శ్రీ బలరామాచార్య, మడిపడిగ
డ్ర్యాగన్
మంచు కొండ వద్ద
పొంచింది డ్ర్యాగన్
మరచి నిద్దుర పోక
పేల్చరా స్టెన్ గన్ ||మం||
ఉండి ఉండి పైకి
ఉరికి వచ్చునురా!
గుండు దెబ్బతో దాన్ని
కూల్చివేయుమురా ||మం||
నల్ల మందును మెక్కి
నక్కి యుండెనురా!
బుల్లెట్లతో దాన్ని
పూడ్చి వేయుమురా! ||మం||
మురిగిపోయిన కాలు
నరికి వేయుమురా
కుళ్ళిపోయిన దెపుడు
మళ్ళి పూయదురా! ||మం||
* * * *
