రామ్ ది గ్రేట్ అనిపించుకోలేకపోయాడా..?
on Oct 25, 2017
చిత్ర పరిశ్రమ భలే గమ్మత్తయ్యింది. ఒక కథ సినిమాగా మారే క్రమంలో అది ఎంతో మంది హీరోలకు వినబడుతుంది. కానీ అంతిమంగా ఎవరో ఒక్కరే ఆ కథకు తన అంగీకారాన్ని తెలుపుతారు. అలా టాలీవుడ్‌లో ఒక హీరో చేయాల్సిన కథ అటు తిరిగి ఇటు తిరిగి వేరే వారి దగ్గరకు వెళ్లడం జరుగుతుంది. సినిమా హిట్ అయ్యిందనుకోండి.. అరేరే ఆ సినిమా చేస్తే బాగుండేదే అని బాధపడటం.. అదే అట్టర్ ఫ్లాప్ అయితే.. నేను చేయకపోవడం మంచిదే అయ్యిందే అని సంబరపడటం ఎంతో మంది హీరోల విషయంలో చూశాం.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మాస్ మహరాజ్ రవితేజ రాజా ది గ్రేట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంధుడిగా రవితేజ ఎనర్జీటిక్ పర్ఫామెన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే 20 కోట్ల షేర్ రాబట్టి రవితేజకు, ఆయన అభిమానులకు మంచి జోష్‌ని ఇచ్చింది. అయితే రవితేజకు ముందు ఈ కథ హీరో రామ్ దగ్గరికి వెళ్లిందట.. ఆయనకు కూడా కథ బాగా నచ్చిందట.. అయితే నిర్మాత దిల్‌రాజుకు.. రామ్‌కి రెమ్యూనరేషన్ విషయంలో తేడా రావడంతో చివరి నిమిషంలో ఎనర్జిటిక్ స్టార్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడట. ఉన్నది ఒకటే జిందగి మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ ఈ విషయాన్ని చెప్పాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
