ఇస్మార్ట్... వెరీ వెరీ హాట్!
on Jul 13, 2019
దర్శకుడు పూరి జగన్నాథ్ తన డైరెక్షన్ కంటే హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్‌ని, హాట్ హాట్ మసాలా సీన్స్‌ని ఎక్కువ నమ్ముకున్నట్టున్నారు. రామ్ ఎనర్జీ, యాక్షన్, స్టోరీ కాన్సెప్ట్ చూపిస్తూ కట్ చేసిన 'ఇస్మార్ట్ శంకర్' ఫస్ట్ ట్రైలర్‌కి ఆశించిన స్పందన రాకపోవడంతో రిలీజ్ ట్రైలర్ మరొకటి వదిలారు. ఇందులో కంటెంట్ అంతా రొమాన్స్ చుట్టూ తిరిగింది. డైలాగులు ఓవర్ ది బోర్డ్ వెళ్లాయి. యూత్‌కి కావలసిన మసాలా సీన్లకు లోటు లేదని సెకండ్ ట్రైలర్‌తో చెప్పే ప్రయత్నం చేశారు. 'ఇస్మార్ట్ శంకర్' ప్రెస్‌మీట్స్‌లో ఛార్మి కూడా హీరోయిన్స్ గ్లామర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రేక్షకుల్లోకి వెళ్లాయి. యూత్‌లో సినిమాకి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌ని నిలబెట్టకునేలా కంటెంట్ ఉందో లేదో జూలై 18న తెలుస్తుంది. 'టెంపర్' తరహాలో ఈ సినిమాతోనూ సక్సెస్ అందుకుంటానని పూరి జగన్నాథ్ ధీమాగా ఉన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
