LATEST NEWS
బీఆర్ఎస్ వర్సెస్ కవిత వార్ కొత్త సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కబోతున్నది. ఇప్పటి వరకూ ఘాటుగా విమర్శలు చేస్తున్నా కవిత తన విమర్శలను ఒకింత సున్నితంగా చిన్నపాటి సూదిమొన గుచ్చినట్లుగా చేస్తు వచ్చారు. అయితే ఇక ముందు అంటే కొత్త సంవత్సరంలో తాను ఇంకెంత మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతానని.. ఈ ఏడాది చివరి రోజున కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన ఈ సారి కేటీఆర్ లక్ష్యంగా కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు.
బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు. కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరితే.. తాను మాత్రం 2006 లో సొంతంగా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశాననీ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ అన్న విషయానికి తెలంగాణ సాధన ఉద్యమంలో అగ్రస్థానం కలిగేలా చేశాననీ చెప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్ గానే పాల్గొన్నా నన్నారు.
తెలంగాణ ఆవిర్భవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తీరులో మార్పు వచ్చిందని కవిత అన్నారు. అప్పుడే తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం తనకు కలిగిందన్న కవిత.. తన ఫోన్ ను తన భర్త పోన్ ను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అప్పుడే పార్టీ దృష్టికి తీసుకువచ్చినా తేలికగా తీసుకున్నారని కవిత చెప్పారు. అదే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయిస్తే తేలికగా తీసుకుంటారా అని ప్రశ్నించిన ఆమె, మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే తన ఫోన్, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న విషయం అర్ధమైందన్నారు.
మహిళలకు అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగా వ్యవహరించలేదని తండ్రి నిర్ణయాలను సైతం తప్పుపట్టిన కవిత.. కేసీఆర్ హయాంలో 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే.. వారిలో కనీసం ఒక్క మహిళ కూడా లేని విషయాన్ని ఎత్తి చూపారు. ఆ నాడే తాను తన తండ్రిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు.
ఇక హరీష్ రావుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హరీష్ రావును తెలంగాణ చంద్రబాబుగా అభివర్ణించారు. ఏడాది ముగుస్తున్న సమయంలో ఆమె పాడ్ కాస్ట్ లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వచ్చే సంవత్సరం కవిత బీఆర్ఎస్ పై ఇప్పటి వరకూ చేస్తున్న యుద్ధం కొత్త పుంతలు తొక్కబోతోందన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇప్పటి వరకూ తన సోదరుడిని హరీష్ ముంచేస్తారు, తన తండ్రిని తప్పుదోవపట్టిస్తారు అంటూ వచ్చిన కవిత.. ఇప్పుడు మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా మొత్తం అందరిపైనా యుద్ధం ప్రకటించేసినట్లైంది.
జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు కొద్ది కాలంగా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. అటువంటి నాగబాబు.. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వడం ద్వారా ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు.
జనసేన ఎమ్మెల్సీగా.. ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు పని చేసుకుంటూ పోతున్న నాగబాబు.. శివాజీ కామెంట్లకు కౌంటర్ ఇచ్చి, మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారారు. శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
వాస్తవానికి మెగా కాంపౌడ్ అంత పటిష్ఠంగా ఉండటానికి నాగబాబే కారణమని అంటుంటారు, ఆయన నాగబాబు లేకుండా మెగా కాంపౌండ్ ఇంత స్ట్రాంగా నిలబడే ఛాన్స్ లేదనే వారు కూడా చాలా మంది ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి అయినా, మెగాపవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అయినా.. తాము మాట్లాడితే ఇబ్బంది అనుకునే విషయాలను నాగబాబు నోట పలికిస్తారని వారిని దగ్గరా తెలిసన వారు చెబుతుంటారు.
ఇందుకు ఉదాహరణగా అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సందర్భంలో కానీ, ఇండస్ట్రీలో చిరుకు మద్దతుగా గళం విప్పే అంశంలో కానీ నాగబాబు ఎలాంటి శషబిషలూ లేకుండా ముందుకు వచ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఇక తన స్వంత కుమార్తె నీహారిక విషయంలో ఆమె పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలబడిన ఉదంతాన్నీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నాగబాబును జనసేన నుంచి సస్పెండ్ చేయాలంటూ చేస్తున్న డిమాండ్ ను జనసైనికులు కొట్టి పారేస్తున్నారు. మహాళల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నాగబాబు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆయనకు అండగా నిలబడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ అనవసర అంశాన్ని ఇంకా పొడిగించకుండా కామైపోవడం మంచిదని హితవు చెబుతున్నారు.
రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం పెద్ద దిక్కు. దశా దిశా దిస్కూచి కూడా రాహుల్ గాంధీయే. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కూడా ఆయనే. అందులో సందేహం లేదు. అయితే.. రాహుల్ తరువాత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చూసిన ఆయన సోదరి ప్రియాంక వధేరా గాంధీ కుమారుడు రేహాన్ వాద్రానే వారసుడు. అందుకు కారణం రాహుల్ గాంధీ అవివాహితుడిగా ఉండటమే. ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
అదే రాహుల్ గాంధీకి వివాహమై ఉంటే.. ఆయన తనయులే తర్వాతి తరం వారసులు అయి ఉండేవారు. కొద్ది కాలం కిందటి వరకూ రాహుల్ గాంధీ వివాహం అన్నదే వారి కుటుంబంలోనే కాక, రాజకీయవర్గాలలో కూడా హాట్ టాపిక్ గా ఉండేది. అయితే.. రాహుల్ వివాహం పట్ల సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ చర్చ క్రమంగా ఆగిపోయింది. ఇప్పుడు రాహుల్ మేనల్లుడు రేహాన్ తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని పెళ్లి పీటలెక్కుతున్నారు. అయితే రాహుల్ గాంధీకి కూడా ఓ ప్రియురాలు ఉండేదని గట్టిగా వినిపించేది. అయితే ఆయన రేహాన్ లా ధైర్యం చేయలేదు. అందుకు ప్రధాన కారణం సెక్యూరిటీ థ్రేట్ అంటారు. అప్పట్లో సోనియా గాంధీ ప్రధాని కావల్సిన వారు.. ఆమె ప్రధాని కాలేక పోవడానికి, తర్వాత రాహుల్ పెళ్లాడక పోవడానికి కూడా అదే కారణంగా చెబుతారు.
అప్పట్లో ఎల్. టీ. టీ. ఈ అనే మిలిటెంట్ గ్రూప్ రాజీవ్ గాంధీని హతమార్చిన సంగతి తెలిసిందే. సోనియా ప్రధాని కాకుండా హెచ్చరికలు జారీ చేసి అడ్డుకున్నది కూడా ఎట్టీటీయే అని అప్పట్లో గట్టిగా వినిపించింది.ఈ నేపథ్యంలో రాహుల్ తన తదనంతర వారసులకు ఈ ప్రాణహాని సైతం అనువంశికంగా కల్పించడం ఎందుకు? అన్న కోణంలో ఆలోచించి.. తన పెళ్లి ఊసెత్తలేదని అంటారు. అందుకే రేహాన్ పెళ్లి ద్వారా ఆ ఇంట ఇన్నేళ్లకు ఒక శుభకార్యం జరుగుతుండటంతో హ్యాపీ ఫీలవుతున్నారు కాంగ్రెస్ కార్యర్తలు.
ALSO ON TELUGUONE N E W S
సినిమా పేరు: సైక్ సిద్దార్ధ
నటీనటులు: శ్రీ నందు, యామిని భాస్కర్,ప్రియాంక రెబెకా, సింహ, సుఖేష్ రెడ్డి తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రకాష్ రెడ్డి. కె
ఎడిటర్: ప్రతీక్
సంగీతం: స్మరన్ సాయి
నిర్మాతలు: రానా దగ్గుబాటి, శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి
బ్యానర్స్: స్పిరిట్ మీడియా, నందు నెస్, సురేష్ ప్రొడక్షన్స్
రిలీజ్: ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్ మెంట్స్
రచన, దర్శకత్వం: వరుణ్ రెడ్డి
రిలీజ్ డేట్ : జనవరి 1 ,2025
శ్రీ నందు(Shree Nandu)తన సెకండ్ ఇన్నింగ్స్ లో రీసెంట్ గా దండోరా తో వచ్చి తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసాడు. ఇప్పుడు సోలో హీరోగా 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha) తో వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టాడు. రానా దగ్గుబాటి రిలీజ్ చేయడం, నందు కూడా ఒక నిర్మాతగా వ్యవహరించడం ఈ చిత్రం స్పెషాలిటీ. ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
సిద్దార్ధ( నందు), త్రిష( ప్రియాంక రెబకా) ఒకరికొకరు ఇష్టపడతారు.ఇద్దరు శారీరకంగా కూడా చాలా సార్లు కలుస్తారు. కానీ త్రిష ఆ తర్వాత మన్సూర్ (సుఖేష్ రెడ్డి) అనే బిజినెస్ మెన్ ని ఇష్టపడి పెళ్ళికి సిద్దమవుతుంది. శ్రావ్య( యామిని భాస్కర్) భరత నాట్యంలో ప్రావీణ్యురాలు. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో తన ఎనిమిదేళ్ల వయసు ఉన్న కొడుకు రిషితో కలిసి వేరేగా ఉంటు ఉంటుంది. రేవంత్(సింహ) తన భార్య దగ్గర డబ్బులు తీసుకొని సిద్దార్ధ కి అప్పుగా ఇస్తాడు. అందుకు కారణం చిన్నప్పట్నుంచి సిద్దార్ధ, రేవంత్ లు ప్రాణస్నేహితులు. ఈ ఆరుగురు చుట్టూ అల్లుకున్న అవసరాలు, కారణాలు, ప్రేమలు, పంతాలు, ఆప్యాయత, అమాయకత్వాల నేపధ్యమే సైక్ సిద్దార్ధ.
ఎనాలసిస్
ఇలాంటి కథలు సెల్యులాయిడ్ పై చాలానే వచ్చాయి. డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలే ఒక ఉదాహరణ. కాకపోతే కొత్త తరహా దర్శకత్వం, ఫొటోగ్రఫీ, నందుతో సహా మిగతా ఆర్టిసుల నాచురల్ పెర్ ఫార్మెన్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కొత్త తరహా స్క్రీన్ ప్లే సైక్ సిద్దార్ధ ని బోర్ కొట్టకుండా చేసాయి. కొన్ని అసభ్య సన్నివేశాలు ఉన్నా చాలా చిత్రాల్లో వస్తు ఉన్నవే. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే ప్రారంభ సన్నివేశమే కొత్తగా ఉంది. దీంతో సిద్దార్ధ తో కనెక్ట్ అవుతాం.
ఆ తర్వాత రేవంత్, సిద్దార్ధ్ మధ్య వచ్చిన సన్నివేశాలు బాగున్నా, నవ్వుని మాత్రం పెద్దగా తెప్పించలేకపోయాయి.అసలు మూవీ మొత్తం ఎంటర్ టైన్ మెంట్ ని బాగా సృష్టించవచ్చు. ఆ స్కోప్ గా కూడా ఉంది. కాకపోతే మేకర్స్ ఆ దిశగా దృష్టి పెట్టలేదు.కొన్ని క్యారెక్టర్స్ పైన మాత్రమే మూవీ మొత్తాన్ని నడిపించారు. త్రిష, సిద్దార్ధ మధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశాలు అయితే పీక్ లో ఉండటంతో పాటు, మోడరన్ తిరుగుళ్ళకి అలవాటు పడ్డ కొంత మంది అమ్మాయిలు డబ్బు, హోదాకి, శారీరక సుఖానికి తప్ప స్వచ్ఛమైన ప్రేమకి విలువ ఇవ్వరని చెప్పినట్లయింది.
శ్రావ్య క్యారక్టర్ ద్వారా మాత్రం ఆడవాళ్ళ ఆత్మభిమానాన్ని, కసాయి భర్త పెట్టే ఇబ్బందుల నుంచి తప్పించుకొని, తమ మనసు ఒక మంచి వ్యకి కోసం ఎలా ఎదురుచూస్తుందో చెప్పినట్లయింది. సిద్దార్ధ,మన్సూర్ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి.ఇంటర్ వెల్ సన్నివేశం పెద్దగా పేలింది ఏమి లేదు. ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో ముందుగానే ఊహిస్తాం. కాకపోతే ప్రారంభంలోనే చెప్పుకున్నట్టుగా డిఫెరెంట్ స్క్రీన్ ప్లే తో పాటు క్యారక్టర్ డిజైన్స్ బాగుండటంతో చూస్తూ ఉండిపోతాం. సిద్దార్ధ, శ్రావ్య, రిషి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. స్వచ్ఛమైన ప్రేమకి, శీలానికి సంబంధం ఉండదని చెప్పినట్లయింది. ఇలాంటి ప్రేమలు బయట సొసైటీ లో చాలానే జరుగుతున్నాయి. దాంతో నిజమైన క్యారెక్టర్స్ ని చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది.
స్కూల్ సన్నివేశాలు మాత్రం ఈ కథకి అవసరం లేదు. సిద్దార్ధ్ చేసే పెయింటింగ్ పని కి సంబంధించి కాంట్రాక్టు రావడం కోసం స్కూల్ సన్నివేశాలు ఎస్టాబ్లిష్ చేసి ఉండవచ్చు. కానీ సిద్దార్ధ పెయింట్ కాంట్రాక్టు, మన్సూర్ ఆఫీస్ కి సంబంధించినది అయ్యి ఉంటే కావాల్సినంత ఫన్ వచ్చేది. ఎందుకంటే మన్సూర్ తో ఉండి కూడా త్రిష నిన్ను మర్చిపోలేకపోతున్నానని సిద్దార్ధ ని కలవడానికి వస్తుంది.కాబట్టి సిద్దార్ధ పెయింటింగ్ కాంట్రాక్టు మన్సూర్ ఆఫీస్ కి షిఫ్ట్ చేసి ఉండాల్సింది. ఇక్కడే కావాల్సినంత ఫన్ ని జనరేట్ చేసుకొనే అవకాశం ఉండేది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం బాగున్నాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు
సిద్దార్ధ గా నందు పెర్ ఫార్మెన్స్ ఒక రేంజ్ లో సాగింది. అన్ని వేరియేషన్స్ లోను ఎవరు ఎలాంటి వంక పెట్టని విధంగా అద్భుతంగా చేసి మరో సారి సిల్వర్ స్క్రీన్ పై బెస్ట్ పెర్ఫార్మ్ ని ప్రదర్శించాడు. ఈ మూవీ తర్వాత నందు సినీ డైరీ బిజీ అవుతుందేమో చూడాలి. ఇక శ్రావ్య క్యారక్టర్ లో యామిని భాస్కర్(Yamini Bhaskar)కూడా సూపర్ గా చేసింది. అసలు ఆ క్యారక్టర్ తన కోసమే పుట్టిందా అనేలా మెస్మరైజ్ చేసింది. త్రిష గా చేసిన ప్రియాంక(Priyanka Rebekah)కూడా అంతే మేకర్స్ తన క్యారక్టర్ ని ఏ పర్పస్ కోసం అయితే సృష్టించారో, ఆ ప్రకారం తన వంతు న్యాయం చేసింది. సిద్దార్ధ ఫ్రెండ్ గా చేసిన సింహ, త్రిష మరో లవర్ గా చేసినా సుఖేందర్ రెడ్డి కూడా అద్భుతమైన పెర్ఫార్మ్ ఇచ్చారు.ఇక దర్శక రచయిత వరుణ్ రెడ్డి(Varun Reddy)గురించి చెప్పుకోవాలంటే ఒక మాములు కథని తన అద్భుతమైన డైరెక్షన్ తో కట్టిపడేసాడు. ఒక కొత్త రకమైన టేకింగ్ ని కూడా చిత్ర సీమకి పరిచయం చేసినట్లయింది. రచయితగా మాత్రం పెద్దగా మెప్పించలేకపోయాడు. నిర్మాణ విలువలు కథకి తగ్గ విధంగా బాగున్నాయి. సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ అయితే ఒక లెవల్. ఆ రెండు ఈ చిత్రానికి మరో ప్రాణంగా నిలిచాయి.
ఫైనల్ గా చెప్పాలంటే ఇలాంటి చిత్రాలు సెల్యులాయిడ్ పై గతంలో చాలా వచ్చినా కూడా కథ నడిచిన విధానం, దర్శకత్వం, మ్యూజిక్, ఫొటోగ్రఫీ, నందుతో పాటు మిగతా ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ సైక్ సిద్దార్ధ ని చూస్తున్నంత సేపు బోర్ కొట్టకుండా చేసాయి. ఫన్ గ్యారంటీ.
రేటింగ్ 2 .5 /5
అరుణాచలం
Cast: Shree Nandu, Yamini Bhaskar, Narasimha S, Priyanka Rebekah Srinivas, Sukesh, Wadekar Narsing, Bobby Ratakonda, Sakshi Atree Chaturvedi, Mounika, Pradyumna Billuri
Crew:
DOP: K Prakash Reddy
Editor: Prateek Nuti
Additional Screenplay: Shree Nandu
Music Director : Smaran Sai
Writer & Director: Varun Reddy
Producers: Shree Nandu, Shyam Sunder Reddy Thudi
Shree Nandu has stated several times that he had been struggling for 19 years to find his success as a leading man. Now, with Psych Siddhartha, he has decided to try a completely whacky and out-of-box movie to attract Gen-Z. The movie is distributed by Spirit Media and Suresh Productions and the teasers, trailer has earned it good buzz. How is the movie? Will the New Year begin with a bang for Telugu Cinema? Read further to know.
Plot:
Siddhartha (Shree Nandu) has lost 3 crores of investment to Mansoor and his girlfriend Trisha. He is living on roads and in a basti unable to pay rents. He runs a fraud case on Mansoor and his friend Revanth tries to make him accept a settlement. Trisha keeps swinging between Siddhartha and Mansoor, while Mansoor is planning to propose to her. In this washed out state, Siddhartha meets a dancer Sharvya (Yamini Bhaskar) who is abused by her husband and has a son. What all twists and turns his life will take at this juncture, watch the movie to know more.
Analysis:
Nandu shed all his inhibitions for the film and tried to do his best for the role. Trying to be a person who is extremely innocent to the level of being dangerously naive, he played the character well. He gave it everything without restricting himself. Yamini Bhaskar is cute and very apt for this role. Sadly, other actors did not look perfect for their roles.
Most of them looked like they did not get the character or the kind of skill to make the scene more real. Even random editing patterns that try to go back and forth at times give jarring feel rather than the whacky comic mode that the makers hoped to set. While some laugh out loud moments to shine, the regularity of these moments is very low and even the story is very predictable.
The makers have decided to overcome the predictability factor by using Siddhartha's character but the lack of proper back story except for a certain situation tends to take us away from connecting with him too. Sometimes it feels like they are trying too hard to sell the whacky gig when it is not required or not present. The director has tried to give us an internal feeling of how it is to be in Siddhartha's brain and how he is totally damaged looking at his life like a game.
So, the new lease of life that he is able to find after a long struggle makes him even more desperate to hold it together but he is unable to due to his old patterns which needs to overcome. Such writing needs even more depth even in whacky scenes and ideas.
While the movie looks to have been made with restrictions and trying to make it look cool and new-age, the character writing lacked the real depth and there is more shallowness to the gigs too. Having said that the moments that work might entertain the limited set of audiences that this movie aims to touch.
Bottomline:
The movie has a very limited appeal and high usage of abusive language. Not a recommendation but might attract audiences it targets.
Rating: 2.5/5
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)కి తెలుగునాట కూడా మంచి గుర్తింపు ఉంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ప్రస్తుతం తెలుగులో 'ఆకాశంలో ఒక తార'తో పాటు ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక ఫిల్మ్ చేయడానికి దుల్కర్ సల్మాన్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు.
ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది.. రెండో సినిమాకే రామ్ చరణ్ తో 'రచ్చ' చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సీటీమార్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత దుల్కర్ ని డైరెక్ట్ చేయనున్నాడట.
ఇప్పటికే దుల్కర్ సల్మాన్, సంపత్ నంది మధ్య కథా చర్చలు జరిగాయని.. సంపత్ చెప్పిన స్టోరీ లైన్ కి దుల్కర్ ఇంప్రెస్ అయ్యాడని వినికిడి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
Yash Rangineni has long been known to Telugu audiences as a producer with sharp judgment and refined cinematic taste. Under his Big Ben Cinemas banner, he has backed several meaningful and distinctive films. His production debut, Pelli Choopulu, starring his nephew Vijay Deverakonda, went on to become a critically acclaimed commercial blockbuster, earning National Award and securing its place as a modern classic in Telugu cinema.
Following that success, Yash Rangineni produced notable films such as Dorasani, Dear Comrade, ABCD, Annapurna Photo Studio, and Bhaag Saale—each reflecting his inclination towards content-driven storytelling and socially resonant themes. Through these films, he firmly established himself as a producer with vision and conviction.
Now, Yash Rangineni is proving his mettle on screen as well. His latest outing, Champion, directed by National Award-winning filmmaker Pradeep Advaitham, marks a significant and worthy step in his acting journey. Set against a compelling period backdrop and headlined by Roshan Meka, the film features Yash Rangineni in a brilliantly written role that allows him to explore layered emotions and moral strength.
In Champion, he essays the role of Veeraiah—an uneducated, idealistic man rooted in rural life, representing the marginalized and oppressed sections of society. Yash Rangineni delivers a powerful and nuanced performance, embracing the character with raw sincerity and restraint. Rather than relying on dialogue-heavy dramatics, he communicates volumes through his silence, body language, and commanding screen presence.
His portrayal of Veeraiah—a man who speaks little, observes deeply, and carries an intense inner fire—is being widely noticed and appreciated. Through subtle expressions, measured movements, and quiet strength, Yash Rangineni brings authenticity and emotional depth to the character, making him a symbol of hope and resistance within the narrative.
With Champion currently running successfully in theatres, Yash Rangineni’s transition from producer to actor stands out as both natural and impactful—reinforcing his versatility and deep understanding of cinema, not just behind the scenes but firmly in front of the camera as well.
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
-ఎవరు ఊహించలేదు
-ఎందుకు వేడుకలు రద్దు
-సన్నీలియోన్ ఏం చెప్తుంది!
జిస్మ్ 2 తో భారతీయ సినీ ప్రేక్షకులని తన మానియాతో మెస్మరైజ్ చేసిన నటీ 'సన్నీలియోన్'(Sunny Leone). తన పోస్టర్ పడితే చాలు థియేటర్స్ కి ప్రేక్షకులు పరుగులు పెట్టేలా అంత స్టేటస్ కూడా సన్నీలియోన్ సొంతం. దక్షిణాదిలో కూడా ల్యాండ్ అయ్యి మన తెలుగులో మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన 'కరెంటు తీగ'లో చేసింది. సినిమాలకి సంబంధం లేకుండా సన్నీ లియోన్ పలు ప్రైవేట్ ఫంక్షన్స్ కి హాజరై అభిమానులని, ఆహుతులని అలరిస్తూ వస్తుంది. నూతన సంవత్సర వేడుకలకి కూడా గెస్ట్ గా వెళ్లి అభిమానుల్లో ఉన్న న్యూ ఇయర్ జోష్ ని రెట్టింపు చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఈ కోవలోనే న్యూ ఇయర్ సందర్భంగా రేపు ఉత్తర ప్రదేశ్ లోని మధుర(Mathura)లోని ఒక ప్రముఖ ప్రైవేట్ హోటల్ రూఫ్‌టాప్ రెస్టారెంట్లో సన్నీలియోన్‌తో డీజే నైట్ నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 300 మందికి మాత్రమేప్రవేశం ఉండేలా టికెట్లు ముందుగానే విక్రయించారు. ఈ ఈవెంట్ పై సన్నీలియాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మీ మధుర వచ్చి డి జె గా న్యూ ఇయర్ జోష్ ని మరింతగా పెంచబోతున్నామని వీడియో కూడా చేసింది. కానీ ఈ ఈవెంట్‌పై స్థానిక సాధువులు, పూజారులు, హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మధుర, బృందావన్, బ్రజ్ ప్రాంతం మొత్తం శ్రీకృష్ణుడి లీలలకు సాక్ష్యమైన పవిత్ర భూమి. భజనలు, కీర్తనలు, ధార్మిక కార్యక్రమాలు జరగాల్సిన ప్రాంతంలో నైట్ పార్టీలు, డీజే ఈవెంట్లు నిర్వహించడం బ్రజ్ ప్రాంత సంప్రదాయాలకి విరుద్ధమని తమదైన శైలిలో ఆందోళన నిర్వహించారు. జిల్లా అధికార యంత్రాంగానికి లేఖలు కూడా రాసి తమ ఆందోళనని ఉధృతం చేసింది.
Also Read: ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి
ఈ నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకుడు మితుల్ పాఠక్ స్పందిస్తు'సన్నీలియోన్‌ని ఒక ఆర్టిస్ట్‌గా మాత్రమే ఇన్ వైట్ చేసాం.ఇది కేవలం డీజే పెర్ఫార్మెన్స్ మాత్రమే. అన్ని చట్టపరమైన అనుమతులు, పరిపాలనా నిబంధనలు పాటించాం. అయినప్పటికీ, సామాజిక మరియు ధార్మిక మనోభావాలను గౌరవిస్తు ఈవెంట్ ని రద్దు చేస్తున్నాం. ఈ రద్దుతో ఆర్ధికంగా కొంత నష్టం వస్తుందని తెలిపాడు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు. అయితే కష్టం లేదా సమస్య వచ్చినప్పుడు వాటిని భరించాలని, ఓర్పుతో వాటిని అధిగమించాని తెలిసిన మనుషులు ఆరోగ్యం దగ్గర మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే నేటికాలంలో ఆరోగ్యం విషయంలో సర్దుబాటు చేసుకునే వారు ఎక్కువ. అలాగే జీవితం అంటే ఎప్పుడూ ఇంతే అని నిరాశలో బ్రతికేవారు కూడా ఎక్కువే. ప్రతి సారి ఇలాంటివి మామూలే అనుకోకుండా కనీసం కొత్త ఏడాదిలో అయినా ఆరోగ్యం, జీవితం గురించి కాస్త శ్రద్ద పెట్టడం వల్ల మెరుగవ్వచ్చు. 5 టిప్స్ ఫాలో అవ్వడం వల్ల జీవితమే మారిపోతుంది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
ఆరోగ్యంగా ఉంటేనే అన్ని విషయాల్లో పర్పెక్ట్ గా ఉండగలం..
పైన పేర్కొన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే చురుకుగా ఉండటం సాధ్యమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం వల్ల శక్తి, సమయం, డబ్బు ఆదా అవుతాయి. అంతేకాదు ఇతరులకు సహాయం చేయవచ్చు. తాము ఆరోగ్యంగా, పాజిటివ్ గా ఉండటమే కాకుండా చుట్టూ ఉన్న వారిని కూడా అటు వైపు ఇన్ప్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది.
బరువు మాత్రమే కాదు..
చాలా మంది ఆరోగ్యం గురించి తీసుకునే నిర్ణయాలలో ఈ ఏడాది బరువు తగ్గాలి.. లాంటివి ఉంటాయి. అయితే బాగా ఆరోగ్యంగా ఉండటం అంటే బరువు తగ్గడం, పొట్ట తగ్గించుకోవడం మాత్రమే కాదు. తెలివితేటలను, మనస్సును నిరంతరం మెరుగుపరచుకుంటూ ఉండాలి. జిమ్‌లో కండరాలు పెంచడానికి వ్యాయామం చేయడమే కాదు.. నలుగురికి సహాయపడటం, మానవత్వంతో ఉండటం వంటి గుణాలు కూడా ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఎన్నో రెట్లు మెరుగుపరుస్తాయి.
నిద్ర ముఖ్యం..
కార్పొరేట్ ఉద్యోగాలు, యంత్రాల్లా పని చేసే మనుషులు, ఎలక్ట్రానిక్ వస్తువుల్లా సాగే శరీరాలు.. ఇది మాత్రమే కాకుండా గాడ్జెట్లు నాణ్యమైన నిద్ర అంటే ఏంటో తెలియకుండా మనుషులను మార్చేశాయి. అందుకే ఈ నూతన సంవత్సరంలో నిద్ర విషయంలో రాజీ పడకూడదని ఎవరికి వారు ఒక నిబంధన పెట్టుకోవాలి. శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుకోవడానికి, ఎలాంటి జబ్బులు శరీరానికి కలగకుండా ఉండటానికి ప్రతి రాత్రి సమయానికి నిద్రపోవాలి. ఇది నిద్ర కణాలను పునరుజ్జీవింపజేస్తుంది, మరుసటి రోజు లేవగానే ఎనర్జీగా ఉండేందుకు, మానసిక, శారీరక ఒత్తిడి తగ్గేందుకు సహాయపడుతుంది.
శ్వాస- ప్రాణ శక్తి..
ప్రతిరోజూ కొంత సమయం శ్వాసపై శ్రద్ధ వహించాలి. కాలానుగుణ పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి చేస్తే శరీరంలో మంచి ఎనర్జీ, ప్రాణ శక్తి మెరుగవుతాయి. రోజువారీ అలసట అధిగమించడానికి ప్రకృతిలో సమయం గడపాలి. సూర్యకాంతిలో గడపడం, స్వచ్ఛమైన గాలి ఉన్న చోట నడవడం. నేలపై చెప్పులు లేకుండా నడవడం, వంటివి చేయాలి. ప్రకృతిని గౌరవిస్తే అది ప్రేమను, శక్తిని, ఆరోగ్యాన్ని తిరిగిస్తుంది.
ప్రతిభ- సామర్థ్యం..
ప్రతి వ్యక్తి తమలో ఉన్న ప్రతిభను, సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంత గొప్ప ఫలితాలు పొందగలుగుతారు. ఏదో బ్రతికేస్తున్నాం అనుకోకుండా జీవితాన్ని మరింత అందంగా ఎలా మార్చుకోవాలో, అవకాశాలను ఎలా సృష్టించుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. ఇది జీవితంలో అబివృద్దికి దారి తీస్తుంది.
- రూపశ్రీ
ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వారి వ్యక్తిత్వానికి తగినట్టు వారు మాట్లాడుతుంటారు. నచ్చినట్టే ఏ పని అయినా చేస్తుంటారు. అయితే సైకాలజీ ప్రకారం మనుషులను వివిధ వర్గాలుగా విభజిస్తారు. వారిలో నార్సిసిస్టులు కూడా ముఖ్యమైనవారు. నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు. దీని వల్ల వారు గొప్ప వారు అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. నార్సిసిస్టులు తమ తప్పు ఎప్పటికీ ఒప్పుకోరు. తమ తప్పును ఒప్పుకోకూడదు కాబట్టి, తాము చేసింది కరెక్ట్ అని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం ఎవ్వరినైనా దోషులుగా నిలబెట్టడానికి వెనుకాడరు. ఈ నార్సిసిస్టులు మన చుట్టూనే ఉంటారు. కానీ వీరిని అంత సులువుగా గుర్తించలేం. మనం నార్సిసిస్టులతో మాట్లాడుతున్నాం అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
తప్పుల తిరస్కారం..
నార్సిసిస్టులు తమ తప్పులను ఎప్పుడూ ఒప్పుకోరు. వారిని ఏదైనా విషయంలో గట్టిగా అరిచినట్లయితే, వారు వెంటనే ఎందుకంత రియాక్ట్ అవుతున్నావ్ ఇదేమంత పెద్ద విషయమని అంటారు, లేదంటే నేను అలా ప్రవర్తించలేదు, నాకు అలాంటి హ్యాబిట్ లేదు అని అంటారు. తమ తప్పులు బయట పడకుండా ఉండటం కోసం ఎదుటివారిని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. నిజంగా జరిగిన సంఘటనలను కూడా తిరస్కరిస్తారు. టోటల్ గా గందరగోళానికి గురిచేసి ఎదుటి వ్యక్తి తమ మీద తాము అనుమానించుకునే స్థాయికి తెస్తారు.
ఎదుటి వ్యక్తిని కించపరచడం..
నార్సిసిస్టులు వారి తప్పులు లేదా వారి నిజాలు బయటపడినప్పుడు తమ తప్పు దాచుకోవడానికి అవతలి వ్యక్తిపై దాడి చేస్తారు. తెలివి లేని వ్యక్తులు గానూ, డ్రామా ఆడే వారిగానూ ఎదుటి వ్యక్తులను నిందిస్తారు. వారి వ్యక్తిత్వాన్నే కించపరిచి, వారిని తక్కువ చేసి మాట్లాడతారు. సింపుల్ గా ఎదుటివారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా తమను తాము రక్షించుకోవడానికి ట్రై చేస్తారు. కేవలం ఇది మాత్రమే కాదు.. గతంలో జరిగిన తప్పులను ప్రస్తావిస్తూ అన్నింటిని కలిపి ఎదుటి వారిని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు.
తామే బాధితులుగా..
నార్సిసిస్టులు తరచుగా తమను తాము బాధితులుగా చిత్రీకరించుకుని వారు చేసిన తప్పుల నుండి అందరినీ దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తారు. వారిని తప్పుగా అర్థం చేసుకున్నారని లేదా వారి గురించి ఎదుటి వారే చెడుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తారు. దీని వల్ల వారి తప్పుల గురించి మాట్లాడటం మాని తాము తప్పు వ్యక్తులం కాదని నిరూపించుకోవడానికే ఎదుటి వ్యక్తులు ట్రై చేస్తారు. దీని వల్ల నార్సిసిస్టులు ఎదుటివారిని తప్పు చేసిన వ్యక్తులుగా నిలబెట్టి తాము తప్పించుకుంటారు.
తక్కువ చేసి మాట్లాడటం..
ఎదుటి వ్యక్తులు విచారం లేదా కోపాన్ని నార్సిసిస్టుల ముందు వ్యక్తం చేస్తే వారు దాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడతారు. చాలా ఓవర్ చేస్తున్నావ్ అనడం లేదా చాలా సెన్సిటివ్ అని చెప్పడం, ఇంత చిన్న విషయానికి గొడవ చేయడం ఏంటి అని అనడం చేస్తారు. చివరికి తాము నిజంగా దైర్యం లేని వారిమేమో అని ఆలోచించే స్థాయికి వారు తీసుకొస్తారు. చివరికి తప్పు నాదేనేమో అని ఎదుటివారు అనుకునేలా చేస్తారు.
తప్పులు వారివి.. నిందలు ఎదుటివారికి..
నార్సిసిస్టులు తమ తప్పులకు ఎదుటివారిని బాధ్యులుగా చేస్తారు. తాము సొంతంగా చేసే తప్పులు, పనులకు ఎదుటివారిని నిందిస్తారు. వారు అబద్ధం చెప్పి ఎదుటివారిని అబద్ధాలకోరు అని అంటారు. వారు మోసం చేస్తూ ఎదుటి వారిని అనుమానిస్తారు.
ఎదుటి వారి బాధలు.. నార్సిసిస్టులకు జోకులు..
కొన్నిసార్లు ఎదుటివారికి బాధ కలిగించే విషయాలను జోక్ లాగా మాట్లాడుతుంటారు. వారు మాట్లాడిన మాటలను ఎవరైనా ఖండిస్తే.. నేను జోక్ చేశాను దానికి కూడా ఇంత సీరియస్ అవ్వాలా అని తప్పించుకుంటారు.
పైన చెప్పుకున్న లక్షణాలన్నీ నార్సిసిస్టులలో ఉంటాయి. నార్సిసిస్ట్తో వాదించడానికి ప్రయ త్నించడం తరచుగా వ్యర్థం. ఎందుకంటే వారు ఏమి చేసినా తమను తాము సరైనవారని నిరూపించుకుంటారు. కాబట్టి అలాంటి వారితో బోర్డర్ లైన్ పెట్టుకోవాలి. వారితో ఎక్కువ డిస్కస్ చేయకూడదు. వారిలో ఏ విషయాలలో విబేదించకూడదు. ఏదైనా ఇబ్బంది లేదా సమస్య అనిపిస్తే మెల్లిగా తప్పించుకుని వారికి దూరం వెళ్లాలి. అంతేకానీ వారితో గెలవాలని అనుకుంటే మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది. జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు. అలాగని వీటికి పెద్ద కారణాలు ఉన్నాయా అంటే అది కూడా లేదు. పెద్ద కారణాలు, గొడవలు జరిగినప్పుడే విడిపోవడానికి దారి తీస్తుందని అనుకుంటే పొరపాటే.. పైకి కనిపించకుండానే భార్యాభర్తల బంధం పెళుసుబారుతుంది. ఎంతో సంతోషంగా ఉన్న జంట కూడా కొన్ని తప్పులు చేయడం వల్ల తమ బంధాన్ని నాశనం చేసుకుంటారు. ఇంతకీ భార్యాభర్తల బంధాన్ని నాశనం చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే..
అనుమానం..
ఏ సంబంధానికైనా అనుమానం అతిపెద్ద శత్రువు. లైఫ్ పార్ట్నర్ ఫోన్‌ను చెక్ చేయడం, పదే పదే అనుమానించినట్టు చూడటం చేస్తుంటే, వారిపై నిఘా పెడుతుంటే లేదా అనవసరమైన ప్రశ్నలు అడుగుతుంటే జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం లేకుండా ప్రేమ అనే భవనం నిలబడదు. అనుమానం పెనుభూతం అనే మాట వినే ఉంటారు. అనుమానం అనేది ఒక సంబంధాన్ని లోపల నుండి క్షీణింపజేసే చెదపురుగుల లాంటిది.
ఎగతాళి..
ఎగతాళి చేయడం చాలామందికి అదొక కామెడీ ఆటగా ఉంటుంది. కోపంతో లేదా హాస్యంగా ఎగతాళి చేయడం సర్వసాధారణంగా అనిపించవచ్చు, కానీ అది అవతలి వ్యక్తి హృదయంలో లోతైన గాయాన్ని కలిగిస్తుంది. "నీకు ఏమీ తెలియదు" లేదా "నువ్వు ఎప్పుడూ అలాగే చేస్తావు" వంటి మాటలు భాగస్వామి మనస్సులో నెమ్మదిగా ద్వేషాన్ని పెంచుతాయి. అంతేకాదు.. బాడీషేమింగ్ గురించి, రూపం గురించి చేసే ఎగతాళి మరింత మానసిక గాయం చేస్తుంది. ఇవి చాలా తప్పు.
పోలిక..
భార్యాభర్తలు ఎప్పుడూ తమ భాగస్వాములను ఇతరులతో పోల్చి దెప్పిపొడచకూడదు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎవరికి వారు ప్రత్యేకం. ఇతరులతో ఏ విషయంలో పోలిక పెట్టి మాట్లాడటం చాలా తప్పు. ఇతరులతో పోల్చి మాట్లాడేటప్పుడు తమతో బంధం ఎందుకు అని భావించేవారు ఉంటారు. ఇది వ్యక్తి ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తుంది.
పంతం..
నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే పైనల్.. లాంటి మాటలు మాట్లాడుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. తాను కరెక్ట్ అని తన భాగస్వామి తప్పని నిరూపించడానికి ట్రై చేస్తుంటారు. వారి అహం వారిని అలా చేయిస్తుంది. కానీ ఇది బందం నాశనం కావడానికి కారణం అవుతుంది.
మౌనం..
భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు మౌనంగా ఉండటం మంచిదే. కానీ భార్యాభర్తల మధ్య గౌడవ కేవలం మౌనంతో పరిష్కారం కాదు. కొందరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి మౌనాన్ని ఆయుధంగా వాడతారు. అలా చేయడం వల్ల అపార్టాలు మరింత పెరుగుతాయి.
పాత విషయాలు..
భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు చాలామంది చేసే పని పాత విషయాలు బయటకు తీసి వాటి గురించి మాట్లాడతారు. ఇలా జరిగిపోయిన విషయాలను బయటకు తీసి మాట్లాడుతుంటే గొడవ వల్ల బందంలో ఏర్పడిన గాయం ఎప్పటికీ మానదు. ఎప్పటి గొడవలు అప్పుడే వదిలేయాలి.
మొబైల్..
నేటి కాలంలో బంధాలలో దూరం పెరగడానికి మొబైల్ ఫోన్ లే కారణం. భార్యాభర్తలు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నా, ఇద్దరూ కలిసి పక్కన పక్కన కూర్చొన్నా ఫోన్ లో నిమగ్నమవుతుంటారు. దీని వల్ల ఒకరిని ఒకరు పట్టించుకోలేని పరిస్థితికి వస్తారు. ఒకరి ప్రదాన్యత ఇలా తగ్గిపోతుంది. ఇది విడిపోవడానికి కారణం అవుతుంది.
స్పేస్..
భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువైనా కష్టమే. ప్రేమ పేరుతో అతుక్కుపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. 24గంటలు అతుక్కుని ఉండటం, భాగస్వామి మీద ఆంక్షలు విధించడం, స్నేహితులను, బంధువులను కలవనివ్వకపోవడం వంటివి చేస్తే అలాంటి బంధాన్ని ఎప్పుడెప్పుడు వదులుకుందామా అనుకుంటారు. ఇలాంటి బందం ఒక పక్షిని గట్టిగా చేతిలో బంధించినట్టే ఉంటుంది.
సంతోషకరమైన సంబంధాన్ని బిల్డ్ చేసుకోవడం రాకెట్ సైన్స్ కాదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి, నమ్మకంగా ఉండాలి, క్షమించడం నేర్చుకోవాలి.. పైన పేర్కొన్న ఈ ఎనిమిది విషయాలను దృష్టిలో ఉంచుకుంటే బంధాన్ని నిలబెట్టుకోవచ్చు.
*రూపశ్రీ.
బీఆర్ఎస్ వర్సెస్ కవిత వార్ కొత్త సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కబోతున్నది. ఇప్పటి వరకూ ఘాటుగా విమర్శలు చేస్తున్నా కవిత తన విమర్శలను ఒకింత సున్నితంగా చిన్నపాటి సూదిమొన గుచ్చినట్లుగా చేస్తు వచ్చారు. అయితే ఇక ముందు అంటే కొత్త సంవత్సరంలో తాను ఇంకెంత మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతానని.. ఈ ఏడాది చివరి రోజున కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన ఈ సారి కేటీఆర్ లక్ష్యంగా కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు.
బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు. కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరితే.. తాను మాత్రం 2006 లో సొంతంగా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశాననీ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ అన్న విషయానికి తెలంగాణ సాధన ఉద్యమంలో అగ్రస్థానం కలిగేలా చేశాననీ చెప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్ గానే పాల్గొన్నా నన్నారు.
తెలంగాణ ఆవిర్భవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తీరులో మార్పు వచ్చిందని కవిత అన్నారు. అప్పుడే తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం తనకు కలిగిందన్న కవిత.. తన ఫోన్ ను తన భర్త పోన్ ను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అప్పుడే పార్టీ దృష్టికి తీసుకువచ్చినా తేలికగా తీసుకున్నారని కవిత చెప్పారు. అదే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయిస్తే తేలికగా తీసుకుంటారా అని ప్రశ్నించిన ఆమె, మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే తన ఫోన్, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న విషయం అర్ధమైందన్నారు.
మహిళలకు అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగా వ్యవహరించలేదని తండ్రి నిర్ణయాలను సైతం తప్పుపట్టిన కవిత.. కేసీఆర్ హయాంలో 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే.. వారిలో కనీసం ఒక్క మహిళ కూడా లేని విషయాన్ని ఎత్తి చూపారు. ఆ నాడే తాను తన తండ్రిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు.
ఇక హరీష్ రావుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హరీష్ రావును తెలంగాణ చంద్రబాబుగా అభివర్ణించారు. ఏడాది ముగుస్తున్న సమయంలో ఆమె పాడ్ కాస్ట్ లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వచ్చే సంవత్సరం కవిత బీఆర్ఎస్ పై ఇప్పటి వరకూ చేస్తున్న యుద్ధం కొత్త పుంతలు తొక్కబోతోందన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇప్పటి వరకూ తన సోదరుడిని హరీష్ ముంచేస్తారు, తన తండ్రిని తప్పుదోవపట్టిస్తారు అంటూ వచ్చిన కవిత.. ఇప్పుడు మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా మొత్తం అందరిపైనా యుద్ధం ప్రకటించేసినట్లైంది.
జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు కొద్ది కాలంగా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. అటువంటి నాగబాబు.. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వడం ద్వారా ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు.
జనసేన ఎమ్మెల్సీగా.. ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు పని చేసుకుంటూ పోతున్న నాగబాబు.. శివాజీ కామెంట్లకు కౌంటర్ ఇచ్చి, మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారారు. శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
వాస్తవానికి మెగా కాంపౌడ్ అంత పటిష్ఠంగా ఉండటానికి నాగబాబే కారణమని అంటుంటారు, ఆయన నాగబాబు లేకుండా మెగా కాంపౌండ్ ఇంత స్ట్రాంగా నిలబడే ఛాన్స్ లేదనే వారు కూడా చాలా మంది ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి అయినా, మెగాపవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అయినా.. తాము మాట్లాడితే ఇబ్బంది అనుకునే విషయాలను నాగబాబు నోట పలికిస్తారని వారిని దగ్గరా తెలిసన వారు చెబుతుంటారు.
ఇందుకు ఉదాహరణగా అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సందర్భంలో కానీ, ఇండస్ట్రీలో చిరుకు మద్దతుగా గళం విప్పే అంశంలో కానీ నాగబాబు ఎలాంటి శషబిషలూ లేకుండా ముందుకు వచ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఇక తన స్వంత కుమార్తె నీహారిక విషయంలో ఆమె పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలబడిన ఉదంతాన్నీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నాగబాబును జనసేన నుంచి సస్పెండ్ చేయాలంటూ చేస్తున్న డిమాండ్ ను జనసైనికులు కొట్టి పారేస్తున్నారు. మహాళల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నాగబాబు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆయనకు అండగా నిలబడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ అనవసర అంశాన్ని ఇంకా పొడిగించకుండా కామైపోవడం మంచిదని హితవు చెబుతున్నారు.
రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం పెద్ద దిక్కు. దశా దిశా దిస్కూచి కూడా రాహుల్ గాంధీయే. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కూడా ఆయనే. అందులో సందేహం లేదు. అయితే.. రాహుల్ తరువాత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చూసిన ఆయన సోదరి ప్రియాంక వధేరా గాంధీ కుమారుడు రేహాన్ వాద్రానే వారసుడు. అందుకు కారణం రాహుల్ గాంధీ అవివాహితుడిగా ఉండటమే. ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
అదే రాహుల్ గాంధీకి వివాహమై ఉంటే.. ఆయన తనయులే తర్వాతి తరం వారసులు అయి ఉండేవారు. కొద్ది కాలం కిందటి వరకూ రాహుల్ గాంధీ వివాహం అన్నదే వారి కుటుంబంలోనే కాక, రాజకీయవర్గాలలో కూడా హాట్ టాపిక్ గా ఉండేది. అయితే.. రాహుల్ వివాహం పట్ల సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ చర్చ క్రమంగా ఆగిపోయింది. ఇప్పుడు రాహుల్ మేనల్లుడు రేహాన్ తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని పెళ్లి పీటలెక్కుతున్నారు. అయితే రాహుల్ గాంధీకి కూడా ఓ ప్రియురాలు ఉండేదని గట్టిగా వినిపించేది. అయితే ఆయన రేహాన్ లా ధైర్యం చేయలేదు. అందుకు ప్రధాన కారణం సెక్యూరిటీ థ్రేట్ అంటారు. అప్పట్లో సోనియా గాంధీ ప్రధాని కావల్సిన వారు.. ఆమె ప్రధాని కాలేక పోవడానికి, తర్వాత రాహుల్ పెళ్లాడక పోవడానికి కూడా అదే కారణంగా చెబుతారు.
అప్పట్లో ఎల్. టీ. టీ. ఈ అనే మిలిటెంట్ గ్రూప్ రాజీవ్ గాంధీని హతమార్చిన సంగతి తెలిసిందే. సోనియా ప్రధాని కాకుండా హెచ్చరికలు జారీ చేసి అడ్డుకున్నది కూడా ఎట్టీటీయే అని అప్పట్లో గట్టిగా వినిపించింది.ఈ నేపథ్యంలో రాహుల్ తన తదనంతర వారసులకు ఈ ప్రాణహాని సైతం అనువంశికంగా కల్పించడం ఎందుకు? అన్న కోణంలో ఆలోచించి.. తన పెళ్లి ఊసెత్తలేదని అంటారు. అందుకే రేహాన్ పెళ్లి ద్వారా ఆ ఇంట ఇన్నేళ్లకు ఒక శుభకార్యం జరుగుతుండటంతో హ్యాపీ ఫీలవుతున్నారు కాంగ్రెస్ కార్యర్తలు.
భారతీయుల వంటింట్లో బోలెడు దినుసులు ఉంటాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు మెరుగ్గా ఉంటాయి. అటు మౌత్ ఫ్రెషనర్ గా, ఇటు వంటల్లో రుచిని పెంచడానికి ఉపయోగించే దినుసుల్లో సోంపు అగ్ర స్థానంలో ఉంటుంది. సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? సోంపు నీరు ఎలా తయారు చేసుకుని తాగాలి? ఇవన్నీ తెలుసుకుంటే సోంపుతో కలిగే బెనిఫిట్స్ ను అందరూ పొందవచ్చు.
సోంపు నీటి ప్రాధాన్యత..
సోంపు నీటిని శక్తివంతమైన, ఆరోగ్యకరమైన పానీయంగా ఉపయోగిస్తున్నారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తరచుగా సోంపును మౌత్ ఫ్రెషనర్‌గా మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ సోంపు దీని కంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక వ్యాధులను నయం చేయడంలో శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది.
సోంపు నీరు ఎలా తయారు చేయాలి?
సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది కడుపు సంబంధిత వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
సోంపు నీరు ప్రయోజనాలు..
ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నీటిని తాగితే, శరీరంలో అనేక సానుకూల మార్పులు కలుగుతాయి. సోంపు నీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది.
సోంపు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు సంబంద వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది యాసిడ్ కారణంగా ఏర్పడే ఎసిడిటీ, యాసిడ్ రిప్లక్స్ వంటి ఉదర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కడుపు చికాకును తగ్గిస్తుంది, కడుపును మంటను తగ్గించి కడుపును శాంతపరుస్తుంది.
ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కుంటున్న అతి ఆకలి సమస్యకు సోంపు చెక్ పెడుతుందట. కడుపు నిండినప్పటికీ పదే పదే ఆహారం తినాలని అనిపించడం, ఆకలి వేయడం వంటి లక్షణాలు ఆరోగ్యానికి హానికరం. సోంపు నీరు తాగడం వల్ల అనవసరంగా అతిగా ఆకలి వేయడం అనే సమస్య తగ్గుతుంది.
ప్రతి రోజూ ఉదయాన్నే సొంపు నీరు తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. ఇది కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులు, సమస్యలను తగ్గిస్తుంది.
సోంపు నీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే సోంపులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
సొంపు నీరు మహిళలకు ఋతుస్రావ సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. పాలిచ్చే స్త్రీలలో పాలు పెరగడానికి కూడా సహాయపడుతుంది.
-రూప
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి. అలాంటి వాటిలో ఉసిరి కాయ ప్రధానమైనది. ఉసిరికాయను ఆయుర్వేదం అమృత ఫలం అని అంటుంది. ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. శీతాకాలంలో ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం జలుబు, దగ్గు, ఫ్లూ వంచివి దరిచేరవు. కేవలం సీజనల్ ఇన్పెక్షన్లు నివారించడమే కాదు.. ఫ్యాట్ బర్నర్ గా కూడా సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిని మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
విటమిన్ స, యాంటీఆక్సిడెంట్లు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయి. ధమనులలో ఫలకం పేరుకుపోకుండా ఉండటానికి , ధమనులలో ఫలకం సమస్య తగ్గించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను కూడా తగ్గిస్తుంది. మొత్తం రోగనిరోధక శక్తి, హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరిని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. కానీ శీతాకాలంలో ఉసిరికాయలు సమృద్దిగా దొరుకుతాయి. ఉసిరికాయలను కొన్ని కాంబినేషన్లలో తీసుకుంటే ఇమ్యూనిటీ మరింత పెరుగుతుంది. ఇంతకూ ఉసిరికాయతో బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసుకుంటే..
ఉసిరి-తేనె..
తేనె కాంబినేషన్ లో ఉసిరి తీసుకుంటే ఉసిరిలో ఉండే విపరీతమైన పులుపు, వగరు రుచి తగ్గుతుంది. పైగా బోలెడు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉసిరి ఇమ్యూనిటీని పెంచుతుంది., మరోవైపు తేనె గొంతు సమస్యలు తగ్గిస్తుంది. గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. తేనె-ఉసిరి కాంబినేషన్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది, మంటను తగ్గిస్తుంది, శ్వాసకోశ ఆరోగ్యానికి సపోర్ట్ ఇస్తుంది.
ఎలా తినాలి..
టీస్పూన్ ఉసిరి పొడి లేదా తాజా ఉసిరి రసం 1 టీస్పూన్ తీసుకోవాలి. దీన్ని సమాన పరిమాణంలో తేనెతో ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
ఉసిరి-పసుపు..
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇవి రెండు కలిసినప్పుడు రోగనిరోధక శక్తి సూపర్ గా పెరుగుతుంది, మంటను తగ్గిస్తుంది, శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, తెల్ల రక్త కణాల పనితీరును పెంచడానికి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని సహాయపడతుంది
ఎలా తీసుకోవాలి..
స్పూన్ ఉసిరి రసాన్ని గ్లాసు నీటిలో వేసి అందులో కాసింత మంచి పసుపును కలిపి తాగాలి. లేదంటే ఒక ఉసిరికాయ, ఒక ఒక ఇంచ్ తాజా పచ్చి పసుపును మిక్సీ వేసి జ్యూస్ చేసుకుని తాగాలి. ఇందులో కాసింత కరివేపాకు కూడా వేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు. అలాగే క్యారెట్ లాంటివి వేసుకోవచ్చు.
ఉసిరి-అల్లం..
అల్లంను ఉసిరితో కలపి తీసుకున్నా ఇమ్యూనిటీ మెరుగవుతుంది. అల్లం శరీరంలో వేడిని పెంచుతుంది. ఉసిరి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరరానికి వేడిని అందించడం ద్వారా అల్లం రక్త ప్రసరణను పెంచుతుంది, ఇన్ప్లమేషన్లతో పోరాడుతుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ల కంటెంట్ శరీర సహజ రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఎలా తీసుకోవాలి..
2 టేబుల్ స్పూన్ల తాజా ఉసిరి రసాన్ని 1/2 టీస్పూన్ తురిమిన అల్లం రసం తీసుకోవాలి. వీటిని 1/2 కప్పు నీటితో కలిపి తీసుకోవచ్చు. కొన్ని చుక్కల తేనె జోడిస్తే మరీ మంచిది. దీన్ని ఉదయాన్నే తీసుకోవాలి.
ఉసిరి-బెల్లం..
ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా మెరుగైన ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. ఉసిరి-బెల్లం కలిపి మురబ్బా తయారు చేసుకోవచ్చు.ఈ కాంబో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఐరన్ శోషణను పెంచుతుంది. శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది.
ఎలా తీసుకోవాలి..
ఉసిరిని ఆవిరి పట్టి వాటిని విత్తనాలు తీసివేసి , ఆపై వాటిని బెల్లం సిరప్ లో ఉడికించి, ఉప్పు, మిరియాలు, జీలకర్ర పొడితో కలిపి తీసుకోవాలి. చాలా మంచి ఇమ్యునిటీ ఇస్తుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆరోగ్యం కోసం, శరీరానికి కావలసిన ప్రోటీన్, పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు. వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి. ధర కాస్త ఎక్కువ అనే కారణంగా సాధారణ ప్రజలు వాల్నట్స్ కు దూరంగా ఉంటారు. అయితే వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా బెస్ట్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు సులువుగా నయం అవుతాయని అంటున్నారు. ఇంతకూ వాల్నట్స్ ను తినడం వల్ల తగ్గే వ్యాధులు ఏంటి? వాల్నట్స్ లో ఉండే పోషకాలు ఏంటి? తెలుసుకుంటే..
వాల్నట్స్ లో పోషకాలు..
వాల్నట్స్ లో అత్యంత ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. వాల్నట్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. వాల్నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని చాలామంది చెబుతారు. అయితే ఇది మాత్రమే కాకుండా చాలా రకాల వ్యాధులు కూడా నయం అవుతాయి.
గుండె ఆరోగ్యం..
వాల్నట్స్ ను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందట. అంతేకాదు ఇది చెడు కోలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుందట.
రక్తపోటు..
రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు రోజు వాల్నట్స్ ను తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది.
బరువు..
బరువు తగ్గడానికి ట్రై చేసేవారు వాల్నట్స్ తింటే చాలా మేలు. వాల్నట్స్ లో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగకుండా నిరోధిస్తాయి. తర్వాత బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి.
మానసిక ఆరోగ్యం..
మానసిక ఆరోగ్యం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటితో పాటు వాల్నట్స్ ను కూడా తింటూ ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఇది మెదడు పనితీరుకు అవసరమైన ఒమెగా-3 ఆమ్లాలను కలిగి ఉండటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
జీర్ణవ్యవస్థ..
జీర్ణవ్యవస్థ సరిగా లేకున్నా, జీర్ణాశయం పనితీరు మందగించినా చాలా సమస్యగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను సరిచేసి తిరిగి ఆరోగ్యంగా చేయడంలో వాల్నట్స్ కీలకపాత్ర పోషస్తాయి. వాల్నట్స్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది.
వాపులు, నొప్పులు..
వాల్నట్స్ లో ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ల7ణాలు వాపులను, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
