పూరీకి బుర్ర కధ కష్టాలు!
on Jun 26, 2019
ఈ మధ్య కాలంలో దాదాపు కాస్త క్రేజ్ ఉన్న అన్ని సినిమాల మీదా కాపీ వివాదాలు అల్లుకోవడం కామన్ గా మారింది. నిజానికి ఈ కాపీ వివాదాలలో విషయం పెద్దగా ఉండదు. ఎందుకంటే కధను రెడీ చేసుకునే క్రమంలో మన దర్శకులు, కధకులు ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉంటారు. అక్కడ వారికి ఏదో ఒక కామన్ పాయింట్ కనిపించవచ్చు, దానిని పట్టుకుని అంటే ఒక లైన్ రాసుకుని దానిని డెవలప్ చేస్తూ పోతారు. దీంతో ఒక్కోసారి ఇద్దరు రాసుకున్న కధలు ఒకలాగా అనిపిస్తాయి. అంటే మక్కీకి మక్కీ అని చెప్పలేము కానీ కాస్తంత పోలికలతో కూడి ఉంటుంది. నిజానికి ఇది ఎవరో ఎవరినో చూసి కాపీ కొట్టినట్టు కాదు, ఇద్దరూ బహుశా ఒక సినిమానే లేదా ఒకలాగా ఉన్న సినిమానే చూసి ఉండచ్చు. కానీ ముందుగా కధ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఏమంటారు ...ఇది నా కధే నేను ఫలానా వాళ్ళకి చెబితే వాళ్ళు ఈ డైరెక్టర్ చేత సినిమా తీయించుకుంటున్నారు అంటూ వాదిస్తారు. అయితే ఈ మధ్య కాస్త పబ్లిసిటీ కూడా అవుతోంది, ఇలా మీడియాకి ఎక్కడం వలన. అయితే ఇప్పుడు తెలుగులో వస్తున్న రెండు సినిమాల లైన్స్ దగ్గరగా ఉన్నాయనే వార్తలు రావడం కాస్త సంచలనంగా మారింది.
అదేంటంటే... పూరీ డైరెక్షన్ లో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. మరో పక్క డైమండ్ రత్నబాబు అనే రైటర్ డైరెక్షన్ డెబ్యూగా సాయికుమార్ కుమారుడు ఆది హీరోగా బుర్ర కధ అనే సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల కాన్సెప్ట్ లు రెండూ ఒకటే అని అంటున్నారు. నిజానికి ఈ మధ్య రిలీజ్ అయిన బుర్ర కధ ట్రైలర్స్, టీజర్స్ పరిశీలిస్తే గనుక ఓకే మనిషికి రెండు బుర్రలు ఉంటె ఎలా ఉంటుందో అనే కాన్సెప్ట్ తో ఈ కధ రాసినట్టు అర్ధం అవుతుంది. నిజానికి ఇలాంటి దగ్గరి కాన్సెప్ట్ తో గతంలో సవ్యసాచి అనే సినిమా కూడా వచ్చింది. ఒక మనిషిలో మరో మనిషి అంతర్లీనంగా ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నాగ చైతన్య హీరోగా వచ్చిన ఈ సినిమా ఆడలేదు కానీ కాస్త విభిన్నమైన సినిమాగా పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు పూరీ తీస్తున్న ఇస్మార్ట్ శంకర్ కూడా ఈ రెండు మైండ్స్ అనే లైన్ తోనే తెరకేక్కుతుందట. ఈ సినిమా ట్యాగ్ లైన్ పరిశీలిస్తే డబుల్ దిమాగ్ అనే ఉంటుంది. ఈ సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో వస్తుందని అంటున్నారు. అయితే అదే జరిగితే ఇప్పటికే వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరీకి పెద్ద దెబ్బేనని చెప్పాలి. కొడుకుని నిలబెట్టదానికి ఆయన గతంలో మెహబూబా అనే సినిమా తేఇ ఆర్ధికంగా నష్టపోయాడు. ఇక ఈ సినిమాని కూడా ఎవరూ నిర్మించడానికి ముందుకు రాకపోతే ఈయనే స్వయంగా మళ్ళీ అప్పులు చేసి మరీ నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా కంటే ముందుగానే ఈ బుర్ర కధ రిలీజ్ అవుతోంది. ఓకవేళ సేమ్ కధ అని తెలిసినా ఇస్మార్ట్ షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి. మరి ఏమవుతుందో వేచి చూడాలి.