చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ 

నాగబాబుకు మంత్రి పదవి ఖాయం కావడంతో సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం, మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారా? ఎమ్మెల్సీ ఎన్నిక అయిన తర్వాత మంత్రి వర్గంలో తీసుకుంటారా అనే అంశాలపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలో సూచిస్తూ జనసేన తయారు చేసిన జాబితాను పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఇవ్వనున్నారు. పోలవరం పర్యటన ముగించుకుని చంద్రబాబు సచివాలయానికి చేరుకున్నారు సాయంత్రం మూడు తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ కానున్నారు.