శ్రీ కృతివాస తీర్థులు, తల్లావఝ్ఝల
చీనా సామ్రాజ్యవాదం
సామ్రాజ్యం మహాశ్మశానం
శాసకు లంతా కీచకులే!
మమత్వ మెరుగని పిశాచులా
మానవులేనా చైనా చవటలు!
చితాభస్మ రాసుల పైనా
శీర్షమెత్తగా చీనా కోరిన
నిటలేక్షా క్రాంతి కీలలో
కుటిల శ్రీ భస్మరాసులౌ!
మానవాశ్రు రోదనలోనా
సామ్రాజ్యపు సమర స్వానం?
శాస్త్రాలూ, పరిశోధనలూ
సమరాగ్నికి సమిధలు కావా?
వల్లకాటి అధికారానికి
వాంఛించే చైనా దేశం
అణ్వస్త్రము నాహ్వానించును
భూగోళము బుగ్గైపోయిన
పొంగిపోవు పైశాచిక చీనా!
అయ్యయ్యో రక్తపు టేళ్ళలొ
అరాతి చీనా హల్లీసకమా?
* * * *
