నువ్వు అయితే తట్టుకున్నావ్ కానీ నేను అయితే చచ్చిపోయేదాన్ని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -79 లో.. ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం మీ బావ ఆ దీపకే ఓటు వేస్తాడని పారిజాతం అంటుంది. ఇప్పటికైనా అర్థం అయిందా మన ఇంట్లోనే మనకి మెజారిటీ లేదని జ్యోత్స్న అంటుంది. ఈ మాత్రం దానికి మనం ఏదో పొడిచేసినట్లు నీ వల్ల నేనేదో చేస్తున్నట్లు గొప్పలు చెప్పడం అవసరమా అని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడేం చేస్తున్నారంటావని పారిజాతం అనగానే.. ఇప్పుడున్న సిచువేషన్ కి లగ్జరీగా తిరగలేరని జ్యోత్స్న అంటుంది.

ఆ తర్వాత అప్పుడే కార్తీక్ వస్తాడు. తనతో పాటు దీప కూడా వస్తుంది. కార్ దిగుతుంటే మందులు పడిపోతాయి.. ఏంటి ఇవ్వన్నీ మందులు.. ఎవరికి అని దీప అడుగుతుంది. అమ్మమకి ఒంట్లో బాలేదు అందుకే అని కార్తీక్ అంటాడు. అసలు మీరెందుకు ఏదో ఆలోచిస్తూ రోడ్డుపై నడుస్తున్నారని కార్తీక్ అడుగగానే దీప ఏం సమాధానం చెప్పలేక మీ అమ్మ గారికి బాలేదు అన్నారు కదా త్వరగా వెళ్ళండి అని దీప అంటుంది. అదంతా చూస్తున్న పారిజాతం, జ్యోత్స్నలకి.. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్థం కాదు. దాంతో జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఆ తర్వాత దీప వంట చేస్తూ కార్తీక్ ని అపార్థం చేసుకున్నా అని బాధపడుతుంది. నిజం చెప్పాలని చాలాసార్లు ట్రై చేసాడు. కానీ నేనే చెప్పనివ్వకుండా ఎప్పటికప్పుడు ఇష్టం వచ్చినట్లు తిట్టాను. పాపం అన్ని భరించారని దీప ఎమోషనల్ అవుతుంది. అప్పుడే శౌర్య వచ్చి ఏమైంది అమ్మ అని ఆడుగుతుంది. నర్సింహా అన్న మాటలు గుర్తుకుచేసుకొని.. నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా సరే నిన్ను కాపాడుకుంటాను.. నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావని దీప అనుకుంటుంది.ఆ తర్వాత మరుసటిరోజు కార్తీక్ కాంచనకి మందులు ఇచ్చి ఆఫీస్ వర్క్ అంటూ వెళ్ళిపోతాడు.

మరొకవైపు దీపకి.. శ్రీధర్, కావేరిలు వెళ్తూ కన్పిస్తారు. ఆ తర్వాత కాంచన వంట చేసుకుంటుంటే.. దీప వెళ్లి సాయం చేస్తుంది. అప్పుడే డైరక్ట్ గా శ్రీధర్ గురించి కాంచనకి చెప్పకుండా ఒకతను భార్య ఉండగా మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకుని బిడ్డని కన్నాడు.. ఇప్పుడు ఇద్దరిని మోసం చేస్తున్నాడని దీప అంటుంది. అలాంటి వాడిని జైలుకి పంపాలి..  నువ్వు అయితే అలాంటిది తట్టుకున్నావు కానీ నాలాంటి దాన్ని అయితే చచ్చిపోయేదాన్ని అని కాంచన అంటుంది. ఇప్పుడు మీరే ఆ సిచువేషన్ లో ఉన్నారని దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.