సమంత దుకాణం క్లోజ్
on Apr 11, 2015
ఒకప్పుడు సమంత అనగానే.. ఆమె కాల్షీట్లు దొరకవు బాబోయ్.. అనుకొనేవారు దర్శక నిర్మాతలు. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ చేతినిండా సినిమాలతో అంత బిజీగా ఉండేది మరి. ఇప్పుడంత సీన్ లేదు. తమిళం మాటేమోగానీ.. తెలుగులో ప్రస్తుతానికి ఖాళీ అయిపోయింది సమంత. సన్నాఫ్ సత్యమూర్తి తరవాత ఆమె ఒక్క తెలుగు సినిమాపైనా సంతకం చేయలేదు. ఆ మాటకొస్తే.. ఆమెకు అవకాశాలే రాలేదు. కొత్తమ్మాయిలు రకుల్ ప్రీత్‌సింగ్, ఆదాశర్మలాంటివాళ్లు సమంతకు గట్టిషాక్ ఇచ్చారు. ఈ కుర్ర హీరోయిన్లతో పోటీకి తట్టుకోలేకపోతోంది సమంత. దానికి తోడు.. గ్లామర్ కూడా రోజురోజుకీ తగ్గిపోతోంది. మొఖకవళికల్లో మార్పు వచ్చిన దగ్గర నుంచీ ఆమెలో గ్లామర్ మటుమాయమైపోతోంది. సన్నాఫ్ సత్యమూర్తిలతోనూ సమంత చేసిందేం లేదు. సమంత కావాలంటే కోట్లు పెట్టాలి. అదే రకుల్, ఆదాలాంటి వాళ్లని తీసుకొంటే లక్షల్లో తేలిపోతుంది. అందుకే సమంతని తెలుగులో దర్శక నిర్మాతలు లైట్ తీసుకొన్నారు. దాంతో తెలుగులో సమంత దుకాణం దాదాపుగా క్లోజ్ అయిపోయింది. తెలుగులో మళ్లీ ఇదివరకటిలా అవకాశాలు రాకపోతాయా?? అని ఎదురుచూస్తోందీ అమ్మడు. మరి.. కనికరించే నాధులు ఎవరో..??