ఏ క్షణంలోనైనా అమెరికాపై దాడి... ఎవరూ కాపాడలేరు..

 

ఉత్తర కొరియా తరచూ క్షిపణలు ప్రయోగిస్తూ పక్క దేశాలకు ఆగ్రహం తెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా ఈ విషయంలో మండిపడుతుంది. ఈనేపథ్యంలోనే గత కొద్దిరోజులుగా అమెరికాకు, ఉత్తర కొరియా,  ఉత్తర కొరియాకు అమెరికా వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూఎస్ కాంగ్రెస్ సీనియర్ సభ్యుడొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ నుంచి అమెరికాను రక్షించుకోవడం చాలా కష్టమని, ఏ క్షణంలోనైనా దేశంపై అణ్వాయుధాలతో కొరియా తెగబడే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే ఎవరూ అమెరికాను కాపాడలేరని.. ఉత్తరకొరియాతో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే, యూఎస్ కు ఎంతో నష్టం కలుగుతుందని, ఆ దేశం యుద్ధానికి సిద్ధమని చెబుతుంటే, సమస్య పరిష్కారానికి పాలకులు కదలకపోవడం దారుణమని విమర్శించారు.