వాకింగ్ ఆరోగ్యానికి చాలామంచిది. ఎలాంటి ఇతర వ్యాయామ పరికరాలు లేకపోయినా వాకింగ్ ను ఎక్కడైనా, ఎవరైనా చేసేయచ్చు. చాలామంది వాకింగ్ ను బరువు తగ్గడానికి శరీరం ఫిట్ గా ఉండటానికి చేస్తారు. అయితే వాకింగ్ చేయడం వల్ల కేవలం ఇవే కాదు.. మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రోజూ 4వేల అడుగులు వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
రోజుకు 4వేల అడుగులు నడవడం వల్ల మెదడుకు రక్తప్రవాహం పెరుగుతుంది. మెదడు కణాలకు పోషణ అందించేందుకు ఆక్సిజన్ సరఫరా బాగుంటుంది. ప్రతిరోజూ 4వేల అడుగులు నడవడం వల్ల అభిజ్ఞా పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అదే విధంగా ఏకాగ్రత మెరుగవుతుంది.
జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నవారు తరచుగా మతిమరుపుకు లోనవుతున్నవారు రోజూ 4వేల అడుగులు నడుస్తూ ఉంటే మెదడు పనితీరు విషయంలో చాలా మార్పులు ఉంటాయి. మెదడు వాల్యూమ్, కనెక్టీవిటీ మెరుగవుతాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడమే కాకుండా అల్జీమర్స్, చిత్తవైకల్యం వంటి సమస్యల తీవ్రతను, అవిరాకుండా ఉండటంలోనూ సహాయపడుతుంది.
సాధారణంగా మెదడు పనితీరు బాలేకుంటే అది మూడ్ మీద ప్రభావం చూపిస్తుంది. కానీ మెదడు పనితీరు బావుంటే మూడ్స్ కూడా సహజంగానే మెరుగ్గా ఉంటాయి. ఒత్తిడి, నిరాశ, ఆందోళ వంటి సమస్యలు తగ్గించడంలో రోజూ 4వేల అడుగుల నడక ప్రభావవంతంగా ఉంటుంది. శరీరం ఒక క్రమ పద్దతిలో చలనానికి లోను కావడం వల్ల శరీరానికి కూడా విశ్రాంతి బాగా తీసుకోవడం సాధ్యమవుతుంది. నిద్ర బాగా పడుతుంది.
నడక మెదడులో వివిధ ప్రాంతాలను ఏకకాలంలో పనిమీద దృష్టి సారించేలా చేసే మల్టీ టాస్కింగ్ ప్రదేశం. శరీర కదలికలను గ్రహించడం నుండి శరీరంలో జరిగే కలిగే వివిధ చర్యల వరకు ప్రతి దానికి స్పందిస్తుంది. దీనికి నాడీ కణాలు సహాయపడతాయి. రోజూ 4వేల అడుగులు నడవడం వల్ల నాడీ కణాలు బలోపేతం అవుతాయి. వీటికి మెదడుతో ఉన్న కనెక్షన్లు మరింత బలపడతాయి.
రోజూ 4వేల అడుగులు నడవడం వల్ల శరీరంలో డోపమైన్, సెరోటోనిన్ వంటి న్యూరోకెమికల్స్ ఉత్పత్తిని సులభతరం చేసే హార్మోన్లు మెరుగ్గా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును, ఆలోచనను, సృజనాత్మకంగా ఆలోచించే నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది.
*నిశ్శబ్ద.