బాలకృష్ణను ఎందుకు పిలవలేదు?
on May 28, 2020
నటసింహం నందమూరి బాలకృష్ణను ఎందుకు పిలవలేదు? దీనికి కారకులు ఎవరు? ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇది. కరోనా తదనంతర పరిస్థితులపై చిత్రసీమ సమస్యలపై పరిశ్రమ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చిరంజీవి ఇంట్లో ప్రముఖులు సమావేశం అయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ చర్చల్లో బాలకృష్ణ ఎక్కడా కనిపించలేదు. అసలు, చర్చలు జరుగుతున్నట్టు పత్రికలలో, ప్రసార మాధ్యమాలలో చూసి తెలుసుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు. దాంతో బాలకృష్ణను పిలవకపోవడం ఏమిటని చర్చ మొదలైంది.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా గురువారం ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ చేరుకున్న బాలకృష్ణ, తండ్రికి నివాళులు అర్పించారు. దేశానికి తండ్రి చేసిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శమని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి మాట్లాడుతూ చర్చలకు ఎవరూ తనను పిలవలేదని స్పష్టం చేశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కుటుంబాలు ఏవేవి అని చర్చకు వస్తే నందమూరి కుటుంబం పేరు ముందు ఉంటుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఆయన తర్వాత తనయులు హరికృష్ణ, బాలకృష్ణ, మూడో తరానికి వస్తే యంగ్ టైగర్ తారక్, కళ్యాణ్ రామ్ తదితరులు తమదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎన్టీఆర్ తనయులలో ఒకరు పేరు మీద స్టూడియో ఉంది. సినిమా పరిశ్రమలో పలు రంగాల్లో నందమూరి కుటంబం ఉంది. చర్చలకు బాలకృష్ణను విస్మరించడం సబబుగా ;లేదు. దీనిపై పరిశ్రమ వర్గాలు ఏం సమాధానం చెబుతాయో?

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
