తన తల్లిని తల్చుకుని తన భాద్యతలు నెమరు వేసుకోగానే తనలోని నిరాశ కడుగుక పోయినట్లు అయిపొయింది. మళ్లీ తను అర్ధం లేని ఆవేదనతో మంచం పడితే కోలుకోవటం కష్టమన్న భయం కూడా తనను ప్రవాహం లో కొట్టు కునిపోతూ వడ్డు నించి విసిరిన తాడు కోసం తాపత్రయపడినట్లు చేసింది.
కన్నీటి చుక్కలతో బంగారు పద్మాలు, కళ్ళ చూపులతో చంద్ర కిరణాలు సృష్టించుకోడానికి ప్రయత్నించాడు. ఎనుపోతుల్లా ముందుకు వచ్చే మేఘాలు డీ కొని మెరుపును సృష్టించినట్లు అతని నిరాశ నిండిన ఆలోచనలు డీ కొని ఒక ఆశా కిరాణాన్ని సృష్టించాయ్! ఆ శబ్దంతో అతను మేల్కొన్నాడు.
ఆ మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లి చూసేసరికి శుభలేఖ లేదు. ఉదయమే స్వీపరు చెత్త కాగితాల బుట్టలన్నీ ఖాళీ చేసి కాల్చేసాడు. అతని మనసు గురించి విశాలనూ చెరిపి వెయ్యాలని చూస్తున్నాడు. ఏ పెయింట్ తో బొమ్మలను గీస్తారో ఆ పెయింటే ఆ బొమ్మలను చెరపడానికి ఉపయోగించాలి. ఆమెపై నున్న అనురాగాన్నే ఆమెను మరిచి పోడానికి వినియోగించాడు. ఇప్పుడు విశాల తనది కాదు. ఆమె దగ్గరగా చేరడానికి తనకు హక్కు లేదు. ఆమె మెడలో పడిన మూడు ముళ్ళు మంగళ సూత్రాన్ని మెరపించే క్రొత్త మెరపు లను మేరిపిస్తాయ్. ఆ మెరుస్తున్న మంగళ సూత్రం లో గడచిన ప్రతిబింబాలు కనపడవు. ఎదురుగా నిల్చున్న వ్యక్తీ రూపును ఆకర్షిస్తుంది. మూడు ముళ్ళు మెదడు వెనుక భాగానికి తాకి గతాన్ని మరపించి క్రొత్త ఆలోచనలకూ చోటిస్తాయ్. హోమగుండం యెదురుగా జంటగా పడిన యేడడుగులూ గడచిన సప్త జన్మాల అనుభూతులను జ్ఞప్తికి తెచ్చి మనసులను యేకం చేస్తాయ్.
విశాల తనను అంతగా ప్రేమించి వుంటే యీ పెళ్లికే ఒప్పుకునేది కాదన్న భావన కలగగానే సూర్యం తియ్యని కలగని తెలివి తెచ్చుకున్నట్లు అయ్యాడు. శరత్కాలం లో నిత్యం అనుకున్న పూవు గ్రీష్మం లో పరిమళం వుడిగి కలాహీనమైనట్లు విశాల గురించి యిప్పుడు అనుకున్నాడు. తనలో అనవసరంగా కన్నీరు రక్తంగా వర్షం కురిపించుకున్నందుకు బాధపడ్డాడు. ఈ జీవితం ఒక రైలు బండి లాంటిది. రైలు బండికి టైం టేబిలు వున్నట్లే యీ మనిషికి ఒక టైము టేబులు వుంటుంది. తను ఆ టైం టేబిలు ప్రకారమే నడవాలి. తనకూ విశాల కూ ఒక ఆకులో తినాలని వుంటే ఆమె తన జాతిలోనే పుట్టేది.
ఇలా క్రొత్త ఆలోచనలు పూల కుప్పలుగా పోసుకుని సూర్యం కాస్త తేరుకున్నాడు. పాత ఆలోచనలు వాడి పోగానే క్రొత్త ఆలోచనలు అంతకంటే ఆశ జనకంగా సృష్టించుకోసాగాడు. మేఘం లో మెరుపులా విశాల కనిపించి మాయమైంది. ఆ మెరుపు కోసం నిత్యం తను బాధపడి పొందలేడు. నింగి పై నిలవని మెరుపు కోసం బాధ పడేకంటే నీటిలో కదిలే చందమామ వేపు చూస్తూ కూర్చుంటే నయం అనుకున్నాడు. ఆ చందమామను నీరేక్కడున్నా చూడవచ్చు. ఒక్క దగ్గర కాదు నాలుగు చేరువులుంటే నాల్గు దగ్గరలలో చూడవచ్చు. చందమామను అందుకోవాలని తనకు లేదు. అతను అందుకోలేడని తనకు తెలుసు. కానీ ఆ అందాన్ని మాత్రం చూస్తూ ఆస్వాదించకుండా వూరుకోలేడు. అందుకే సూర్యం సినీమాలకీ, సాయంత్రమైతే రోడ్డు మీదా తిరిగేవాడు. అందమైన అమ్మాయిలూ చలాకీగా నడుస్తూ పోతుంటే చూసేవాడు. తప్పి చెడి యే అమ్మాయైనా ఒకసారి తన వేపు చూస్తె తనూ చూసేవాడు.
ఒకే విగ్రహం, చెట్టూ, పువ్వూ కళ్ళ వేడుక నివ్వదు. పూల సముదాయం, చెట్లతో నిండిన ప్రకృతి , పరిరకాల విగ్రహాలుగా నున్న యౌవ్వనులూ, యెంచటానికి అవకాశం యిచ్చి ఆనందాన్ని అధికంగా చేస్తాయి. ఎంచిన రూప లావణ్యం ముగ్ధుని చేస్తుంది. విశాల ను మరచి పోడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆమెను రోజూ జ్ఞప్తికి తెస్తున్నాయ్. ఆమెను మరచి పోవటం అంత కష్టం కాదేమో కానీ ఆమె వదలిన బావుటాల్లాంటి చివరి సంఘటనలు అతనిలో ఎగుర్తునే వున్నాయ్. ఇవి సంతోషం పొందటానికి తల్సుకుని చివరకు కన్నీళ్లు గుటకలు మ్రింగేటట్లు చేసేవి. తన జీవితంలో ఆడదాన్ని చూసీ చూడటం తో మనస్సు చేలించటం ఒక్కసారే కలిగింది. అది విశాలను చూసాకే! ఆ చూపులు ప్రసరించిన ముఖం మనః ఫలకం మీద వులితో చెక్కిన రాతి బొమ్మలా వుంది. అవి చెరపటం అతని శక్యం కాదు.
ఆశా నిరాశల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక కవరు వుత్తరం వచ్చింది. కవరు మీద ఎడ్రసు రాసిన దస్తూరి యెక్కడో చూచినట్లుంది. అది విశాలది కాకూడదు? విశాల తన నింకా మరిచి పోలేదు. తొందరగా విప్పాడు. ఇంగ్లీషు లో రాసి వుంది.
'ప్రియమైన సూర్యం! యీ వేళ పేపర్లో ప్రకటన చూసే వుంటావ్. ఆ ఆఫీసరు గారికి కావలసిన యోగ్యతలు నీకున్నాయ్. తప్పక దరఖాస్తు పంపిస్తావని ఆశిస్తున్నాను.
నీ శ్రేయోభిలాషి,
నవీంద్ర నాధ సర్కార్.'
సూర్యం తన పాత ఆఫీసరు పెద్ద హోదాకు వెళ్ళినా తనను మరచిపోనందుకు సంతోషించాడు. దరఖాస్తు పంపించాడే గాని తను అఫీసరునవుతానన్న నమ్మకం తనకు అంతగా లేదు. జ్యోతిష్యం మీద పోయిన నమ్మకం కొద్దిగా ఆశ పెట్టిస్తోంది. తనలాంటి యోగ్యతలున్న వాళ్ళు వేలాది వున్నారు. తనకు పై వాళ్ళ కన్న అనుకూలత వుంది.
తను ఆ డిపార్టుమెంటు లోనే వుండి అన్ని రకాల పనులలో తర్ఫీదు పొంది వున్నాడు. అతను యింటర్వ్యూ కి డిల్లీ వెళ్ళటానికి యిప్పటి నించే తయారుగా సాగాడు. అమ్మతో, అసలు విషయం చెప్తే చాలా సంతోషించింది. 'అదృష్టం కలసి రావాలి నాయనా, నీకేం కొదవ. తెలివితేటలూ లేవా? ఆకారం లేదా? లేనిపోని ఆలోచనలు పెట్టుకోక పొతే తిన్నది వంట పట్తుంది. కంటికి కనిపిస్తావు. నివ్వా పెద్ద హోదాలో వుంటే నీ తరవాత వాళ్లకి పైకి తెస్తావు. మన కుటుంబాలలో గౌరవం వస్తుంది. అధికారం వచ్చిందని అన్యాయం చెయ్యకపోతే పదుగురూ నీ తల్లి తండ్రికి మ్రొక్కుతారు.'
'ఏంటమ్మా అప్పుడే నేను ఆఫీసరు అయిపోయినట్లు మాట్లాడేస్తున్నావ్.'
'పెద్దలు, పేరంటాళ్ళు చెప్పినది వమ్ము కాదు నాయనా! జాతకబలంకి మించిన బలం లేదు. నా బాబు గోప్పవాడవుతాడు. వాడికేం కాదన్నా ధీమా లేకపోతె యీ మధ్య వచ్చిన కష్టాలను ఆదుకోగలిగేదాన్నా? దేముడు దొడ్డవాడు నాయనా! కష్టాలు మంచి వాళ్ళ మంచికే యిస్తాడు. అతని వరాలవీ. వాటిని సంతోషంగా స్వీకరించాలి.'
అమ్మ యీ మధ్య ఆమె బ్రతికి సంపాదించిన అనుభవాలను చెప్తోంది. అది అబద్దం అనే సాహాసం సూర్యం కు లేకపోతోంది.
* * * *
సూర్యం డిల్లీ యింటర్వ్యూ కి వెళ్లాడు. వెళ్ళే ముందు యింటర్వ్యూ పద్దతులు యిది వరకు వెళ్లి నెగ్గుకొచ్చిన ఆఫీసర్లు చెప్పగా విన్నాడు. వాళ్ళంతా తనకు విజయం చేకూరాలని కాంక్షించారు. ఒక ఆఫీసరు తన తాలుకూ సూటు, టై తో సహా యేరువిచ్చాడు. బూట్లు తనే కొనుక్కున్నాడు. టై కట్టుకోవటం యేలానో నేర్పాడు. ఇంట్లో , అంతా ఒకసారి రిహార్సల్ చేసుకున్నాడు. సూటు వెయ్యగానే తను కాస్త లావుగా కనిపించాడు. తల్లి చూసి ముచ్చటపడి ' అప్పు చేసైనా ఒకటి అలాంటిది కుట్టించుకో నాయనా' అంది.
ఇంటర్వ్యూ బోర్డు లో ఒక మెంబరు గా సచీంద్ర నాధ సర్కార్ వున్నాడు. తనకు హెచ్చు ప్రశ్నలు వేసింది అతనే. మొదట కొద్దిగా కాళ్ళు వణికినా తరవాత త్వరగా ఖచ్చితంగా జవాబులు చెప్పాడు. బయటకు వచ్చాక తను నెగ్గు కొచ్చానన్న తృప్తి కలిగింది. ఐనా మనసులో నెగ్గినా లాభమేమీటనే సంశయం వేధించుక తింటోంది.
ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లి అప్పటికే యెన్నో దేవుళ్ళ కి మొక్కింది. విన్నపాలతో పాటు ముడుపులు తీసింది. ఈ పూజలు , ఆ పూజలు చేయిస్తానని హామీ యిచ్చింది.
'బాగా చెప్పావు కదా నాయనా?'
'ఏదో చెప్పాను'
'తప్పకుండా వస్తుంది.'
ఏంటో తనకు లేని ధీమా అమ్మకు. అతనికి అన్నీ సంశాయాలే. తను సంశాయాలతోనే పుట్టినట్లుంది. అమ్మ సంశయం యెరగదు. అయితే అవును లేకపోతె కాదన్న తత్వం. నిరాశను ఆశ అనే ధైర్యం అమెది. సూర్యం, తన కేందుకా గుణం అబ్బలేదని విసుక్కున్నాడు.
కొద్ది రోజుల ఆందోళన తన పేరు నెగ్గిన వారి లిస్టు లో వున్నదన్న వార్త వినగానే పోవలసింది పోలేదు. హెచ్చింది. తనకున్న గుండె జబ్బును ముగ్గురు డాక్టర్లున్న బోర్డు గుర్తించి తనను పనికి రాడని నిర్ధారిస్తుంది. దాని మూలాన తన ప్రస్తుత వుద్యోగం పోయే అవకాశం వుంది. అంచేత బోర్డు ముందుకు వెళ్దామా వద్దా అన్న సంశయం లో పడ్డాడు. జీవితంలో ఏల్ల వెళల యందు అవకశాలు అదృష్టాలు వెంట పడవు. వెంటపడిన యీ ఒక్క అవకాశాన్ని వదలుకొని జీవితకాలం విచారించుకొని వుండటం దేనికి? ఆ డాక్టర్ల నే బ్రతి మాలుతానని అనుకుని మెడికల్ బోర్డు ముందు నిల్చున్నాడు. ముగ్గురు డాక్టర్లు అన్ని విధాల పరీక్షించారు. రక్తం తీసి పరీక్ష కు పంపించారు. ఎలక్ట్రోకార్దియాగ్రం (ఈ.సి.జి) తీసారు. గుండెను తనిఖీ చేసారు. వక్షాన్ని ఎక్స్ రే తియ్యాలనగానే సూర్యం ఆలోచించు కున్నాడు. కాంపౌండరు చెప్పింది అక్షరాల నిజం. జ్యోతిష్యం అబద్దం.
అంత అర్జంటుగా అప్పటి కప్పుడే ఆ బోర్డు కు పెద్ద జరిపించాడు. ప్రక్క గదిలో విచారం తో క్రుంగి పోయిన సూర్యం కు కబురు వచ్చింది. పెద్ద డాక్టరు టేబిలు ఎదరగా కుర్చీ మీద కూర్చోమని ఆహ్వానించాడు. కూర్చున్నాడే గాని గుండె దడ హెచ్చింది. అతను సహజమైన చిరునగవు తో
