బాలకృష్ణ చూసిన తర్వాతే ఏ నిర్ణయమైనా?
on May 16, 2020
మలయాళంలో బిజూ మీనన్, పృథ్వీరాజ్ హీరోలుగా నటించిన సినిమా 'అయ్యప్పన్ కోషియమ్'. దీని రీమేక్ రైట్స్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాతలు కొనుగులు చేశారు. తమ అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సినిమా నిర్మించాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. నట సింహం నందమూరి బాలకృష్ణతో రీమేక్ చేయాలని సితార సంస్థ కోరిక.
మలయాళంలో బిజూ మీనన్ పోషించిన క్యారెక్టర్‌కి బాలకృష్ణ అయితే పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతారని వాళ్ల నమ్మకం. నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ రోల్ అది. ఒక ధనవంతుడు పంతానికి పోవడం వల్ల అతను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది కథ. అందులో క్యారెక్టర్ కింద పడినట్టు అనిపించినా హీరోయిజం ఒక లెవల్లో ఉంటుంది. అందుకని, సినిమా సీడీ తీసుకుని బాలకృష్ణ దగ్గరకు వెళ్లారు. ఆయన సినిమా చూసి చెబుతానని అన్నారట. అయితే సీడీలో కాకుండా ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో చూస్తానని చెప్పారట.
బాలకృష్ణ సినిమా చూసిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని సితార సంస్థ వెయిట్ చేస్తోంది. బాలకృష్ణ ఓకే అంటే దర్శకుడు ఎవరు అయితే బావుంటుందని ఆయనతో డిస్కస్ చేస్తారు. ఆయన నో చెప్తే మరో హీరో దగ్గరకు వెళ్లాలని అనుకుంటున్నారు. అప్పుడు మళ్లీ కాంబినేషన్లు మారే అవకాశం ఉంది కనుక ముందు దర్శకుడి గురించి ఆలోచించడం లేదు. పృథ్వీరాజ్ పాత్రకు రానాను అనుకుంటున్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
