విశ్వాస ఘాతుకం
ఓ రోరి నేస్తగాడా!
ఘోరాతి ఘోర
క్రూరాతి క్రూర
నేరాల మారీచుడా! ||ఓ||
మంత్రాల తోడ నీవు
తంత్రాలు పన్నినావు
మంచిని వంచించావు
మము రెచ్చగొట్టినావు ||ఓ||
నీ నిలువు నిలువు విషబద్ధం
నీ పేరే పెద్ద "అబద్ధం"
నీ జీవితమంతా యుద్ధం
నీ చర్యలన్నీ విరుద్ధం ||ఓ||
మా దేశానికి వచ్చితివి
మర్యాద లెన్నొ బడసితివి
మధురాన్నములను మెక్కితివి
మాపైనె రాయి రువ్వితివి ||ఓ||
* * * *
