మెదడుకు, కంటికి లింక్ ఇదే!
Face in the index of the Mind అన్నట్టుగా Eye is the mirror of the Brain అంటారు. మెదడు పనిచేసే తీరు తెన్నులు తెలుసుకోవడానికి కన్ను అనేక వివరాలు అందజేస్తుంది. కొన్ని అవయవాలు, అవిచేసే పనులు, వాటిలో వుత్పన్నమయ్యే లోపాలు, సమస్యలు పరోక్షంగ తెలుసుకోగలమే తప్ప తలుపుతీసి గదిలో ప్రవేశించి గదిలోని వస్తువులను పరిశీలించినట్లు చేయడానికి అవకాశం లేదు. అలాంటి వాటిలో మెదడు ఒకటి. మెదడుకు సంబంధించిన సమాచారము పరోక్షంగా ఇతర అవయవాలనుండి తెలుసుకోవడమేతప్ప మెదడు కోసి చూడలేము. మెదడు బలిష్టమైన ఎముకల గదిలో వుంటుంది. అందుచేత మెదడును పరీక్షించాలంటే సామాన్య పద్దతులలో వీలుపడదు. మెదడు నుండి సరాసరి విడుదలయ్యే నాడులు 12 జతలు. ఈ 12 జతలు శరీరంలోని కన్ను, ముక్కు, చెవి, గొంతు, నాలుక, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్రేవులకు సంబందించి ఇవి వివిధ కర్తవ్యాలు నిర్వహిస్తుంటాయి. ఇందులో 6 జతల నాడులు కంటికి సరఫరా అవుతాయి. దృష్టి నాడి, దృష్టి క్షేత్రం వర్ణదృష్టి, కంటి చలనము, కన్నుమూసుకోవడం తెరుచుకోవడం, కంటి స్పర్శ, కంటినొప్పి మొదలైనవి, మెదడులోని కొన్ని కేంద్రాలనుండి కంటిలో వివిధ భాగాలతో ముడివేస్తాయి. వీటిలో వచ్చే మార్పులను బట్టి దెబ్బతిన్న భాగాన్ని అందుకు సంభంధించిన కారణాలను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మెదడుకు, కంటికీ రక్తం సరఫరా అవుతుంది. ఈ రెండూ ఒకేచోట పుట్టి చీలిక మెదడంతా వ్యాపిస్తుంది. మెదడులో నుండే కొన్ని కంటికి చేరతాయి. అందుచేత కంటిలోని రక్తనాళాల తీరుతెన్నులు, మెదడులోని రక్తనాళాలు ఒకేలా వుంటాయి. రక్తనాళాలు రక్తాన్ని సరిగ పంపిణీచేయగల స్థితిలో వున్నవా లేక నాళాలు సన్నబడి రక్త ప్రసరణకి ఆటంకం ఏర్పడుతుందా? రక్తనాళాలలో కొవ్వు పేరుకొందా? రక్తం గడ్డకట్టి ప్రవాహం అంతరాయం ఏర్పడిందా? కొత్త నాళాలు పుడుతున్నాయా? నాళాలనుండి రక్తం లీకవుతోందా? మొదలైన సమాచారం కంటిలోని రెటినాల్ నాళాలను పరిశీలించి తెలుసుకోవచ్చును. మెదడులో కంతులు ఏర్పడితే కంతి యొక్క స్వరూపము, ఏ భాగములో ఏర్పడ్డదో తెలుసుకోవడానికి కంటి పరీక్షలు ఎనలేని అవకాశం కల్పిస్తుంది. కంటికి సరఫరా చేసే 6 నాడులలో ఒకటి గాని, అంతకంటే ఎక్కువగాని, పాక్షికంగ గాని, పూర్తిగా కాని దెబ్బతినడం కనిపెట్టవచ్చును. కొన్ని సమయాలలో దృష్టి క్షేత్రంలో మార్పులు ఏర్పడవచ్చును. మెల్ల ఏర్పడ వచ్చును. కంటినాడి వుబ్బవచ్చును. వీటిని తెలుసుకోవడం ద్వారా వ్యాధి లక్షణాలు, వ్యాధిస్థితి, చికిత్స యొక్క ఫలితము మొదలైన విషయాలను అంచనా కట్ట వచ్చును. నాడి పొరలోనుండి బయలుదేరిన నాడులు, పోగులు పోగులుగ చేరి చివరకు కంటినుండి ఆప్టిక్ నాడి ద్వారా మెదడుకు చేరుతాయి. మెదడుకు బయలు దేరేముందు రెటీనాలో కనిపించే భాగాన్ని, నాడీ నాభి (ఆప్టిక్ డిస్క్) అంటారు. ఈ భాగాన్ని పరిశీలిస్తే, మెదడుకు సంబందించిన అతి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. మెదడుకు వాపు వచ్చినప్పుడు, మెదడులో కంతి, చీము మొదలైనవి చేరినపుడు ఆ వాపు దృష్టి నాడి ద్వారా నాడీ నాభి వరకు ఎగబాకుతుంది. కంటినాడి వుబ్బుతుంది. దానిని మనం ఆప్తాల్మాస్కోపు అనే పరికరం ద్వారా తెలుసుకోవచ్చును. అంతేకాదు, వ్యాధి యొక్క తీవ్రత, వ్యాది వైద్యానికి లొంగుతుందా లేదా అనేది కూడ తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల మెదడులో సంభవించే అనేక పరిణామాలను తెలుసుకోడానికి కంటి పరీక్షలమీద ఆధారపడవలసి వస్తుంది. ◆నిశ్శబ్ద.
read moreగ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి?? ఎందుకు వస్తుంది??
ఈమధ్య కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. అయితే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఎందుకొస్తుంది?? అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి?? తెలుసుకుంటే.. మనం ఆహారంతో పాటు గాలిని మింగుతుంటాం. ఈ అలవాటున్నా కార్బొనేటెడ్ పదార్థాల్ని ఎక్కువగా తీసుకుంటున్నా, చూయింగ్ గమ్ తినే అలవాటున్నా, ధూమపానం చేస్తున్నా త్రేన్పులు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి వారిలో కడుపులోపల బాగా ఉబ్బరించినట్లుంటుంది. కడుపులో ఉత్పత్తి అయ్యే ఆ వాయువు కారణం చేతనే గుండె మండుతున్నట్లుంటుంది. జఠరాశయంలోని ఈ గాలి చిన్న ప్రేగులలోకి వెళ్తుంది. ఇక్కడ ఇది చిన్నప్రేగుల గోడలద్వారా పీల్చిబడుతుంది. లేకపోతే గ్యాస్ రూపంలో బయటికి నెట్టివేయబడుతుంది. కడుపుబ్బరించే గాస్ తో బాధపడుతున్నా మనిపించినప్పుడు ఏ పదార్థాలు గ్యాస్ ని ఉత్పత్తి చేయడానికి కారణం అవుతున్నాయో వాటిని తినడం మానేయాలి. అలాగే గ్యాస్ ఉత్పత్తికి కారణమైన అలవాట్లని మానుకోవాలి. చాలా మంది త్రేన్పులు వస్తుంటే లోపలి గాలి బయటకు వెళ్ళి పోతోందని అనుకుంటారు. కాని వాస్తవానికి ఈ త్రేన్పుల వల్ల లోపలి పరిస్థితి మరింతగా దెబ్బతింటుంది. ఒక్కోసారి జీర్ణాశయంలో ఆహారం జీర్ణమయ్యేప్పుడు కూడా రకరకాల రసాయనిక మార్పులు కారణంగా కూడా గ్యాస్ ఉత్పత్తి కావచ్చు. జఠరాశయం, పెద్ద, చిన్న ప్రేగులు గాలితో నిండి ఇబ్బందిగా అనిపిస్తుండవచ్చు. త్రేన్పుల ద్వారా వెళ్ళే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ వుంటాయి. అదే గ్యాస్ రూపంలో వెళ్ళే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ లతోపాటు హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మిధేన్ కూడా వుంటాయి. పిండి పదార్థాలు సరిగ్గా జీర్ణం కానప్పుడు ఆ పదార్థాలు చిన్నపేగులలో పేరుకు పోయినప్పుడు బాక్టీరియా అనే సూక్ష్మజీవులు అక్కడ చేరతాయి. ఈ బాక్టీరియా వున్నప్పుడు హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మిథెన్ గ్యాస్ లు ఉత్పత్తి అవుతాయి. ఈ కుళ్ళిన పదార్థాల దగ్గరే చెడ్డ వాసన పుడుతుందన్నమాట! ఇలా గ్యాస్ సమస్యతో ఇబ్బందికి గురువుతున్నప్పుడు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వాటిని ఒక్కసారిగా తాగేయకూడదు. కొద్దికొద్దిగా చప్పరిస్తూ త్రాగాలి. ఆహారాన్ని పెదాలు మూసుకుని బాగా నమిలి తినాలి. మనస్సు ఆందోళనగా వున్నప్పుడు కాక ప్రశాంతంగా వున్నప్పుడు తినాలి. కొద్ది కొద్దిగా తినాలి. ఎక్కువెక్కువ తినకూడదు. గుండె ప్రాంతంలో మంట ఈ గ్యాస్ ఉత్పత్తి కారణానో, యాసిడ్ ఉత్పత్తి కారణానో వస్తుంటుంది. ఈ మంట లోపలి మార్పులను సూచించే ఒకానొక సిస్టమే కానీ జబ్బుకాదు. ఈ మంట లోపల ఆహారం పులియడం వల్లగాని, నోటిలో కొంత జీర్ణమైన ఆహార పదార్థాలు ఉండడంవల్ల కూడా కలగవచ్చు. ఆహారం జీర్ణమవడానికి జఠరాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్ ఎంజైమ్స్ కలుస్తాయి. ఈ కారణంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వొస్తుంది. ◆నిశ్శబ్ద.
read moreఈ 7 రకాల నొప్పులను నిర్లక్షం చేస్తే అంతే సంగతులు!
ప్రతిఒక్కరు ఎదో ఒక నొప్పితో బాధ పడుతూ ఉంటారు. అసలు ఆ నొప్పులు ఎలా ఉంటాయి అంటే కొంచం గుచ్చుకున్నట్లుగా ఉంటె తీవ్రంగా ఉంటుంది.సహజంగా సందర్బోచితంగా శరీరంలో నొప్పులు వస్తూనే ఉంటాయి.లేదా అంచెలు అంచెలుగా నొప్పులు వస్తూనే ఉంటాయి.అయితే కొన్నిరకాల్ నొప్పులు వచ్చినప్పుడు పరీక్షలు చేయించుకోండి. ఈ నొప్పులు మీలోపల ఉన్న వాస్తవ పరిస్థితిని తెలియచేస్తుంది. క్యాన్సర్, ఆర్ధరైటిస్, ఇంఫ్లామేషణ్, వంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జీవితం ప్రమాదంలో ఉన్నట్లే అనిగమనించాలి. 7 రకాల నొప్పులను మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.ప్రత్యేకంగా చాలా తీవ్రంగా ఉన్న లేదా దీర్ఘకాలం పాటు నొప్పులు కొనసాగినా సమస్యలే అన్నవిషయం గ్రహించాలి. 1 )పొట్టలో తీవ్రమైన నొప్పి.. పొట్టలో నొప్పి లేదా పొత్తికడుపులో నొప్పి రావడం సహజం.మీరు తీసుకున్న ఆహారం కావచ్చు.లేదా గ్యాస్ వల్ల కావచ్చు ఒకవేళ తీవ్రమైన నొప్పి కిన్దిభాగం లో ఎడమవైపు వస్తే అదితీవ్రంగా ఉంటె తక్షణం పరీక్షించాల్సిందే.ఆనోప్పి అపెండిసైటిస్ కావచ్చు. అపెన్ డిక్స్ లో ఇంఫ్లా మేషన్ కావచ్చు. ఇంఫ్లామేషన్ ను తొలగించేందుకు సర్జరీ చేయాల్సి రావచ్చు. ఇంఫ్లామేషన్ వచ్చిఅది బరస్ట్ కాక ముందే అభాగాన్ని తొలగించడం అనివార్యం.అలా కాక నిర్లక్ష్యం చేస్తే మరణించే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పొట్ట మధ్యలో లేదా పైభాగం లో అది లేదావెనుక వైపు పై భాగం లో అసహనంగా గాబరా పడడం. లేదా ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడడం ప్యాంక్రియాస్ కారణం కావచ్చు. అందులో గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉండవచ్చు.వాటిని సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. 2) వ్యాయామం అనంతరం అసహజంగా వచ్చే నొప్పి... మీరు వ్యాయామం చేసే సమయంలో బరువులు ఎత్తడం మీరు ఇబ్బందులు పడతారు.ఒకవేళ మీకు నొప్పి తీవ్రంగా ఉంటె పాదం అరికాలు నొప్పితో బాధపడితే డాక్టర్ ను సంప్రదించాలి. ముఖ్యంగా వర్క్ అవుట్ తరువాత నొప్పి వారం రోజులపాటు అలాగే కొనసాగితే కాస్త అలోచించాల్సిందే.అక్కడ అరగడం లేదా విరగడం లేదాటీర్ కావడం అయ్యిఉండవచ్చు.అది మీనోప్పికి కారణంగా చెప్పవచ్చు. ౩ )నొప్పితో పాటు వాపు... ఏదైనా వాపుతోపాటు నొప్పి వస్తే సంకేతం ఏమిటి అంటే అది ఇన్ఫెక్షన్ కావచ్చు.కొన్ని గంటల తరువాత వాపు నొప్పి తగ్గనట్లయితే అది మరింత తీవ్రంగా మారితే డాక్టర్ ను తప్పనిసరిగా సప్రదించాలి. 4)తీవ్రమైన తలనిప్పి... తలనొప్పి తీవ్రంగా ఉంటె అది మైగ్రైన్ కావచ్చు.లేదా బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు చికిత్చలో భాగంగా ఉపసమనం కొసం వైద్యసహాయం తీసుకోవాలి లేదా నొప్పినివారించే మండువడాలి. లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటె ఎప్పుడు అనుభవించని నొప్పి మిమ్మల్ని బాధిస్తుంటే.ఏదైనా ఒకవ్యాది వచ్చి ఉండవచ్చు.అదిఎదొ తెలుసుకోవాలంటే పరీక్షలు నిర్వహించాలి.కార్బన్ మోనాక్సైడ్ విషతుల్య పదార్ధాలు ఉండవచ్చు.దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ ట్యూమర్ కణి తలు ఏర్పడి ఉండవచ్చు.మీ జీవితం లో ఎప్పుడూ ఎవరూ ఎదుర్కిని తీవ్రమైన తలనొప్పి తప్పనిసరిగా అత్యవసర చికిత్చ అవసరం కావచ్చు. 5)చాతి నొప్పి... అన్నిరకాల చాతినోప్పులు గుండె పోటు కాదు అన్న విషయం తెలుసుకోవాలి.అయితే చాతిలో నొప్పి అన్నది హార్ట్ ఎటాక్ గుండేనోప్పి లక్షణంగా చెప్పవచ్చు.మీచాతిపై ఎదో బరువుపెట్టినట్ట్లుగా ఉంటె మీరే కారు నడపడం మంచిది కాదు. చాతి లో నొప్పి వచ్చినప్పుడు అంబులెన్స్ ను పిలిపించుకుని ఆసుపత్రికి వెళ్ళండి.మీసమస్యను వివరించండి తగిన సమయంలో చికిత్చ అందించడం ద్వారా గుండెపోటుతో మరణం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ముఖ్యంగా ఇటీవలి కాలం లో ఉదయం వేళ లో మాత్రమే వ్యాయామం అనంతరం గుండెపోటుతో మరనిస్తున్నఘటనలు చూస్తున్నాం. కాబట్టి చాతి పై బరువుగా ఉన్న ఊపిరి పీల్చుకోడం కష్టంగా ఉన్న వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం అని నిపుణులు పేర్కొన్నారు. 6)పెద్ద పాదం లో నొప్పి... మీపాదం లో నొప్పి వస్తే అది గౌట్ కావచ్చు దీనిని వైద్య పరిభాష లో గౌట్ ఆర్తరైటిస్ అంటారు. ఇది ఆర్తరైటిస్ నుండి వస్తుంది.చాలా నొప్పిగా ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం కారణంగా ఆహార పదార్ధాలు అరగక పోయినా ఆల్కాహాల్ ఎర్రమామ్సం సాఫ్ట్ డ్రింక్స్ ఇతర ఆహార పదార్ధాలు అయితే వీటినుండి ఉపసమనం పొందనికి పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు.ఈసమస్యకు నిపుణుడైన ప్రత్యేక డాక్టర్ నుండి చికిత్చ తీసుకోవడం అవసరం. గౌట్ కు సరైన చికిత్చ చేయనట్లయితే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.కిడ్నీ ఫెయిల్యూర్ కు దారి తీయవచ్చు. 7)నెలసరి వచ్చే సమస్యలో క్రామ్ప్... నెలసరి సమస్యల కాలం లో స్త్రీలు తీవ్రమైన నొప్పులతో బాధపడుతూ ఉంటారు.ఈసమస్యను వైద్య పరిభాష లో మేన్స్టురియల్ క్రామ్స్ వల్ల కింది భాగం లో నొప్పి తీవ్రంగా ఉంటుంది.అయితే అది ప్రతినెలా స్త్రీలను వేదిస్తూ ఉంటుంది. అది చాలా సహజమైన నొప్పిగానే స్త్రీలు భావిస్తారు.అయితే నొప్పి తీవ్రత అధికంగా ఉంటె మీరు గైన కాలజిస్ట్ ను కలిసి డాక్టర్ సూచనల మేరకు పరీక్షలు నిర్వహించాలని లేదా తీవ్ర ద్సమస్యలు తప్పవు. అది ఒవేరియన్ క్యాన్సర్ ఎస్ టి డి క్యాన్సర్ కాని కణితలు కావచ్చు.అదనంగా వచ్చే నొప్పి ఏందో మెట్రిసెస్ కావచ్చు.అది త్వరితగతిన పరీక్షించాలి అలాగే ఉత్తమ చికిత్చ తీసుకోవాలి. ఏండో మెట్రిసెస్ వల్ల సంతనలేమి సమస్యలు వస్తాయి.కొన్ని సందర్భాలలో డాక్టర్స్ సర్జరీకి సిఫార్స్ చేయవచ్చు.సర్జరీ ద్వారా టిష్యు ను తొలగిస్తారు దీనివల్ల పిల్లలు కలిగే అవకాసం ఉందని నిపుణులు తేల్చి చెప్పారు. నెప్పి ఎలాంటిదే అయినా ప్రాధమిక స్థాయిలో తక్షణం గుర్తించి అందుకు తగిన చికిత్చ తీసుకోవాలని సూచించారు.
read moreగుప్పెడంత గుండెకు కొండంత భరోసా ఇలా సాధ్యం!
చలి పంజాకు ఈ సంవత్సరం చాలా గట్టిగానే దెబ్బ తిన్నారు ప్రజలు. ఈ చలి ప్రభావం వల్ల ఎంతో మంది శ్వాశ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. మరికొందరు మరణించారు కూడా. చలి ముఖ్యంగా శ్వాస నాళం మీద ప్రభావం చూపినప్పటికీ శరీరంలో కీలకమైన ఊపిరితిత్తులు, గుండె ఈ చలి ప్రభావానికి ఎక్కువగా గురవుతాయి. ప్రస్తుతం శివరాత్రి గడిచిపోయిన తరువాత చలి ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలి తగ్గిపోయి మెల్లగా వేసవి వైపు అడుగులు పడుతున్నాయి. చాలామందికి ఈ సమయం ఎంతో విలువైనది. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారికి, వ్యాయామం చక్కగా చేసి ఫ్యాట్ బర్న్ చెయ్యాలని అనుకునేవారికి ఇది బెస్ట్ సీజన్. అయితే ఈ మూమెంట్ లో గుండె ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలండోయ్.. జిమ్ లలోనూ.. ఆరు బయట, రోడ్ల మీద నడక నుండి విభిన్న రకాల వ్యాయామాలు చేస్తూ చేస్తూనే గుండె ఆగిపోయి ప్రాణాలు వదిలేస్తున్న వారు ఉన్నారు ఇప్పట్లో. అందుకే ఈ సీజన్ లో గుండె ఆరోగ్యం ఇలా.. పదిలం చేసుకోండి. గుండె పర్ఫెక్ట్ ఉండాలంటే.. అందరూ గుర్తుంచుకోవలసిన అయిదు విషయాలు.. హైడ్రేటెడ్ గా ఉండాలి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగిన మోతాదులో నీరు తాగడం చాలా అవసరం. నీరు శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పంపుతుంది. గుండెను సరైన రీతిలో పని చేయడానికి సహకరిస్తుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని గుర్తుపెట్టుకోవాలి. వ్యాయామం ఇలా.. రెగ్యులర్ గా చేసే వ్యాయామం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది హృదయాన్ని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే ఎంతో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. గుడ్ ఫుడ్.. శరీర ఆరోగ్యానికి ఆహారమే గొప్ప ఔషధం. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలలో షుగర్, కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే గుండెకు చేటు చేసే కొవ్వులు వాటిలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చెయ్యడం మంచిది. ఒత్తిడి మీద మంత్రం.. ఒత్తిడి గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఒత్తిడి కారణంగానే చాలా వరకు అనారోగ్య సమస్యలు, హైపర్ టెన్షన్ వంటి పరిస్థితులు ఏర్పడతాయి. యోగా లేదా ధ్యానం వంటి విశ్రాంతినిచ్చే మార్గాలను ఎంచుకోవడం, వాటిలో పాల్గొనడం ద్వారా ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. బ్యాడ్ హాబిట్స్ కు బై బై.. గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ధూమపానం ఒకటి. అలాగే ఊపిరితిత్తుల వినాశనానికి కూడా ఇదే కారణం. ధూమపానం మానేయడం వల్ల మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రత్యక్ష పరోక్ష ధూమపానం వల్ల అందరి ఆరోగ్యాలు పాడవుతాయి. అదే ధూమపానం మానేస్తే మీ ఆరోగ్యంతో పాటు అందరి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి గుండె పదిలంగా, ఆరోగ్యం అద్భుతంగా ఉండాలంటే ఈరోజే ఈ చెడు అలవాటుకు చెక్ పెట్టేయండి. పైన చెప్పుకున్న అయిదు విషయాలు చాలా సింపుల్ గా పాటించేవి. కానీ వాటి వల్ల కలిగే బెనిఫిట్ మాత్రం మీ జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం గుప్పెడంత గుండెకు కొండంత భరోసా ఇచ్చేయండి. ◆నిశ్శబ్ద.
read moreవ్యాయామం ఒకే సమయానికి చెయ్యాలంటారు ఇందుకే!
వ్యాయామం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సాధారణంగా రోజు వ్యాయామం చేసేవారికంటే.. వ్యాయామం జోలికి వెళ్ళని వారి శరీరం విభిన్నంగా ఉంటుంది. వ్యాయామం మనిషిని చురుగ్గానూ, ఆరోగ్యంగానూ ఉంచేందుకు దోహపడే గొప్ప మార్గం. ఇందులో అనే రకాలు కూడా ఉన్నాయి. రన్నింగ్, జాగింగ్, యోగా, ఆసనాలు, జిమ్ ఇలా బోలెడు ఉన్నాయి. అయితే వ్యాయామం గురించి నిపుణులు ఒకమాట చెబుతున్నారు. అదేంటంటే.. వ్యాయామం అనేది ఒక సమయానికి ఒక ప్రణాళికతో చేసేది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?? తెలుసుకుంటే.. వ్యాయామం నిర్ణీత సమయానికి ఎందుకు చేయాలో కూడా అర్థమవుతుంది. మానవ శరీరంలో జీవ ప్రక్రియలు కణాల సిర్కాడియన్ కలయికలపై ఆధారపడి ఉన్నందున రోజులో వేర్వేరు సమయాల్లో శారీరక శ్రమ శరీరాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. వ్యాయామం చేసే రోజు సమయం కొవ్వును కరిగించడానికి కొన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కొన్ని అధ్యయనాలు కూడా ప్రయోగపూర్వకంగా తెలిపాయి. వ్యాయామం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమంటే.. ఆహారం తీసుకునే విషయంలో ఫ్రీడమ్ వస్తుంది. వ్యాయామం మొదలు పెట్టినప్పుడు శారీరక శ్రమ వల్ల కొవ్వు కణజాలంలో థర్మోజెనిసిస్ (వేడి ఉత్పత్తి) మరియు మైటోకాండ్రియా విచ్ఛిన్నానికి సంబంధించిన జన్యువుల వ్యక్తీకరణను పెంచుతుంది. ఇది అధిక జీవక్రియ రేటును సూచిస్తుంది. ఈ ప్రభావాల వల్ల ఒకే సమయానికి వ్యాయామం చేయడం అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. జీవక్రియను పెంచడం మరియు కొవ్వును కరిగించడం వంటి అంశాలలో సాయంత్రం వ్యాయామం కంటే మార్నింగ్ వ్యాయామం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దీని వల్ల తీసుకునే ఆహారం విషయంలో ఛాయిస్ మనదే అవుతుంది. వ్యాయామంతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. శరీరం బ్యాలెన్స్డ్ గా అంటే శరీర ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. ఆహారం, ఔషధాలు, లైఫ్ స్టైల్ ఎంత బాగున్నా వ్యాయామం వల్ల మెరుగయ్యే స్థాయి చాలా బాగుంటుంది. అలాగే వ్యాయామం వల్ల శారీరక ఆరోగ్య సమస్యలు ఉంటే మెల్లగా అవే తగ్గుముఖం పడతాయి. దీనికి కారణం, నిర్ణీత సమయంలో నిర్ణీత వ్యాయామం, ఈ వ్యాయామం కారణంగా నిర్ణీత వేళకు ఆహారం తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం అనేది వ్యాయామం, ఆహారం రెండింటి సమతుల్యత వల్ల మనకు అందే గొప్ప బహుమానం. ◆నిశ్శబ్ద.
read moreనాడీ వైద్యంలో వందకు పైగా చికిత్చలు
కొస్మెటిక్ ఆక్యుపంక్చర్... ఈ చికిత్చలో ఒక సూదిని వినియోగిస్తారు. వ్యాధి లక్ష్నాలను బట్టి శరీరంలో ఎంపిక చేసిన ప్రత్యేక పాయింట్స్ లో ముఖ్యంగా ముఖం పై ఇది పూర్తిగా సహజమైన చికిత్చ ఈ చికిత్చ వల్ల రక్త ప్రసారం ముఖం పై సజావుగా ఉంటుంది . మీముఖం లో లో అందమైన గ్లో వస్తుంది మీముఖంలో అవయవ నిర్మాణం లేదా ముడతలు కాంతికింద నలుపు ముడతలు లేకుండా ముఖం అందంగా ఉంటుంది .శరీరంలో ఏర్పడే హార్మోన్ల మార్పులు వాతావరణం లో వచ్చే సమస్యలు వయస్సు రీత్యా వచ్చే మార్పులు ముఖంలో శరీర ఆకృతి లో మార్పులు చోటుచేసుకుంటాయి. లేదా మీముఖం వచ్చే గ్లో తేజస్సు తరిగిపోతుంది. నేడు చాలా మంది యువతులు తమ ముఖం అందంగా కనపడడానికి కొన్ని రకాల కొస్మెటిక్స్ వాడడం వల్ల కొన్నిరకాల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తున్నాయి. మేరు మీ ముఖం కాంతి వంతం గా చేసేందుకు వినియోగించిన రసాయానాలవల్ల మీ ముఖం పై వచ్చిన సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వంటి వాటిని నాడీ పతి ద్వారా అక్యు పంక్చర్ కొస్మెటిక్ థెరఫీ సహజమైన థెరఫీ గా పేర్కొన్నారు నిపుణులు .చాలా మంది స్త్రీలు అవాంఛిత రోమాలు పెరగడం పై శరీరంలో చోటు చేసుకోడానికి శరీరంలో ఏర్పడే హార్మోన్ మార్పు కారణం గా నిపుణులు పేర్కొన్నారు .నాడీ పతి ద్వారా అలాంటి సమస్యలకు సహజమైన థెరఫీ ద్వారా హార్మోన్ లలో వచ్చే మార్పులు మీముఖం పై ఆయిల్ ఫేస్ .లేదా ద్రై స్కిన్ , ముఖం పై మొటిమలు కంటి కింద మచ్చలు ముడతలు తగ్గించడానికి మందులు లేకుండానే చికిత్చ చేయవచ్చని తెలిపారు. మ్యాగ్నెట్ థెరఫీ... ఒక శాస్త్రజ్ఞుడు ఆల్బర్ట్ రాయ్ డేవిస్ చేసిన పరిశోదనలో కొన్ని ఫలితాలు పొజిటివ్ గాను కొన్ని నెగెటివ్ గాను మేగ్నెట్ లో మార్పులు చేశారు. దీని వల్ల వివిధరకాల ప్రభావాలు మనావ జీవితం లో వచ్చే బయో లాజికల్ పద్దతులు ఉన్నాయాని పేర్కొన్నారు. వాస్తవానికి భూమి ని ఒక మ్యాగ్నెటిక్ గా భావించారు. ఒక ఇస్ కాంతం లో శక్తి ఉంది . చాలా మందికి ఐస్ కాంతం పై అవగాహన లేనాందువల్లే మానవ శరీరంలో వివిదారకాల అనారోగ్యాలకి కారణం గా చెప్పవచ్చు.చర్మ సమస్యలు, ఆర్థరైటిస్ మహిళ ల లో వచ్చే నెలసరి సమస్యలు ,రక్త హీనాథ ,ఒళ్ళు నొప్పులు కంటి సమస్యలు, సైనస్, తల నొప్పులు తగ్గాలంటే ఆయా ప్రాంతాల లో నొప్పుల కు వీపు భాగం లో బలామ్ శక్తి నిచ్చేందుకు ఐస్ కాంతానికి తగ్గిచే శక్తి ఉందని నిపుణులు నిరూపించ గలిగామని నిపుణులు స్పష్టం చేశారు. ఇస్ కాంత చికిత్చ ఉపయోగాలు... ఆర్థరైటిస్ .తల నొప్పులు, మైగ్రైన్, నొప్పులు ఒత్తిడి, ఎముకలు విరిగినసరికేయడం , రక్త ప్రసారం మెరుగుపడడం. మీశరీరంలో ఉన్న అరుగుదల వ్యాధులు క్యాన్సర్ నివారణ, నిద్రలేమి, జలుబు,సర్వైకల్, వంటి సమస్యకు ఐస్ కాంతం తో అద్భుతాలు చేస్తున్నామని ఇతర వ్యాధుల నివారణకు ఇతర థెరఫీ లతో పాటు రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇందులో సుజోక్ మినీ మ్యాగ్నెట్స్ అంటే చిన్న ఐస్ కాంతం అతికిస్తామని తాత్కాలికంగా శరీరం పై ఆత్మపై పెడతామని.ఇవి అంధికశక్తిని ఇస్తాయని ఈకారణంగానే తీవ్రంగా నోపులు ఉన్నపటికీ తగ్గించగలిగామని ఆదేరకమైన మ్యాగ్నెట్స్ ను మేరీడియన్స్ పై శక్తి నిచ్చి నొప్పిని నివారిస్తుంది.
read moreయోగాతో థైరాయిడ్‌కు అడ్డు కట్ట
థైరాయిడ్ ఎలాంటి వ్యాధి అంటే నేడు ప్రపంచంలో నేడు ప్రతి ఐదు గురిలో థైరాయిడ్ బాధితులు ఉన్నారన్నది వాస్తవం. నేటి పరిస్థితులలో పురుషులకంటే మహిళల లోనే ఈ సమస్య ఎక్కువ చూడవచ్చని ఆరోగ్యనిపుణులు భావిస్తున్నారు. థైరాయిడ్ హార్మోన్ మన శరీరం పనిచేయడం లో కీలకంగా ఉంటుంది.శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనా తక్కువ అయినా ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపిస్తుంది. థైరాయిడ్ వల్ల వస్తున్న మార్పులు స్పష్టం గా కనిపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్ ఇచ్చే సంకేతాలు కొన్ని ఉపచారాలఅవసరం అలా థైరాయిడ్ ను నియంత్రించడం లో యోగా సహకరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. థైరాయిడ్ లో రకాలు... హైపర్ థైరాయిడ్ -- ఇందులో థైరాయిడ్ చాలా ఎ క్కువ సంఖ్యలో తయారు అవుతుంది.ఈ కారణంగా శరీరంలో బరువు చాలా త్వరగా త్గగ్గిపోతుంది. హైపో థైరాయిడ్ --- ఇందులో థైరాయిడ్ చాలా తక్కువగా సంఖ్యలో తయారు అవుతుంది.దీనికి తోడు పంచేంద్రియాలలో సమస్యలు ప్రారంభ మౌతాయి. ఊబకాయం,సంతాన లేమి సమస్యలు వేదిస్తాయి. థైరాయిడ్ లక్షణాలు /హార్మోన్ సమస్యలు... థైరాయిడ్ హార్మొన్ నియంత్రణలో లేకపోవడం వల్ల మీ జుట్టు ఊడిపోవడం,మీ కనుబొమ్మలు తగ్గిపోతాయి.రాత్రి అంతా నిద్ర పోయినప్పటికీ పగలు అంతా తీవ్రమైన అలసట అనిపిస్తుంది.బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. లక్షణాలలో భాగంగా.. --కారణం లేకుండానే చింతించడం-ఒత్తిడికి గురికావడం-- --థైరాయిడ్ హార్మోన్ నియంత్రణ లేనికారణం గా ఊబకాయం పెరుగుతుంది.లేదా ఒక్కోసారి బరువు తగ్గిపోతారు. ---మహిళలలో థైరాయిడ్ హార్మోన్ తగ్గడం వల్ల స్త్రీలలో నెలసరి సమస్యలు వస్తాయి. --థైరాయిడ్ కారణం గానే ఎప్పుడూ వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది.చాలా వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. --థైరాయిడ్ గ్రంధిలో వాపు దీనివల్ల స్వరంలో మార్పు ఉంటుంది. --పైన పేర్కొన్న అంశాలాలో ఏ లక్షణం మీకు కనిపించినా అలస్యం డాక్టర్ ను సంప్రదించండి.డాక్టర్ సూచనలు పాటించండి థైరాయిడ్ నియంత్రణ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి. ఖర్చులేకుండా సహజ పద్దతుల ద్వారా థైరాయిడ్ నియంత్రించ వచ్చు.దీనిప్రభావం చాలా త్వరగా ఉంటుంది. థైరాయిడ్ సమస్యకు చికిత్స లేదన్నది వాస్తవం కాదు.సమయాను గుణంగా నియంత్రించడం ద్వారా అన్ని సమస్యల మాదిరిగాదీనిని నియంత్రించ వచ్చు ఇతర చికిత్స లో ఖర్చులేకుండా యోగ సాధన ద్వారా థైరాయిడ్ ను నియంత్రించవచ్చు. మన శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.శరీరంలో ఒక్కో భాగం ఒక్కొరకం గా పని చేస్తాయి.అందుకోసం అత్యవసరమైన హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది.థైరాయిడ్ గ్రంధి ఒక చిలక బటర్ ఫ్లై రూపంలో ఉంటుంది.అక్కడ నుంచి థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది.అది మన శరీరానికి అవసరం ఒక్క సారి థైరాయిడ్ ఉత్పత్తి ఎక్కువగా తక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది.దీనివల్ల శరీరంలో పనితీరు పై తీవ్ర ప్రభావం చూపుతుంది.దీనిని నియంత్రించేందుకు కొంత సేపు యోగా చేయడం ద్వారా ప్రభావం చూపవచ్చని నిపుణుల విశ్లేషణ అసలు ఎలాంటి ఆసనాలు వేయాలి వాటివల్ల ప్రయోజనం ఏమిటో చూద్దాం. సర్వాంగ ఆసనం... సర్వాంగ ఆసనం థైరాయిడ్ ని నియంత్రించడం లో చాలా ప్రభావ వంత మైన అసనంగా పేర్కొన్నారు.దీనివల్ల పైన పేర్కొన్న అంశాలలో రక్త ప్రసారం సరైన పద్దతిలో జరుగుతుంది.ఈ ఆసనం సాధన చేయడం ద్వారా థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది.దానిపని తీరు మెరుగు పడుతుంది. హలాసనం... హలాసనం ద్వారా థైరాయిడ్ పిట్యుటరీ గ్రంధుల పనితీరు మెరుగు పడుతుంది.ఆసనం వల్ల మన శరీరం లో ముఖ్యంగా వెన్నుపూసలోని మెరుగు పాడేందుకు ఉపయోగ పడుతుంది.దీనితోపాటు పొట్ట పెరగడాన్ని చాలా ఫలప్రదంగా ఉపయోగ పడుతుంది.ఈ ఆసనం సాధన చేయడం ద్వారా మాంసం కండరాలు పై ఒత్తిడి తగ్గుతుంది. మస్చ్య ఆసన... వెనుక వైపుకు ఒంగే ఈ ఆసనం గొంతు,చాతి,భుజాలు,పొట్ట ను పెంచుతుంది.లేదా తెరుస్తుంది.యోగాలో వేసే ఈముద్ర పొట్ట శరీరం పై భాగాలను యాక్టివ్ చేస్తుంది. అవిసక్రమంగా తమ పని చేసుకుపోతాయి.' విపరీత కారిణీ... ఈ ఆసనం వల్ల లాభాలు ఏమిటి అంటే సర్వాంగ ఆసనం లాగానే ఉంటుంది.ఇందులో కూడా పొట్ట పైకి తల క్రిందికి ఉంటుంది.ఆసనం సాధన చేస్తున్నప్పుడు మనం వీపుతో పాటు గొంతు ఒత్తిడి పెరుగుతుంది.ఆసనం వేస్తున్నప్పుడు మనం వీపుతోపాటు గొంతు పై ఒత్తిడి పెరుగు తుంది.దీనివల్ల థైరాయిడ్ గ్రంధి యాక్టివ్ గా ఉంటుంది. ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం సందర్భంగా థైరాయిడ్ ను నిర్లక్ష్యం చేయవద్దని సరైన వైద్యం తో పాటు సాంప్రదాయ యోగాసధనాల ద్వారా థైరాయిడ్ కు అడ్డకట్ట వేయవచ్చని నిపుణులు
read moreగుండె మీద గుదిబండ హైపర్ టెన్షన్!
మనిషిలో ఆందోళన, గందరగోళం, కంగారు ఎక్కువైనప్పుడు చోటు చేసుకునే పరిస్థితి హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అనేది జబ్బు కాకపోవచ్చు కానీ ఇది చాలా జబ్బులకు దారి తీస్తుంది. మరీ ముఖ్యంగా ఇది గుండె జబ్బులకు కారణం అవుతుంది! ఈ మధ్య కాలంలో గుండెపోటు వచ్చిందనే విషయం మనం చాలా ఎక్కువగా వింటుంన్నాం. ఇంతకూ గుండెపోటు ఎందుకు వస్తుంది?? ఎలా వస్తుంది?? అన్ని అవయవాలకు రక్తం సరఫరా చేయడానికి రక్తనాళాలు ఉన్నట్లే గుండెకి రక్తం సరఫరా చేయడానికి 'కరోనరి ఆర్టెరీ' అనే ధమని వుంటుంది. దీంట్లో అడ్డం ఏర్పడితే గుండెకి రక్తం సరఫరా సరిగ్గా జరగదు. దాంతో ఆ భాగం ఆహారం అందక నశిస్తుంది. గుండె, మెదడు కండరాలలోని కణాలు ఒకసారి మరణిస్తే వాటి స్థానంలో మిగతా అవయవాలలోలా క్రొత్తవి ఉత్పత్తి కావు. అందుకని ఒకసారి నష్టం జరిగితే అది శాశ్వత నష్టమే! గుండె కండరాలు దెబ్బతినే సరికి గుండె కొట్టుకోవడం హఠాత్తుగా ఆగిపోతుంది. ఇదే గుండెపోటు రావడం గుండె ఆగితే ఇక ప్రాణం పోయినట్లే.. రక్తప్రసరణ మెదడులోని భాగాలకి సరిగ్గా జరగకపోవడం వల్ల ఆ భాగాలు దెబ్బతిని క్రమంగా మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే అధిక రక్తపోటువల్ల మెదడులోని అతి సన్నని రక్తనాళాల చివర్లు చిట్లి సెరబ్రల్ హెమరేజ్ కలగవచ్చు. ఈ రక్తపోటు వయసు, జాతిల మీద కూడా ఆధారపడి వుంటుంది. మగవాళ్ళలోను, వృద్ధులలోను ఈ అధిక రక్తపోటు ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి 40 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటినుంచి రక్తపోటు పరీక్షించి, తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రక్తపోటు పెరగడం వల్ల మూత్రపిండాలు కూడా దెబ్బ తింటాయి. ఒక్కోసారి మూత్రపిండాలకు సరిగా రక్తం అందనప్పుడు, అవి రక్తపోటు పెరగడానికి రెవిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేసి రక్తంలో కలుపుతాయి. కాబట్టి మూత్ర పిండాలలోపం వల్ల రక్తపోటు పెరుగుతుంది. శరీరబరువు పెరగకుండా జాగ్రత్తపడుతుండాలి. ముఖ్యంగా నలభై ఏళ్ళ తర్వాత! ప్రతి కిలో బరువు పెరుగుదలకి గుండె రోజుకి 300 కి.మీ. దూరం ఎక్కువగా రక్తనాళాల ద్వారా రక్తాన్ని ప్రసరింపజేయాల్సి వుంటుంది. అంటే పెరిగే బరువునిబట్టి గుండెమీద భారం పెరుగుతుందన్నమాట! కాబట్టి బరువు తగ్గడం అవసరం!! ఉప్పు, కారం తగ్గించాలి. పొగ త్రాగడం మానాలి. పొగ త్రాగడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. పొగ త్రాగడం వల్ల 80 నుంచి 120 మి.గ్రా. నికోటిన్ ప్రతిరోజు రక్తంలో చేరుతుంది. ఇది ఆర్టెరీస్ ముఖ్యంగా కాళ్ళలో, చేతుల్లో మూసుకుపోయేటట్లు చేస్తుంది. అలాగే గుండె కొట్టుకోవడాన్ని నిముషానికి 72 సార్లు నుంచి 80 సార్లకి పెరిగేలా చేస్తుంది. ఇలా గుండెమీద భారం పెరుగుతుంది! కేవలం పొగ త్రాగడం వల్ల మాత్రమే కాదు, మద్యం సేవించడం వల్ల కూడా గుండెకు ముప్పు పొంచి ఉంటుంది. పైన చెప్పుకున్నవన్నీ మొదట రక్తపోటుకు కారణం అయ్యి అది కాస్తా హైపర్ టెన్షన్ కు దారితీసి గుండె పనితీరు మీద దెబ్బ కొడుతుంది. అందుకే గుండె పనితీరు చక్కగా ఉండాలంటే హైపర్ తేనైన్ కు, రక్త పోటుకు దూరంగా ఉండాలి. ◆నిశ్శబ్ద.
read moreనిలబడి నీళ్ళు తాగితే ప్రమాదమా ?
మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. అదే పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిది అని అనేవాళ్ళు.ఇప్పుడు నిలబడి నీళ్ళు తాగితే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.నిలబడి నీళ్ళు గడగడా తాగడం మంచిది కాదని నాలుగు రకాల అనర్ధాలు వస్తాయని అంటున్నారు నిపుణులు.నీళ్ళు మన జీవితానికి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. నిలబడి నీళ్ళు ఎలాతగాలో చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.అంటే నిలబడి నీళ్ళు తాగడం వల్ల వచ్చే అనర్ధాలు అందరికీ తెలియదు. మరి నీళ్ళు తాగే సరైన పద్ధతి ఏమిటి. అసలు నీరు తాగడం కూడా అంతే ప్రాధాన్యత ఉంది.అసలు విషయానికి వస్తే నీళ్ళు తాగే టప్పుడు నిలబడి తాగడం ఒక అలవాటుగా మారిందిఅసలు నిలబడి నీళ్ళు తాగితే ఎలాహాని కలుగుతుంది సమస్యలు వస్తాయి వాటి గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నిలబడి నీళ్ళు తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్... ఊపిరి తిత్తులకు నష్టం కలిగిస్తుంది... మీరు నిలబడి నీళ్ళు తాగినప్పుడు అత్యవసరమైన పోషక తత్వాలు విటమిన్లు లివర్ పంచేంద్రియాలను చేరవు జారుగా ఉండే పదార్ధాలు అతి త్వరగా కరిగిపోతాయి అది మీ ఊపిరి తిత్తులు గుండెకు తీవ్ర నష్టం సంభవిస్తుంది ఆక్సిజన్ స్థాయిలో సమస్యలు వస్తాయి. జీర్ణ సమస్యలు.. మీరు తీసుకున్న ఆహారం ఒక్కోసారి అరుగుదల లేకపోవడం మీఆహారాం పోట్టలోనే చెడి పోవడమే అవకాశం ఉంటుంది.నిలబడి నీళ్ళు తాగడం వల్ల పంచేంద్రియాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. మనం నీళ్ళు తాగేటప్పుడు త్వరిత గతిన అన్నవాహిక గుండా పోట్ట కింది భాగం లో కి చేరుతుంది. ఇది మీ కు తీవ్ర హాని కలిగిస్తుంది నిలబడి గటగటా నీల్లుతాగడం వల్ల నరాలు ఒత్తిడికి గురి కావడం మృదువైన మెత్తటి పదార్దాలు లేదా శరీరంలోని సున్నితమైన భాగాలు పట్టుకోల్పోతాయి.టాక్సిన్స్ చేరి అరుగుదలలో సమస్యలు మార్పులు వస్తాయి. కిడ్నీకి సంబందించిన సమస్యలు... మనం నిలబడి నీళ్ళు తాగినప్పుడు మనకిడ్నీ ఆసమయం లో ఒక పద్ధతి ప్రకారం ఫిల్టర్ చేస్తుంది. మనం కూర్చుని నీళ్ళు తాగినప్పుడు,నిలబడి నీళ్ళు తాగినప్పుడు మెత్తటి పదార్ధాలు ఒక్కోసారి ఫిల్టర్ కాకుండానే పోట్టకింది భాగం లోకి చేరుతుంది. నీటిలో ఉన్న మలినాలు మూత్రాశయం లోకి చేరి మూత్రపిండాలు కిడ్నీ చేసే పని పై ప్రభావం చూపుతుంది. యురినరీ ట్రాక్ కు సంబంధించి అనారోగ్య సమస్యలు వస్తాయి. గట్టి పడే ప్రమాదం ఉంటుంది... మీరు నిలబడి నీళ్ళు గడగడా తాగేస్తే మీ ముక్కు నాసికా రంద్రాలలో ఒక్కోసారి నీరు చేరి శ్వాస నాళం లేదా ఇతర భాగాల్ పైన ఒత్తిడి పెరిగి మెత్తటి పదార్ధాలు ఒక్కోసారి శరీరం లోని మెత్తటి భాగాలు గట్టిగా మారడం మెత్తటి పదార్ధాలు పట్టుకోల్పోతాయి శరీరంలో టాక్సికేంట్స్ జీర్ణ వ్యవస్తలోమర్పులు వస్తాయి చెడు పదార్ధం లేదా విష పదార్ధం పేరుకు పోతుంది. మన జాయింట్స్ లో ఉండే మెత్తటి పదార్ధాలు చేరుతాయి ఈ కారణంగా గట్టిగా మారిపోతుంది దీనివల్ల ఒక్కోసారి ఎముకలకు నష్టం కలుగుతుంది. మరి నీళ్ళు తాగే సరైన పద్దతులు ఏమిటి ?... నిపుణుల సూచనల ప్రకారం నీళ్ళు ఎలా తాగాలి కూర్చుని తాగాలి. కుర్చీపై కూర్చుని మీవీపును నిటారుగా ఉంచి నీళ్ళు తాగాలి దీనివల్ల పోషక పదార్ధాలు మెదడును చేరుతాయి మెదడు పనితీరులో క్రమబద్దీ క రిమ్పబడతాయి అంతే కాదు పంచేంద్రియాల పనితీరు మెరుగు పడుతుంది పొట్టలో వాపు పోట్టపెరగడం వంటి సమస్యలు రావు. .
read moreడేంజర్ బెల్స్ కొట్టే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్!
మూత్రపిండాల నుండి విసర్జింపబడే మూత్రము మూత్రనాళము, మూత్రాశయం ద్వారా మాత్రమే బయటకు విసర్జింపబడుతుంది. ఈ మూత్ర అవయవాలు చాలా తరచుగా ఇన్ఫెక్షన్ గురవుతుంటాయి. కొన్నిసార్లు మూత్ర అవయవాల్లో రాళ్ళు, లేదా పోస్ట్రేట్ గ్రంథి వాపు వలన మూత్రనాళాల దారి సంకోచించి ఇన్ ఫెక్షన్ వస్తుంటుంది. అలాంటపుడు ఆ సమస్యను పరిష్కరించవలసి వుంటుంది. మూత్రనాళాలు ఇన్ఫెక్షన్కు గురికాకుండా మూత్రము ఆమ్ల లక్షణాన్ని కలిగి వుంటుంది. దేహరక్షణ వ్యవస్థ పటిష్టంగా వున్నంతకాలం ఏ ఇన్ఫెక్షన్ సోకదని గుర్తుంచుకోవాలి. ఇన్ఫెక్షన్లో అక్యూట్ మరియు క్రానిక్ అని రెండు రకాలు. అక్యూట్ రకంలో ఇన్ఫెక్షన్ అకస్మాత్తుగా వచ్చి కొన్ని రోజులు బాధ పెట్టి, పూర్తిగా నయమవుతుంది. కొన్ని యాంటీ బాక్టీరియల్ మందులతో వ్యాధి ఆగుతుంది. కొన్నిసార్లు అదే ఇన్ఫెక్షన్ అశ్రద్ధ చేసినట్లయితే క్రానిక్ అవుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లో లక్షణాలు:- మూత్రం పోసే టప్పుడు మంట రావటం, మూత్రం సాఫీగా రాక కొద్ది కొద్దిగా రావటం, నొప్పి కడుపు వరకు పాకినట్టవటం జరుగుతుంది. మూత్రం కొద్దిగా పసుపు పచ్చగా లేదా ఎరుపు రంగుగా రావచ్చు. ఇన్ఫెక్షన్ మోతాదు మించినట్టయితే పెద్ద పెట్టున, చలిజ్వరం రావటం, వణకటం వుంటాయి. వ్యాధి లక్షణాలు సేకరించి, మందును ఎంపిక చేసి వాడినట్టయితే అక్యూట్ యురినరీ ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమవుతుంది. నీరు అధికంగా తీసుకోవాలి. క్రానిక్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గించటానికి కొంత సమయం పడుతుది. ఇది ముఖ్యంగా 'గోనోకోకల్ ఇన్ఫెక్షన్' వల్ల వస్తుంది. ఇన్ ఫెక్షన్ క్రానిక్ అయినపుడు మూత్రనాళంలో స్ట్రిక్చర్స్ ఏర్పడుతాయి. మూత్రనాళంలోని జిగురు పొర కలసిపోయి మూత్రనాళం లోపలి పరిమాణం తగ్గుతుంది. మూత్రం పోసే దారి సన్నగా మారి మూత్రం పోసేటప్పుడు రోగి కడుపు కండరాలతో వత్తిడి చేయవలసి వుంటుంది. కొన్నిసార్లు మూత్రం ధార చీలినట్టుగా వస్తుంది. స్ట్రక్చర్ పెద్దదయినట్టయితే మూత్రనాళం పూర్తిగా మూసుకుపోయి మూత్ర విసర్జన ఆగిపోతుంది. మూత్రాశయం ఉబ్బుతుంది. ఆ పరిస్థితుల్లో శస్త్ర చికిత్సచేసి మూత్రాశయ ద్వారం తీయవలసి వుంటుంది. ఇన్ఫెక్షన్ ప్రారంభ దశలో వున్నప్పుడే మందులు వాడినట్టయితే ఇన్ఫెక్షన్ పూర్తిగా నివారించుకోవచ్చు. స్ట్రక్చర్లు ఏర్పడితే కూడా దీర్ఘకాలిక మందులను ఎంపిక చేసి వాడినట్టయితే శస్త్ర చికిత్స అవసరం లేకుండా నయం చేసుకోవచ్చు. క్రానిక్ ఇన్ఫెక్షన్ పూర్తిగా నయం చేయటంలో కొంత సమయం పడుతుంది. ప్రోస్ట్రేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ కు గురవటం వలన, లేదా వాపు వలన కూడా మూత్రం ఆగిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం జరుగుతుంది. ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడినవారిలో ప్రోస్ట్రేట్ గ్రంథి వాపు రావటం జరుగుతుంది. దీనికి కాథటరైజేషన్ చేస్తుంటారు. తాత్కాలికంగా నయమనిపించినా మళ్ళీ మూత్రనాళం సంకోచిస్తుంది. ప్రోస్ట్రేట్ గ్రంథిలో ఒక్కొక్కసారి క్యాన్సర్ కూడా వస్తుంది. తగిన పరీక్షలు చేయించుకుని క్యాన్సర్ కణాలు వున్నాయో లేదో నిర్ణయించవలసి వుంటుంది. ఇన్ని ప్రమాదాలు ఉంటాయి కాబట్టే.. ఇన్ఫెక్షన్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ◆నిశ్శబ్ద
read moreఆకలి కావడం లేదా?? అయితే ఇదిగో పరిష్కారాలు..
మనిషిని నిత్యం వేధించే సమస్య ఆకలి. ఇది పూట పూటకు పుడుతుంది. దాన్ని తృప్తి పరచకపోతే మనిషి శరీరాన్ని బాధకు గురిచేస్తుంది. అయితే కొందరిలో ఈ ఆకలి అధికంగా ఉంటుంది. ఎంత తిన్నా కొద్దిసేపటికే ఆకలి మొదలవుతుంది. దీనివల్ల అధికబరువు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇకపోతే ఆకలి లేకపోవడం అనేది మనుషుల్ని హింసించే సమస్య. ఇలా ఆకలి లేకపోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి, పోషకాలు, అవసరమైన విటమిన్లు మొదలైనవి లభించక పోషకాహార లోపంతోను, బలహీనత తోనూ ఇబ్బంది పడతారు. ఆకలి తగ్గిపోవడం అనే సమస్య రావడానికి అనేక కారణాలతో ఉంటాయి. ఫ్యాట్స్ ఎక్కువగా వున్న ఆహారపదార్ధాలను అతిగా తినడం, ప్యాక్ చేసిన పదార్థాలు, రెడి టూ ఈట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ మొదలైనవి తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. అలాగే కొన్ని జీర్ణాశయ, జీర్ణవాహికల వ్యాధులలోనూ ఆకలి లేక పోవచ్చును. కాబట్టి "ఆకలిలేదు!” అని అనుకొనేవారు. ముందుగా అన్ని వైద్యపరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయితే వైద్యుల సూచనల ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదే ఎలాంటి వ్యాధి లేదని నిర్ధారణ అయితే ఆహారం తీసుకోవడం, లైఫ్ స్టైల్ వంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనానికి అరగంట ముందుగా కొద్దిగా అల్లం రసం తాగితే బాగుంటుంది, ఒకవేళ అల్లం అందుబాటులో లేకపోతే వాము కొద్దిగా నమలి తిన్నా మంచి ప్రయోజనమే. ఇవి రెండూ ఆకలిని పెంచుతాయి. అలాగే జీర్ణాశయాన్ని శుద్ధి చేస్తాయి. చాలమందికి టీ.. కాఫీ.. లాంటివి గంటకు ఒకసారి, పూటకు ఒకసారి తీసుకోవడం బాగా అలవాటు. అలాంటి అలవాటు ఉన్నవారు దాన్ని తగ్గించుకోవాలి. అదేవిధంగా తీపి పదార్థాలు తినడం అంటే కొందరికి చెప్పలేనంత ఇష్టం. వాటిని కూడా తగ్గించుకోవాలి. ఇవి ఆకలి మీద చాలా దారుణమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే జీర్ణాశయ గోడలను బలహీనం చేస్తాయి. ఏ అనారోగ్యం వచ్చినా, ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా, మన పెద్దలు అయినా చెప్పేది ఒకే మాట. సమయానికి తినాలి అని. ఆకలి లేదు అని వంకతో ఆహారం తీసుకోవడం అస్తవ్యస్తం అయితే అది అలాగే అలవాటుగా మారిపోయి జీర్ణశయాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. అలాగే ఆకలి లేకపోయినా.. సమయాన్ని చూసుకుని అధికంగా పొట్టలోకి వేయకూడదు. మితంగా ఆహారం తీసుకుంటూ ఉంటే ఆకలికి అదే ఒక మంచి ఔషధంగా మారుతుంది. ఆహారంలో అన్నం ఎక్కువ ఉండకూడదు. అన్నం తక్కువ, పెరుగు, ఆకుకూరలు, కాయగూరలు, పీచుఎక్కువగావున్న పదార్థాలను అధికముగా తీసుకొంటూ ఉండాలి. ఇలా చేస్తే జీర్ణక్రియ బాగా జరుగుతుంది, ఆకలి కూడా సమయనికి తగ్గట్టు అవుతుంది. వేపుడులు, మసాలా పదార్థాలు, ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవి, నూనె అధికంగా ఉన్నవి తీసుకోకూడదు. అవి జీర్ణాశయనికి చేటు చేస్తాయి. పై జాగ్రత్తలతో పాటుగా.... అవసరమైతే వైద్య సల హాల ప్రకారము జీర్ణశక్తికి ఉపకరించే కొన్ని “టానిక్స్” వాడవచ్చు. ఆకలి దగ్గర మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ◆నిశ్శబ్ద.
read moreబరువు చెప్పే బండెడు నిజాలు!
ఈకాలంలో అధికశాతం మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. మనలో చాలామంది కేజీల కొద్ది బరువు పెరగడం చాలా సులభం. కానీ అదే బరువును తగ్గించుకోవాలంటే చాలా శ్రమపడతారు. పైనున్న తాతలు దిగిరావాలి ఈ బరువు తగ్గాలంటే.. అన్నంత కష్టతరంగా ఫీలవుతారు. అయితే బరువుకు ఆహారానికి పెద్ద సంబంధమే ఉంది. మనం రోజుకు ఎంత తింటున్నాం?? రోజుకి మనకెన్ని కేలరీలు అవసరమవుతాయి?? ఈ ప్రశ్నకు జవాబు కోసం చాలామంది ఎంతో వెతుకుతూ ఉంటారు. అయితే దీనికి సమాధానం మనం రోజూ చేసే పని ఎటువంటిది?? మన వయస్సు ఎంత, మన శరీర వ్యవస్థ ఎలాంటిది వంటి అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే తీసుకునే ఆహారం ఎప్పుడూ చేసే పని, శరీర వ్యవస్థను బట్టి ఉండాలి. కాయకష్టం చేసే వడ్రంగికి రోజుకి 5,000 కేలరీల అవసరం కావచ్చు. పని సవ్యంగా నడవటానికి అతడు పుష్టిగా తినాలి. మరోవంక చూస్తే, రోజంతా ఓ టేబుల్ ముందు కూర్చుని పని చేసే ఉద్యోగికి రోజుకు 2,200 కేలరీలే కావలసి వుంటుంది. అలాగే రోజంతా ఇంటి చాకిరితో సతమతమయ్యే అతని భార్యకు 2,500 కేలరీల అవసరమై వుంటుంది. అదే ఒక ఆఫీస్ పక్కకు కదలకుండా పనిచేసే ఉద్యోగికి రోజూ 1,800 కేలరీలు అయినా సరిపోతాయి. ఈ కేలరీల కథ అంతా, మనం ఎంత చురుకుగా వున్నామనే దాన్ని బట్టి వుంటుంది. పాతికేళ్ళ వయసులో సామాన్యంగా ఎటువంటి ఇబ్బందీ లేకుండానే మనం కేలరీలను సులభంగా కరిగించెయ్యగలుగుతాము. కానీ ముప్పై ఐదేళ్ళప్పుడు పరిస్థితిలో మార్పు ప్రారంభమవుతుంది. అప్పుడు మనలో చురుకుపదనం తక్కువ. ఎక్కువ సేపు కూర్చుంటాం. వీలయినంత వరకూ ఒళ్లు అలసటకు గురికాకుండా వుండేందుకు అనువుగా శ్రమలేని జీవితాన్ని గడపడానికి, రోజులో పనులు సులభతరం చేసే పరికరాలను వుపయోగిస్తూ వుంటాము. అందుకు తగినట్టుగా మన పనికి అవసరమైన తిండి ఎంత సరిపోతుంది అని మనమే చూసుకోవాలి. అంతేకానీ, ఇతరులు అలా ఉంటున్నారు, అది ఫాలో అవుతున్నారు అని వాటిని పట్టుకుని వేలాడకూడదు.. ఒక వ్యక్తి బరువులో మార్పు కలిగించే పరిస్థితులు ఇంకా ఏమైనా వున్నాయా అని ఆలోచిస్తే.. నిశ్చయంగా వున్నాయని మనకు స్పష్టమవుతోంది. చర్మం క్రింద వున్న ధాతువులలో నీరు చేరడం వల్ల బరువు ఎక్కువ కావచ్చు. ఉదాహరణకు - గుండె పనితీరు తప్పినప్పుడు దానికి గురుతుగా కాళ్లూ, ఇతర అవయవాలూ వాపు కనిపించవచ్చు. ఇలానే కొన్ని రకాల మూత్ర పిండపు వ్యాధులు కూడా. ఈ లోపాలున్న వ్యక్తులు ఉప్పు అధికంగా వాడకూడదు. అయితే, సామాన్యంగా చాలామంది బరువెక్కడానికి కారణం ఇదికాదు. అసలు విషయం, ఎక్కువగా తినడమే. తామేమీ ఎక్కువ తినడం లేదని అంటుంటారు. కానీ చేస్తున్న పనికి మించి ఎక్కువ తింటేనే బరువు పెరుగుతారు. ఏది ఏమైనా సరే.. మీ బరువు ఎక్కువగా వున్నట్టయితే మీకొక హెచ్చరిక చెయ్యాలిప్పుడు. ఇరవై సంవత్సరాలకు పైగా అధిక క్రొవ్వును ఇలా మోసుకు తిరుగుతూ వుంటే, తరువాత జీవిత దశలో, ఈ శ్రమాధ్యికం వల్ల గుండె, మూత్రపిండాలు పని చెయ్యకపోవచ్చు. వాటికి సంబంధించిన జబ్బులు సులువుగా రావచ్చు. కాబట్టి అధిక బరువు అత్యంత ప్రమాదకరం అన్నమాట ఎన్నటికీ మరువకూడదు. ఇప్పటికైనా బరువు చెప్పే నీతులు కాస్త వినండి. ◆నిశ్శబ్ద.
read moreపొట్టలో నీరు వల్ల ఇన్ని రోగాల రిస్క్ ఉందా?
ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య పొట్ట పెరగడం. దీన్నే అందరూ పొట్ట పడింది అంటూ ఉంటారు. కొందరికి పొట్టలో నీరు చేరుతుంది. పొట్టలో 12 లీటర్ల నీరు చేరితే తప్ప నీరు చేరినట్లు స్పష్టంగా కనబడదు. పొట్టలో నీరు చేరడాన్ని 'ఎసైటిస్' అంటారు. జీర్ణకోశం నుంచి లివర్ కి వెళ్ళే రక్తనాళాలకి ఏదైనా అడ్డంకి ఏర్పడితే పొట్టకి నీరు చేరడం అతి సహజం. ముఖ్యంగా లివర్ కుదించుకు పోయినప్పుడు (సిర్రోసిస్ లివర్) పొట్టకి నీరు చేరుతుంది. గుండె పెరిగినప్పుడు, మూత్ర పిండాలు దెబ్బతిన్నప్పుడు పొట్టకి నీరు వస్తుంది. కడుపులో క్షయవ్యాధి, క్యాన్సర్, ఇతర వ్యాధులు వచ్చినప్పుడు కడుపుకి నీరు చేరడం సహజం. లివర్, పాన్ క్రియాస్, జీర్ణకోశం, గర్భకోశం, అండాశయాలకి టి. బి కేన్సర్ వచ్చినప్పుడు సాధారణంగా పొట్టకి నీరు చేరు తుంది. కొందరికి పొట్టకి నీరు చేరడంతోపాటు కాళ్ళకి, ముఖానికి, శరీరం అంతటికీ కొద్దో గొప్పో వీరు వస్తుంది ఈ పరిస్థితిని'నెఫ్రొటెక్' సిండ్రోమ్' అనుకోవచ్చు. ముందుగా కాళ్ళకి వీరు కనిపించి, ఆ తరువాత పొట్టకి నీరు చేరడం అంటే గుండె పెరగడంవల్ల అని అనుమానించవచ్చు. పొట్ట బానలాగా తయారై పొట్టకి విజరీతంగా నీరు మరి కొద్దిపాటి నీరు కాళ్ళకి వుంటే 'సిర్రోసిస్ లివర్' అనుకోవచ్చు. పొట్టకి నీరు చేరడమే కాకుండా పచ్చకామెర్లు (జాండిస్) కూడా వుంటే పోర్టల్ వెయిన్ ఆల్ స్ట్రక్షన్ అను కోవచ్చు. పోర్టర్ వెయిన్ అల్సక్షన్లో రక్తంలో ప్రోటీను శాతం బాగా తక్కువగా వుంటుంది. ఏ సమస్య ఎలా ఉంటుంది?? సిర్రోసిస్ :- సిర్రోసిస్ లివర్ (లివర్డి స్యూ పూర్తిగా పాడై కుదించుకుపోవడం) ఉన్న వ్యక్తి అంతకు ముందు మధ్యం అతిగా సేవించడం జరిగి ఉండవచ్చు లేదా అంతకు ముందు ఏదైనా ఇన్ ఫెక్షను వచ్చి కాలేయం బాగా దెబ్బతిని ఉంటుంది. కొందరిలో అంతకు ముందు రక్తం వాంతి అవడం, విరోచనంలో నల్లగా రక్తం పోవడం, కామెర్లు రావడం ఉంటాయి. కోసిస్ పరిస్థితి ఉన్న వారి బుగ్గలు ఎరుపుగా వుంటాయి. బొడ్డు దగ్గర రక్తనాళాలు ఉబ్బి స్పష్టంగా కనబడతాయి. వికారం, ఆకలి లేకపోవడం వుంటాయి. కొందరిలో మొదట్లో లివర్ స్క్రీన్ పెరిగి కనబడటుంది. సిర్రోసిస్ లివర్ లో కొందరికి పచ్చ కామెర్లు ఉంటాయి. మూత్రపిండాల వ్యాధి : మూత్రపిండాల వ్యాధి వల్ల పొట్టకి నీరు చేరటమేకాకుండా, ముఖానికి, కాళ్ళకి . నీరు చేరుతుంది. మూత్రంలో ఆల్బుమిన్ కనబడుతుంది. మైక్రోస్కోప్ పరీక్ష చేస్తే ఎపిథీలియల్ కాస్ట్స్ ఉంటాయి. గుండెజబ్బు: గుండె పెరిగినప్పుడు సిరలన్నీ ఉబ్బుతాయి. మెడదగ్గర రక్తనాళాలు ఉబ్బి కనబడతాయి. కాలేయం ఉబ్బుతుంది. గుండె పెరిగినప్పుడు ముందు కాళ్ళకి, ఒంటికి నీరు కనబడి ఆ తరువాత పొట్టకి నీరు కనబడుతుంది. గుండె పెరగగా పొట్టకి నీరు చేరిన పరిస్థితిలో వ్యక్తి ఆయాసపడటం వుంటుంది. 'థాలస్ ఎసైటిస్' లో పొట్టలో చేరిన నీరు పాల లాగా కనబడుతుంది. నీరు పాలలాగా కనబడటానికి కడుపులో వున్న ప్రధాన ఎంఫాటిక్ నాళానికి అడ్డంకి ఏర్పడటం లేదా క్యాన్సర్ కణాలు చేరడం కారణం. బోదకాలు వున్న వారిలో కూడా బోద వ్యాధివల్ల పొట్టలో ఖైల్ చేరి నీరు పాలలా కనబడుతుంది. ఇన్ని రకాల సమస్యలను మీరే డిసైడ్ చేసుకోకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. ◆నిశ్శబ్ద
read moreపనస పండు తరచూ తింటే..!
కోరోనా తరువాత శరీరం లో రోగనిరోదక శక్తి తగ్గింది కాబట్టి.మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. గరీబోడికి బాదం, పిస్తా, కర్జూరం కొనాలంటే కాస్త ఇబ్బందే అందుకే అతి తక్కువ ఖర్చుతో కూడిన గరీబోడి బాదాం ఏది అని కదా మీ ప్రశ్న అదే పనస పండు. పనస పండు పై భాగం లో ముళ్ళు ముళ్ళు గా ఉన్నప్పటికీ లోపల ఉండే పనస తొనల సువాసన తొనలను తిన్నకొద్దీ తినాలని అనిపిస్తుంది.పనసపండు చూసేందుకు అందం గానూ ఉండే తోన అందులో ఉండే గింజలో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయంటే ఎవరూ నమ్మరు. పనస పండులో విటమిన్ బి,లేదా రక్తహీనత ఉన్నవాళ్ళకి పనసపండు శ్రేష్టం.మీ చర్మం అందంగాను జుట్టు ద్రుడంగాను ఉండాలంటే పనసపండు కు మించినది లేదని న్యుట్రీషియనిస్ట్ లు అంటున్నారు. న్యుట్రీషియనిస్ట్ లు చేసిన పరిశోధనలలో పనస గింజలలో అద్భుతమైన గుణాలు ఉన్నా యని పేర్కొన్నారు. పనస గింజల ను తినే పద్ధతి ని పనస గింజలలో ఉండే లాభాల ను గురించి వివరించారు. వేసవి కాలం లో మాత్రమే లభించే పనసపండు పనసతోన కేవలం సువాసన నే కాదు ఆరోగ్య పరంగా మరిన్ని పోషకాలు లభ్యమౌతాయి.ప్రత్యేకంగా పనసగింజలు ఆరోగ్య ఖజానాను అందిస్తుందని పేర్కొన్నారు. పనస తొనలు,గింజలు తీసుకోవడం వల్ల మంచిఫలితాలు ఇస్తాయని గింజలను సరైన పద్దతిలో తినడం వల్ల ఆరోగ్య ఫలితాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. పనస గింజలు అద్భుత ఫలితాలు... పనస గింజలలో కొన్ని రకాల పోషక తత్వాలు సంపూర్ణంగా లభిస్తాయి. పనస గింజలలో విటమిన్ బి గుణాలు సంపూర్ణం గా లభిస్తాయి. విటమిన్ సి,విటమిన్ఏ తయామిన్, రేబాఫ్లోబిన్, జింక్,నియాసిన్, లాంటి చాలా రకాల తత్వాలు ఇందులో ఉంటాయి. పనస గింజలు తినడం వల్ల శరీరం లో హిమాగ్లోబిన్ శాతం పెరుగుతుంది. మీరు ప్రోటీన్ కోసం వెతుకు తున్నారా ప్రత్యామ్నాయం గా పనస గింజలు ఎంచుకోవచ్చు. పనస గింజలు శరీరం లోపల నుండి బలోపేతం చేస్తుంది.అనారోగ్య తీవ్రతను నియంత్రిస్తుంది. పనస గింజలను ఎలా ఉడికించాలి... పనస గింజలు తినే ముందు శుభ్రంగా కడిగి శుభ్రంగా ఒలిచి గింజలు ఒకదగ్గర చేర్చి శుభ్రంగా నిపౌలమీద కాల్చినా, లేదా పెనం పై రోస్ట్ చేసి తిన్న ఆరుచి వేరు అంటారు పనస ప్రియులు. బాగా మరిగించిన నీటిలో వేసిన గింజలు వేసి కొంచం ఉప్పు జోడించండి చాలా రుచిగా ఉంటుందని అంటారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు పనస పొట్టు తో కూర అద్భుతంగా చేస్తారు పనస కూర తో చేసే బిరియాని చాలా రుచిగా ఉంటుంది. సో ఏని వే గరీబోడి బాదం పనస గింజల తో అద్భుత ఫలితాలు ఉన్నాయన్నది వాస్తవం.
read moreక్యాన్సర్ అంటే ఏమిటి ?
కొన్ని అపోహలు,సందేహాలు.అవగాహన. క్యాన్సర్ గురించి అందరూ వినే ఉంటారు. కాని క్యాన్సర్ అంటే ఏమిటి ? అని అడిగితే మాత్రం చాలా మంది సమాధానాన్ని చెప్పలేరు. కొద్ది మంది మాత్రమే క్యాన్సర్ క్యాన్సర్ అంటే ఏమిటి అది ఎలా ఏర్పడుతుంది, ఎలా వృద్ధి చెందుతుంది అన్న విషయాలు తెలిసి ఉంటాయి. క్యాన్సర్ లో 1౦౦ కు పైగా రకాలు ఉన్నాయి. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు ఆఖరికి కళ్ళు గుండె కు కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఉందంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. క్యాన్సర్ ప్రారంభం మొదట ఎదో ఒక శరీర భాగపు కణాల లో మొదలు అవుతుంది. సాధారణ శరీర కణాలు క్యాన్సర్ కణాలుగా ఎలా మారాయి అన్నది తెలుసుకుంటే క్యాన్సరు రూపు రేఖలు ఏమిటో తెలుస్తాయి. సాధారణ శరీర కణాలు...జీవిత చరిత్ర తెలియాలి. మన శరీరం అనేక రకాల సజీవ కణాల తో కూడుకుని ఉంటుంది. శరీరంలోని ప్రతి అవయవము కణాల సముదాయమైన తిష్యుల తో నిర్మితమై ఉంటుంది. భావన నిర్మాణం లో ఇటుకలు ఎలాంటివో శరీరంలోని వివిధ విభాగాల నిర్మాణం లో టిష్యూ లు ఇటుకల లాంటివి. సాధారణ ఆరోగ్యకర శరీరంలో కణాలు పరిపక్వ స్థితికి రాగానే ఒకటికి మరిన్ని కణాలుగా విభాజ్యం చెందుతూ ఎప్పటి కప్పుడు కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక నిర్ణీత కాలం వచ్చే సరికి శరీరంలోని ప్రతి కణానికి వయస్సు చెల్లె సమయం ఆసన్న మౌతుంది.అప్పుడు అవి ఇక పని చేయని స్థితికి వస్తాయి. పని చేయని స్థితికి వచ్చిన కణాలు ఎప్పటి కప్పుడు నశించి పోతాయి. నశించిన కణాల స్థానం లో అంతకు ముందు విభాజ్యం చెందుతూ ఏర్పడిన కొత్తకణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనిషికి జీవన ప్రారంభదశలో అంటే బాల్యంలో శరీర కణాలు వేగంగా విభాజ్యమౌతూ వృద్ది చెందుతాయి. ఆకాలం లో నశించి పోయే కణాలకంటే కొత్తగా ఏర్పడే కణాల సంఖ్య అధికంగా ఉంటుంది. దీనివల్ల శరీరాలు అభివృద్ధి చెందుతూ పిల్లలు ఎదగడానికి వీలు కలుగుతుంది. ఇది మనశారీర కణాల జీవిత చరిత్ర. క్యాన్సర్ కణాలు ---కణితలు. క్యాన్సరు ఎప్పుడూ ఎదో ఒక శరీర భాగపు కణం తో ప్రారంభ మౌతుంది. కణాలు విభాజ్యం చెందడం కొత్త కణాలు గా ఏర్పడుతూ వృధీ చెందడం . పాత గా అయిపోయిన కణాలుమరణించడం అనే సహజ సిద్దమైన క్రమబద్ద క్రియ లో ఒక్కోసారి ఎక్కడో తేడా వస్తుంది. ఆ తేడా కారణంగా శరీరంలోని ఒకానొక భాగం లో పనిచేయని వయస్సు చెల్లిన కణాలు నసిన్చిపోవడం అంతే కాక అవసరం లేక పోయినా ఆ భాగాన కొత్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవసరం తీరి నశింపు చెందకుండా ఉన్న పాత కణాలు, అవసరం లేకపోయినా ఏర్పడిన కొత్త కణాలు ఆ మొత్తంలో అక్కడి భాగం ఒక ముద్దగా గడ్డలా తయారు అవుతుంది. అలా ఏర్పడిన గద్దలనే వైద్య పరి భాషలో ట్యూమర్స్ అంటారు. గడ్డలు శరీరంలో ఏ భాగంలో ఐనా ఏర్పడవచ్చు. వీటిలో ప్రామాడం లేని గడ్డలు ఉంటాయి. ప్రమాదాన్ని కలిగించే హానికారక గడ్డలు ఉంటాయి. ప్రమాదంలేని గడ్డలను మ్యాలిగ్నేంట్ ట్యూమర్స్ అంటారు. ప్రమాదాన్ని కలిగించే గడ్డలను మ్యాలిగ్నేట్ ట్యూమర్ అంటారు క్యాన్సరు గద్దలంటే ఇవే.. ప్రమాదం లేని గడ్డలు- బినైన్ ట్యూమర్స్... * ఇవి క్యాన్సర్ ను కలిగించవు,ప్రాణాపాయం లేనివి. * వీటిని చిన్నపాటి శస్త్ర చికిత్స ద్వారా తొలగించ వచ్చు. సాధారణంగా ఇంకా మళ్ళీ పెరగవు. * ఈ గడ్డ లోని కణాలు చుట్టుపక్కల కణ జాలం లోకి ప్రవేసించ లేవు. * అదే విధంగా మరో ప్రాంతపు శరీర భాగం లోకి వ్యాపించలేవు. హానికార గడ్డలు -మ్యాలి గ్నేట్ ట్యూమర్స్... * ఇవి క్యాన్సర్ కు సంబందించిన ప్రాణాపాయ గడ్డలు. * ఈ రకంగా ప్రాణాంతక హానికారక క్యాన్సర్ గడ్డలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించ వచ్చుకాని మళ్ళీ పెరిగే అవకాసం ఉంది. * క్యాన్సర్ కణాలు చుట్టుపక్కల కణజాలం లోకి ఇతర శరీర భాగాలలోకి ప్రవేసించ గలుగుతాయి. * ఈ గడ్డ లోని క్యాన్సరు కణాలు రక్త ప్రావాహం ద్వారా,లింఫ్ వ్యవస్థ ద్వారా దూరంగా ఉన్న అవయవాల లోకి ప్రవేశించి. ఆయా భాగాలాలో కొత్త గడ్డలను ఏర్పరచ గలుగు తాయి. ఇలా దూరంగా ఉన్న ఆవయవాలలోకి క్యాన్సర్ వ్యపించడాన్ని మెటా స్టే సిస్ అంటారు. క్యాన్సర్ లక్షణాలు ... క్యాన్సర్ లో అనేక రకాలు ఉన్నాయి.ఒక్కోరకమైన క్యాన్సరు లో ఒక్కోరకమైన లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల క్యాన్సార్ లలో అవి భాగా ముదిరిపోయే దాకా ఏ లక్షణాలు కనిపించవు. కూడా అందుకనే డాక్టర్స్ క్యాన్సర్ కవాచ్చు ఏమో అన్న అనుమానం కలగ గానే ఆ వ్యక్తికి వివిధ టెస్టులు ,స్క్రీనింగ్ లు జరిపిస్తారు. క్యాన్సర్ లో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలు, చిహ్నాలు ఈ విధంగా ఉంటాయి ... * చాతిలో లేక శరీరంలో మరెక్కడైనా కొత్తగా ఏదైనా గడ్డలు కనిపించడం. * కొత్తగా నల్లటి మచ్చ ఏర్పడడం. లేదా అంతకు ముందే ఉన్న పులిపిరి లేక నల్ల మచ్చలో మార్పులు కనిపించడం గమనించవచ్చు. * పుండు ఎంతకీ తగ్గక పోవడం. * విడవకుండా దగ్గు, గొంతు బొంగురు పోవడం. * మల మూత్ర అలవాట్లలో మార్పులు కనిపించడం. * నిరంతరం అజీర్ణం. * మింగటానికి ఇబ్బంది కలగడం. * ఏ కారణమూ లేకుండా బరువు తగ్గడం. * జననేంద్రియం నుంచి అసాధారణంగా రక్త స్రావం కావడం లేక విపరీతంగా తెల్లటి ద్రవం ఉత్పత్తి కావటం. మొదలైన లక్షణాలు గమనించిన వెంటనే క్యాన్సరా కదా అని నిర్ధారించుకోవాలి.అయితే చెప్పినవన్నీ క్యాన్సర్ మూలంగానే వస్తాయని కాదు. ఏ ఇన్ఫెక్షన్ మూలంగానో కూడా రావచ్చు. అయినా సరే ఇలాంటి లక్షణాలు కనిపించి నప్పుడు డాక్టర్ ను సంప్రదించి పరీక్ష చేయించుకోవడం అవసరం. పైన చెప్పిన లక్షణాలే కాకుండా కింద పేర్కొన్న కొన్ని సాధారణ లక్షణాలు కూడా వివిధ క్యాన్సర్లకు చిహ్నాలు కావచ్చు. పొత్తికడుపు నొప్పి పెల్విక్ పెయిన్... బొడ్డుకు దిగువ భాగంలో పొత్తికడుపులో విడవకుండా నొప్పి వస్తే అది నెలసరి కి సంబందించిన మూలంగానే కాకుండా ఎండో మెట్రియాల్ క్యాన్సర్ ఓవరియన్ క్యాన్సర్, లేదా సర్వికల్ క్యాన్సర్ లాంటి వాటి మూలంగా కూడా కవాచ్చు. కడుపు ఉబ్బరం..తేన్పులు... వీటిని మనం అంతగా పట్టించుకోము కాని రెండూ విడవకుండా ఉండడం సాధారణంగా జీర్నకోస క్యాన్సర్ లక్షణం గా అని నిపుణులు అనుమానించే అవకాశం ఉంది. నడుము నొప్పి... కొందరు స్త్రీలు నడుము కింది భాగంలో తీవ్రనోప్పి వస్తోందంటూ వాపోతూ ఉంటారు. కొందరు స్త్రీలు అయితే ఆ నొప్పి ప్రసవ నొప్పులంత తీవ్రంగా ఉంటోందని అంటున్నారు. బహుశా అది అండాశయ క్యాన్సర్ వల్ల కావచ్చు. ఎంతకీ తగ్గని జ్వరం ... నెలరోజులుగా గడిచినా జ్వరం తగ్గక పోతే డాక్టర్ ను కలవడం మంచిది. ఒక్కోసారి అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. తీవ్రమైన అలసట నీరసం... క్యాన్సర్ లో కనిపించే సాధారణ లక్షణం. ఇది ప్రారంభ దసకంటే సాధారణంగా క్యాన్సరు ముదిరి పోయిన దశలో ఎక్కువగా కనిపిస్తుంది. మామూలు దిన చర్యలు కూడా చేసుకోలేనంతగా నీరసం. అలసట ఉంటె డాక్టర్ ను తప్పకుండా కలవాలి. క్యాన్సర్ ఎవరికీ వస్తుంది ?...రిస్క్ ఫాక్టర్... క్యాన్సర్ ఎవరికీ వస్తుంది? ఎవరికీ రాదు? అన్న విషయాన్ని ఇది మిద్దం గా చెప్పడం కష్టం. కాకపోతే కొన్ని కారణాలు కొన్ని రిస్క్ ఫాక్టర్స్ క్యాన్సర్ రావడానికి మూలంగా ఉదావచ్చని పరిశోధకులు చెపుతున్నారు. స్థూలంగా చూసినప్పుడు అలాంటి అలాంటి కారణాలలో కొన్నిటిని చూద్దాం. వృద్దాప్యం. పొగ తాగే వాళ్ళు, సూర్యరస్మి, రేడియేషన్ కి గురికావడం,, విచల విడిగా,రాసాయన ఎరువులు వాడడం. వాతావరణ కాలుష్యం, ఆహార పదార్ధాలలో రంగుల వాడకం, కొన్ని రకాల వైరస్ లు, బ్యాక్టీరియా,కొన్ని హార్మోన్లు, కుటుంబ పరంగా, క్యాన్సర్ చరిత్ర ఉన్న వారికి, మద్యాన్ని సేవించేవారికి, పోషకాహార లోపం,స్థూలకాయం, పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్ లో కొన్ని నివారించు కోగాలిగినవి. కొన్ని మన చేతిలో ఉంటాయి.
read moreఅలసటకు కారణాలు!
ఈ శరీరం అలిసిపోయింది వంట్లో శక్తి లేదు ఏదో బతుకు బండిని భారంగా ఈడుస్తున్నాను అని చాలామంది అంటూ ఉంటారు.ఇది కేవలం వృద్ధాప్యం లో ఉన్నవారి మాటలలో మాత్రమే ఒకప్పుడు వినిపించేది అయితే ఈ పరిస్థితి పోస్ట్ కోవిడ్ తరువాత అన్ని వర్గాలలో వినిపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటికి వచ్చి మళ్ళీ శక్తి ఉత్సాహాలాను పుంజుకోవాలని అనుకుంటున్నారు కోవిడ్ భారిన పడ్డ బాధితులు. అలసట తో అలిసిపోతున్నామని అంటున్నారు. అలసట ఇది మనందరికీ తెలిసిన పదమే అప్పుడప్పుడూ చిన్న చిన్న జ్వరాలు వచ్చి పోయినప్పుడు మనల్ని హలో అని పలకరిస్తుంది.ఒక్కోసారి వయసు మీద పడి తీవ్ర అనారోగ్యానికి గురి అయిన వారిలో,శస్త్ర చికిత్స జరిగి కోలుకుంటున్న కొందరిలో త్వరగా అలిసిపోవడం మాములుగా పైకి కనిపిస్తున్నా తీవ్రమైన అలసట ఎక్కువగా ఉండడం సహజంగా కనిపిస్తుందని బాధితులు పేర్కొంటున్నారు. ఇంకొందరిలో నడవలేకపోవడం మెట్లు ఎక్కలేకపోవడం ఆయాసం వంటి సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయాని రోగులు తమ తోటి వారితో వాపోయిన ఘటనలు ఈ మధ్యకాలం లో తరచుగా వింటూనే ఉన్నాము. దీనినే వైద్య పరిభాష లో క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్ సి ఎఫ్ ఎస్ ను కనుగొనేందుకు గల కారాణాలు ఏమిటి అని కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక వైద్య శాస్త్రం లో పరిశోదనలు జరుతున్నాయని నిపుణులు వెల్లడించారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే సి.ఎస్. ఎఫ్. వల్ల బాధపడుతున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు గణనీయంగా పెరిగిపోవడం గమనించవచ్చు. సి ఎస్. ఎఫ్ వల్ల సంపాదన పనుల వల్ల కుటుంబాలు దేశాలు అసాధారణ స్థాయిలో ఆదాయాన్ని ఉత్పాదకతను కోల్పోతున్నాయి దశాబ్దాల పాటు ఆరోగ్య భీమా రంగాలలో దీనిని పట్టించుకొని పశ్చిమ దేశాలు ఇటీవల సి.ఎస్. ఎఫ్. ను వ్యాధిగా గుర్తించి చికిత్సను భీమా పరధిలోకి తీసుకు వచ్చినట్లు గ్రంధ రచయిత పరిశోధన సారాన్ని మనకు అందించిన రచయిత రామ్మోహన్ అప్పరసు స్పష్టం చేసారు.అసలు సి.ఎస్. ఎఫ్. వ్యాధికి కారణాలను కనుగొనే పరిశోదన ద్వారా చికిత్చా విధానం వరకూ సి .ఎస్. ఎఫ్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. మీరు అలిసిపోతున్నారంటే అది సాధారణమైనదే అయిన సి.ఎఫ్.ఎస్ ప్రస్తుతం చేయగలిగింది దానిని అర్ధం చేసుకోవడం ఎదుర్కోవడమే. మీరు ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా చేసే ప్రయత్నం వల్ల ఆశక్తులను చేసే నీరసం అలసట చక్రబంధం నుంచి బయట పడగలుగుతారు. వాస్తవానికి అలసట పై చేసే పోరాటం అంత కష్టతరమైంది ఏమి కాదు అని అంటున్నారు నిపుణులు. మనం నిత్యజీవితంలో ఎలాంటి సందర్భాలలో అలిసిపోతారు అన్న విషయం తెలుసుకుందాం... రోజంతా వృత్తి,ఉద్యోగాలలో ఉన్నవారు,తీవ్రంగా క్రీడలలో పాల్గొన్నవారు అలిసిపోవడం సహజమే అని నిపుణులు అంటున్నారు.ముఖ్యంగా ఎవరైనా కుటుంబాలతో దూర ప్రాంతాలు,విహార యాత్రలు వందలకిలోమీటర్లు కలిసి ప్రయాణం చేయడం.వల్ల అసలు శరీరంలో శక్తి లేనంతగా అలసట ఉంటుంది. ఇలాంటి సమయంలో కొద్ది గంటలో,లేదా కొన్ని రోజుల్లో విశ్రాంతి తీసుకుంటాం. మళ్ళీ రెట్టించిన ఉత్సాహం తో తిరిగి రోజువారి కార్యక్రమాలతో మళ్ళీ బిజీ అయిపోతాం. అయితే కొన్ని సందర్భాలలో అలసట ఒక పట్టాన తీరదు. ఒకరెండు సంవత్సారాల క్రితం జరిగిన అధ్యయనంలో రోజూ ఏదు గంటల పాటు నిద్రపోయిన వారు సైతం వారిలో 45% మంది అలసటతో గడుపుతున్నట్లు నిపుణులు గమనించారు. నేటి కాలమాన పరిస్థితులలో వివిధ రంగాలలో అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు,వృత్తి నిపుణులు, పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న జనాభ మాత్రమే దీని బారిన పడుతున్నారని,ఇందులో పురుషులు మాత్రమే ఎక్కువగా ఉండడాన్ని గమనించినట్లు తెలిపారు. ఈ పరిస్థితి అంటే ఫాటిగ్ యు సింగ్ ద్రోహం నుండి బయట పది శక్తి ఉత్సాహాలను తిరిగి పొందేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు మానసిక నిపుణులు చేస్తున్న ప్రయత్నం అలసట మన కండరాలను మజిల్ ఫ్యాటీ యు నాడీ వ్యవస్థను సెంట్రల్ ఫ్యామిలీ యును తీవ్రంగా ప్రాభావితం చేస్తోంది అని నిపుణులు నిర్ధారించారు.అసలు అలసటకు కారణాలు ఏమిటో అత్యధికంగా నిస్సాత్తువ నిస్తేజం మనలను ఎందుకు ఆవరిస్తోందో మీకు తెలిపే ప్రయాత్నం చేస్తున్నారు రామ్మోహన్ అర అప్పరసు గారు మీరు ఒంటరి కాదని చెప్పేందుకే ఈ ప్రయత్నమని పరిష్కారం అందించే దిశగా ప్రయాత్నాలు చేస్తున్నారని ఫలితం వస్తుందని ఆశిద్దాం.
read moreఈ లక్షణాలు ఉంటే మీ కిడ్నీ డేంజర్ లో ఉనట్టే!
మీ కిడ్నీ సరిగా పనిచేయనప్పుడు సరైన తోక్సిన్స్ పెరుగు తాయి. అది మీ రోజువారి జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.అది మీకు ఆస్చార్యాన్ని కలిగించ వచ్చు. కిడ్నీలో సమస్యల లో వచ్చాయిఅనడానికి ఈ పదిలక్షణాలు గమనించండి. 1)మీరు తరచుగా అలిసిపోవడం... మీ శరీరంలో కిడ్నీ ద్వారా రక్తం శుద్ధి చేసున తరువాత వచ్చే వేస్టేజ్ ను బయటికి పంపుతుంది. మీకిడ్నీ సరిగా పనిచేయనట్లయితే టాక్సిన్స్ పెరుగుతాయి.దీనికి సంకేతంగా త్వరగా అలిసిపోవడం అలసట వారం రోజులకు పైగా ఉండవచ్చు. కిడ్నీలు మీ శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అలాగే శరీరంలో ఎర్ర,తెల్ల రక్తకణాలు ఉత్పత్తి చేస్తాయి. మీ కిడ్నీలో సమస్య ఉంటె రక్తం ద్వారా మెదడుకు కండరాలకు అవసరమైన ఆక్సిజన్ అందక పోవచ్చు. 2 )నిద్రలేమి! మీ నిద్రలేమికి కిడ్నీ వ్యాధికి సంబంధం ఉండచ్చు. అది మీశారీరంలోని ఇతర అవయవాలను నాశనం చేస్తుంది. తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీయవచ్చు. మీ శరీరానికి సరిపడా నిద్ర లేకుంటే కిడ్నీ సమస్యలు ఉన్నట్లే. కిడ్నీ లో సమస్యకారణం గానే ఆక్సిజన్ సరఫరా లోపిస్తుంది.ఒక్కోసారి కిడ్నీ సమస్య వల్ల గొంతులో నాళాలు కుంచించుకు పోతాయి. టాక్సిన్స్ పెరిగి అనేకసమస్యలకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ౩ ) చర్మం పై దురద! మీ శరీరం లోని టాక్సిన్స్ కిడ్నీ ద్వారా బయటకు రాకుంటే రక్తంలో టాక్సిన్స్ పెరిగినట్లే. ఈ కారణం గా దద్దుర్లు రావడం దురదకు దారితీస్తుంది.మీకిద్నీ కొంత కాలానికి మినరల్స్ ను న్యుట్రీషియన్స్ సమతుల్యం గా ఉంచలేదు. మినరల్స్ సరిగా అందకుంటే ఎముకలకు సంబందించిన సమస్యలు వచ్చి మీ చర్మం ఎండిపొయినట్లు గా దురదగా ఏర్పడుతుంది. 4 )ముఖం -కాళ్ళు వాయడం! మీకిడ్నీకి అవసరమైన సోడియం అందకుంటే శరీరంలో ఫ్లూయిడ్స్ ఏర్పడి చేతులు కాళ్ళు,పాదాలు లేదా ముఖం వాచినట్లుగా ఉంటుంది. ప్రత్యేకంగా కాళ్ళ లో,కాలిమడమల లో వచ్చేవాపులు గమనిస్తే లేదా మూత్రంలో ప్రోటీన్ కోల్పోతారు కాళ్ళు వాచినట్లు కనిపిస్తుంది. 5 )కండరాలు పట్టేయడం! కాలినరాలు పట్టేయడం అంటే మీ కిడ్నీ పనితీరు సరిగాలేదని అర్ధం. సోడియం,కాల్షియం,పొటాషియం, సమానంగా లేకపోవడం ఎలక్ట్రోలైట్స్ పరీక్షలు కొంతమేరకు ఇబ్బంది కలిగిస్తాయి. దీని ఆధారంగానే నాడీ వ్యవస్థ కండరాల వ్యవస్థ పనిచేస్తాయి. సమస్య తలెత్తితే కిడ్నీ ఎలాఉంది అన్నది మొదటి ప్రశ్న. 6 )ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది! మీరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఎరిత్రో ప్రోటీన్ హార్మోన్ ను ఉత్పత్తి చేయదు. హార్మోన్ సిగ్నల్ వల్లే ఎర్రరక్త కణాలు తయారు అవుతాయి. అలా జరగ నట్లయితే పూర్తిగా రక్త హీనత ఏర్పడుతుంది. అప్పుడే మీకు ఊపిరి అందడం కష్టంగా ఉంటుంది. అది ఒక్కో సారి తీవ్రసమస్యాగా మారితే కళ్ళు తిరగడం లేదా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. 7)మెదడు మొద్దుబారినట్లుగాఉండడం! తల పై ఎదో కమ్మినట్లు మబ్బుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. శరీరంలో మీ కిడ్నీ సరిగా ఫిల్టర్ చేయనట్లయితే టాక్సిన్స్ మీ మెదడుపై ప్రభావం చూపుతాయి.ఒక్కొసారి మెదడు చీకట్లు కమ్ముకుంటాయి. దీనుకి కారణం శరీరానికి ఆక్సిజన్ అందాకపోవడం. అప్పుడే కళ్ళు తిరిగినట్లు ఏకాగ్రత కోల్పోవడం జ్ఞాపక శక్తి చిన్న చిన్న సమస్యలు సైతం కష్టంగా కనిపిస్తాయి. 8)ఏపటై టిస్ తగ్గడం! కిడ్ని సమస్య ఉంటె మీఅహారం అరగక పోవడం. శరీరం అసహనంగా ఉండడం. దీర్ఘంగా అలసట గాఉండడం. ఈ కారణంగానే వాంతి వచ్చినట్లుగా ఉండడం. లేదా పొట్టలో సమస్యలు అరగక పోవడం లేదా విరేచనాలు. ఆకలి మండగిబ్చడం లేదా ఆహారం తీసుకోవాలని అనిపించక పోవడం వంటిలక్షణాలు ఉంటె త్వరగా మీరు బరువు కోల్పోతారు. 9)నోటి దుర్వాసన! మీకిడ్నీ లో సమస్య వచ్చి ఫిల్టర్ జరగకుంటే శరీరంలోని వేస్టేజ్ బయటికి పోవడం వల్ల యురీమియా సమస్య వస్తుంది. ఈ కారణంగా నే మీ శ్వాస ఊపిరిలో దుర్వాసన వస్తుంది.శరీర రక్త కణాలలో టాక్సిన్ చేరి మెటాలిక్ గా మారి రుచిని కోల్పోతారు. 1౦)మూత్రం లో నురగా లేదా రక్తం పడడం లేదా రక్త స్రావం.లేదా మీ మూత్రం బ్రౌన్ రంగులోకి మారడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మీశరీరంలో అధికంగా ప్రోటీన్ చేరినా దీనిని ఆల్బుమిన్ ఉంటె అది కిడ్నీ సమస్యకు దారితీయవచ్చు. మూత్రం తెల్లగా లేదా బ్రౌన్ రంగులో కి మారడం ంటే కిడ్నీ లో లోపం ఉన్నట్లే అంటే కిడ్నీ సమస్య ఉన్నట్లే అని నిపుణులు భావిస్తున్నారు. మూత్ర నాళం ద్వారా రక్త శ్రావం కిడ్నీలో రాళ్ళు, ఇతర ట్యూమర్లు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైన పేర్కొన్న లక్షణాలు గమనించిన వెంటనే మీరు దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించడం అవసరం తద్వారా కిడ్నీ మార్పిడికి పోకుండా కిడ్నీ లో వచ్చే తీవ్ర సమస్యను ముందుగానే గమనించి విలువైన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. లేదా కిడ్నీని రక్షించుకోవచ్చు.
read more


.webp)
.webp)





.webp)
.webp)

.webp)
.webp)


.webp)

.webp)



