నేటి నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము శీతాకాల విడిది

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం (డిసెంబర్ 17) నుంచి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శీతాకాల విడిది చేయనున్నారు. ఈ నెల 21 వరకూ ఆమె అక్కడ బస చేయనున్నారు. మంగళవారం (డిసెంబర్ 17) ఏపీలో పర్యటన ముగించుకుని గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటలోని వాయుదళ శిక్షణ కేంద్రానికి సాయంత్రం చేరుకుంటారు.

అక్కడ ఆమెకు గవర్నర్, ముఖ్యమంత్రి, సీఎస్, , మంత్రులు, అధికారులు రాష్ట్రపతికి ఆహ్వానం పలుకుతారు. అక్కడ నుంచి ద్రౌపది ముర్ము భారీ కాన్వాయ్‌తో రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.  కాగా, బుధవారం(డిసెంబర్ 18) రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ముర్ము ప్రారంభిస్తారు.  శుక్రవారం(డిసెంబర్ 21) రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో ఎట్ హోం నిర్వహిస్తారు.