RELATED EVENTS
EVENTS
అద్భుతం, అపూర్వం - నాట్స్ సంబరాలు ముగింపు వేడుకలు

న్యూ జెర్సీ ఎడిసన్ లోని రారిటాన్ సెంటర్ లో, తెలుగు వైభవాన్ని ఘనంగా చాటుతూ... అమెరికాలో నాట్స్ తెలుగు సంబరాలు ముగిశాయి. ముగింపు వేడుకలను నాట్స్ అట్టహసంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో తెలుగు పాట.. ఆట కనువిందు చేశాయి. తెలుగు సంస్క్రుతి సంప్రదాయాలకు నాట్స్ తెలుగు సంబరాలు అద్దం పట్టాయి. తెలుగు భాష వైభవం, వేయ్యేళ్ల తెలుగు చరిత్ర ప్రాశ్తస్త్యం గురించి కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి వివరించారు. తెలుగుభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందన్నారు..నాట్స్ తెలుగు సంబరాలలు ముగింపు వేడుకల సందర్భంగా ఆమె తెలుగు గొప్పదనం, తెలుగువారి ఐక్యతపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

అద్భుతం, అపూర్వం - నాట్స్ సంబరాలు ముగింపు వేడుకలు

 

 

కాన్సర్ బాధితుల కోసం తమ తల్లి స్మృత్యర్ధం స్థాపించిన బసవ తారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ promotional స్టాల్ ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి , కాన్సర్ హాస్పిటల్ తరపున సోదరుడు నందమూరి బాలకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.

అలరించిన ఆట పాట..

పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు బృందం చే దేవి నమస్తుభ్యం కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకల్లోనే బాలమురళీ క్రిస్ణ డాక్యుమెంటరీ డీవీడీని కే రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఇక ఒకవైపు డ్యాన్స్ చేస్తూనే మరో వైపు కాలుతో ముగ్గులు వేసిన నృత్య ప్రదర్శన నాట్స్ లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. నృత్య మాధవి స్కూల్ అఫ్ డాన్స్ నుండి దివ్య ఏలూరి చేసిన ఈ అరుదైన నృత్యం కు తెలుగువారిని నుంచి విశేష స్పందన లభించింది. ఇక వీటితో పాటు..కవి స్కూల్ ఆఫ్ డాన్స్ వారిచే టాలీవుడ్ ధమాక యువత ను ఉర్రూత లూగించింది. సిద్దేంద్ర కూచిపూడి డాన్స్ అకాడమి వారి జగదానంద కారక, టీఎప్ఎఎస్ వారిచే రసమయి, ఆనంద నాట్యాలయం వారిచే రేవతి తిల్లాన,ఫణి మాధవ్ మిమిక్రీ , రామాచారి & లిటెల్ మ్యూజిషియన్స్ అకాడెమి వారి పాటల పందిరి, ప్లూట్ నాగరాజు తోపాటు మని నాగరాజుల వేణు గానం, చంద్ర జక్క గ్రూప్ వారి రామ్ చరణ్ రిమిక్స్ ల కు విశేష స్పందన వచ్చింది. జయలక్ష్మి చేసిన భావ రాగ క్లాసికాల్ డాన్స్, వర్షం రీమిక్స్ డాన్స్ కూడా తెలుగువారు బాగా ఎంజాయ్ చేశారు.

తెలుగు పల్లె పాటను..జానపదాన్ని నృత్యాంజలి , హైదరాబాద్ వారు నాట్స్ వేదికపై ప్రదర్శించారు. సావిత్రి రామానంద్ గ్రూప్ చే పండట్టం (మోహిని అట్టం స్టైల్ డాన్సు) చేస్తే...అనుపమ దగ్గుపాటి చేసిన పుణ్య భూమి అదరగొట్టింది. ఇక మధు శాలిని డాన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. నృత్య మాధవి డాన్స్ అఫ్ స్కూల్ చే మేరా భారత్ మహాన్ , శ్రీ ఆనంద నాట్యాలయం చే అమ్మ అమ్మాయి ప్రదర్శన, సిని నటుడు కృష్ణుడు , యలక్ష్మి , సౌమ్య రాయి ల నృత్య కార్యక్రమం కవి స్కూల్ అఫ్ డాన్స్ చే తమసోమ జ్యోతిర్గమయా సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ తన సంగీతంతో ముగింపు వేడుకలకు మరింత జోష్ నింపారు. తమన్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కుర్రకారును ఊర్రూతలూగించింది.

అద్భుతం, అపూర్వం - నాట్స్ సంబరాలు ముగింపు వేడుకలు

 

 

నాట్స్ లో నవ్వులు పువ్వుల్..

నాట్స్ నవరసాల ప్రదర్శన జరిగింది.. ఆట పాటతో పాటు.. కోట శ్రీనివాస రావు కామెడి కబుర్లు, కామెడీ యాక్టర్స్ చే నాడు నేడు డ్యాన్స్ , నల్ల వేణు కామెడీ కితకితలు ఇవన్నీ తెలుగువారిని కడుపుబ్బ నవ్వించాయి. రమేష్ , ఫణి మాధవ్ లచే మిమిక్రి, జుగల్ బంది తెలుగువారిని బాగా ఆకట్టుకున్నాయి. మైం మధు చేసిన ప్రదర్శన పిల్లలను విశేషంగా ఆకర్సించింది., గౌతం రాజు కామెడి స్కిట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నాట్స్ లో భక్తి ప్రవచనం..

నాట్స్ ముగింపు వేడుకల్లో చిన జియ్యర్ స్వామి వారి ఆధ్యాత్మిక ప్రవచనం, వడ్డిపర్తి పద్మాకర్ చే పలకరిస్తే పద్యం, సిద్ధేంద్ర కూచిపూడి డాన్స్ అకాడెమి వారి జతిస్వరం, ఓం గం గణపతి ,అన్నమయ పదనర్తన ,శివ పంచాక్షరి స్త్రోత్రం,కవిత తోటకూర గారిచే సజీవ శిల్పాలు, సాధన పరంజే గ్రూప్ చే అలమేలు మంగ విలాసం కార్యక్రమాలు కూడా నాట్స్ కు విచ్చేసిన తెలుగు భక్తులకు కన్నులపండుగా మారింది.

అద్భుతం, అపూర్వం - నాట్స్ సంబరాలు ముగింపు వేడుకలు

 

 

 తమన్ సంగీత విభావరి:

టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ , వసంత్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. - లేటెస్ట్ హిట్స్ కిక్ , బృందావనం , రగడ, మిరపకాయ్ , సింహ తదితర సినిమాల నుంచి పాటలతో ప్రేక్షకులని ఉర్రూత లూగించారు . పిల్లలు , పెద్దలు స్టేజి పైకి వచ్చి డాన్స్ లు చేసారు . టాలీవుడ్ వర్ధమాన గాయకులు గీతమాధురి , శ్రీకృష్ణ , మాళవిక , సింహ , రాహుల్ నంబియార్ ఈ కార్యక్రమంలో తమ పాటలతో ప్రేక్షకుల్ని రంజింప చేసారు . నాట్స్ సంబరాలు సందర్భంగా నిర్వహించిన నాట్స్ T20 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు భారత మాజీ క్రికెట్ కాప్టైన్ , పద్మభూషణ్ శ్రీ కపిల్ దేవ్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది.

వినోద కార్యక్రమాలే కాకుండా న్యూ జెర్సీ లోని ప్రముఖ డాక్టర్ లచే నిర్వహించబడిన ఉచిత నాట్స్ మెడికల్ క్యాంపు కి సర్వత్రా ప్రసంసలు. సెలెబ్రిటీస్ మీట్ అండ్ గ్రీట్ లో భాగం గా జరిగిన 'ఎన్కౌంటర్ విత్ TV9 CEO శ్రీ రవి ప్రకాష్ ' కార్యక్రమము చాలా ఆసక్తి కరం గా సాగింది. రాష్ట్రం లోని ప్రస్తుత పరిస్థితుల పై మీడియా బాధ్యతల పై ప్రేక్షకలుకి , TV9 రవి ప్రకాష్ మధ్య ఆసక్తి కరమైన చర్చా గోష్టి జరిగింది .

రాం చరణ్ తేజ్ రీమిక్స్ సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, డైలాగ్ కింగ్ శ్రీ సాయికుమార్ సంభాషణలు ప్రేకషకులను ఉర్రూతలూగించాయి . ప్రముఖ సినీ నటులు సుమన్, రాజశేఖర్ లకు మొదట్లో తన గాత్రాన్ని ఇచ్చిన కొన్ని సినిమా ల లోని డైలాగ్స్ చెప్పి, అబిమానుల్ని కట్టి పడేశారు నాట్స్ యూత్ ప్రోగ్రామ్స్ లో భాగం గా క్రూజ్ లో రామ్ చరణ్ తేజ్ పాల్గొన్న కార్యక్రమము అత్యంత ఆహ్లాదం గా జరిగింది .

నేషనల్ ఫిలిం ఫెయిర్ అవార్డు హీరోయిన్ ప్రియమణి నాట్స్ సంబరాలు లో పాల్గొనటం ఎంతో సంతోషం గా వుందని చెపుతూ స్వర్ణ జేవేల్లెరి లక్కీ దీప లో గెలిచిన విజేత లకు బహుమతి ప్రదానం చేసారు. వర్ధమాన తెలుగు హీరోఇన్స్ మధు శాలిని , సాక్షి గులాటి , మధురిమ బెనర్జీ , కామ్న జేత్మలాని సంబరాలు లో పాల్గొని ప్రేకషకులను అలరించారు.

బాపు ఆర్ట్ గేలరీ లోని చిత్రాలు ప్రేక్షకులని కానర్పకుండా కట్టిపడేశాయి.నాట్స్ కి చేసిన సేవలకి మరియు ట్రిపుల్ Gunniess రికార్డు సాధించిన సందర్భంగా మేస్ట్రో ఘజాల్ శ్రీనివాస్ కి గండపెండేరాన్ని తొడిగి ఘనంగా సన్మానించారు.అట మరియు నాట Presidents హాజారు అయ్యి నాట్స్ సంబరాల నిర్వహణ అద్భుతం అని ప్రశంసించారు. స్థానిక తెలుగు Associations TLCA and TFAS నాట్స్ సంబరాలు నాట్స్ గొప్పగా జరగటానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు.

విందుభోజనం:

భోజనవతులు , విందు భోనాన్ని, అభిరుచి హోటల్ అధినేత శ్రీ సతీష్ దాసరి ని ప్రతీ ఒక్కరు అభినందించారు.న్యూ జెర్సీ నుంచే కాక పలు రాష్ట్రాల నుంచి మరియు భారత దేశం నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు .7,628 మంది నాట్స్ అభిమానులు హాజరయ్యారు. కార్యక్రమాలు , ఏర్పాట్లు , వసతుల గురించి ప్రజలు ఎంతో సంతృప్తి ప్రకటించారు. 300 మంది నాట్స్ వొలుంతీర్స్ అనేక మాసాలు గా ఎంతో శ్రమంచి వచ్చిన ప్రముఖలకు , ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాలికా బద్ధం గా ఎంతో చక్కటి ఏర్పాట్లు చేసారు . Operations హెడ్ శ్రీ మన్నవ మోహన్ ను నాట్స్ టీం "మాన్ అఫ్ ది సంబరాలు" గా ప్రకటించి తమ అభిమాన్ని చాటుకున్నారు.

అద్భుతం, అపూర్వం - నాట్స్ సంబరాలు ముగింపు వేడుకలు

 

నాట్స్ సంబరాలు ఆర్గనైజింగ్ కమిట్టీ కి , మరియు నాట్స్ Volunteers అందరికి పేరు పేరునా దగ్గుబాటి పురంధరేశ్వరి చేతుల మీదుగా జ్ఞాపికలు అంధ చేసారు . సంబరాలకు అనేక సినీ , రాజకీయ , క్రీడా , వ్యాపార ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు - చిన జియ్యర్ స్వామి ,కపిల్ దేవ్ , రామ్ చరణ్ తేజ్, ప్రియమణి , సాయి కుమార్ , కృష్ణుడు , కోట శ్రీనివాస రావు , మధు శాలిని , కామ్న జేత్మలాని , మధురిమ బెనర్జీ , సాక్షి గులాటి , కోట Shankara రావు , ఢిల్లీ రాజేశ్వరి , గౌతం రాజు , నల్ల వేణు , రాఘవేంద్ర రావు , T S దీక్షిత్, అశ్వని దత్ , తమ్మారెడ్డి భరద్వాజ , దగ్గుబాటి పురంధరేశ్వరి , నాదెండ్ల మనోహర్ , సృజనా చౌదరి , మధు యాష్కి ,TV9 రవి ప్రకాష్ , గురవా రెడ్డి , సురేష్ చుకపల్లి , వరప్రసాద రెడ్డి తదితర అతిత మహారధులు నాట్స్ సంబరాలు ki వచ్చి నాట్స్ ఇంతా బ్రహ్మాండంగా సంబరాలు నిర్వహినందుకు అభినందనలు తెలియచేసారు.

3 రోజుల పాటు జరిగిన నాట్స్ - ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు పండుగ వాతావరణం లో జరిగింది . అన్ని రకాల ప్రేకషకులను దృష్టి లో పెట్టుకొని రూపిందించిన కార్యక్రమాలు అన్దరినిఏ అలరించాయి . ఇంత పెద్ద ఎత్తున జరిగిన నాట్స్ సంబరాలకు హజారైన అందరికీ NATS కృతజ్ఞతలు తెలియ చేసింది .

బహుమతుల ప్రధానం నాట్స్ - టోరి సౌజన్యంతో యావత్ అమెరికా లో జరిగిన తెలుగు అమెరికా ఐడల్ పోటీలలో విజేత లను ప్రకటించి బహుమతులను అందచేసారు., కే రాఘవేంద్ర రావు కు అవార్డు ప్రధానంతో పాటు.. శ్రీ కృష్ణ రాయబారం, కార్యవర్గ కమిటీ , ఆర్గనైజింగ్ కమిటి సభ్యులకు పురంధరేశ్వరి గారి చేతుల మీదుగా అవార్డులు అందించారు. ప్రియమణి చే స్వర్ణ జ్యూయలరీ వారి లక్కీ డ్రా విజేత ల ప్రకటించారు.. మొత్తం మీద నాట్స్ అటు తెలుగు ప్రముఖులకు గౌరవ సత్కారాలతో పాటు.. నాట్స్ కు వచ్చిన తెలుగువారందరికి అంతులేని ఆనందాన్నిచ్చింది. స్వీట్ మోమోరీస్ ను మిగిల్చింది

అద్భుతం, అపూర్వం - నాట్స్ సంబరాలు ముగింపు వేడుకలు

 

Photo Gallery :  https://picasaweb.google.com/108235771047452620221/NATSTeluguSambaraluDay2?
authkey=Gv1sRgCPu038WwhcbbYg&feat=email
#

 

TeluguOne For Your Business
About TeluguOne
;