గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శీతాకాలంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. దీంతో రకరకాల వ్యాధులు ఎటాక్ చేసే ప్రమాదం ఉంటుంది. గర్బిణీలు ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఈ ఫుడ్స్ తప్పనిసరిగా తినాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
బ్రోకలీ:
బ్రోకోలీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా ఈ కూరగాయలో విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం పుష్కలంగా ఉన్నందున, బ్రోకోలీని మీ ఆహారంలో మితంగా చేర్చుకోవడం మంచిది.
తృణధాన్యాలు:
గర్భిణీల ఆరోగ్యానికి తృణధాన్యాలు చాలా అవసరం. దీనికి ప్రధాన కారణం ఈ పప్పులలో ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో వీటి పాత్ర చాలా పెద్దది.
నానబెట్టిన డ్రైఫ్రూట్స్:
నానబెట్టిన ఎండు గింజల్లో అనేక రకాల పోషకాలు, వివిధ రకాల విటమిన్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
ఆమ్ల ఫలాలు:
నారింజ, మాంగోస్టీన్, కివీస్, స్ట్రాబెర్రీ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అవి గర్భిణీల రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి.
అరటిపండు:
గర్భిణీలు వైద్యుల సలహాతో అరటిపండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. దీనికి ప్రధాన కారణం ఈ పండులో ఉండే పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
గుమ్మడికాయ గింజలు:
గుమ్మడి గింజల్లో ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి గర్భిణీలు ఈ విత్తనాలను మితంగా తీసుకోవడం మంచిది.
గ్రీన్ టీ:
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీని గర్భిణీలు రోజుకు ఒకసారి తాగడం మంచిది.