తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత

తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడి పోతున్నాయి.  ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ తీవ్రత ఎక్కువ ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఊష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ 6.3  డిగ్రీల ఊష్ణోగ్రత నమోదైంది.  హైద్రాబాద్ లో అత్యల్ప ఊష్ణోగ్రత మౌలాలీలో 7.1 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదైంది.  డిసెంబర్ లోనే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం చూస్తుంటే సంక్రాంతి వరకు ఊష్ణోగ్రతలు పడిపోవచ్చు.