మే 1న ‘పండగ చేస్కో’ ఆడియో
on Apr 27, 2015
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హ్యాట్రిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘సింహా’ నిర్మాత పరుచూరి కిరీటి యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘పండగ చేస్కో’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఆడియో మే 1న గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ ‘‘మా చిత్రానికి సంబంధించి టోటల్‌గా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఆడియోను మే 1న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య చాలా గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నాం. ఈ చిత్రానికి థమన్ చాలా ఎక్స్‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. శ్రీమణి, భాస్కరభట్ల చాలా మంచి సాహిత్యాన్ని అందించారు. మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ చిత్రంలో రామ్ క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్‌గా వుంటుంది. సేమ్ టైమ్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా వుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని మే 15న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
