ఇంజనీరింగ్ కాలేజీలో జై పాకిస్థాన్ నినాదాల కలకలం

బెంగళూరులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో జై పాకిస్థాన్ నినాదాలు కలకలం రేపాయి. ఆ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు జై పాకిస్థాన్ నినాదాలు చేశారు. ఈ సంఘటనను మరో విద్యార్థి సెల్ ఫోన్ లో షూట్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో ఇది వైరల్ అయ్యింది.

నెటిజన్లు కాలేజీలో ఈ నినాదాలేంటంటూ ఫైర్ అవుతున్నారు. న్యూ హరిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల 25 నుంచి రెండు రోజుల పాటు ఫెస్ట్ జరగనుంది.  అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్సాయి. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య ఐపీఎల్ ఫేవరెట్ జట్ల ప్రస్తావన వచ్చింది.

ఐపీఎల్ లో పాకిస్థాన్ ఆటగాళ్లకు స్థానం లేకపోవడంపై చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా ఇద్దరు విద్యార్థులు జై పాకిస్థాన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇతర విద్యార్థులు అభ్యంతరం తెలిపారు. జై పాకిస్థాన్ నినాదాలు చేసిన విద్యార్థుల చేత క్షమాపణ చెప్పించి వారి చేత జై భారత్, జై కర్నాటక అనిపించారు.

అయితే ఈ మొత్తం సన్నివేశాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. జై పాకిస్థాన్ నినాదాలు చేసిన విద్యార్థులపై కేసు నమోదు చేశారు. మొత్తం మీద ఇంజనీరింగ్ కాలేజీలో జై పాకిస్థాన్ నినాదాలు కలకలం సృష్టించాయి.