లారెన్స్ ఓ రాక్షసుడు.. నిత్య మీనన్
on Apr 28, 2015
సంచలన కామెంట్స్ నిత్యమీనన్ ది పొగరో, అహంకారమో, లేదంటే అమాయకత్వమో తెలీదు. నోటికి ఏం వస్తే అది మాట్లాడేస్తుంది. ప్రభాస్ ఎవరో తెలీదు అంటూ.. వచ్చిన కొత్తలో సంచనల వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు లారెన్స్ ఓ రాక్షసుడు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. లారెన్స్ దర్శకత్వం వహించిన గంగలో నిత్య కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా నిత్య చాలా ఇబ్బంది పడిందట. లారెన్స్ టేకుల మీద టేకులు తీసుకొని తనని చాలా ఇబ్బంది పెట్టాడని, ఒక దశలో ఈ టార్చర్ తట్టుకోలేకపోయానని, లారెన్స్ సెట్లో దర్శకుడిగా కాకుండా పని రాక్షసుడిలా కనిపించాడని వ్యాఖ్యానించింది నిత్య. మణిరత్నం లాంటి దర్శకుడి దగ్గర ఈజీగా పనిచేశా గానీ.. లారెన్స్ దగ్గర అది సాధ్యం కాలేదని తేల్చేసింది నిత్య. ఇది కాంప్లిమెంట్ అనుకోవాలో, నెగిటీవ్ కామెంట్ అనుకోవాలో లారెన్స్‌కి కూడా అర్థంకావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. సెట్లో లారెన్స్‌కీ, నిత్యకీ పడేది కాదట. అందుకే ప్రమోషన్లలో కూడా ఎక్కడా నిత్య బొమ్మ కనిపించకుండా చేస్తున్నాడు లారెన్స్. మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో, ఏంటో??

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
