అన్ని పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యం దృఢంగా ఉంటుందని వైద్యులు, పోషకాహార నిపుణుల నుండి సాధారణ ప్రజల వరకు అందరికీ తెలుసు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉంటాయి.  కానీ మనం తరచుగా మన రోజువారీ ఆహారంలో వాటిలో కొన్నింటిని నిర్లక్ష్యం చేస్తాము. అలా నిర్లక్ష్యం చేసేవాటిలో మెగ్నీషియం ఒకటి. ఈ కీలకమైన ఖనిజం గురించి అందరికీ తెలిసింది, దాన్ని రోజువారీ ఆహారంలో తీసుకునేది తక్కువే..  దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే.

మెగ్నీషియం ఎందుకు ముఖ్యమైనదంటే..

మెగ్నీషియం మన శరీరానికి అవసరమైన ముఖ్య ఖనిజాలలో ఒకటి. ఇది మన ఎముకలలో ఉంటుంది. ఎముకలలో 60-70% భాగాన్ని మెగ్నీషియమే ఏర్పరుస్తుంది. అంతేకాదు మన రోజువారీ పనితీరులో కూడా మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కండరాలు, నరాల పనితీరును నియంత్రించడం, రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు, ప్రోటీన్, ఎముక, DNA తయారీతో సహా శరీరంలోని అనేక ప్రక్రియలకు మెగ్నీషియం ముఖ్యమైనది. సాధారణంగా, పురుషులు కనీసం 400mg, మహిళలు ప్రతిరోజూ కనీసం 310mg మెగ్నీషియం తీసుకోవాలి. 

మెగ్నీషియం లోపం వస్తే..

మెగ్నీషియం చాలావరకు శరీరానికి సులువుగానే అందుతుంది. అయినప్పటికీ మెగ్నీషియం లోపం ముఖ్యంగా జీర్ణశయాంతర వ్యాధులు, టైప్-2 మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారిలో సంభవిస్తుంది. మెగ్నీషియం లోపం ఏర్పడినప్పుడు  ఆకలి లేకపోవడం, వికారం, అలసట, నిద్రలేమి, కండరాల నొప్పులు వంటి లక్షణాలను కనిపిస్తాయి.

మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాలు..

డార్క్ చాక్లెట్

రుచిగా ఉండే డార్క్ లో మెగ్నీషియంతో సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాపర్, మాంగనీస్ కూడా ఎక్కువగా ఉంటాయి . ఇది గుండెకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో ఫ్లేవనోల్స్ ఉంటాయి. ఫ్లేవనోల్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

విత్తనాలు..

చియా, అవిసె, గుమ్మడికాయ గింజలు మెగ్నీషియంను అధికంగా కలిగి ఉంటాయి.  ఈ విత్తనాలలో ఐరన్, మోనోసాచురేటెడ్ ఫ్యాట్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.

చేపలు..

సాల్మన్, మాకేరెల్, హాలిబట్ చేపలలో  మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.  ఈ చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా చాలా మొత్తం ఉంటాయి.

అరటిపండ్లు..

చవగ్గా సులభంగా లభించేవి అరటిపండ్లు. వీటిలో పొటాషియం కంటెంట్ బాగుంటుంది. పొటాషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటే అరటిపండ్లు తరచుగా తింటూ ఉండాలి.

ఆకు కూరలు..

మెగ్నీషియంతో నిండిన ఆకు కూరలు ఖచ్చితంగా ఆహారంలో భాగం ఉండాలి.  ఆవపిండి, పాలకూర,  బచ్చలికూర వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.

తృణధాన్యాలు

వీటిలో మెగ్నీషియం మాత్రమే కాకుండా, డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది, తద్వారా మీ గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

                                   ◆నిశ్శబ్ద.