LATEST NEWS
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ ఊహించని రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ వార్త తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమ వర్గాలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా సినిమా షూటింగ్ పనుల్లో భాగంగా ఆయన నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక పాటకు సంబంధించి రాత్రి సమయంలో జరిగిన చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆయన తిరుగు ప్రయాణమయ్యారు.
షూటింగ్ ముగించుకుని తన బృందంతో కలిసి వాహనంలో వస్తున్న తరుణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ముచ్చింతల్ వద్ద తెల్లవారుజామున సుమారు ఆరు గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
అదే మార్గంలో వెనుక వైపు నుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన పండ్ల లోడు లారీ.. వారు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ అనూహ్య పరిణామానికి కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో కారులోని వారందరికీ ప్రాణాపాయం తప్పిందని అంతా భావించారు. అయితే కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ఎలాంటి గాయాలు కూడా కాకుండా క్షేమంగా బయటపడటం నిజంగా అదృష్టమని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.!
ప్రమాదం జరిగిన వెంటనే శేఖర్ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనకు ఏమైందంటూ ఆందోళన చెందుతున్న అభిమానులకు అసలు విషయాన్ని వివరించి భరోసా కల్పించారు.
తాను ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే తాను అయ్యప్ప స్వామి మాల ధరించానని, ఆ స్వామివారి దివ్య ఆశీస్సుల వల్లే ఈ ఘోర ప్రమాదం నుంచి తమ ప్రాణాలు నిలిచాయని ఆయన భావోద్వేగంతో తెలిపారు.
ఈ అనుకోని ఘటన తనను కాసేపు కలవరపెట్టినప్పటికీ, తన దైవభక్తి, ఆ స్వామి కటాక్షం తనను కాపాడాయని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పటికీ తన వృత్తిపై ఉన్న అంకితభావంతో ఆయన వెనుకంజ వేయలేదు.
రాత్రికి మరోసారి షెడ్యూల్ ప్రకారం షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే తిరిగి విధులకు హాజరవుతుండటంతో ఆయన నిబద్ధతను అందరూ అభినందిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: జ్యువెలరీ షోరూమ్‌లో భారీ దోపిడీ.. రూ.50 కోట్ల బంగారం చోరీ.!
మీకు నచ్చవచ్చు: రూ.7 కోట్లు ఇవ్వాలి.. లేదంటే చంపేస్తాం.. కేజ్రీవాల్‌కు హత్య బెదిరింపులు.!
[ Sekhar Master car accident, Sekhar Master Ayyappa grace, Tollywood choreographer accident,
Shamshabad lorry accident Sekhar Master, Kaka movie shooting ]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు ఉమ్మడి విజయనగరం వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
చినమేరంగి సంస్థాన కుటుంబానికి చెందిన విజయరామరాజు, దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించిన ఆయన, ఉత్తరాంధ్ర ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అత్యున్నత పదవుల వరకు ఆయన చేసిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
తొలిసారిగా 1978లో జనతా పార్టీ తరఫున నాగూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభలోకి అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేశారు. 1983, 1985 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి తన రాజకీయ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. కేవలం రాష్ట్ర స్థాయికే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన ఆయన, పార్వతీపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో ప్రజల గళాన్ని వినిపించారు.
ఇది కూడా చదవండి: నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.!
ఆ తర్వాత మళ్లీ ప్రాంతీయ రాజకీయాల వైపు దృష్టి సారించిన విజయరామరాజు, తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలక పాత్ర పోషించారు. పార్టీ విజయాల్లోనూ, సంస్థాగత బలోపేతంలోనూ ఆయన అందించిన సేవలు ఎనలేనివి. వివిధ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి, శాఖా పరంగా అనేక సంస్కరణలు తెచ్చారు. అటవీ, పర్యావరణ శాఖలతో పాటు రవాణా వంటి కీలకశాఖలను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆయన మరణవార్త తెలియగానే రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, టీడీపీ అధినాయకులు, స్థానిక నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒక పెద్ద దిక్కును కోల్పోయామని పలువురు నాయకులు ఆవేదన వెలిబుచ్చారు. సంస్థాన కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, ఎప్పుడూ గర్వం ప్రదర్శించకుండా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని జ్ఞాపకం చేసుకుంటున్నారు.
విజయరామరాజు భౌతికకాయానికి తుది నివాళులు అర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక ప్రజానేత నిష్క్రమణతో స్థానిక రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను పూడ్చలేనిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
విజయరామరాజు రాజకీయ ప్రస్థానం..
1978లో జనతా పార్టీ తరఫున నాగూరు ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నిక
1983, 1985లో కాంగ్రెస్ పార్టీ తరఫున నాగూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం
1989, 1991లో పార్వతీపురం ఎంపీగా లోక్‌సభకు ఎన్నిక
1998లో తెలుగు దేశం పార్టీ తరఫున పార్వతీపురం ఎంపీగా విజయం
1999లో నాగూరు నుంచి మరోసారి శాసన సభ్యుడిగా ఎన్నిక
2004లో పార్వతీపురం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం
వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో అటవీ, పర్యావరణ, సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు
రోశయ్య మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా సేవలు
2017లో టీడీపీ తరఫున శ్రీకాకుళం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక
ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో రాజకీయ సేవలు అందించారు
మీకు నచ్చవచ్చు: జ్యువెలరీ షోరూమ్‌లో భారీ దోపిడీ.. రూ.50 కోట్ల బంగారం చోరీ.!
[ Satrucherla Vijayaram Raju, TDP leader Vijayaram Raju passes away, Vizianagaram news, former minister Vijayaram Raju death, AP political news ]
తమిళనాడులోని మదురైలో జరిగిన ఒక సంచలన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మదురైలోని కలవాసల్ బైపాస్ రోడ్డులో గల పలంగనాథం ప్రాంతంలో ఇటీవల అత్యంత వైభవంగా ప్రారంభించిన ప్రతిష్టాత్మక 'తనిష్క్' జ్యువెలరీ షోరూమ్‌లో భారీ చోరీ వెలుగుచూసింది.
కేవలం పది రోజుల క్రితం మాత్రమే ప్రారంభమైన ఈ సరికొత్త ఆభరణాల దుకాణంలో, భవన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకుండానే సుమారు 70 శాతం మేర మాత్రమే పూర్తయ్యాయి. ఈ లోపు దుండగులు వేసిన ప్లాన్ చూసి పోలీసులే విస్మయం చెందారు.
నవంబర్ 10వ తేదీ రాత్రి యథావిధిగా సిబ్బంది దుకాణానికి తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోగా, మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి వెనుక వైపు తలుపులు, షట్టర్లు పగులగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే షాక్‌కు గురయ్యారు.
ఈ దుండగుల దురాగతంలో దాదాపు 15 నుంచి 20 కిలోల (సుమారు 16 కిలోల వరకు) బంగారు, వజ్రాభరణాలు మాయమైనట్లు ప్రాథమిక అంచనా వేశారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఈ బ్రాండ్ షోరూమ్‌లో చోరీకి గురైన ఆభరణాల మార్కెట్ విలువ సుమారు రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.!
షోరూమ్‌లో ఉన్న మొత్తం నిల్వలలో దాదాపు 30 శాతం మేర బంగారం ఈ భారీ దోపిడీకి గురైనట్లు మదురై పోలీస్ కమిషనర్ రాజేంద్రన్ మీడియా వెల్లడించారు. అయితే, ఈ ఘరానా దొంగతనం వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు సీసీటీవీ ద్వారా స్పష్టమవుతోంది.
నిందితుడు ఎవరికీ అనుమానం రాకుండా భవనం పై అంతస్తు నుంచి లిఫ్ట్ మార్గం ద్వారా లోపలికి ప్రవేశించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో రికార్డైంది. ముఖానికి మాస్క్ ధరించిన ఒకే వ్యక్తి ఈ దుండగానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దుండగుడు భారీ మొత్తంలో ఉన్న నగలను ఎత్తుకెళ్లడానికి ఉపయోగించిన ట్రావెల్ బ్యాగ్ సైజు, డిజైన్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. అసిస్టెంట్ కమిషనర్ల పర్యవేక్షణలో ప్రత్యేకంగా మూడు పోలీసు బృందాలను రంగంలోకి దించారు.
మరోవైపు డాగ్ స్క్వాడ్ (జాగిలాలు), ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, క్లూస్‌ను సేకరిస్తున్నారు. కేవలం పది రోజుల క్రితం ప్రారంభమైన షోరూమ్‌లో ఇంత భారీ మొత్తంలో దోపిడీ జరగడం వ్యాపార వర్గాల్లో, స్థానికంగా తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది.
మీకు నచ్చవచ్చు: రూ.7 కోట్లు ఇవ్వాలి.. లేదంటే చంపేస్తాం.. కేజ్రీవాల్‌కు హత్య బెదిరింపులు.!
[ Madurai Tanishq showroom theft, 16 kg gold stolen Madurai, Tanishq jewellery robbery Tamil Nadu, Rs 50 crore gold stolen, Palanganatham Tanishq heist, Madurai crime news today ]
ALSO ON TELUGUONE N E W S
విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ అనే మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 18న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
మెహర్ తేజ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మానవ ప్రవర్తనలోని విభిన్న కోణాలు, నేర ప్రవృత్తి, మనిషి తీసుకునే నిర్ణయాలు వాటి పర్యవసానాల నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోంది.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా స్టైలిష్, సరికొత్త లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.
ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన రుహానీ శర్మ నటిస్తుండగా, నిహారిక ఎన్ఎం, సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, రఘుబాబు, వెంకటేష్ కాకుమాను, కిరీటి దమరాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇది కూడా చదవండి: 'చార్లీ చాప్లిన్'గా టాలీవుడ్ హీరో.. ఫస్ట్ లుక్ అదిరింది.!
ఈ సినిమాకు ఘిబ్రాన్ సంగీతాన్ని అందిస్తుండగా, చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు. జిజు సన్నీ సినిమాటోగ్రఫీ, నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విశాల్ అబాని ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆసక్తికరమైన కథాంశం, అల్లరి నరేష్ సరికొత్త అవతారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ‘ఆల్కహాల్’ డిసెంబర్ 18న ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
అసలు ఈ విడాకుల కథ ఏంటి?.. భార్యాభర్తల మధ్య గొడవేంటి.?
శోభన్ బాబుకు స్టార్డమ్ తెచ్చిన మూవీ.. 'తాసిల్దార్ గారి అమ్మాయి' వెనుక ఇన్ని విశేషాలా.?
[Alcohol Release Date, Allari Naresh, Ruhani Sharma, Meher Tej, Naga Vamsi]
హిందీ సాంగ్స్... నిమ్మకూరు నుంచి నిజామాబాద్ వరకు, గుంటూరు నుంచి గుంతకల్లు దాకా... ఏదో ప్రాస బాగుందని పై పదాలు ఉపయోగించాం కానీ అసేతు హిమాచలం సంగీత సాగరంలో దాగి ఉన్న ఎన్నో అద్భుతమైన ట్యూన్స్ తో కూడిన మధురమైన హిందీ సాంగ్స్ వింటూ ఆహా మా జన్మ ధన్యమైందని అనుకునే వాళ్ళు. అంతలా హిందీ సాంగ్స్ తమ శక్తిని చట్టాయి.
తెలుగు నాట కూడా ఎన్నో దశాబ్దాల నుంచే తెల్లవారుజామునే ఎంతో మంది రిక్షా, ఆటో కార్మికులు, శ్రామికులు, బలహీనులు, బలవంతులు హిందీ పాటలని విన్న తర్వాతనే తమ దిన చర్యని ప్రారంచించే వాళ్ళు. ఫిమేల్, మేల్ వాయిస్ కూడా చెవుల్లో అమృతాన్ని నింపేవి. అలాంటి హిందీ పాటలు కొన్ని సంవత్సరాలుగా రావడం లేదు.
ఒకప్పుడు భారతీయ సంగీత ప్రపంచం అంటేనే బాలీవుడ్ పాటల హవా నడిచేది. భాషా భేదం లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరి పెదవులపై హిందీ పాటలే నాట్యమాడేవి. 1990వ దశకం, 2000వ దశకం ప్రారంభంలో ఏ.ఆర్. రెహమాన్, నదీమ్-శ్రవణ్, జతిన్-లలిత్, శంకర్-ఎహసాన్-లాయ్ వంటి దిగ్గజ సంగీత దర్శకుల స్వరాలు దేశవ్యాప్తంగా ఒక ప్రభంజనాన్ని సృష్టించాయి. అప్పట్లో ఒక సినిమా విడుదలవుతుందంటే, ముందుగా ఆ సినిమా ఆడియో క్యాసెట్లు, సీడీలు లక్షల్లో అమ్ముడయ్యేవి. భాష రాకపోయినా సరే, ఆ పాటల్లోని మధురమైన మెలోడీ, హృదయాన్ని హత్తుకునే సాహిత్యం దక్షిణాది ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేసేవి.
కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవలి కాలంలో హిందీ సినిమా పాటలు కేవలం ఉత్తరాదికి, అందులోనూ కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. దేశవ్యాప్తంగా మార్మోగే చార్ట్‌బస్టర్ హిందీ పాటలు రావడం ఎందుకు తగ్గిపోయిందనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: కరీనా కపూర్ లాకెట్ పై ఖురాన్ వచనాలు: ఆ పార్టీ నేత నుంచి లీగల్ నోటీసులు!
దీనికి ప్రధాన కారణం సృజనాత్మకత లోపించడం మరియు రీమిక్స్ సంస్కృతి పెరిగిపోవడం. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ సంగీత దర్శకులు కొత్త బాణీలు కట్టడం కంటే, 80లు, 90ల నాటి పాత సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం, ఇటీవలి కాలంలో వచ్చిన పెద్ద బాలీవుడ్ సినిమాలలో దాదాపు 40 శాతం కంటే ఎక్కువ పాటలు పాత పాటల రీక్రియేషన్లే ఉంటున్నాయి. అసలు పాటలోని ఆత్మను చంపేసి, కేవలం క్లబ్ బీట్స్ జోడించి వదలడం వల్ల శ్రోతలకు ఆ పాటలపై ఆసక్తి సన్నగిల్లుతోంది. ఒకసారి వినగానే బాగున్నాయనిపించినా, ఆ పాటలకు దీర్ఘకాలిక ఆయుష్షు ఉండటం లేదు. వారంలోపే జనాలు ఆ పాటలని మర్చిపోతున్నారు.
మరోవైపు, సినిమా కథాంశాలలో వచ్చిన మార్పు కూడా సంగీతంపై తీవ్ర ప్రభావం చూపింది. ఒకప్పుడు బాలీవుడ్ అంటేనే స్వచ్ఛమైన ప్రేమకథలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో నిండిన సినిమాలు వచ్చేవి. అలాంటి కథల్లో పాటలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. కథను ముందుకు నడిపించడానికి కవిత్వం ఉట్టిపడే సాహిత్యాన్ని ఉపయోగించేవారు. గుల్జార్, జావేద్ అక్తర్, సమీర్ వంటి రచయితల కలం నుంచి జాలువారిన పదాలు నేరుగా గుండెల్లోకి దిగేవి. కానీ ప్రస్తుతం బాలీవుడ్లో యాక్షన్ థ్రిల్లర్లు, డార్క్ కామెడీలు, బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది.
ఈ తరహా సినిమాలలో పాటలకు పెద్దగా చోటు ఉండటం లేదు. ఉన్నా కూడా అవి కేవలం నేపథ్య సంగీతానికే పరిమితమవుతున్నాయి. అంతేకాకుండా, నేటి తరం పాటలలో హిందీ, ఉర్దూ పదాల స్థానంలో పంజాబీ మరియు ఇంగ్లీష్ పదాల మిశ్రమం విపరీతంగా పెరిగిపోయింది. ఇది సామాన్య శ్రోతలకు, ముఖ్యంగా హిందీయేతర రాష్ట్రాల ప్రజలకు అంతగా కనెక్ట్ కావడం లేదు.
సోషల్ మీడియా మరియు రీల్స్ ప్రభావం కూడా సంగీత నాణ్యతను దెబ్బతీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సంగీత సంస్థలు ఒక పూర్తి స్థాయి 5 నిమిషాల పాటను నిర్మించడం కంటే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్‌లో 15 సెకన్ల పాటు వైరల్ అయ్యే హుక్ స్టెప్స్, క్యాచీ ట్యూన్స్ తయారు చేయడంపైనే దృష్టి పెడుతున్నాయి. అల్గారిథమ్‌లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసే ఈ కృత్రిమ సంగీతంలో సహజమైన మాధుర్యం కరువవుతోంది.
ఒకప్పుడు ఒక పాట హిట్ అవ్వడానికి నెలల తరబడి రేడియోలలో, టీవీలలో మారుమోగేది. కానీ నేడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రోజుకు వందల పాటలు విడుదలవుతుండటంతో, ఏ పాట ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
అదే సమయంలో దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ సంగీత పరంగా అద్భుతమైన ప్రగతి సాధించింది. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల పాటలు నేడు పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్, తమన్, అనిరుధ్ రవిచందర్, ఎం.ఎం. కీరవాణి వంటి సంగీత దర్శకులు అందిస్తున్న వైవిధ్యమైన బాణీలు ఉత్తరాది ప్రేక్షకులను సైతం ఉర్రూతలూగిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, పుష్ప, కెజిఎఫ్, జవాన్ వంటి చిత్రాల విజయంలో దక్షిణాది సంగీత దర్శకుల పాత్ర ఎంతో ఉంది.
యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్‌లో సైతం ఇప్పుడు హిందీ పాటల కంటే దక్షిణాది పాటలే అత్యధిక వ్యూస్ సాధిస్తున్నాయి. బాలీవుడ్ మళ్లీ తన పాత వైభవాన్ని పొందాలంటే రీమిక్స్‌లను పక్కన పెట్టి, స్వచ్ఛమైన మెలోడీలకు, అర్థవంతమైన సాహిత్యానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మీకు నచ్చవచ్చు: Goat Movie Review Telugu: Goat మూవీ రివ్యూ
మీకు నచ్చవచ్చు: శేఖర్ మాస్టర్ వీడియో వైరల్!
[Why Hindi Songs Lost Pan India Craze, Latha Mangeshkar, mohamad rafi, Anandh bakshi, Ar Rehman]
మనర్తి విఘ్నేష్ నిర్మాతగా శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’. సుఖ మీడియా నిర్మాణ భాగస్వామి.
తనదైన నటనతో వైవిధ్యమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ కోమాకుల ఈ చిత్రంలో ఒక కీలకమైన, ఛాలెంజింగ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో కొంత భాగం ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు సుపరిచితమైన దిగ్గజ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ ప్రత్యేకమైన పాత్ర కోసం సుధాకర్ కోమాకుల.. చార్లీ చాప్లిన్ హావభావాలు, బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్‌ను ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.
‘SI యుగంధర్’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాఘవేంద్ర కటారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఒక మంచి, ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారు. ‘Life Is a Dramedy’ (జీవితమే ఒక డ్రామెడీ) అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ కథ ముందుకు సాగుతుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్లు, నవ్వులు, అనుకోని మలుపులు.. ఇలా డ్రామా, కామెడీ, భావోద్వేగాల కలయికే జీవితం అనే సందేశాన్ని ఈ చిత్రం ఆవిష్కరించబోతోంది.
ప్రస్తుత జెన్ జీ (Gen Z) తరానికి చార్లీ చాప్లిన్ పేరు వినగానే గుర్తుకొచ్చేది నవ్వులు, వినోదం, మరపురాని హాస్య సన్నివేశాలు. అయితే ఈ సినిమా కేవలం వినోదానికే పరిమితం కాకుండా, చార్లీ చాప్లిన్ స్ఫూర్తిని గుర్తుచేస్తూ ఒక అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని, భావోద్వేగాలను ప్రేక్షకులకు పరిచయం చేయబోతోంది. నవ్వుల వెనుక దాగి ఉన్న కన్నీళ్లను, కష్టాల మధ్య కూడా జీవితాన్ని ప్రేమించాలనే స్ఫూర్తిని ఈ కథలో చూపించబోతున్నారు.
ఒక సరికొత్త కథాంశంతో, విభిన్నమైన పాత్రలతో రూపొందనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది మే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించి, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
వినోదం, భావోద్వేగం, స్ఫూర్తి కలగలిసిన ఒక సరికొత్త సినీ ప్రయాణానికి ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ సిద్ధమవుతోంది.
[Directed By Charlie Chaplin, Sudhakar Komakula, Raghavendra Katari, Charlie Chaplin, Tollywood]
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
శంషాబాద్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌తో పాటు కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.
ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నైట్ షూటింగ్ ముగించుకుని వస్తుండగా ప్రమాదం జరిగిందని, అయ్యప్ప దయ వల్ల కారులో ఉన్న నలుగురూ సురక్షితంగా ఉన్నామని తెలిపారు.
ప్రస్తుతం శేఖర్ మాస్టర్ అయ్యప్ప మాలలో ఉన్నారు. అందుకే ఆ అయ్యప్ప దయ వల్ల క్షేమంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: శేఖర్ మాస్టర్‌కు యాక్సిడెంట్.. 'కాకా' షూటింగ్ నుంచి వస్తుండగా కారుని ఢీ కొట్టిన ట్రక్.!
స్నేహితులు, శ్రేయోభిలాషులు ఏమైందోనని ఆందోళన చెందుతూ ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నారని.. అందుకే ఈ వీడియో చేస్తున్నానని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.
https://www.instagram.com/reel/Dfon7Y_A93n/
ప్రస్తుతం శేఖర్ మాస్టర్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమాకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్లో భాగంగా రాత్రి వేళల్లో పనిచేసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన కారు ప్రమాదానికి గురవడం ఆందోళన కలిగించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మీకు నచ్చవచ్చు:
రామ్ చరణ్ కోసం సుకుమార్ ప్లాన్.. RC17 షూటింగ్ ముహూర్తం ఫిక్స్.!
చచ్చిపోకముందే వెళ్లిపోండి.. ‘పైర్’ కథ వింటే కన్నీళ్లు ఆగవు.!
[Shekhar Master Accident, Hyderabad, Shekhar Master Reaction, Chiranjeevi, Kaaka Movie]
-సినిమా పేరు: GOAT
-నటీనటులు: సుధీర్ ఆనంద్, దివ్య భారతి, ప్రియాంక, నితిన్ ప్రసన్న, సర్వదమన్ బెనర్జీ, బ్రహ్మాజీ, 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు
-సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
-ఎడిటింగ్: విజయ్
-మ్యూజిక్: జేమ్స్ లియోన్,
-బ్యాక్ గ్రౌండ్ స్కోర్: మణిశర్మ
-నిర్మాత: మొగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి
-సహా నిర్మాత: రవీందర్ రెడ్డి
-బ్యానర్స్: జైష్ణవ్ ప్రొడక్షన్స్, మహాతేజ క్రియేషన్స్
-రచన,దర్శకత్వం: వేదవ్యాస్
-రిలీజ్ డేట్ : డిసెంబర్ 12 ,2026
సుధీర్ ఆనంద్ (సుడిగాలి సుదీర్) క్రేజీ బ్యూటీ దివ్యభారతి జంటగా తెరకెక్కిన మూవీ G.O.A. T .. ప్రచార చిత్రాలతో సినీ అభిమానుల్లో క్యూరియాసిటీ కలిగించి ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
సార్( సుధీర్ ఆనంద్) వైజాగ్ జైలు నుంచి రిలీజైన ఖైది..తన గ్యాంగ్ తో కలిసి ఓసీ( ప్రతి వస్తువుకి డబ్బులు కట్టకుండా) గా బతికేస్తుంటాడు.క్రికెట్ లో బెట్టింగ్ కట్టడాలు, మద్యపానం, ధూమపానం, చిన్న చిన్న సెటిల్ మెంట్స్ లాంటి లక్షణాలు కూడా ఉన్నాయి. చిన్నసైజు రౌడీ అని చెప్పుకోవచ్చు. సుభాషిణి( దివ్య భారతి) సూసైడ్ ఎలా చేసుకోవాలో తెలియడంలో బాగా అనుభవమున్న స్పెషలిస్ట్. ఒక పదిసార్లైనా సూసైడ్ ప్లాన్ చేసుంటుంది. అలాంటి సుభాషిణి పెళ్లికూతురుగా పెళ్లి పీటలు ఎక్కబోతుంటే సార్ ఆమెని పెళ్లి కాకుండా తీసుకొస్తాడు. మొద్దు బాబ్జి( నితిన్ ప్రసన్న) ఒక అసాంఘిక శక్తీ. గోదావరి జిల్లాలోని రుద్రవరం అనే ఊరుని స్థావరంగా చేసుకొని అక్కడి ప్రజలని బెట్టింగ్స్ కి బానిసలుగా మారేలా చేసి వాళ్ళ మరణాలకు కూడా కారణమవుతుంటాడు. బాబ్జికి వ్యతిరేకంగా వెంకటకృష్ణంరాజు(సర్వదమన్ బెనర్జీ) ముప్పై ఏళ్ళ క్రితమే ఒక చట్టం తీసుకొస్తాడు. ఆ చట్టం పేరు G.O.A. T ..గోదావరి అవుట్ డోర్ యాక్టీవిటీస్ ట్రస్ట్.. ఈ ట్రస్ట్ ఉద్దేశ్యం ఏంటి? అది నెరవేరిందా లేదా? సార్ అసలు పేరు సారేనా? ఇంకేమైనా ఉందా? ఉంటె సార్ తాలూకు ఫ్లాష్ బ్యాక్ ఏంటి? సుభాషిణి ఎవరు? అనేదే GOAT
ఎనాలసిస్
కథ చాలా మంచి కాన్సెప్ట్..ఈ విషయం సినిమా స్టార్టింగ్ లోనే అర్థమైపోతుంది. ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే పాయింట్ కూడా. ఫస్ట్ హాఫ్ కూడా సూపర్ గా ఉంటుంది. దీంతో బొమ్మ హిట్ అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్ లో కథనం నీరసించడంతో పాటు దారి తప్పింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఒక డైరెక్టర్ నేనా అనే డౌట్ కూడా వస్తుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సినిమా ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కర్ని ఆలోచింపచేస్తాయి. కాకపోతే నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ గోల్ ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది. ఎందుకంటే అతని క్యారక్టర్ నే కథకి మూలం కాబట్టి.
సార్(సుధీర్) ట్రాక్ తో పాటు సుభాషిణి ట్రాక్, సుభాషిణి ద్వారానే మెయిన్ కథలోకి వెళ్లడం అయితే సూపర్. పృథ్వీ తో వచ్చిన హాస్పిటల్ సీన్స్ లో వచ్చిన కామెడీ అయితే ఎక్స్ లెంట్. ఈ ట్రాక్ ని కథకి ఇంకా ఉపయోగించుకోవాల్సిందేమో. సాంగ్స్ సైతం బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సైతం బాగుంది. సెకండ్ హాఫ్ లో చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో ఎవరకి ఎవరు ఏం అవుతారో తెలిసింది కాబట్టి, సార్ తన లక్ష్య సాధనకి త్వరగా వెళ్లేలా చెయ్యాల్సింది.
అలా కాకుండా సుభాషిణి, సార్ మధ్య మళ్ళీ ఎక్కువ ట్రాక్ నడించింది. కాకపోతే ఆ సీన్స్ బాగానే ఉన్నా, మెయిన్ కథలోకి ఎందుకు వెళ్లరని అనిపిస్తూ ఉంటుంది. బాబ్జి( నితిన్ ప్రసన్న) యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ క్యారక్టర్ కి అంతగా సెట్ అవ్వలేదు. సర్వదమన్ బెనర్జీ ట్రాక్ బాగుంది. చివరి అరగంట పస లేని సీన్స్ వచ్చాయి. అసలు బాగా చదువుకోవడంతో పాటు ఎంతో తెలివిగల సుభాషిణి హీరో(సార్) కోసం తనకి ఇష్టం లేని ఒక రౌడీ దగ్గరకి వచ్చి హీరోని ఏం చేయవద్దు నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటుందా! ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది.
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
సార్ గా సుధీర్ ప్రసాద్ సెటిల్డ్ పెర్ఫార్మ్ చేసాడు. క్రికెటర్ గణగా చేసినా అది సుధీరో కాదో తెలియదు. సుభాషిణిగా దివ్యభారతి పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా మొత్తానికే తన క్యారక్టర్ హైలెట్. అందుకు తగ్గట్టే తన అందంతో స్క్రీన్ కి కూడా అందం తీసుకొచ్చింది. సర్వదమన్ బెనర్జీ, సుధీర్ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ గా తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేసారు. బాబ్జిగా నితిన్ ప్రసన్న సెట్ కాలేదు. పెర్ఫార్మ్ మాత్రం బాగుంది. బ్రహ్మాజి స్క్రీన్ షేరింగ్ తక్కువే అయినా మరోసారి అద్భుతమైన పెర్ఫార్మ్ తో మెప్పించాడు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జేమ్స్ లియోన్ మ్యూజిక్ గోట్ కి అదనపు హంగులని ఇచ్చాయి. సీనియర్ కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ మరో సారి తన ఫొటోగ్రఫీ తో ప్రతి ఫేమ్ ని అత్యంత సుందరంగా మలిచాడు. వేదవ్యాస్ దర్శకుడిగా సక్సెస్ అయినా రచయితగా ఇంకా తన ప్రతిభని చాటాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఒక రేంజ్ లో ఉన్నాయి.
బలాలు
1 . కథ
2 . సుధీర్,దివ్య భారతి పెర్ఫార్మెన్స్
3 . ఫస్ట్ హాఫ్
బలహీనతలు
1 . సెకండ్ హాఫ్ లో చివరి అరగంట నడిచిన కథనం
చివరిగా చెప్పాలంటే మంచి కథతో పాటు మంచి సందేశంతో తెరకెక్కింది.
రేటింగ్ 2 .5 /5
అరుణాచలం
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉంటేనే మనం ఎలాంటి పనైనా చురుగ్గా చేసుకోగలుగుతాము. కానీ మారుతున్న జీవనశైలి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల చాలామంది చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఎముకలు విరిగినప్పుడు లేదా పగుళ్లు ఏర్పడినప్పుడు, వాటిని తిరిగి పూర్వ స్థితికి తీసుకురావడానికి వైద్యులు సరైన విశ్రాంతి మరియు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని సూచిస్తారు. అయితే, వారం కేవలం రెండు సార్లు కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలను మన ఆహారంలో భాగంగా చేసుకుంటే, విరిగిన ఎముకలు సైతం ఉక్కులా మారతాయని ఆరోగ్య నిపుణులు నిరూపిస్తున్నారు. ఇందులో ప్రధానంగా నిపుణులు సూచించేది సహజ సిద్ధమైన నువ్వులు మరియు బెల్లం కలయిక.
ప్రతి వారం రెండుసార్లు నువ్వుల ఉండలు లేదా నువ్వులతో చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన కాల్షియం, మెగ్నీషియం, మరియు ఫాస్పరస్ పుష్కలంగా అందుతాయి. కేవలం నువ్వులే కాకుండా, మన సాంప్రదాయ వంటకాల్లో వాడే రాగులు కూడా ఎముకల బలానికి ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి. రాగులలో పాలలో కంటే దాదాపు 3 రెట్లు అధికంగా కాల్షియం లభిస్తుంది. వారంల రెండుసార్లు రాగి జావ లేదా రాగి సంగటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎముకల సాంద్రత అద్భుతంగా పెరుగుతుంది.
అలాగే, ఎముకలు వేగంగా అతుక్కోవడానికి మరియు దృఢంగా మారడానికి విటమిన్ డి మరియు ప్రొటీన్లు అత్యంత కీలకం. దీనికోసం రోజూ లేదా కనీసం వారానికి రెండు నుంచి మూడుసార్లు కోడిగుడ్డు తెల్లసొన, చేపలు వంటి ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. చేపలలో లభించే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎముకలలో వాపులను తగ్గించి, కణజాలం వేగంగా పునరుత్పత్తి అయ్యేలా సహాయపడతాయి. మరోవైపు, పాల ఉత్పత్తులైన పాలు, పెరుగు, మరియు మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం రాకుండా కాపాడుకోవచ్చు. చాలా మంది పాలు తాగడానికి ఇష్టపడరు, అలాంటి వారు పాలకు బదులుగా రోజువారీ ఆహారంలో పెరుగు లేదా పన్నీర్‌ను చేర్చుకోవచ్చు. అలాగే, మొలకెత్తిన ధాన్యాలు మరియు నానబెట్టిన బాదం పప్పులను తినడం ద్వారా ఎముకలకు అవసరమైన సూక్ష్మపోషకాలు లభిస్తాయి. బాదంలో ఉండే విటమిన్ ఇ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఎముకల బలాన్ని పెంపొందించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
వీటితో పాటు, ఆకుకూరలు ముఖ్యంగా బచ్చలికూర మరియు మునగాకు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మునగాకులో సాధారణ పాల కంటే 4 రెట్లు అధికంగా కాల్షియం మరియు క్యారెట్ల కంటే 7 రెట్లు అధికంగా విటమిన్ ఎ లభిస్తాయని అనేక శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వారంల కనీసం రెండు సార్లు మునగాకు కూర లేదా మునగాకు పప్పును తీసుకోవడం వల్ల ఎముకలు ఉక్కులా మారడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆకుకూరలలో ఉండే విటమిన్ కె ఎముకల ఖనిజీకరణను మెరుగుపరిచి, పగుళ్లను త్వరగా మాన్పడానికి సహాయపడుతుంది. అలాగే పసుపు మరియు అల్లం వంటి సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు కీళ్ల నొప్పులను తగ్గించి ఎముకల కణాలను రక్షిస్తాయి.
ఇది కూడా చదవండి:లూజ్ మోషన్స్ తగ్గడానికి, టీ ఆకులు మింగుతున్నారా? ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి!
శరీరంలో కాల్షియం ఎంత ఉన్నప్పటికీ, అది ఎముకలకు సరిగ్గా అందాలంటే విటమిన్ డి చాలా ముఖ్యం. ఉదయపు ఎండలో కనీసం 15 నుండి 20 నిమిషాలు గడపడం ద్వారా శరీరానికి కావలసిన సహజమైన విటమిన్ డి లభిస్తుంది. ఈ విటమిన్ డి సహాయంతోనే ఆహారం ద్వారా మనం తీసుకునే కాల్షియం పూర్తిగా రక్తనాళాల ద్వారా ఎముకలకు చేరుకుంటుంది. ఎండలో తిరగడం వల్ల కేవలం విటమిన్ డి మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. ఎముకల దారుఢ్యాన్ని కోల్పోతున్న వృద్ధులు మరియు మహిళలు ఈ చిన్న జీవనశైలి మార్పులను పాటించడం ద్వారా ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చు.
ఆహారపు అలవాట్లతో పాటు, తగినంత నీరు త్రాగడం మరియు నిద్రపోవడం కూడా ఎముకల పునరుద్ధరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు త్రాగడం వల్ల శరీరం లోని మలినాలు బయటకు పోయి కణాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ధూమపానం మరియు మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత ముఖ్యం. ఇటువంటి హానికరమైన అలవాట్లు శరీరంలో కాల్షియం శోషణను అడ్డుకుని ఎముకలను బోలుగా మారుస్తాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటూ, ఈ పోషకాహార నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే వృద్ధాప్యంలో కూడా ఎలాంటి కీళ్ల నొప్పులు లేకుండా ఉక్కులాంటి బలమైన ఎముకలను సొంతం చేసుకోవచ్చు.
మీకు నచ్చవచ్చు:సింక్‌లో, ఇవి వేస్తే ముప్పు తప్పదు.. నిపుణుల హెచ్చరిక!
దీపావళి స్పెషల్: నో ఆయిల్ స్ప్రౌట్స్ కెనాప్స్ చాట్, తయారు చేసే విధానం!
Bone Healing Foods, Fracture Recovery Diet, How To Heal Broken Bones, Bone Strengthening Foods, Calcium Rich Diet Tips, Doctor Health Advice, Health Tips In Telugu.
ప్రస్తుత ఆధునిక ఉరుకులు పరుగుల జీవితంలో మహిళలు ఇంటి బాధ్యతలతో పాటు ఆఫీస్ టెన్షన్స్, ఉద్యోగ బాధ్యతలను సైతం ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ బిజీ లైఫ్‌స్టైల్, నిత్య ఒత్తిడి కారణంగా చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ తీవ్రమైన మానసిక ఆందోళన, అలసటను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి మన పూర్వీకులు అనుసరించిన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మళ్లీ దరిచేర్చుకోవడం చాలా ముఖ్యం. పాతకాలంలో బాగా నీరసంగా, నిస్సత్తువగా ఉన్నప్పుడు మన పెద్దలు గిన్నెడు బార్లీతో చేసే అద్భుతమైన వంటకాన్ని తినేవాళ్లు. ఇది కేవలం రుచికరమైన స్వీట్ మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడిని, టెన్షన్‌ను ఇట్టే తగ్గించే ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది.
ఈ పోషకభరితమైన బార్లీ పాయసం తయారీ కోసం ప్రధానంగా 1 కప్పు బార్లీ గింజలు, 2 కప్పుల నీరు, 1 కప్పు బెల్లం పొడి, అర లీటర్ కొబ్బరి పాలు, 6 నుండి 8 పచ్చి యాలకులతో తయారు చేసిన అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి అవసరమవుతాయి. వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి, గుప్పెడు జీడిపప్పు, ఎండుద్రాక్షలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ పదార్థాలన్నీ మన శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో అద్భుతంగా సహకరిస్తాయి.
ఈ పాయసం తయారు చేయడానికి ముందుగా బార్లీని తీసుకుని శుభ్రంగా కడిగి నీటిని వడకట్టాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో 2 కప్పుల నీరు పోసి, బార్లీ బాగా మెత్తగా ఉడికే వరకు సుమారు 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. కుక్కర్లో ప్రెషర్ మొత్తం పూర్తిగా పోయే వరకు దానిని అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల బార్లీ గింజలు మెత్తగా ఉడికి పాయసానికి అద్భుతమైన ఆకృతిని ఇస్తాయి.
ఇప్పుడు ఉడికించిన బార్లీ మిశ్రమంలో తగినంత బెల్లం పొడిని వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత బెల్లం మొత్తం పూర్తిగా కరిగే వరకు మీడియం మంట మీద బాగా కలుపుతూ ఉండాలి. ఆపై సన్నని మంట మీద ఈ బార్లీని మరో 2 నిమిషాల పాటు ఉడికించి, మంటను కొద్దిగా తగ్గించాలి. బెల్లం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్ అందడంతో పాటు రిఫైండ్ షుగర్‌తో వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
ఇది కూడా చదవండి:నిమ్మ, నారింజ తొక్కల వెనుక ఉన్న అసలు నిజాలు మరియు ఆరోగ్య హెచ్చరికలు
ఆ తరువాత దీనిలో అర లీటర్ కొబ్బరి పాలు, పచ్చి యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మీడియం మంట మీద సుమారు 10 నిమిషాల పాటు దీనిని మెల్లమెల్లగా బాగా ఉడకనివ్వాలి. కొబ్బరి పాలు చేర్చడం వల్ల పాయసం ఎంతో కమ్మటి వాసనతో పాటు క్రీమీ టెక్చర్‌ను సంతరించుకుంటుంది. ఇది మన మనసును, శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది.
చివరగా ఒక చిన్న పాన్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి, అందులో నాలుగు జీడిపప్పులు, ఎండుద్రాక్షలను వేసి దోరగా వేయించాలి. ఈ పోపును పాయసంలో కలుపుకుంటే గుమగుమలాడే కమ్మనైన బార్లీ పాయసం సిద్ధమవుతుంది. దీనిని వేడివేడిగా తిన్నా లేదా ఫ్రిజ్‌లో చల్లబరచుకుని తిన్నా రుచి అదిరిపోతుంది. ఉద్యోగ ఒత్తిడిని తరిమికొట్టి రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఈ ఆరోగ్యకరమైన బార్లీ పాయసాన్ని తప్పకుండా ప్రయత్నించండి.
మీకు నచ్చవచ్చు:పక్షవాతం, ప్రాణాంతకం కాకుండా ఉండాలంటే. వెంటనే ఈ పని చేయండి!
పిల్లల కోసం విటమిన్లు, ఐరన్‌తో నిండిన ఈజీ ఏబీసీ గమ్మీస్ రెసిపీ!
Barley Kheer Recipe, Stress Relief Foods, Healthy Payasam Ideas, Working Women Health Tips, Energy Boosting Sweet Recipes, Doctor Health Advice, Health Tips In Telugu.
శరీరానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మందులతో ఇంకా చికిత్సలతో ఈజీగా తగ్గించుకోవచ్చు. కానీ కొన్ని మొండి వ్యాధులు మాత్రం ఎన్ని మందులు వాడినా అస్సలు తగ్గవు. అటువంటి వాటిలో తామర కూడా ఒకటి. ఇది ఒకసారి శరీరానికి సోకిందంటే అంత తొందరగా వదిలిపెట్టదు. నిర్లక్ష్యం చేస్తే, అది శరీరంలోని అనేక భాగాలకు వ్యాపించడమే కాకుండా, అంటువ్యాధి కాబట్టి ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది. ఈ మొండి తామర సమస్యకు రకరకాల మందులు వాడి విసిగిపోయిన వారికి ఒక అద్భుతమైన హోం రెమిడీ అందుబాటులో ఉంది. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేవు, పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా నయం చేసుకోవచ్చు.
తామర అనేది ఒక చర్మ సంబంధిత అంటు వ్యాధి, ఇది వివిధ రూపాల్లో వస్తుంది. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఇది నేరుగా తాకడం వలన ఇంకా వారి వస్తువులు, దుస్తులు వాడటం వలన వేగంగా వ్యాపిస్తుంది. తామర వల్ల చర్మం పొడిబారి, పొలుసులు ఏర్పడి, మచ్చలు పడటం, తీవ్రమైన దురద రావడం వంటి బాధాకరమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు, కానీ చిన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా గజ్జలు, చంకలు వంటి తడిగా ఉండే ప్రదేశాలలో ఇది ఎక్కువగా వస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
తామరలో ప్రధానంగా అటాపిక్ డెర్మటైటిస్ అనేది ఒక రకమైన అలెర్జీ. చిన్న పిల్లలలో, ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు వారికి ఇది ఎక్కువగా వస్తుంది. ఆహార పదార్థాలు, పర్యావరణ మార్పులు, జన్యుపరమైన కారణాల వల్ల ఇది వచ్చే అవకాశం ఉంది. మరొకటి కాంటాక్ట్ డెర్మటైటిస్. తామర ఉన్న వ్యక్తిని తాకినప్పుడు లేదా కొన్ని వాతావరణ మార్పుల వల్ల ఇది రావచ్చు. దీనివల్ల చర్మం ఎర్రగా మారి తీవ్రంగా దురద పెడుతుంది. సాధారణంగా ఇది చేతులు మరియు కాళ్ళపై ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రకృతి మనకు అద్భుతమైన వస్తువులను ప్రసాదించింది. వేపాకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుద్ధి చేస్తాయి, మంటలను తగ్గిస్తాయి. అలాగే, పసుపులోని కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో వాపు, మంట వంటి సమస్యలను తగ్గించి, చర్మానికి మంచి రక్షణ ఇస్తుంది. మరోవైపు, కొబ్బరి నూనె యాంటీ ఇన్ఫ్లమేటరీ, లినోలిక్ యాసిడ్, విటమిన్ F, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండి, చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి:గుడ్లు పగిలిపోకుండా, పర్ఫెక్ట్ బాయిల్డ్ ఎగ్స్ తయారీకి అద్భుతమైన చిట్కాలు!
ఈ అద్భుతమైన ఇంటి నివారణ పద్ధతిని తయారు చేసుకోవడం చాలా సులభం. ముందుగా, వేపాకులను శుభ్రంగా కడిగి, నీడలో, గాలి బాగా తగిలే చోట ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత, 10 నిమిషాల పాటు ఎండలో ఉంచి, ఆపై వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.
ఒక బౌల్ తీసుకుని, మీరు ఎంత వేప పొడి వేసుకుంటారో అంత పసుపు పొడిని కూడా సమానంగా వేయాలి. ఈ రెండింటినీ బాగా కలిపి, కొద్దికొద్దిగా కొబ్బరి నూనె కలుపుతూ, పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం మరీ చిక్కగా గానీ, పల్చగా గానీ ఉండకుండా చూసుకోవాలి. వీలైతే, ఇందులో రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్ కలుపుకోవచ్చు. ఇది చర్మ అలెర్జీలకు చాలా ప్రభావవంతంగా పనిచేసి మొండి తామరను శాశ్వతంగా తరిమికొడుతుంది.
మీకు నచ్చవచ్చు:ప్రెగ్నెన్సీ ఫస్ట్ మంత్స్ డైట్: నిపుణులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు
శరీరానికి, ఉక్కులాంటి బలాన్నిచ్చే, మేక తలకాయ కూర రహస్యం!
Ringworm Home Remedies, Skin Fungus Treatment, Itching And Rash Relief, Natural Skin Care Tips, Herbal Remedies For Fungus, Doctor Health Advice, Health Tips In Telugu.
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రభావం వైసీపీపై ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయాలలోకి ప్రవేశించడానికి ముందు నుంచి కూడా విజయసాయి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో కూడా విజయసాయి సహ నిందితుడు. జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నాయి.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన విజయసాయి, ఇప్పుడు పరివర్తన రాజనీతి పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.
దేశభక్తి, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా తన పార్టీ పనిచేస్తుందని విజయసాయి పార్టీ ప్రకటన సందర్భంగా చెప్పారు. పార్టీ అధికారిక ప్రకటనతో పాటు జెండాను కూడా ఆవిష్కరించిన విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సంస్కృతిని తీసుకువస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
ఈ పరిణామం వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకంగా, పార్టీ నేతకు అధినేతకు అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకోవడం ఆ పార్టీకి ఏదో మేరకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తమౌతోంది.
ఇది కూడా చదవండి: జయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!
పార్టీలో అసంతృప్తితో ఉన్న, అలాగే ఆయనతో సత్సంబంధాలు కలిగిన కొందరు నేతలు భవిష్యత్తులో వైసీపీని వీడి విజయసాయి పంచన చేరే అవకాశలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. అదలా ఉంచితే.. కొత్త పార్టీ ద్వారా ఆయన ఏ మేరకు ప్రభావం చూపగలరు, ప్రజాదరణను ఏ విధంగా సంపాదించుకుంటారు అనే విషయంలో కూడా రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
రానున్న కాలంలో విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) ప్రయాణం అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను ఏ మేరకు ఎలా ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చెప్పిన ముహూర్తానికి చెప్పినట్లుగా తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విజయసాయి, ముందు ముందు రాష్ట్ర రాజకీయాలలో ఏ మేరకు ప్రభావం చూపుతారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్త మౌతోంది.
మీకు నచ్చవచ్చు: వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి
విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.?
[Effect of Vijayasai Reddy New Party onYCP, Parivarthana Rajaneethi Party, PRP, Political Impact, AP Politics, Telugu One]
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి కొత్తపార్టీని అధికారికంగా ప్రకటించారు. తాను ఏర్పాటు చేసిన పార్టీ పెరును ఆయన ప్రకటించారు. విజయవాడ ఏ కన్నెన్షన్ వేదికగా బుధవారం (నవంబర్ 11) సరిగ్గా 11 గంటల 11నిముషాలకు ఆయన తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. తన కొత్త పార్టీ పేరు పీఆర్పీ (పరివర్తన రాజనీతి పార్టీ)గా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దీంతో ఏపీ రాజకీయాలలో మరో కొత్తపార్టీ ఆవిర్భవించింది.
గతంలో వైపీపీలో కీలక నేతగా చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి, ఆ తరువాత ఆ పార్టీకీ, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా సందర్భంగా ఇక రాజకీయాలకు దూరం, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన విజయసాయి రెడ్డి, ఆ నిర్ణయం మార్చుకుని, యూటర్న తీసుకుని మళ్లీ రాజకీయ ప్రవేశం చేశారు.
తన కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన ఆయన ఈ సందర్భంగా పార్టీ జెండా, ఎజెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో కుల, మత రాజకీయాలకు స్వస్తి పలకడంతో పాటు, రెండు కుటుంబాల ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలకడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
దేశభక్తి, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పీఆర్పీ పనిచేస్తుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ముఖ్యంగా యువతను భావి నాయకులుగా తీర్చిదిద్దే ఫ్యాక్టరీగా తమ పార్టీ పని చేస్తుందన్న విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో కరువు కాటకాలు, కరెంటు కోతలు లేని పరిస్థితులను సృష్టించడం, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం తమ ధ్యేయమన్నారు.
ఇది కూడా చదవండి: వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి
ఇక ఎన్నికల హామీల విషయంలోనూ ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించడం, చదువుల భారాన్ని తగ్గించి వంద శాతం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు,
విజయసాయిరెడ్డి నూతన పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాలలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు అసంతృప్త నేతలు ఆయన బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయాలపై చూపే ప్రభావంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరలేచింది.
మీకు నచ్చవచ్చు: విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!
తెలుగుదేశం, వైసీపీ దొందూదొందే.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. విజయసాయిరెడ్డి.!
[Vijayasai Reddy New Party PRP, Parivarthana Rajaneethi Party, Andhra Pradesh Politics, Vijayawada Convention Center, Gen Z Leaders, Telugu One]
తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ తనదైన ముద్ర వేస్తూ తొలి ప్రయత్నంలోనే తన టీవీకే పార్టీని గెలిపించుకుని, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి సుమారు 35 శాతానికి పైగా ఓటు బ్యాంకును సాధించారు.
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల కాలంలో టీవీకే ప్రభుత్వానికి చెందిన కొందరు నేతల వివాదాస్పద ప్రవర్తన పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తోంది. గతంలో ఒక మంత్రి డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో వివాదంలో చిక్కుకోగా, తాజాగా తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే రవిశంకర్ దురుసు ప్రవర్తన వివాదంగా మారింది.
తిరుచిరాపల్లి జిల్లాలో తమ ప్రాంతంలోని తాగునీటి ఎద్దడి, చెత్తాచెదారం పేరుకుపోవడం వంటి సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్లిన కార్తీక్ కుమార్ అనే వ్యక్తిపై డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ భౌతిక దాడికి దిగారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి తన వద్దకు వచ్చిన వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకోవడం దుమారానికి దారితీసింది.
ఇది కూడా చదవండి: చంద్రబాబుతో భేటీ: విజయ్ విక్టరీ సింబల్.. దక్షిణాది పొలిటికల్ సినేరియో మార్పునకు సంకేతమా.?
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో టీవీకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రజా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో హింసాత్మక మరియు ఆధిపత్య రాజకీయాలకు స్వస్తి పలకాలని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేల తీరు ఆయన ఆశయాలకు గండికొడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం కొద్ది నెలలు మాత్రమే అయినప్పటికీ, ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం కావడం పార్టీకి నష్టం చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి విజయ్, తప్పు చేసే ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుని గాడిన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
ముఖ్యమంత్రిగా విజయ్ పని తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో చూపుతున్న వేగం, నిరాడంబరత ప్రజలను ఆకట్టుకుంటున్నప్పటికీ, టీవీకే ఎమ్మెల్యేల తీరు, వారిపై వెల్లువెత్తుతున్న విమర్శలు పార్టీకే కాదు, వ్యక్తిగతంగా విజయ్ కూడా నష్టం చేకూరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. గీత దాటిన ఎమ్మెల్యేలపై విజయ్ కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
మీకు నచ్చవచ్చు: తమిళనాడు సీఎం విజయ్ పై ఎన్నికల కేసు: ఈ నెల 14న తీర్పు.!
విడాకుల కేసు: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్ వైఫ్.!
[TVK MLAS Crossing Line, Tamilnadu Government, CM Vijay, Deputy Speaker Ravi Shankar, Controversy, Telugu One]
ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే చాలామంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వయసు పెరిగిన తర్వాత మాత్రమే వచ్చే సమస్యగా భావించే ఆర్థరైటిస్ ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తోంది. అసలు చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు రావడానికి కారణాలేంటి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అంటే ఏమిటి? ఈ సమస్యకు వ్యాయామానికి ఉన్న సంబంధం ఏమిటి? కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కీళ్లు మన శరీర కదలికలకు ఎంతో కీలకం. నడవడం, మెట్లు ఎక్కడం, కూర్చోవడం, నిలబడటం వంటి రోజువారీ పనులన్నీ కీళ్ల సహకారంతోనే సాధ్యమవుతాయి. అయితే శారీరక శ్రమ తగ్గడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు కీళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా మోకాళ్లపై ఒత్తిడి పెరిగినప్పుడు నొప్పి, బిగుతుగా అనిపించడం, కదలికల్లో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి.
కీళ్ల నొప్పులు రాకుండా ఉండటానికి, మోకాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రోజువారీ వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ వీడియోలో Dr. Bhaskarకీళ్ల ఆరోగ్యం, ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి ముఖ్యమైన విషయాలను వివరించారు. అలాగే మోకాళ్ల కదలికలు మెరుగుపడటానికి, కండరాలు బలపడటానికి, కీళ్లపై ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఐదు వ్యాయామాల గురించి తెలియజేశారు.
ఈ ఐదు వ్యాయామాలను ఎలా చేయాలి? వాటిని రోజువారీ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి? కీళ్ల నొప్పులతో బాధపడేవారు వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు ఎలాంటి వ్యాయామాలను ఎంచుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి పిండికూరతో కిడ్నీ రాళ్లు కరుగుతాయా.. డాక్టర్ ఏం చెబుతున్నారు
కీళ్ల నొప్పులు ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన వ్యాయామాలు సరిపోవు. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే తమకు తగిన వ్యాయామాలను ఎంచుకోవాలి. నొప్పి పెరిగేలా బలవంతంగా వ్యాయామాలు చేయకూడదు.
కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మోకాళ్ల నొప్పుల పట్ల అవగాహన పెంచుకోవడానికి డాక్టర్ భాస్కర్ అందిస్తున్న ఈ విలువైన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోండి.
మరిన్ని ఆరోగ్య విషయాలు, నిపుణుల సలహాలు, ఉపయోగకరమైన సమాచార వీడియోల కోసం TeluguOne Healthను ఫాలో అవ్వండి.
మనం రోజూ తినే ఆహారంలో కొన్ని కాంబినేషన్స్ ట్రై చేస్తుంటాం. కానీ ఏ ఆహార పదార్థాన్ని వేటితో కలిపి తింటే మన శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయనే విషయం మీద చాలామందికి స్పష్టత ఉండదు. మనం తినే వాటిలో కొన్ని కాంబినేషన్ లు ఆరోగ్యానికి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అలాంటి కొన్ని అరుదైన , అత్యంత ప్రయోజనకరమైన ఫుడ్ కాంబినేషన్ లు ఏవో.. వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో గురించి వివరంగా తెలుసుకుంటే..
పుచ్చకాయ.. ఉప్పు..
మనలో చాలా మందికి పుచ్చకాయ అనగానే గుర్తుకు వచ్చేది కేవలం తియ్యటి రుచి మాత్రమే. అయితే పుచ్చకాయ ముక్కల మీద కొద్దిగా ఉప్పు చల్లుకొని తింటే దాని రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా రెట్టింపు అవుతాయి. పుచ్చకాయలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఉప్పులో సోడియం లభిస్తుంది. ఈ రెండు కలిసి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండేలా చూస్తాయి. ముఖ్యంగా ఎండకాలంలో లేదా వర్కవుట్లు చేసిన తర్వాత ఈ కాంబినేషన్ శరీరాన్ని తక్షణ శక్తితో పాటు హైడ్రేట్ గా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది.
బాదం..డార్క్ చాక్లెట్..
బాదం పప్పులను డార్క్ చాక్లెట్ తో కలిపి తీసుకోవడం మరొక మంచి అలవాటు. బాదం పప్పులో శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు , విటమిన్ ఈ లభిస్తాయి. అలాగే డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువగా ఉండే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఈ రెండింటి కలయిక శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ శక్తిని గణనీయంగా పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది , గుండె సంబంధిత సమస్యలు రాకుండా రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఓట్స్.. పెరుగు..
ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తినడం చాలా మందికి అలవాటు. అయితే ఈ ఓట్స్ ను పెరుగుతో కలిపి తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఓట్స్ లో ప్రీబయోటిక్స్ ఉంటాయి. అలాగే పెరుగులో మంచి బ్యాక్టీరియాను అందించే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ రెండు కలిసి కడుపులోని జీర్ణక్రియను మెరుగుపరచడంలో , గట్ హెల్త్ ని ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. పొట్టకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి ఈ ఆహార కాంబినేషన్ మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ఇది కూడా చదవండి మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..!
గ్రీన్ టీ.. నిమ్మరసం..
బరువు తగ్గాలనుకునేవారు లేదా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టేవారు గ్రీన్ టీ తాగడం సాధారణం. అయితే గ్రీన్ టీ లో కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగితే దాని ప్రయోజనాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లను శరీరం వేగంగా గ్రహించేలా సహాయపడుతుంది. సాధారణంగా గ్రీన్ టీ తాగడం వల్ల అందే పోషకాలు నిమ్మకాయ కలవడం వల్ల మరింత మెరుగ్గా పనిచేస్తాయి.
పసుపు పాలు.. మిరియాల పొడి..
మన ఇంట్లో తరచూ చేసుకునే పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగడం మన సాంప్రదాయం. అయితే ఈ పసుపు పాలలో చిటికెడు మిరియాల పొడి కూడా కలిపితే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. మిరియాలలో పైపరిన్ అనే గుణం ఉంటుంది. ఇది పసుపులోని కర్క్యుమిన్ అనే మూలకాన్ని శరీరం త్వరగా , పూర్తిగా గ్రహించడానికి సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఎముకల నొప్పులు , ఇతర ఆరోగ్య సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మనం తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఏ ఆహారాన్ని ఏ పదార్థంతో కలిపి తినాలో తెలుసుకొని పాటిస్తే శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ అద్భుతమైన ఆహార కాంబినేషన్ లను దైనందిన జీవితంలో భాగం చేసుకొని పూర్తి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు ఇలా చేస్తే చాలు... పిల్లలు ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలంటే ఇష్టపడతారు..!
ప్రతిరోజూ ఉదయం గొంతుకు హాయిగా ఉండేలా వేడి వేడిగా టీ తాగి రోజును ప్రారంభించడం చాలా మందికి అలవాటు. అయితే ఆ రొటీన్ టీకి బదులుగా అప్పుడప్పుడు కొన్ని సుగంధ ద్రవ్యాలు , మూలికలను జోడించి తయారు చేసుకునే పానీయాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని హెర్బల్ టీలు అని అంటారు.
మన వంటింట్లో సులభంగా లభించే మసాలా దినుసులతోనే ఈ టీల ను తయారు చేసుకుని తాగవచ్చు. అలా వంటిట్లో ఉండే మసాలా దినుసుల్లో అనాస పువ్వు కూడా ఒకటి. ఈ అనాస పువ్వుతో తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చిన్న పువ్వు కేవలం వంటకాలకు రుచిని ఇవ్వడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే..
అనాస పువ్వు టీ..
ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ ఫీవర్స్ , ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. జ్వరం లేదా ఏదైనా వైరస్ లేదా శ్వాసకోశ సమస్యలు తలెత్తినప్పుడు ప్రకృతి మనకు ప్రసాదించిన అనాస పువ్వును ఉపయోగించి సులభంగా హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు. అనాస పువ్వును చిన్న ముక్కలుగా చేసి, నీటిలో మరిగించి టీలా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రయోజనాలు..
వైరల్ ఫీవర్.. శ్వాసకోశ సమస్యలు..
వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, వైరస్ జ్వరాలు సర్వసాధారణం. అనాస పువ్వులో యాంటీ వైరల్ , యాంటీ మైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించే హానికారక వైరస్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. శ్వాసనాళాల్లో చేరిన శ్లేష్మాన్ని కరిగించి, గొంతు నొప్పి , ఊపిరితిత్తుల ఇబ్బంది నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.
జీర్ణక్రియ ..
తిన్న ఆహారం సరిగా అరగకపోవడం, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ టీ చాలా బాగా పనిచేస్తుంది. అనాస పువ్వులోని పోషకాలు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి, జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. భోజనం తర్వాత లేదా ఉదయం పూట ఈ టీ తాగడం వల్ల పొట్ట తేలికగా ఉంటుంది.
ఇది కూడా చదవండి షుగర్ పేషెంట్లు తప్పక తెలుసుకోవాలి ! ముఖ్యమైన డాక్టర్ సూచనలు
రోగనిరోధక శక్తి పెంపు..
శరీరంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే చిన్నచిన్న అనారోగ్యాలు కూడా త్వరగా చుట్టుముడతాయి. అనాస పువ్వు టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది , ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ లభిస్తుంది.
కీళ్ల నొప్పులు, వాపులు తగ్గించడం..
శరీరంలో ఎక్కడైనా వాపులు లేదా కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు ఈ టీ సహజ నివారణగా పనిచేస్తుంది. దీనిలో ఉండే కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు శరీరంలో మంటను, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. వయసు మళ్లిన వాళ్ళలో లేదా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
మానసిక ప్రశాంతత , నిద్రలేమి నివారణ..
రోజంతా పడిన అలసట, ఒత్తిడి కారణంగా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. అనాస పువ్వు టీలో ఉండే సువాసన , మృదువైన గుణాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది మనసును రిలాక్స్ చేసి చక్కగా నిద్ర పట్టేలా సహాయపడుతుంది.
చర్మ సౌందర్యం..
శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు వస్తుంటాయి. ఈ హెర్బల్ టీ శరీరాన్ని శుభ్రపరిచి, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారడానికి దోహదపడుతుంది.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు థైరాయిడ్ PCOS గట్ హెల్త్.. వీటి మధ్య సంబంధం ఏమిటి.!
మహిళలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడని అండాశయ క్యాన్సర్ లక్షణాలివే!
What Happens to Your Body When You Drink Star Anise Tea,Amazing Benefits Revealed,Star Anise Tea,Amazing Benefits for Your Body
