Previous Page
Next Page
దాశరథి రంగాచార్య రచనలు - 9 పేజి 6
శ్రీ ఆరుద్ర
రణ నినాదాలు
గుండెల డిండిమాల
రణఘోషలు దిక్కులు పిక్కటిల్లగా
లెండి పదండి రండి
లవలేశము దేశము వైరి చేతిలో
నుండగరాదు: జల్దుకొని
యోధులు వీధుల బార్లు తీరుడీ!
భండనదీక్షతో కదన
పాండితి చూపుడి! వెండికొండపై.
మెత్తని వారల జూచిన
మొత్తెడి చండాల గుణపు ముష్కరు లౌరా!
కత్తులు దూసిరి మనపై
నెత్తురు పారించి కొండ నెత్తమ్ములపై
సుత్తీ కొడవలి గుర్తులు
హత్తిన జెండా వహించు నతడెందులకా?
సుత్తితొ తలపై మొత్తుచు
కత్తుక కొడవలి ధరించి కోయుట కొరకే,
ఆటలు సాగనీము
కపటాత్ముల మాయలు తేటతెల్లమై
సూటిగ సూర్యరశ్మివలె
చూపులకందెను నేటినుండి మో
మోటము వీలులేదు మన
పూర్వవిధానము మారిపోయె ము
మ్మాటికి గెల్తుమింక మన
మంచికె మ్రోగెను యుద్ధవాద్యముల్.
* * * *
Previous Page
Next Page