మా యవ్వారాలలో కోర్టులు వేలెట్టనేలా

 

ఒకవైపు ప్రతిపక్షాలవారు అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందాలేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, మేము చేస్తున్న ఆ కొద్దిపాటి పనులను కూడా చేయనీయకుండా కోర్టులు మాకు అడ్డుపడుతున్నాయని మంత్రివర్యులు కొండ్రు మురళి మోహన్ అభిప్రాయపడ్డారు. అసలే నత్తనడకన సాగుతున్న అనేక పనులు ఇప్పుడు కోర్టు జోక్యంతో పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. కోర్టులు ఈ విదంగా ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆపకపోతే, ఇక ప్రభుత్వం అన్ని పనులు మానుకొని కూర్చవలసిందే అన్నారు. మరి కోర్టులు మంత్రి గారి అభిప్రాయంతో అంగీకరిస్తాయో, లేక ఆయనకి కూడా సమన్లు జారీచేసి కోర్టుకు రప్పించుకొంటాయో చూడాలి.