LATEST NEWS
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రభావం వైసీపీపై ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయాలలోకి ప్రవేశించడానికి ముందు నుంచి కూడా విజయసాయి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో కూడా విజయసాయి సహ నిందితుడు. జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నాయి.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన విజయసాయి, ఇప్పుడు పరివర్తన రాజనీతి పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.
దేశభక్తి, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా తన పార్టీ పనిచేస్తుందని విజయసాయి పార్టీ ప్రకటన సందర్భంగా చెప్పారు. పార్టీ అధికారిక ప్రకటనతో పాటు జెండాను కూడా ఆవిష్కరించిన విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సంస్కృతిని తీసుకువస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
ఈ పరిణామం వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకంగా, పార్టీ నేతకు అధినేతకు అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకోవడం ఆ పార్టీకి ఏదో మేరకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తమౌతోంది.
ఇది కూడా చదవండి: జయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!
పార్టీలో అసంతృప్తితో ఉన్న, అలాగే ఆయనతో సత్సంబంధాలు కలిగిన కొందరు నేతలు భవిష్యత్తులో వైసీపీని వీడి విజయసాయి పంచన చేరే అవకాశలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. అదలా ఉంచితే.. కొత్త పార్టీ ద్వారా ఆయన ఏ మేరకు ప్రభావం చూపగలరు, ప్రజాదరణను ఏ విధంగా సంపాదించుకుంటారు అనే విషయంలో కూడా రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
రానున్న కాలంలో విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) ప్రయాణం అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను ఏ మేరకు ఎలా ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చెప్పిన ముహూర్తానికి చెప్పినట్లుగా తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విజయసాయి, ముందు ముందు రాష్ట్ర రాజకీయాలలో ఏ మేరకు ప్రభావం చూపుతారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్త మౌతోంది.
మీకు నచ్చవచ్చు: వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి
విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.?
[Effect of Vijayasai Reddy New Party onYCP, Parivarthana Rajaneethi Party, PRP, Political Impact, AP Politics, Telugu One]
ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉన్నట్లు సృష్టించారు.. జీతం రాకపోయినా వేలల్లో జీతం అందుతున్నట్లు నకిలీ పే స్లిప్పులు తయారు చేశారు. ఆధార్, పాన్ కార్డులను సైతం ఫోర్జరీ చేసి బ్యాంకు అధికారులను నమ్మించారు. ఇలా పక్కా స్కెచ్‌తో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ నుంచి ఏకంగా రూ.30 లక్షల రుణం పొందిన ముఠా బాగోతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సాధారణంగా బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణం పొందాలంటే ఉద్యోగం, నెలవారీ ఆదాయం, గుర్తింపు పత్రాలు కీలకం. అయితే ఈ నిబంధనలనే తమ మోసానికి అవకాశంగా మలుచుకున్నారు నిందితులు. సుమిక్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీలుగా వ్యవహరిస్తున్న రామావత్ గోపాల్, పులి సురేష్ బాబు ఈ మోసానికి ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో గంటల శంకర్ అనే వ్యక్తిని బెంగళూరులోని ప్రముఖ కాప్కో టెక్నాలజీస్ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించేలా నకిలీ నియామక పత్రాలు, పే స్లిప్పులు సృష్టించారు. అంతేకాకుండా ఫోర్జరీ చేసిన ఆధార్, పాన్ కార్డులను కూడా సిద్ధం చేశారు. ఈ నకిలీ పత్రాలను అసలైనవిగా నమ్మించిన నిందితులు ఐసీఐసీఐ బ్యాంకులో శంకర్ పేరుతో ఏకంగా రూ.30 లక్షల వ్యక్తిగత రుణం పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ వ్యవహారంలో రుణం మంజూరయ్యేందుకు సహకరించినందుకు రామావత్ సురేష్‌కు రూ.6.70 లక్షలు కమీషన్‌గా చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, శంకర్ పేరు మీద జారీ అయిన క్రెడిట్ కార్డును ఉపయోగించి మరో రూ.3 లక్షల వరకు షాపింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
అయితే రుణ చెల్లింపుల్లో తేడాలు రావడం, బ్యాంకు అంతర్గత తనిఖీలు చేపట్టడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రామావత్ గోపాల్, పులి సురేష్ బాబు, రామావత్ సురేష్, గంటల శంకర్, గంటల శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ముఠా ఇదే తరహాలో మరిన్ని బ్యాంకులను మోసం చేసిందా? నకిలీ పత్రాల తయారీలో ఇంకా ఎవరైనా సహకరించారా? ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉద్యోగం లేకుండానే ఉద్యోగం ఉన్నట్లు.. జీతం లేకుండానే భారీ ఆదాయం వస్తున్నట్లు నమ్మించి బ్యాంకుకే బురిడీ కొట్టించిన ఈ ముఠా వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: రాహుల్‌కు ముందే పుట్టిన మగబిడ్డ.. తొలి కాన్పుపై సోనియా భావోద్వేగ జ్ఞాపకాలు.!
[ ICICI Bank Fraud, Ibrahimpatnam Crime, Fake Salary Slips, Fake Aadhaar Card, Personal Loan Fraud, Telangana Police ]
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి కొత్తపార్టీని అధికారికంగా ప్రకటించారు. తాను ఏర్పాటు చేసిన పార్టీ పెరును ఆయన ప్రకటించారు. విజయవాడ ఏ కన్నెన్షన్ వేదికగా బుధవారం (నవంబర్ 11) సరిగ్గా 11 గంటల 11నిముషాలకు ఆయన తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. తన కొత్త పార్టీ పేరు పీఆర్పీ (పరివర్తన రాజనీతి పార్టీ)గా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దీంతో ఏపీ రాజకీయాలలో మరో కొత్తపార్టీ ఆవిర్భవించింది.
గతంలో వైపీపీలో కీలక నేతగా చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి, ఆ తరువాత ఆ పార్టీకీ, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా సందర్భంగా ఇక రాజకీయాలకు దూరం, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన విజయసాయి రెడ్డి, ఆ నిర్ణయం మార్చుకుని, యూటర్న తీసుకుని మళ్లీ రాజకీయ ప్రవేశం చేశారు.
తన కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన ఆయన ఈ సందర్భంగా పార్టీ జెండా, ఎజెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో కుల, మత రాజకీయాలకు స్వస్తి పలకడంతో పాటు, రెండు కుటుంబాల ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలకడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
దేశభక్తి, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పీఆర్పీ పనిచేస్తుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ముఖ్యంగా యువతను భావి నాయకులుగా తీర్చిదిద్దే ఫ్యాక్టరీగా తమ పార్టీ పని చేస్తుందన్న విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో కరువు కాటకాలు, కరెంటు కోతలు లేని పరిస్థితులను సృష్టించడం, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం తమ ధ్యేయమన్నారు.
ఇది కూడా చదవండి: వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి
ఇక ఎన్నికల హామీల విషయంలోనూ ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించడం, చదువుల భారాన్ని తగ్గించి వంద శాతం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు,
విజయసాయిరెడ్డి నూతన పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాలలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు అసంతృప్త నేతలు ఆయన బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయాలపై చూపే ప్రభావంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరలేచింది.
మీకు నచ్చవచ్చు: విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!
తెలుగుదేశం, వైసీపీ దొందూదొందే.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. విజయసాయిరెడ్డి.!
[Vijayasai Reddy New Party PRP, Parivarthana Rajaneethi Party, Andhra Pradesh Politics, Vijayawada Convention Center, Gen Z Leaders, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు).. టాలీవుడ్లో ఈ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘జులాయి’ నుంచి మొదలైన వీరి ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలకు మరో ఆసక్తికరమైన అంశం కూడా తోడైంది. త్రివిక్రమ్ తదుపరి సినిమా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్లో ఉండొచ్చని, అందులో చిరంజీవి నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
వెంకటేష్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా నిర్మాణంలో అనుకున్న దానికంటే బడ్జెట్ పెరగడంతో పాటు, విడుదల కూడా పలుమార్లు వాయిదా పడింది. సినిమా ఫలితం, పెరిగిన ఖర్చులు, రెమ్యునరేషన్, లాభాల్లో వాటా వంటి అంశాలపై త్రివిక్రమ్, చినబాబు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనే ప్రచారం నడుస్తోంది.
అయితే వీరిద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయా? ఉంటే అవి ఎంతవరకు వెళ్లాయి? అనే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇద్దరూ ఈ ప్రచారంపై మౌనంగానే ఉన్నారు.
ఇదిలా ఉంటే, త్రివిక్రమ్‌కు తన నెక్స్ట్ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య నిర్మాణంలో చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించేలా చర్చలు జరుగుతున్నాయట. ఇదే నిజమైతే చిరంజీవి, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కే తొలి సినిమా అవుతుంది.
ఇది కూడా చదవండి: హారిక హాసినితో త్రివిక్రమ్ బంధం తెగిపోనుందా?.. గాడ్ ఆఫ్ వార్ పరిస్థితి ఏంటి.?
అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా గురించే. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు ప్రకటించారు.
ఇటీవల ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్స్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు హారిక అండ్ హాసినితో త్రివిక్రమ్‌కు సంబంధాలు దెబ్బతిన్నాయనే వార్తలు, డీవీవీ దానయ్యతో కొత్త సినిమా చర్చలు తెరపైకి రావడంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై సందేహాలు మొదలయ్యాయి.
మరి ఈ ప్రచారంలో నిజమెంత? ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
మీకు నచ్చవచ్చు:
చేతులు మారిన జటాయు ప్రాజెక్ట్.. రోషన్ హీరోగా పాన్ ఇండియా మూవీ లాంచ్.!
23 ఏళ్ళ క్రితం జరిగింది ఇదే.. పవన్ కళ్యాణ్ వదులుకున్న తమిళ అమ్మాయి.!
[Trivikram to Direct Chiranjeevi, Trivikram DVV Entertainments, Trivikram Chiranjeevi Movie, Trivikram Next Movie, Trivikram Chinababu, Haarika And Hassine Creations, NTR God of War, DVV Entertainments, Chiranjeevi, Trivikram Srinivas]
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ వివాహం ప్రస్తుతం సినీ, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి పెళ్లి వేడుకలు గ్రీస్‌లో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనిరుధ్, కావ్య పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
వైరల్ అవుతున్న ఒక వీడియోలో అనిరుధ్ బ్లాక్ కలర్ టక్సీడోలో కనిపించగా, కావ్య మారన్ ఎరుపు రంగు పెళ్లి దుస్తుల్లో కనిపించారు. ఇద్దరూ చేతులు పట్టుకుని నడుస్తూ, తమ చేతులకు ఉన్న ఉంగరాలను చూపిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. సముద్ర తీరంలో అందమైన వాతావరణం మధ్య ఈ దృశ్యాలు ఉండటంతో చాలామంది ఇది వారి పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోనే అని భావించారు.
మరో వీడియోలో అనిరుధ్, కావ్యకు డైమండ్ రింగ్ తొడుగుతున్నట్లుగా కనిపిస్తున్నారు. గ్రీక్ అందాల మధ్య సాగిన ఈ ప్రపోజల్ వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోలను నిజమైన పెళ్లి లేదా ప్రపోజల్ దృశ్యాలుగా భావించడం సరికాదని ఫ్యాన్ పేజీలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా ప్రపోజల్ వీడియో ఏఐ సాయంతో రూపొందించినదేనని సంబంధిత పోస్టులోనే క్లారిటీ ఇచ్చారు.
అనిరుధ్, కావ్యల వివాహం నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. అనిరుధ్‌కు మేనమామ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు వెళ్లినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: సమంత డెలివరీ అయిపోయిందని నమ్మిన బామ్మ.. నటి సమాధానం వింటే నవ్వాల్సిందే!
ఇక ఈ జంట వివాహ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే రిసెప్షన్ ఇన్విటేషన్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అనిరుధ్ ‘3’ సినిమాలోని ‘వై దిస్ కొలవెరి డి’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగారు. మరోవైపు కావ్య మారన్ సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్వహణలో కీలక బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి వివాహానికి సంబంధించిన వార్తలతో పాటు సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలు కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
మీకు నచ్చవచ్చు:
పెళ్లయ్యాక అలాంటి పాత్రలు చేయకూడదా? కియారా విషయంలో సిద్ధార్థ్ ఏమన్నారంటే.!
రాముడికి పట్టాభిషేకం చేసిన సౌత్ ప్రేక్షకులు: కలెక్షన్స్ ఇవే.!
[Anirudh Ravichander, Kavya Maran, Anirudh Kavya Wedding, Anirudh Wedding Video, Kavya Maran Wedding, Anirudh AI Video, Anirudh Kavya Viral Video]
కరెక్ట్ గా తెరకెక్కిస్తే రాముడుకి వరల్డ్ బాక్స్ ఆఫీస్ ఏ విధంగా పట్టాభిషేకం చేస్తుందో రామాయణ నిరూపిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్టిల్ 823.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతున్న రామాయణ తాజాగా సౌత్ ఇండియా మార్కెట్లో ఓ అరుదైన మరియు చారిత్రాత్మక రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.
బాలీవుడ్ నుంచి వచ్చి సౌత్ భాషల్లో వంద కోట్ల క్లబ్లో చేరిన తొలి చిత్రంగా 'రామాయణ' సరికొత్త మైలురాయిని అధిగమించింది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే సౌత్ ఇండియన్ డబ్బింగ్ వెర్షన్ల ద్వారా ఏకంగా. 104.45 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. ఈ మొత్తం వసూళ్లలో దేశవ్యాప్తంగా నమోదైన నెట్ కలెక్షన్లలో కేవలం సౌత్ డబ్బింగ్ వెర్షన్ల వాటాయే దాదాపు 23.7% ఉండటం విశేషం.
దీనిని బట్టి హిందీ చిత్రాలకి సౌత్ మార్కెట్లో లభిస్తున్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా కన్నడ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా 41.20 కోట్లు రాబట్టి సౌత్ భాషల్లో అగ్రస్థానంలో నిలిచింది.
కన్నడ తర్వాత తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. కేవలం తెలుగు వెర్షన్ ద్వారానే 33 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి. ఇక తమిళంలో 17.35 కోట్లు, మలయాళ వెర్షన్లో 12.90 కోట్ల మేర కలెక్షన్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి : మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: అన్నయ్య బరిలోకి దిగబోతున్నాడు..
దీపావళి పండుగ సీజన్ కావడంతో పాటు, ఇతర ప్రాంతీయ సినిమాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ సౌత్ భాషల్లో 'రామాయణ' సాధించిన ఈ వసూళ్లు అసాధారణమైనవిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా నైట్ షోలలో థియేటర్ల ఆక్యుపెన్సీ గణనీయంగా పెరగడం ఈ చిత్ర విజయానికి మరింత ఊతమిచ్చింది.
గతంలో వచ్చిన హింది చిత్రాల లైఫ్‌టైమ్ సౌత్ డబ్బింగ్ కలెక్షన్ల రికార్డులను ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే తిరగరాసింది. 'ధురంధర్ 2' ( 68.54 కోట్లు), 'వార్ 2' ( 58.96 కోట్లు), 'జవాన్' (57.94 కోట్లు) వంటి చిత్రాల రికార్డులని అధిగమించి రామాయణ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
మీకు నచ్చవచ్చు:రాముడు ఆస్కార్ ని అందుకుంటాడా!
మీకు నచ్చవచ్చు: ఇయర్ ఎండ్ లో థియేటర్లని షేక్ చేయనున్న చిత్రాలు ఇవే!
[Ramayana South Collections, Ramayana Telugu Collections, Ramayana box office, Ramayana south collection, Ranbir Kapoor Ramayana,Telugucinema news, TeluguCinema, Tollywood, Tollywood News]
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి నుంచి సినిమా వస్తుందంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తుంటారు. అలాంటిది ఈసారి ఆయన ఏకంగా సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యంగ్ హీరో రోషన్ మేకతో ఆయన తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియా సినిమా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది.
అశోక క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రేఖా పాండే తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, వినయ్ రాయ్ కీలక పాత్రలో నటించనున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా ప్రకటనతో ఇప్పుడు అందరిలోనూ ఒకటే ప్రశ్న.. ఇదేనా ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జటాయు’?
నిజానికి ‘జటాయు’ కథపై ఇంద్రగంటి మోహనకృష్ణ కొన్నేళ్లుగా వర్క్ చేస్తున్నారు. రామాయణంలోని జటాయువు పాత్ర చుట్టూ సాగే పౌరాణిక అంశాలతో, భారీ గ్రాఫిక్స్, యాక్షన్‌తో ఈ కథను తెరకెక్కించాలని ఆయన భావించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. మొదట ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో రూపొందించాలని అనుకున్నారు. అప్పట్లో హీరోగా విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది.
ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌లో మరికొందరు స్టార్ హీరోల పేర్లు కూడా వినిపించాయి. కానీ, ఆ కాంబినేషన్లు కార్యరూపం దాల్చలేదు. చివరకు రోషన్ దగ్గరకు ఈ కథ వచ్చిందని ఇటీవల ప్రచారం జరిగింది. ఇప్పుడు రోషన్, ఇంద్రగంటి కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా సినిమా అధికారికంగా ప్రారంభం కావడంతో ‘జటాయు’ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.
ఇది కూడా చదవండి: హారిక హాసినితో త్రివిక్రమ్ బంధం తెగిపోనుందా?.. గాడ్ ఆఫ్ వార్ పరిస్థితి ఏంటి.?
అయితే ఈ సినిమా టైటిల్ ‘జటాయు’ అని మూవీ టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే గతంలో ప్రచారంలో ఉన్న దిల్ రాజు నిర్మాణం కాకుండా, తాజా ప్రకటనలో అశోక క్రియేషన్స్ పేరు కనిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ‘జటాయు’నా లేక కొత్త కథనా? అన్నది తెలియాల్సి ఉంది.
ఏదేమైనా, ఇంద్రగంటి తనకు అలవాటైన సున్నితమైన కథల నుంచి బయటకు వచ్చి భారీ స్థాయి సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్‌ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. రోషన్‌ను ఈ సినిమాలో ఎలాంటి కొత్త అవతారంలో చూపించబోతున్నారు? ‘జటాయు’గానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మీకు నచ్చవచ్చు:
రామ్ చరణ్ ‘RC17’లో రిషికాంత్?.. పూజకు వెళ్లిన అసలు కారణం చెప్పేశాడు.!
30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్ హాసన్ మేకప్ వెనుక అసలు కథ తెలుసా.?
[Roshan Meka Indraganti Mohana Krishna Movie, Jatayu Movie, Roshan Meka, Indraganti Mohana Krishna, Telugu Superhero Movie, Pan India Movie, Vijay Deverakonda, Telugu Film News, Tollywood News]
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆమె బేబీ బంప్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి ‘మేటర్నిటీ ఫొటోషూట్‌గా భావించండి’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేశారు. అయితే తాజాగా సమంతకు కవల పిల్లలు పుట్టారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన ఓ బామ్మ నిజంగానే సమంతకు డెలివరీ అయిపోయిందని నమ్మేసింది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. సమంతకు ఇద్దరు పిల్లలు పుట్టారని, ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వచ్చేసిందని ఓ బామ్మ తన మనవడితో చెబుతుంది. అయితే ఆమె చెప్పే విషయాలన్నీ నిజం కావు. కొందరు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సమంతకు కవల పిల్లలు పుట్టినట్లు నకిలీ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. వాటిని చూసిన ఆ బామ్మ నిజమేనని భావించి తన మనవడితో వాదించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చివరికి సమంత దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆ వీడియో చూసిన ఆమె సరదాగా స్పందించారు. ‘ఇంకా లేదు అమ్మమ్మ’ అంటూ కామెంట్ చేశారు. అంటే తనకు ఇంకా పిల్లలు పుట్టలేదని, ఆ వీడియోలో ఉన్న సమాచారం నిజం కాదని ఆమె ఒక్క మాటతో స్పష్టం చేశారు. సమంత ఇచ్చిన ఈ సమాధానం ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇటీవల సమంత తన బేబీ బంప్ ఫొటోను షేర్ చేయడంతో పాటు ప్రెగ్నెన్సీ సమయంలో తన దినచర్యకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. వ్యాయామం చేస్తున్న వీడియోలు, తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సరదాగా గడుపుతున్న క్షణాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి విషయంపై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇతర రాష్ట్రాల్లో ఒక్క రోజే.. హైదరాబాద్‌లో మాత్రం నెలల తరబడి! నిర్మాతలకు ఇదేం కష్టం?
అయితే ఈ ఆసక్తిని కొందరు ఆకతాయిలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఏఐ సాయంతో సెలబ్రిటీలకు సంబంధించిన తప్పుడు వీడియోలు తయారు చేసి నిజమైన వార్తల మాదిరిగా ప్రచారం చేస్తున్నారు. సమంతకు కవల పిల్లలు పుట్టారంటూ వచ్చిన వీడియో కూడా అలాంటిదే. ఈ విషయంలో సమంత స్వయంగా స్పందించడంతో అసలు విషయం బయటపడింది. ఇలాంటి వీడియోలను చూసి నిజమని నమ్మి ఇతరులకు షేర్ చేయకూడదనే విషయాన్ని కూడా ఈ ఘటన గుర్తుచేస్తోంది.
ఇక సమంత, రాజ్ నిడిమోరు దంపతులు తమ జీవితంలోకి రాబోతున్న కొత్త అతిథి కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబర్లో సమంతకు డెలివరీ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తన ప్రెగ్నెన్సీ సమయాన్ని ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. మరి సమంత నుంచి అసలైన గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చవచ్చు:
ఇటలీ నుంచి నేరుగా పెళ్లి మండపంలోకి.. ప్రభాస్ ఏం చేయబోతున్నారు.?
రెండో పెళ్లి చేసుకునే అమ్మాయిలే టార్గెట్.. వరస హత్యల వెనుక అసలు కథ ఏమిటంటే.?
[Samantha Ruth Prabhu, Samantha Twins News, Samantha Pregnancy News, Samantha AI Fake Video, Samantha Responds to Twins Rumours, Samantha Not Yet Ammamma, Samantha Baby Bump, Samantha Raj Nidimoru, Samantha Viral Video, Tollywood Latest News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం మన సంప్రదాయంలో ఎప్పట్నుంచో ఉంది. అయితే దీని వెనుక దాగున్న శాస్త్రీయ కారణాలు మరియు ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా పాలల్లో కాల్షియం, ఐరన్, ప్రొటీన్ వంటి శరీరానికి అత్యవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు అర చెంచా పసుపు చేర్చినప్పుడు ఈ పానీయం కాస్తా గోల్డెన్ మిల్క్ లేదా అద్భుతమైన ఆరోగ్య అమృతంగా మారుతుంది. రాత్రి పూట ఈ పసుపు పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒత్తిడి, అలసట పూర్తిగా తొలగిపోయి ప్రశాంతమైన గాఢమైన నిద్ర సొంతమవుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పసుపులో అత్యంత శక్తివంతమైన కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను తొలగించడంలో మరియు ఫ్రీ రాడికల్స్ తో పోరాడడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల శరీరానికి సహజసిద్ధమైన యాంటీ క్యాన్సర్ ప్రభావం అందుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా, పసుపు పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ మిశ్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
శరీరంలో రోగనిరోధక శక్తిని అమాంతం పెంచడంలో పసుపు పాలు గ్రేట్ రిజల్ట్ ఇస్తాయి. పసుపులోని యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు కాలానుగుణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళ దీన్ని సేవించడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇందులో కొద్దిగా తేనె లేదా అల్లం కలుపుకుంటే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. రోజూ ఒక గ్లాసు గోల్డెన్ మిల్క్ తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడటంతో పాటు వైరల్ దాడి నుంచి రక్షణ లభిస్తుంది.
జీర్ణవ్యవస్థను పటిష్టం చేయడంలో పసుపు పాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. పసుపు జీర్ణక్రియను ఉత్తేజపరిచి, అజీర్ణం, గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతూ శరీరం తీసుకునే ఆహారంలోని పోషకాలను మెరుగ్గా గ్రహించేలా తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా పసుపు పాలు తాగే వారిలో జీర్ణ సంబంధిత రుగ్మతలు చాలా వరకు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు ధృవీకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి:టైప్1 మరియు టైప్2 డయాబెటిస్‌కు, అద్భుతమైన ఇంటి చిట్కా!
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను, మెదడు పనితీరును మెరుగుపరచడంలో పసుపు పాలు ఎంతగానో సహాయపడతాయి. కుర్కుమిన్ జ్ఞాపకశక్తిని పెంపొందించడమే కాకుండా వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమ్మినో ఆమ్లం, పసుపు గుణాలు కలిసి మెదడు నరాలను రిలాక్స్ చేసి నిద్రలేమి సమస్యను తరిమికొడతాయి.
చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలోనూ పసుపు పాలు అద్భుతంగా పనిచేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి మొటిమలు, మచ్చలు, చర్మంపై ముడతలు రాకుండా నివారించడంలో ఇవి సహాయపడతాయి. వయసు పెరుగుతున్న ఛాయలను తగ్గించి చర్మానికి సహజమైన కాంతిని ఇస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన, నిండు నూరేళ్ల జీవితం కోసం ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగే అలవాటును మీ దినచర్యలో భాగం చేసుకోండి.
మీకు నచ్చవచ్చు:కంటి నీరు, కారడం వెనుక ఉన్న అసలు రహస్యం: వైద్యుల సలహాలు
ఉదయం, లేవగానే నీరు తాగడం వల్ల కిడ్నీలు మరియు జీర్ణవ్యవస్థకు కలిగే లాభాలు!
Turmeric Milk Benefits, Haldi Doodh At Night, Golden Milk Science, Improve Sleep Naturally, Anti Inflammatory Drinks, Doctor Health Advice, Health Tips In Telugu.
వర్షాకాలం లేదా చలికాలం వచ్చిందంటే చాలు, తేళ్లు, పాములు వంటి విషసృపాలు తడి నేలల నుంచి బయటికి వచ్చి ఇళ్లలోకి, చీకటి మూలల్లోకి చేరుతుంటాయి. అయితే, చిన్నపాటి అజాగ్రత్త వల్ల ఒక్కోసారి మనం తేలు కాటుకు గురికావాల్సి వస్తుంది. తేలు కుట్టిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్రమైన మంట, భరించలేని నొప్పి, తిమ్మిర్లు కలుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,500 రకాల తేలు జాతులు ఉండగా, కేవలం కొన్ని మాత్రమే ప్రాణాంతకమైన విషాన్ని విడుదల చేయగలవు. అయినప్పటికీ, తేలు కుట్టిన వెంటనే భయపడిపోకుండా కొన్ని అత్యవసర ప్రథమ చికిత్స చర్యలు పాటించడం ద్వారా విషం ప్రభావాన్ని, తీవ్రమైన నొప్పిని గణనీయంగా తగ్గించవచ్చు.
తేలు కుట్టిన వెంటనే చేయాల్సిన మొదటి పని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడం. కుట్టిన భాగాన్ని గోరువెచ్చని నీరు మరియు యాంటీసెప్టిక్ సబ్బుతో శుభ్రంగా కడగాలి. ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఆ తర్వాత, ఐస్ క్యూబ్స్‌ను ఒక శుభ్రమైన గుడ్డలో చుట్టి తేలు కుట్టిన ప్రదేశంపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి, విషం శరీరంలోకి వేగంగా పాకకుండా అడ్డుకోవచ్చు. ఒకవేళ చేయికి లేదా కాలికి కుట్టినట్లయితే, ఆ భాగాన్ని కదలకుండా కొద్దిగా ఎత్తులో ఉంచడం చాలా మంచిది.
ఇక వంటింట్లో దొరికే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలతో కూడా తక్షణ ఉపశమనం పొందవచ్చు. పసుపులో ఉండే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని మాయం చేస్తాయి. కొద్దిగా పసుపును ఆవ నూనెతో కలిపి పేస్ట్‌లా చేసి కుట్టిన చోట రాస్తే మంట త్వరగా తగ్గుతుంది. అలాగే బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి రాసినా చర్మానికి మంచి ఉపశమనం లభిస్తుంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉండే ఉల్లిపాయ రుద్దడం లేదా నాటు వైద్యాలు వంటి శాస్త్రీయ ఆధారాలు లేని పద్ధతులను గుడ్డిగా నమ్మి కాలయాపన చేయడం ప్రాణాలకే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 3,000 మంది తేలు కాటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో దాదాపు 80 శాతం మంది చిన్నపిల్లలే ఉండటం గమనార్హం. తేలు విషం పిల్లలపై, వృద్ధులపై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బాధితుల్లో విపరీతమైన చెమటలు పట్టడం, తల తిరగడం, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది లేదా వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలి. తీవ్రమైన సందర్భాల్లో వైద్యులు యాంటీ వినమ్ (Antivenom) మందులను అందించి ప్రాణాలు కాపాడుతారు.
ఇది కూడా చదవండి:వైద్య రంగంలో సంచలనం: క్యాన్సర్ కణాల రహస్యాలను, బట్టబయలు చేసిన శాస్త్రవేత్తలు
ఇంటి చుట్టూ తేళ్లు రాకుండా తగిన రక్షణ మరియు నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను ముందే అడ్డుకోవచ్చు. ఇళ్ల పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పనికిరాని వస్తువులు, చెత్తాచెదారం, ఎండిన చెట్ల పొదలను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇంట్లోని గోడల్లో ఉండే పగుళ్లను సిమెంట్ లేదా మట్టితో మూసివేయాలి. రాత్రి సమయాల్లో లేదా చీకటి ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కాళ్లకు బూట్లు, చేతులకు రక్షణ గ్లౌజులు ధరించడం చాలా ముఖ్యం.
అలాగే, ఎక్కడైనా బూట్లు లేదా దుస్తులు బయట ఉంచితే, వాటిని వేసుకునే ముందు ఒకసారి గట్టిగా జాడించి చూసుకోవడం మంచి అలవాటు. తేళ్లు సాధారణంగా చీకటి ప్రదేశాలు, బూట్ల లోపల, మంచాల కింద దాక్కుంటాయి. కొద్దిపాటి అప్రమత్తత, సరైన సమయంలో అందించే ప్రథమ చికిత్స తేలు కాటు విష ప్రభావాన్ని పూర్తిగా తగ్గించి ప్రాణాలను కాపాడుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా నిపుణులైన వైద్యుల సలహా తీసుకోవడమే అత్యంత సురక్షితమైన మార్గం.
మీకు నచ్చవచ్చు:గుండె వేగం, సాధారణంగా ఉన్నా పక్షవాతం రావచ్చా? వైద్యులు హెచ్చరిస్తున్న విషయాలివే!
పరగడుపున, టీ లేదా కాఫీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
Scorpion Sting First Aid, Scorpion Bite Remedies, Emergency Medical Tips, Insect Sting Treatment, First Aid Guide, Doctor Health Advice, Health Tips In Telugu.
పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి అనేక పోషకాలను అందించడంలో ఇవి ముందుంటాయి. శీతాకాలంలో ఎదురయ్యే పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో నారింజ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో చాలామందిని ఇబ్బందిపెట్టే ప్రధాన సమస్యలు దగ్గు, జలుబు మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు. నారింజ పండ్లలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. ప్రతిరోజూ నారింజ తీసుకోవడం ద్వారా కాలానుగుణ వ్యాధుల బారిన పడకుండా సులభంగా రక్షణ పొందవచ్చు.
అలాగే, చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. నారింజలో లభించే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి ఎంతగానో సహాయపడుతుంది, ఇది చర్మాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా ఉంచడంలో కీలకమైనది. అంతేకాకుండా, ఇవి చర్మానికి ముడతలు రాకుండా కాపాడి, ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా సహజమైన మెరుపును అందిస్తాయి.
మరోవైపు, నారింజలో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడంలో, మలబద్ధకం సమస్యను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఆహార ఎంపికగా నిలుస్తుంది. ఇది కడుపు నిండిన భావనాన్ని కలిగించి అనవసరమైన ఆహారపు అలవాట్లను నియంత్రిస్తుంది.
ఇది కూడా చదవండి:పండుగ, తిండి తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా? ఎసిడిటీ ముప్పు తప్పదు!
ఇవే కాకుండా, నారింజలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. చలికాలంలో నీరు తక్కువగా తాగుతుంటారు కాబట్టి శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. నారింజలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో హైడ్రేషన్ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ మరియు ఇతర పోషకాలు కంటి చూపును మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడతాయి.
మొత్తంగా చూస్తే, శీతాకాలంలో ప్రకృతి మనకు అందించే ఒక ఆరోగ్యకరమైన వరం నారింజ పండ్లు. కేవలం రుచిలోనే కాకుండా, పోషకాల పరంగానూ ఇవి ఎంతో శ్రేష్టమైనవి. కాబట్టి ఈ చలికాలంలో మీ రోజువారీ ఆహారంలో నారింజను కచ్చితంగా భాగం చేసుకొని, సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.
మీకు నచ్చవచ్చు:బిల్వ ఆకులతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎవరికి మేలు? ఎవరికి డేంజర్?
లిపిడ్ ప్రొఫైల్, అంటే ఏమిటి? గుండెను కాపాడుకునే సులభమైన మార్గం!
Oranges In Winter, Cold And Cough Remedies, Immunity Boosting Foods, Vitamin C Health Benefits, Winter Health Tips, Doctor Health Advice, Health Tips In Telugu.
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రభావం వైసీపీపై ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయాలలోకి ప్రవేశించడానికి ముందు నుంచి కూడా విజయసాయి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో కూడా విజయసాయి సహ నిందితుడు. జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నాయి.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన విజయసాయి, ఇప్పుడు పరివర్తన రాజనీతి పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.
దేశభక్తి, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా తన పార్టీ పనిచేస్తుందని విజయసాయి పార్టీ ప్రకటన సందర్భంగా చెప్పారు. పార్టీ అధికారిక ప్రకటనతో పాటు జెండాను కూడా ఆవిష్కరించిన విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సంస్కృతిని తీసుకువస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
ఈ పరిణామం వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకంగా, పార్టీ నేతకు అధినేతకు అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకోవడం ఆ పార్టీకి ఏదో మేరకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తమౌతోంది.
ఇది కూడా చదవండి: జయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!
పార్టీలో అసంతృప్తితో ఉన్న, అలాగే ఆయనతో సత్సంబంధాలు కలిగిన కొందరు నేతలు భవిష్యత్తులో వైసీపీని వీడి విజయసాయి పంచన చేరే అవకాశలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. అదలా ఉంచితే.. కొత్త పార్టీ ద్వారా ఆయన ఏ మేరకు ప్రభావం చూపగలరు, ప్రజాదరణను ఏ విధంగా సంపాదించుకుంటారు అనే విషయంలో కూడా రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
రానున్న కాలంలో విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) ప్రయాణం అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను ఏ మేరకు ఎలా ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చెప్పిన ముహూర్తానికి చెప్పినట్లుగా తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విజయసాయి, ముందు ముందు రాష్ట్ర రాజకీయాలలో ఏ మేరకు ప్రభావం చూపుతారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్త మౌతోంది.
మీకు నచ్చవచ్చు: వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి
విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.?
[Effect of Vijayasai Reddy New Party onYCP, Parivarthana Rajaneethi Party, PRP, Political Impact, AP Politics, Telugu One]
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి కొత్తపార్టీని అధికారికంగా ప్రకటించారు. తాను ఏర్పాటు చేసిన పార్టీ పెరును ఆయన ప్రకటించారు. విజయవాడ ఏ కన్నెన్షన్ వేదికగా బుధవారం (నవంబర్ 11) సరిగ్గా 11 గంటల 11నిముషాలకు ఆయన తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. తన కొత్త పార్టీ పేరు పీఆర్పీ (పరివర్తన రాజనీతి పార్టీ)గా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దీంతో ఏపీ రాజకీయాలలో మరో కొత్తపార్టీ ఆవిర్భవించింది.
గతంలో వైపీపీలో కీలక నేతగా చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి, ఆ తరువాత ఆ పార్టీకీ, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా సందర్భంగా ఇక రాజకీయాలకు దూరం, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన విజయసాయి రెడ్డి, ఆ నిర్ణయం మార్చుకుని, యూటర్న తీసుకుని మళ్లీ రాజకీయ ప్రవేశం చేశారు.
తన కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన ఆయన ఈ సందర్భంగా పార్టీ జెండా, ఎజెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో కుల, మత రాజకీయాలకు స్వస్తి పలకడంతో పాటు, రెండు కుటుంబాల ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలకడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
దేశభక్తి, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పీఆర్పీ పనిచేస్తుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ముఖ్యంగా యువతను భావి నాయకులుగా తీర్చిదిద్దే ఫ్యాక్టరీగా తమ పార్టీ పని చేస్తుందన్న విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో కరువు కాటకాలు, కరెంటు కోతలు లేని పరిస్థితులను సృష్టించడం, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం తమ ధ్యేయమన్నారు.
ఇది కూడా చదవండి: వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి
ఇక ఎన్నికల హామీల విషయంలోనూ ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించడం, చదువుల భారాన్ని తగ్గించి వంద శాతం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు,
విజయసాయిరెడ్డి నూతన పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాలలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు అసంతృప్త నేతలు ఆయన బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయాలపై చూపే ప్రభావంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరలేచింది.
మీకు నచ్చవచ్చు: విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!
తెలుగుదేశం, వైసీపీ దొందూదొందే.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. విజయసాయిరెడ్డి.!
[Vijayasai Reddy New Party PRP, Parivarthana Rajaneethi Party, Andhra Pradesh Politics, Vijayawada Convention Center, Gen Z Leaders, Telugu One]
తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ తనదైన ముద్ర వేస్తూ తొలి ప్రయత్నంలోనే తన టీవీకే పార్టీని గెలిపించుకుని, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి సుమారు 35 శాతానికి పైగా ఓటు బ్యాంకును సాధించారు.
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల కాలంలో టీవీకే ప్రభుత్వానికి చెందిన కొందరు నేతల వివాదాస్పద ప్రవర్తన పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తోంది. గతంలో ఒక మంత్రి డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో వివాదంలో చిక్కుకోగా, తాజాగా తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే రవిశంకర్ దురుసు ప్రవర్తన వివాదంగా మారింది.
తిరుచిరాపల్లి జిల్లాలో తమ ప్రాంతంలోని తాగునీటి ఎద్దడి, చెత్తాచెదారం పేరుకుపోవడం వంటి సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్లిన కార్తీక్ కుమార్ అనే వ్యక్తిపై డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ భౌతిక దాడికి దిగారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి తన వద్దకు వచ్చిన వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకోవడం దుమారానికి దారితీసింది.
ఇది కూడా చదవండి: చంద్రబాబుతో భేటీ: విజయ్ విక్టరీ సింబల్.. దక్షిణాది పొలిటికల్ సినేరియో మార్పునకు సంకేతమా.?
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో టీవీకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రజా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో హింసాత్మక మరియు ఆధిపత్య రాజకీయాలకు స్వస్తి పలకాలని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేల తీరు ఆయన ఆశయాలకు గండికొడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం కొద్ది నెలలు మాత్రమే అయినప్పటికీ, ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం కావడం పార్టీకి నష్టం చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి విజయ్, తప్పు చేసే ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుని గాడిన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
ముఖ్యమంత్రిగా విజయ్ పని తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో చూపుతున్న వేగం, నిరాడంబరత ప్రజలను ఆకట్టుకుంటున్నప్పటికీ, టీవీకే ఎమ్మెల్యేల తీరు, వారిపై వెల్లువెత్తుతున్న విమర్శలు పార్టీకే కాదు, వ్యక్తిగతంగా విజయ్ కూడా నష్టం చేకూరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. గీత దాటిన ఎమ్మెల్యేలపై విజయ్ కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
మీకు నచ్చవచ్చు: తమిళనాడు సీఎం విజయ్ పై ఎన్నికల కేసు: ఈ నెల 14న తీర్పు.!
విడాకుల కేసు: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్ వైఫ్.!
[TVK MLAS Crossing Line, Tamilnadu Government, CM Vijay, Deputy Speaker Ravi Shankar, Controversy, Telugu One]
ప్రతిరోజూ ఉదయం గొంతుకు హాయిగా ఉండేలా వేడి వేడిగా టీ తాగి రోజును ప్రారంభించడం చాలా మందికి అలవాటు. అయితే ఆ రొటీన్ టీకి బదులుగా అప్పుడప్పుడు కొన్ని సుగంధ ద్రవ్యాలు , మూలికలను జోడించి తయారు చేసుకునే పానీయాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని హెర్బల్ టీలు అని అంటారు.
మన వంటింట్లో సులభంగా లభించే మసాలా దినుసులతోనే ఈ టీల ను తయారు చేసుకుని తాగవచ్చు. అలా వంటిట్లో ఉండే మసాలా దినుసుల్లో అనాస పువ్వు కూడా ఒకటి. ఈ అనాస పువ్వుతో తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చిన్న పువ్వు కేవలం వంటకాలకు రుచిని ఇవ్వడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే..
అనాస పువ్వు టీ..
ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ ఫీవర్స్ , ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. జ్వరం లేదా ఏదైనా వైరస్ లేదా శ్వాసకోశ సమస్యలు తలెత్తినప్పుడు ప్రకృతి మనకు ప్రసాదించిన అనాస పువ్వును ఉపయోగించి సులభంగా హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు. అనాస పువ్వును చిన్న ముక్కలుగా చేసి, నీటిలో మరిగించి టీలా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రయోజనాలు..
వైరల్ ఫీవర్.. శ్వాసకోశ సమస్యలు..
వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, వైరస్ జ్వరాలు సర్వసాధారణం. అనాస పువ్వులో యాంటీ వైరల్ , యాంటీ మైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించే హానికారక వైరస్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. శ్వాసనాళాల్లో చేరిన శ్లేష్మాన్ని కరిగించి, గొంతు నొప్పి , ఊపిరితిత్తుల ఇబ్బంది నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.
జీర్ణక్రియ ..
తిన్న ఆహారం సరిగా అరగకపోవడం, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ టీ చాలా బాగా పనిచేస్తుంది. అనాస పువ్వులోని పోషకాలు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి, జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. భోజనం తర్వాత లేదా ఉదయం పూట ఈ టీ తాగడం వల్ల పొట్ట తేలికగా ఉంటుంది.
ఇది కూడా చదవండి షుగర్ పేషెంట్లు తప్పక తెలుసుకోవాలి ! ముఖ్యమైన డాక్టర్ సూచనలు
రోగనిరోధక శక్తి పెంపు..
శరీరంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే చిన్నచిన్న అనారోగ్యాలు కూడా త్వరగా చుట్టుముడతాయి. అనాస పువ్వు టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది , ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ లభిస్తుంది.
కీళ్ల నొప్పులు, వాపులు తగ్గించడం..
శరీరంలో ఎక్కడైనా వాపులు లేదా కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు ఈ టీ సహజ నివారణగా పనిచేస్తుంది. దీనిలో ఉండే కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు శరీరంలో మంటను, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. వయసు మళ్లిన వాళ్ళలో లేదా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
మానసిక ప్రశాంతత , నిద్రలేమి నివారణ..
రోజంతా పడిన అలసట, ఒత్తిడి కారణంగా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. అనాస పువ్వు టీలో ఉండే సువాసన , మృదువైన గుణాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది మనసును రిలాక్స్ చేసి చక్కగా నిద్ర పట్టేలా సహాయపడుతుంది.
చర్మ సౌందర్యం..
శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు వస్తుంటాయి. ఈ హెర్బల్ టీ శరీరాన్ని శుభ్రపరిచి, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారడానికి దోహదపడుతుంది.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు థైరాయిడ్ PCOS గట్ హెల్త్.. వీటి మధ్య సంబంధం ఏమిటి.!
మహిళలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడని అండాశయ క్యాన్సర్ లక్షణాలివే!
What Happens to Your Body When You Drink Star Anise Tea,Amazing Benefits Revealed,Star Anise Tea,Amazing Benefits for Your Body
షుగర్ రావడానికి ముందు కనిపించే చివరి వార్నింగ్ సిగ్నల్ ఇదే..
మన శరీరంలో ఎన్నో మార్పులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు చిన్నచిన్న సంకేతాలను మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఆ చిన్న సంకేతాలే భవిష్యత్తులో మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే పెద్ద ముప్పునకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం లేదా షుగర్ వ్యాధి బారిన పడటానికి ముందు మన శరీరం కొన్ని ప్రత్యేకమైన హెచ్చరికలను జారీ చేస్తుంది. ఆ సంకేతాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ మహమ్మారికి పూర్తిగా దూరంగా ఉండవచ్చు. అవేంటో తెలుసుకుంటే..
మన దేశంలో దాదాపు పద్నాలుగు కోట్ల మందికి పైగా ప్రజలు ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నారని పలు ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి. అయితే దురదృష్టవశాత్తు చాలా మందికి తమకు ఈ సమస్య ఉందనే విషయం కూడా అసలు తెలియదు. అసలు ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? డయాబెటిస్ కు ముందు శరీరం ఇచ్చే సిగ్నల్స్ ఏమిటి? వివరంగా తెలుసుకుంటే..
ప్రీ డయాబెటిస్..
రక్తంలో షుగర్ స్థాయిలు కొద్దిగా పెరిగి ఉంటాయి కానీ పూర్తిగా డయాబెటిస్ అని నిర్ధారించేంత స్థాయిలో ఉండవు. వైద్యపరంగా చూస్తే హెచ్‌బీఏ1సీ పరీక్షలో మూడు నెలల యావరేజ్ 5.7 నుంచి 6.4 మధ్యలో ఉన్నా
, లేదా ఖాళీ కడుపుతో చేసే ఫాస్టింగ్ షుగర్ వంద నుంచి నూట ఇరవై ఐదు మిగ్రాముల మధ్యలో ఉన్నా దానిని ప్రీ డయాబెటిస్ దశగా పరిగణిస్తారు.
ఈ దశలోనే మన శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ప్రారంభమవుతుంది.
డయాబెటిస్ రావడానికి ముందు సంకేతాలు..
కేవలం షుగర్ మాత్రమే కాకుండా గుండె జబ్బులు, బీపీ, ఫ్యాటీ లివర్ వంటి ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదం కూడా సరిగ్గా ఇదే సమయం నుంచి పెరుగుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. శరీరంలో పైన చెప్పుకున్న సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే.. డయాబెటిస్ రావడానికి కూడా అవకాశం ఉన్నట్టే.. అయితే దీనిని చూసి ఎవరూ అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, ఇదొక చక్కటి సువర్ణావకాశం లాంటిదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత డయాబెటిస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అధ్యయనం ప్రకారం, శరీర బరువులో కేవలం ఏడు శాతం వరకు తగ్గడం , వారానికి నూట యాభై నిమిషాలు వేగంగా నడవడం ద్వారా టైప్ టూ డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని యాభై ఎనిమిది శాతం వరకు సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకే ఈ ప్రీ డయాబెటిస్ దశను జీవక్రియ సంబంధిత వ్యాధుల చివరి రివర్సిబుల్ దశగా పిలుస్తుంటారు.
ఇంటి గోడకు చిన్న పగులు కనిపించినప్పుడే దానిని సరిచేసుకోవడం చాలా సులభం, కానీ గోడ పూర్తిగా దెబ్బ తిన్న తర్వాత బాగు చేయడం కష్టం. సరిగ్గా అలాగే ఆరోగ్యం పూర్తిగా క్షీణించే ముందే అప్రమత్తమవడం చాలా ముఖ్యం. అందుకోసం శరీర బరువును అయిదు నుంచి ఏడు శాతం వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
ఇది కూడా చదవండి ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే సూత్రాలివి..!
ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలి. మైదా వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు , కూల్ డ్రింక్స్, షుగర్ పానీయాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడు హెచ్‌బీఏ1సి పరీక్షను చేయించుకుంటూ ఆరోగ్యాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి.
డయాబెటిస్ వచ్చిన తర్వాత రకరకాల మందులతో దానిని నియంత్రించడం కంటే, అది రాకముందే ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నప్పుడే దానిని అడ్డుకోవడం ఎంతో మేలు. ఇది ఆరోగ్యానికి ఎంతో సులువైన మార్గం కూడా. కాబట్టి శరీరం ఇచ్చే హెచ్చరికలను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని సంతోషంగా జీవించడమే మంచి మార్గం.
*రూపశ్రీ.మీకు నచ్చవచ్చు
మొండి కఫాన్ని కూడా తరిమికొట్టే పానీయం.. ఇది తాగితే ఎంత రిలీఫ్ ఇస్తుందో!
ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే సూత్రాలివి..!
నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిపోయి రకరకాల వ్యాయామాలు, డైట్లు చేయడం సర్వసాధారణమైంది. అయితే సరైన అవగాహన లేకుండా చేసే కొన్ని పద్ధతులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులు హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ప్రాణాలను బలిగొంటున్న సమస్య గుండె జబ్బులు.. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ రోజువారీ జీవితంలో చేసే చిన్న తప్పులే గుండె సమస్యలకు కూడా కారణం అవుతాయి. అవేంటో, వైద్యులు వాటి గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే..
నీరు..
రోజూ ఎంత నీరు తాగాలి అనే విషయంలో చాలా మందిలో రకరకాల అపోహలు ఉన్నాయి. రోజుకు ఐదు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు తాగాలని కొందరు ప్రచారం చేస్తుంటారు. కానీ వైద్యపరంగా ఇది సరైన పద్ధతి కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అవసరానికి మించి విపరీతంగా నీరు తాగడం వల్ల శరీరంలో సోడియం , పొటాషియం స్థాయిల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల హైపోనేట్రిమియా వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంది.
కేవలం ఒకటి రెండు లీటర్లకే నీటిని తాగడం పరిమితం కాకుండా, ఎవరి శారీరక శ్రమ , వాతావరణ పరిస్థితులను బట్టి నీటి మోతాదు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం తాగే కేవలం మంచినీళ్లే కాకుండా, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సూప్స్, టీ, కాఫీ , ఇతర పానీయాలన్నీ కూడా శరీరానికి అందే ద్రవాల జాబితాలోనే లెక్కలోకి వస్తాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మన మూత్రం రంగు చక్కటి సూచికగా పనిచేస్తుంది. మూత్రం మరీ తెలుపుగా లేదా ముదురు పసుపు రంగులో కాకుండా, లేత పసుపు రంగులో ఉంటే శరీరం సరైన హైడ్రేషన్ స్థితిలో ఉన్నట్లు భావించవచ్చు. కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకే నీటి పరిమాణాన్ని పాటించాలి.
ఆహారం..
ఇక ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, మనం రోజూ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ , ఇతర ఆహార పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉదయం పూట తినే చాకోస్ లేదా రెడీమేడ్ సీరిల్స్ పాలలో కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం అనుకుంటాం. కానీ వాటిలో కార్బోహైడ్రేట్లు, చక్కెర శాతం ఎక్కువగా ఉండి, శరీరానికి అవసరమైన ప్రొటీన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుండటం వల్ల అనారోగ్యకరమైన ఆహారం వైపు మనసు మళ్లుతుంది. దానికి బదులుగా ఉడికించిన గుడ్లు, మల్టిగ్రెయిన్ ఆహారాలు, ఇడ్లీ వంటి ప్రొటీన్‌తో కూడిన అల్పాహారం ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి మనసుపై ఒత్తిడి.. గుండెకు ప్రమాదం! అసలు నిజం ఇదే!
అలాగే మనం ఇష్టపడి తినే బిర్యానీ, ఫ్రైస్ , బయట దొరికే టిఫిన్లు ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోతాయి. ఏ ఆహారాన్ని అయినా ఇంట్లో తక్కువ నూనెతో, సహజమైన పద్ధతిలో వండుకుంటే అది ఆరోగ్యకరమైనదే అవుతుంది. హోటళ్లలో లేదా బయట లభించే తినుబండారాలు త్వరగా తయారవ్వడం కోసం ఎక్కువగా నూనెను వాడతారు. వీటిని అప్పుడప్పుడు రుచి కోసం తీసుకోవడంలో తప్పు లేదు కానీ, రోజూ అలవాటుగా మార్చుకోవడం మంచిది కాదు.
అన్నం తినే విషయంలో కూడా వండే పద్ధతిని మార్చుకోవడం ద్వారా గ్లైసమిక్ ఇండెక్స్ ను తగ్గించవచ్చు. అన్నం వండేటప్పుడు గంజి వార్చడం మన పూర్వీకుల కాలం నుంచి ఉన్న పద్ధతి. దీని వల్ల అన్నంలో గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుందట. ఇది షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా సహాయపడుతుందట.
వ్యాయామం..
ఫిట్నెస్ , మారథాన్ల పేరుతో విపరీతంగా శ్రమించడం, అలాగే రోజూ గంటల తరబడి ఒకే పొజిషన్ లో కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగించి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు. కాబట్టి ఆఫీసుల్లో పని చేసేవారు లేదా సుదూర ప్రయాణాలు చేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి కాస్త నడవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఎవరి సలహాలనో గుడ్డిగా అనుసరించకుండా, మన శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుంటూ సరైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
మీకు నచ్చవచ్చు ఆహారం తినేటప్పుడు.. మీకు ఈ జబ్బు ఉందేమో చెక్ చేస్కోండి..!
*రూపశ్రీ.
