పొగిడేసుకుంటున్న భామలు
on Jun 27, 2015
రెండు కొప్పులు ఒకచోట ఇమడవు అన్న సంగతి తెలిసిందే కదా...కానీ ఈ మధ్య ముద్దుగుమ్మలు కాస్త మారుతున్నట్టున్నారు. ఒకర్నొకరు పొగుడుకోవడం, పార్టీలకు పిలుచుకోవడం, సెల్ఫీలు తీసుకుని సందడి చేయడం చేస్తున్నారు. రీసెంట్ గా ఈ లిస్టు లో చేరారు సమంత, ఎమీ జాక్సన్. సమ్మూ సో క్యూట్, చక్కగా నటిస్తుంది, ఆమె అంటే నాకెంత ఇష్టమో అని ఎమీ తెగ పొగిడేస్తోంది. అటు ఎమీ చాలా తక్కువ సమయంలోనే తమిళం నేర్చుకుని అలవోకగా డైలాగ్స్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని సమంత ఆకాశానికెత్తేస్తోంది.
ప్రస్తుతం రెండు కోలీవుడ్ ప్రాజెక్టుల్లో కలసి పనిచేస్తున్న ఇద్దరూ...ఒకరంటే ఒకరికి భలే ఇష్టం అని ఊదరగొడుతున్నారు. సాధారణంగా ఒకే సినిమాలో కలసి నటించిన ముద్దుగుమ్మలు....ఇగో ప్రాబ్లమ్స్ తో కొట్టుకుంటారు. తనకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఎవరో ఒకరు కత్తిదూస్తుంటారు. మరి అందర్లానే ఉంటారా? లేదా సమంత, ఎమీ జాక్సన్ స్నేహితుల్లానే కొనసాగుతారో తెలియాలంటే ఆ రెండు చిత్రాల షూటింగ్ పూర్తవ్వాలి మరి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
