పబ్లిసిటీ మోజు తెచ్చిన చేటు

పబ్లిసిటీ మోజు   పెచ్చుమీరితే ఏమౌతుందో ఆ ఐఏఎస్ అధికారికి బాగా తెలిసి వచ్చింది.  ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అభిషేక్ సింగ్ సోషల్ లైఫ్ పై ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే పబ్లిక్ సర్వెంట్, సోషల్ ఎంటర్ ప్రెన్యూర్, యాక్టర్ అంటూ తనకు తానే భుజకీర్తులు ఇచ్చుకుంటూ  తన వ్యక్తిగత సోషల్ మీడియా ప్రొఫైల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు.

అంతే కాదండోయ్ ఈయనను సామాజిక మాధ్యమంలో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆయనకు 3 మిలియన్ల ఫాలోయర్స్ ఉండగా ,ట్విట్టర్ లో 31,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు.వారందరి కోసం ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ పోస్టు చేస్తూ ఉంటారాయన. వ్యక్తిగత వివరాలు, తన టాలెంట్స్ గురించి, అభిరుచుల గురించి పోస్టు చేసి ఊరుకుంటే బాగుండేది. కానీ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కు వెళ్లడంతో.. తన స్పెషల్ డ్యూటీ గురించి ఫోటోతో సహా   సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. 

ఎన్నికల విధుల్లో తలమునకలవ్వాల్సిన ఆ ఆఫీసర్  ఇన్స్టాలో రెండు పిక్స్ పోస్ట్ చేసి,  తాను గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నట్టు రైటప్స్ పెట్టారు.  సీన్ కట్ చేస్తే ఆయనపై ఎలక్షన్ కమిషన్ ఆయనపై చర్యలు తీసుకుని షాక్ ఇచ్చింది. అభిషేక్ సింగ్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించింది.ఇదంతా పక్కన పెడితే తన ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి అభిషేక్ సింగ్ చేసిన పోస్టుకు విశేషం ఏమిటంటే అభిషేక్ చేసిన  22 గంటల్లో 28, 597 లైక్స్ వచ్చాయి. ఫలం దక్కింది కానీ వ్రతమే చెడింది.