కేటీఆర్ గారు హెయిర్ డై వేసుకోండి..

 

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాంటి కేటీఆర్ కు ఓ అభిమాని నుండి ఊహించని ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. రెండు రోజుల క్రితం పాతబస్తీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మొగల్ పురాలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు. కాసేపు సరదాగా క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడారు. ఈ ఫొటోలను తన ట్విటర్ పోస్ట్ చేశారు. ఇక ఈ ఫొటోలపై ఎంఎన్ ప్రపుల్లకుమార్ అనే యువకుడు ఆసక్తికర కామెంట్ చేశారు. 'ఈ మధ్యకాలంలో నెరసిన జుట్టుతో కనిపిస్తున్నారు. మీరు యూత్ లీడర్, మంత్రుల్లో మీరే పిన్నవయస్కులు కాబట్టి జుట్టుకు హెయిర్ డై వేసుకోవాల'ని సూచించాడు. మరి దానికి కేటీఆర్ కూడా తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాను మరీ కుర్రాడిని కాదని యువకుడికి కౌంటర్ ఇచ్చాడు.