తెలంగాణ ఇప్పట్లో తేలే అంశం కాదన్న ఆజాద్
posted on Jan 24, 2013 8:55AM
"వారమంటే ఏడు రోజులు కాదు. షిండే చెప్పినంత మాత్రాన నెల రోజుల్లో తెలంగాణను ప్రకటించడం కుదరదు. తెలంగాణ సమస్యకు డెడ్ లైన్ అనేది లేదు. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. సమస్య పరిష్కారానికి మరింత సమయం పడుతుంది” అని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు. హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినంతమాత్రాల ఇప్పుడు ప్రకటన చేయలేం అన్నారు. ప్రకటన చేయడం మీడియా అడిగినంత సులభం కాదని చెప్పారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఖచ్చితంగా 28న ప్రకటన వస్తుందని చెప్పలేం అని అన్నారు.
సమస్య పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని, ఇప్పుడు ఏం జరుగుతుందో తాను చెప్పలేనని ఆజాద్ అన్నారు. తెలంగాణ గురించి ఈ నెల 28న ఏదో ఓ ప్రకటన వస్తుందని అనుకున్న నేపథ్యంలో ఆజాద్ అసలు తెలంగాణ ఇప్పట్లో తేలే అంశం కాదని చెప్పడం ఆసక్తి రేపుతోంది.