Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు - 9 పేజి 21


                            శ్రీ ప్రసన్నాంజనేయులు, పాతూరి

    జవాన్ స్వగతం

    నన్నేనా పిలుస్తున్నది
    సన్నద్ధం కమ్మంటున్నది?
    ఎన్నాళ్ళకు నీ కమ్మని గొంతున
    విన్నానమ్మా రమ్మను పిలుపును!

    దేశం కోసం నీ సందేశం
    సంకెళ్ళను వదిలేస్తా!

    హిమాలయాల్లో ఘనీభవించిన
    మహాతపస్వుల మంత్రశక్తులే
    నా ధ్యేయానికి ఎంతో సాయం
    నా ప్రాణానికి ప్రాణం - ఖాయం!

    స్వాతంత్ర్య జ్యోతిని నిలుపగ
    రక్తాన్నే ధారగ పోస్తా
    రాబోయే తరాల వారికి
    సర్వస్వం త్యాగం చేస్తా!

    గజ గజ మని వణికించే
    మంచు తెరలు కావమ్మా అవి
    కళ కళ లాడే నీ దుకూ-
    లాంచల రోచిస్సులు సుమ్మా !

    జన్మభూమీ - ఓ నా జననీ!
    సౌభాగ్య, స్వర్గ సంధాయినీ!
    జయహో శాంతి ప్రదాయినీ!
    జయహో క్రాంత దర్శినీ!

                                                                *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS