బాలయ్య... ఫ్లాప్ హీరోయిన్లను కనికరిస్తాడేంటి??
on Mar 11, 2015
నందమూరి బాలకృష్ణ దగ్గర ఓ అద్భుతమైన అలవాటుంది. ఫ్లాప్ దర్శకులు, ఫ్లాప్ హీరోయిన్లను పిలిచి మరీ అవకాశాలిస్తుంటాడు. త్రిషకు దమ్ముకు ముందు, ఆ తరవాత సినిమాలేం లేవు. దమ్ము కూడా ఫ్లాప్ అయ్యింది. అయినా సరే.. లయన్‌లో అవకాశం కల్పించాడు. అంతకు ముందు లక్ష్మీరాయ్‌కీ ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. శ్రీమన్నారాయణలోనూ కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చాడు. ప్రియమణి, ఛార్మిలాంటి ఫ్లాప్ హీరోయిన్లను ప్రోత్సహించాడు. ఇప్పుడు ఆ జాబితాలో మరో కథానాయిక చేరింది. తనే... అర్చన. తెలుగింటి అమ్మాయే అయినా.. టాలీవుడ్‌లో పేరు తెచ్చుకోలేకపోయింది అర్చన. ఎన్ని సినిమాలు చేసినా.. బాక్సాఫీసు దగ్గర హిట్టు కొట్టలేకపోయింది. ఆఖరికి లేడీ ఓరియెంటెడ్ కథల్ని ఎంచుకొన్నా ఫలితం లేదు. పైగా ముదురు ఫేసు. అయినా సరే.. ఇప్పుడు బాలయ్య కంట్లో పడిపోయింది. లయన్‌లో అర్చనకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు బాలకృష్ణ. ఈ సినిమాతో అర్చనకు ఐటెమ్ గాళ్‌గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అదేంటో బాలయ్య నిర్ణయాలన్నీ ఇలా షాకింగ్‌గానే ఉంటాయి. బాలయ్య అనుకొంటే... స్టార్ హీరోయిన్ ఎవరైనా సరే... ఐటెమ్ పాట చేయడానికి ఎవరెడీగా ఉంటారు. కావాలంటే బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకోవచ్చు. సన్నీలియోన్‌లాంటి ఐటెమ్ గాళ్స్ తో స్టెప్పులేసి సినిమాకి కావల్సినంత క్రేజ్ తీసుకురావచ్చు. కానీ.. బాలయ్య మాత్రం వెరైటీగా ఆలోచించి అర్చనను ఆహ్వానించాడు. దాంతో ఎగిరి గంతేస్తూ.. ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులేసేసింది అర్చన. ఈ సినిమాతో అయినా తన జాతకం మారుతుందని ఆశపడుతోంది. చూద్దాం.. బాలయ్య హ్యాండు ఎలాంటిదో..??