మళ్లీ వార్తల్లోకి 'కోబలి'
on Mar 12, 2015
అత్తారింటికి దారేది తరవాత పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ ల కలయిక మళ్లీ చూసే అవకాశం దక్కనుందా?? వీళ్లిద్దరూ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా?? ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పవన్, త్రివిక్రమ్‌ల కలల చిత్రం కోబలి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కోబలి సెట్స్‌పైకి వెళ్లడం ఖాయం అనిపిస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తి తరవాత త్రివిక్రమ్ మహేష్ బాబుతోఓ సినిమా చేయాల్సివుంది. అయితే మహేష్.. బ్రహ్మోత్సవం సినిమాతో బిజీ అయిపోయాడు. మరోవైపు గబ్బర్ సింగ్ 2 ఇంకా పట్టాలెక్కలేదు. ఆ ప్రాజెక్టు ఇంకా స్ర్కిప్టు దశలో ఉంది. అటు బ్రహ్మోత్సవం, ఇటు గబ్బర్ సింగ్ 2 స్ర్కిప్టు పూర్తయ్యేలోగా... పవన్, త్రివిక్రమ్‌లు కలసి కోబలిని పూర్తి చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పవన్, త్రివిక్రమ్ ఇద్దరూ మంచి స్నేహితులు. దానికి తోడు హిట్ కాంబినేషన్. `కోబలి` సినిమా పవన్‌తో తీస్తా.. అని ఇది వరకు త్రివిక్రమ్ ప్రకటించాడు కూడా. సో... కోబలి మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇదే సరైన సమయం. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఓ శుభవార్త వినొచ్చు.