తలసానితో కలిసి టాలీవుడ్ భూములు పంచుకుంటోందా?
on May 28, 2020
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టాలీవుడ్ పెద్దల మీటింగ్‌కి తనను పిలవలేదని గురువారం ఉదయం యన్టీఆర్ ఘాట్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన మాటలు టాలీవుడ్‌లో చర్చకు దారి తీశాయి. నందమూరి కుటుంబానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై నిర్మాతల మండలి కార్యదర్శిగా ఉన్న టి. ప్రసన్నకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పరిశ్రమలో కొందరు వ్యక్తులు, అభిమానులు మండిపడుతున్నారు. ఈ వివాదం ఓవైపు కొనసాగుతుండగా... మరోసారి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో కూర్చుని భూములు పంచుకుంటున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
‘‘నన్ను ఎవరూ పిలవలేదు. ఎవరు పిలిచారు నన్ను? అన్ని మీటింగులు జరిగాయి. నన్ను పిలిచారా? వీళ్లందరూ హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా...? శ్రీనివాస్ యాదవ్‌తో కూర్చుని?? నన్ను ఒక్కడు పిలవలేదు. మళ్లీ ఎప్పుడు షూటింగులు స్టార్ట్ అవుతాయని మీటింగులు జరిగాయి. నన్ను ఒక్క మీటింగ్‌కి పిలవలేదు. భూములు పంచుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఎవరికి భయపడతాం? ఇది వాస్తవం. ఏంటి వక్రీకరించేది?’’ అని తనతో ఉన్న వైద్యులతో బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై పరిశ్రమలో చర్చ మరింత వేడికెక్కింది. ఉయదం యన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన ఆయన, మధ్యహ్నం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లారనీ, అక్కడే ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
