Next Page 
వాస్తవ గాధలు పేజి 1


                          వాస్తవ గాధలు --1
                           పక్కింటి విద్యార్ధిని

                                                              మూలం: వేణుగోపాలన్

                                                             తెలుగు :  కృష్ణ

 

                            
              
    వెంకటమ్మ ఒక స్కూల్ టీచర్. వయస్సు ఇరవై అయిదు. బ్రతుకు తెరువు కోసం పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చింది. గ్రామంలో చదువు లేని భర్త ఉన్నాడు. అతని మీది అసహ్యం కొద్దీ ఆమె పట్టణానికి వచ్చేసింది. ఒక పాఠశాల లో ఉపాధ్యాయిని గా చేరింది.

                         
    పట్టణానికి వచ్చిన తరువాత కృష్ణం రాజును ఆమె కలుసుకుంది. తరువాత చాలాసార్లు కలుసుకుంది. స్నేహం ఏర్పడింది. ఇద్దరూ కలిసి జీవించ సాగారు.
    కాని, పెళ్లి జరగలేదు. వాళ్లకు ఒక కొడుకు కూతురు కలిగారు.
    ఒక నిర్ణీత ప్రాంతం లోకి వాళ్ళు బస మార్చారు. వాళ్ళ పక్కింట్లో ఒక సామాన్య గృహస్థు కాపరం ఉంటున్నాడు. ఆయనకు ఒక కంపెనీ లో ఉద్యోగం. ఆయనకు రజని అనే అమ్మాయి ఉంది. వెంకటమ్మ పనిచేసే బడిలో ఆ అమ్మాయి చదువుతోంది.
    రజనికీ పన్నెండే ళ్లుంటాయి. స్పుర ద్రూపం. చిన్నదైనా ఆమె ఆకర్షణీయంగా కనిపించేది. వెంకటమ్మ ఇంటికామే తరచు వచ్చేది. వచ్చినప్పుడల్లా కొంచెం సేపు మాట్లాడి వెళ్ళిపోయేది.
    రజని అంటే వెంకటమ్మ కు చాలా ఇష్టం. ఆమె కూడా రజని వాళ్ళింటికి తరుచు వెడుతూ వుండేది. అలా ఆ రెండిళ్ళ మధ్య పరిచయం ఏర్పడింది.
    ఒకరోజు రజని పూలు కత్తి తీసుకువెళ్ళింది. వెంకటమ్మ ఇంటికి. అప్పుడే బయటకు వెళ్ళిన రాజు ఇంటికి తిరిగి వచ్చాడు. రజనీని చూడగానే కొంచెం సేపు అలాగే నిలబడి పోయాడు. 'భేష్' అని తనలో తానను కున్నాడు. రజని తల వంచుకుంది. అప్పుడు లోపలి నుంచి వస్తున్న వెంకటమ్మ వాళ్ళను గమనించక పోలేదు. ఆమెకు రాజు చెప్పిన 'భేష్' అన్న మాట వినిపించింది. ఒక్క క్షణం ఆమె మనస్సు మనస్సు లో లేకపోయింది. తనను మొదటిసారిగా రాజు కలుసు కున్నప్పుడు కూడా ఎక్కడో చూస్తున్నట్టుగా 'భేష్' అన్నాడు.
    పువ్వు లిచ్చి రజని వెళ్ళిపోయిన తరువాత లోపలి నుంచి వెంకటమ్మ  సావిట్లోకి వచ్చింది. పడక కుర్చీలో పడుకున్న రాజు ఏదో ఆలోచనలో ఉన్నాడు. ఆమె అక్కడ నిలబడింది. తరువాత కొంతసేపటి కి గాని రాజు ఆమెను చూడలేదు.
    "ఈ అమ్మాయి మీ బదిలోనేనా చదువుతుంది?' అని అడిగాడు రాజు.
    "అవును."
    "చూడడానికి బాగుంది."
    "మ్"
    "నాకు నచ్చింది."
    వెంకటమ్మ బదులేమీ చెప్పలేదు. రాజు ఆమెను ఎగాదిగా చూశాడు.
    ఈ సంఘటన జరిగిన తరువాత రజని వచ్చినప్పుడల్లా రాజు కొన్ని క్షణాల పాటు అలాగే వుండి పోయేవాడు. పడక కుర్చీలో పడుకుని ఏదో ఆలోచనలో మునిగి పోయేవాడు. రజని వెళ్ళడం కళ్ళారా చూచి, ఆ తరువాత ఆమెను గురించి వెంకటమ్మ తో ఒకటి రెండు ప్రశంశ వాక్యాలు పలికేవాడు.
    రాజు చేష్టలు వెంకటమ్మ మనస్సులో నిలిచి పోసాగాయి. భర్త మాటలని ఎలా అర్ధం చేసుకోవాలా అనే ఆరాటం బయలుదేరింది.
    మరో రోజున వెంకటమ్మ లోపల ఏదో పనిలో ఉంది. అప్పుడామెను వెతుక్కుంటూ రజని అక్కడికి వచ్చింది. సావిట్లో రాజు నుంచుని ఉన్నాడు. బయట నించి రజని రావడం అతను చూశాడు.
    సావిట్లో వెంకటమ్మ లేకపోవడం చూచి, "అక్కయ్య ఉందా?' అని రజని భయపడుతూ రాజు నడిగింది.
    "ఉంది" అంటూ రాజు ఆమెను సమీపించాడు. "మంచి పిల్ల, మంచి పిల్ల" అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. భయంతో రజని అతని పట్టుని విడిపించుకుని పక్కకు తొలగింది.
    అప్పుడే లోపలి నుంచి వెంకటమ్మ వెనకగా వచ్చింది. ఆమెను చూచీ చూడడంతో రజని ఆమె వైపు వెళ్ళింది.
    రొప్పుతూ ఉన్న రజనీని చూచి, వెంకటమ్మ "ఏమిటి సంగతి?' అని అడిగింది.
    "ఎమీలేదక్కా."
    "ఎందుకలా రోప్పుతున్నావ్?"
    రజని మాట్లాడలేదు. ఏదో గిన్నె కోసం ఆమె వచ్చింది. అది తీసుకుని ఆమె వెంటనే వెళ్ళిపోయింది.
    వెంకటమ్మ సావిట్లోకి వచ్చింది. రాజు ఆలోచిస్తూ పడక కుర్చీలో పడుకుని ఉన్నాడు.
    "రజని మంచి పిల్ల. ఆమె నాకు బాగా నచ్చింది." అని ఆమెను చూస్తూ అన్నాడు.
    'మ్."
    "ఆమెను కనక ఒక్క రోజయినా చూడకపోతే నా కాదోలా ఉంటుంది " అంటూ వెంకటమ్మ ను ఎగాదిగా చూశాడు. ఆమె ముఖంలో చలనం లేదు.
    "చాకులాంటి అమ్మాయి లంటే నా కెప్పుడూ ఇష్టమే!" అని సమర్ధించు కున్నాడు రాజు.
    ఇలా చాలాసార్లు అనడం మొదలు పెట్టాడు.
    సాయంకాలం ఇంటికి త్వరగా వచ్చేవాడు రాజు. పడక కుర్చీలో పడుకుని ఏదో తహతహ తో వీధి వంక చూసేవాడు.
    ఒకనాడు వెంకటమ్మ ను అడిగాడు. "నన్ను చూసి రజని ఎందుకలా బేదిరి పోతుంది.?"
    వెంకటమ్మ బదులు చెప్పాలనుకుంది. కాని, మాట పెగల్లేదు. వచ్చిన కోపాన్ని తనలోనే అణుచుకుంది.
    "ఎందుకలా మాట్లాడకుండా నుంచున్నావ్? ఆ అమ్మాయిని నాతో సన్నిహితంగా మెలగమని చెప్పు."
    అందుకూ ఆమె బదులు చెప్పలేదు. ఆమె మనస్సులో ఆందోళన ప్రారంభ మయింది. భర్త మనస్సుని పసిగట్ట గలిగింది. చివరికిది ఎలా పరిణమిస్తుందో అనుకుంది.
    కాని, ఈ విషయంలో రాజుతో ఏమీ చెప్పడానికి ఆమె ఉద్దేశించలేదు. కారణం, పెళ్లి కాకుండా వాళ్ళిద్దరూ ఒకటిగా కాపరం చెయ్యడమే. అతను కనక అనుకుంటే తనను విడిచి పెట్టి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. పైగా తాను చేసిన తప్పుని తెలుసుకుంది.
    అందువల్ల ఎన్నో విషయాలలో రాజుతో ఏమీ చెప్పకుండా ముభావంగా ఉండేది వెంకటమ్మ. రాత్రిళ్ళు రాజు ఇంటికి ఆలస్యంగా రావడం, ఇంకా అతని కొన్ని చర్యలు ఆమెకు అతని మీద సందేహాన్ని కలిగించాయి. అయినా, ఏమీ అనలేకపోయింది.
    రెండు నెలలు గడిచాయి. రాజు దంపతుల బస మరొక చోటికి మారింది. అందువల్ల అతను త్వరలోనే రజనీని మరిచి పోతాడని వెంకటమ్మ అనుకుంది.
    కాని, రాజు మరిచి పోలేదు. రజనీని గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెట్టాడు.
    "రజనిని ఇక్కడికి తీసుకు రాకూడదూ ?' అని తరచుగా అడుగుతూ వుండేవాడు. వెంకటమ్మ సందిగ్ధావస్థ లో పడింది. "కానీండి, కానీండి' అనేది. అయినా , ఈ విషయంలో రాజు మొండి పట్టు పడుతున్నాడని ఆమె గ్రహించింది.
    ఒకరోజు ఉదయం రాజు వెంకటమ్మ ను పిలిచాడు. ఆమె వచ్చింది. "సాయంకాలం స్కూలు నుంచి వచ్చేటప్పుడు రజనీని పిలుచుకుని రావాలి, తెలిసిందా?' అన్నాడు కొంచెం గట్టిగానే. తల ఆడించి ఆమె వెళ్ళిపోయింది.
    ఆ సాయంకాలం రజని కోసం ఎదురు చూస్తూ రాజు ఇంట్లో కూర్చున్నాడు. వెంకటమ్మ ఒంటరిగా రావడం చూచేసరికి అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది.
    "రజని ఎక్కడ?'
    "పిలుచుకు రాలేదు ."
    "ఏం?"
    "మనమే వాళ్ళింటికి వెళ్లి రజనీని చూడవచ్చు గదా!"
    రాజు కళ్ళు ఎర్ర బడ్డాయి.
    "ఇదుగో చూడు! వాళ్ళింటికి దారి నాకు తెలీదను కున్నావా? ఆ అమ్మాయినీ ఇక్కడి కెందుకు తీసుకు రమ్మంటున్నానొ తెలుసా?"
    "తెలీదు."
    "అయితే , తెలుసుకో. ఆమె నాకు నచ్చింది. నాకు కావాలి."
    వెంకటమ్మ నిర్ఘాంత పోయింది. రాజు అభిప్రాయాన్ని ఆమె పూర్తిగా తెలుసుకుంది. అయినా, ఏమీ మాట్లాడలేదు.
    ఈ విషయమై వాళ్ళిద్దరి మధ్యా చాలా రోజులు వాదోపవాదాలు సాగాయి. కాని, భర్తతో పోట్లాడలేనని ఆమె సులభంగా గ్రహించింది.
    ఒకరోజు....ఆరోజుని వెంకటమ్మ మరిచిపోలేక పోయింది. రాజు ఆమెను పిలిచాడు.
    'ఇదుగో చూడు! రజనిని కనక ఇంటికి తీసుకురాకపోతే ఆ తరవాత నిన్నేం చేస్తానో తెలీదు' అని కళ్ళురిమాడు.
    ఆమె నిజంగానే భయపడింది. రాజు పాత జీవితాన్ని గురించి ఆమె కెన్నో సందేహాలు కలిగాయి. హత్య చేసేందుకు కూడా అతను వెనుదీయడనే నమ్మకం ఆమెకు కలిగింది. ఏమీ బదులు చెప్పకుండా అలాగే నుంచుంది.
    "నీ భర్త చెప్పినట్లు నువ్వు చేస్తావా, లేదా? రజనిని వెంటనే ఇక్కడికి తీసుకు రాకపోతేనా....." మధ్యలో ఆగాడు రాజు. ఒక్కసారి ఆమె వంక చూశాడు. ఆ చూపులో ఎంతో తీవ్రత కనిపించింది. ఆమె దానిని గ్రహించింది.
    వెంకటమ్మ సాహసానికి దిగింది. మధ్యాహ్నం రజనీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆమె తలితండ్రులు వెంకటమ్మ ను సహర్షంగా ఆహ్వానించారు.
    కొంచెం సేపు మాట్లాడిన తరువాత వెంకటమ్మ అసలు విషయానికి వచ్చింది.
    'ఇవాళ స్కూల్లో ఒక ఫంక్షన్ ఉంది. రజనిని బాగా డ్రెస్ చేసి నాతొ పంపించండి. ఫోటో కూడా ఏర్పాటు చేశారు" అంది. కాని చెపుతున్నంత సేపు ఆమె మనస్సులో ఏదో ఒక భయం.
    "అలాగే పంపిస్తాం" అన్నారు రజని తలిదండ్రులు. సంతోషం కొద్దీ రజనిని డ్రెస్ చేశారు. మంచి గుడ్డలు ధరింప జేశారు. నగలు వేశారు. రజనీని వెంకటమ్మ తో పంపించారు.
    బస్సులో వెడుతుండ గానే వెంకటమ్మలో ఆందోళన ప్రారంభమయింది. తాను చేస్తున్న పని ఎంత వరకూ వెడుతుందో , ఎలా పరిణమిస్తుందో అని మధన పడసాగింది.
    "రజనీ! ఫంక్షన్ స్కూల్లో కాదు, మా ఇంట్లోనే" అని వెంకటమ్మ రజని వంక చూచింది. ఆమె సౌందర్యం దిష్టి తగిలేటట్టుగా ఉంది. టీచర్ చెప్పింది విని, చిరునవ్వు నవ్వి తల ఆడించింది.
    ఇల్లు చేరుకునేసరికి సాయంకాలమయింది. రాజు ఆశతో ఎదురు చూడసాగాడు. రజని రావడం చూచేసరికి అతనికి అంతులేని సంతోషం కలిగింది. అతని సంతోషాన్ని వెంకటమ్మ గ్రహించక పోలేదు.
    ఇంట్లోకి వెళ్ళారు. రజనిని తన కొడుకుతో మాట్లాడుతూ ఉండమని చెప్పి, వెంకటమ్మ కలవరపాటుతో రాజు గదిలోకి వెళ్ళింది. హితవు చెప్పాలను కుంది.
    ఆమె మాట్లాడ బొయెసరికీ రాజు ఆమె మీదికి విరుచుకు పడ్డాడు.
    "నువ్వు నా దగ్గర ఏమీ మాట్లాడకు. ఏం చెప్పదలచావో నాకు తెలుసు. నా విషయంలో జోక్యం చేసుకోకు. చేసుకున్నావో జాగ్రత్త...."
    వెంకటమ్మ భయంతో వణికి పోయింది.
    "ఈ రాత్రికి రజని మన ఇంట్లోనే ఉండాలి" అన్నాడు రాజు.
    "అదెలా వీలవుతుందండి" అంది వెంకటమ్మ.
    "అదంతా నాకు తెలీదు. ఇవాళ రజని వాళ్ళ ఇంటికి వెళ్ళ కూడదు అంతే. మనమంతా 6--30 గంటల సినిమాకి వెడదాం. ఈ వంక చెప్పి, రజనిని ఇక్కడే ఉంచాలి' అన్నాడు.
    వెంకటమ్మ ఏమీ మాట్లాడలేదు. వెనక్కు తిరిగింది.
    మధ్య గదిలో తన కొడుకుతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంది రజని. ఆమెను చూసేసరికి వెంకటమ్మ కు కడుపు తరుక్కు పోయింది.
    "ఆభమూ, శుభమూ ఎరగని ఈ అమ్మాయిని.....' అనుకుంటూ ఆమె బాధపడింది.
    అందరూ 6--30 గంటల సినిమాకి వెళ్ళారు. రాత్రి ఇంటికి వచ్చేసరికి పదయింది.    
    "రజనీ! పొద్దు పోయింది గదా. ఇవాళ్టి కి ఇక్కడే ఉండు" అంది వెంకటమ్మ.


Next Page 

WRITERS
PUBLICATIONS