ఫార్ములా ఈ కార్ పై కేబినేట్ సీరియస్ ..ఈ వారంలో కెటీఆర్ అరెస్ట్ ?
posted on Dec 17, 2024 9:41AM
ఫార్ములా ఈ రేస్ కుంభకోణంపై ఎసిబి చేత విచారణ చేయించాలని తెలంగాణ కేబినేట్ ఆమోదం తెలిసింది. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది.
మాజీ మంత్రి కెటీఆర్ ఈ కుంభకోణంలో ముఖ్యభూమిక వహించినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కెటీఆర్ అరెస్ట్ చేయడానికి గవర్నర్ ఆమోదం కూడా తెలంగాణ
సర్కార్ తీసుకుంది. సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన కెటీఆర్ ను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేసే ముందు గవర్నర్ ఆమోదం తీసుకోవల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్న కేబినెట్ ఫార్ములా ఈ రేస్ కుంభకోణంపై విచారణ చేపట్టాలని నిర్ణయించింది. భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక శాఖ చేత విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీపావళి ముందు ఓ ఎత్తు దీపావళి తర్వాత ఓ ఎత్తు అని ఇప్పటికే మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు. పొలిటికల్ బాంబులు పేలతాయని మంత్రి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు చెప్పారు. తాజా పరిస్థితులు చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. కెటీఆర్ ను కట్టడి చేయాలంటే ఫార్ములా ఈ రేస్ మళ్లీ తెరపైకి తేవాలని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయింది.