LATEST NEWS
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ, జాతీయ స్థాయిలో మోదీ-అమిత్ షా ద్వయం అనుసరిస్తున్న వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో, బలమైన ప్రాంతీయ శక్తులు సైతం కేంద్ర పెద్దల చాణక్యానికి తలవంచక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణ వరకు ప్రాంతీయ అధినేతల అహంకారం, వ్యూహాత్మక తప్పిదాలు వారి పతనానికి ఏ విధంగా దారితీస్తున్నాయో  తెలుగువన్ వాస్తవ వేదికలో జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు.  రాజకీయాల్లో ఎప్పుడైనా పోరాటం ఉండాలని, ఎక్కడైతే రాజీ పడతారో అక్కడే పతనం ప్రారంభమవుతుందని  జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన  మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు. పశ్చిమ బెంగాల్ ఉదాహరణను తీసుకుంటే..  మమతా బెనర్జీ బలమైన నాయకురాలైనప్పటికీ, ఇండియా బ్లాక్‌లో ఉంటూనే కాంగ్రెస్, సీపీఎంతో సరైన రీతిలో కలవలేకపోవడం ఓట్ల చీలికకు దారితీసిందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలీకృతమైందన్నారు. మమతా బెనర్జీ, చంద్రబాబు, జగన్ ,  కేసీఆర్.. ఎవరైనా సరే ప్రాంతీయ పార్టీల అధిపతుల్లో ఉండే అహంకారమే ఒక్కోసారి వారి సొంత రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు. మరోవైపు తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ..  బీఆర్ఎస్ తీవ్రమైన నైతిక పతనాన్ని ఎదుర్కొంటోందని విమర్శించారు. గతంలో వచ్చిన టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, నాయకుల ప్రవర్తన ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. అదే సమయంలో బీజేపీ సైతం స్థానికంగా అంతర్గత వివాదాలు, నైతిక సమస్యల వల్ల ప్రజల్లో పట్టు కోల్పోయే ప్రమాదంలో పడిందని, దీనివల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఇక జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన వివిధ ఉద్యమాలు, కొత్త శక్తుల ఆవిర్భావంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రదర్శించిన లౌక్యం అద్భుతమని కొనియాడారు. విపక్షాలు లేదా నిరసనకారులు కేంద్ర ప్రభుత్వంపై ఉద్రిక్తతలు సృష్టించి మైలేజ్ పొందాలని చూసిన ప్రతిసారీ, అమిత్ షా   వ్యూహాత్మకంగా వ్యవహరించి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. అరెస్టులు చేసి అనవసరంగా హీరోలను చేయడం కంటే, చట్టపరమైన వెసులుబాటు కల్పించి వారి వ్యూహాలనే నీరుగార్చడంలో కేంద్రం సఫలమైందని స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్ల కాలం భారత రాజకీయాల్లో అత్యంత కీలకమని, ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవాలంటే అహంకారాన్ని వీడి ప్రజాక్షేత్రంలో గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో మోదీ, అమిత్ షా ద్వయం వేస్తున్న ఎత్తులను చిత్తు చేయకపోతే ప్రాంతీయ శక్తుల మనుగడ మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. 
తెలుగు వన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ  హయాంలో చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో పెను సంచలనం రేపే భారీ కుంభకోణం వెలుగుచూసింది.  2020లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా జరిగిన ఈ రిక్రూట్‌మెంట్‌లో అర్హులైన మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీస అర్హత మార్కులు రాని వారికి తెరవెనుక నుంచి ఉద్యోగాలు కట్టబెట్టారని బాధితులు ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలను ప్రశ్నించిన బాధితులకు  నాటి అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి కుమారుడు, అనుచరుల నుంచి ప్రాణాపాయ హెచ్చరికలు రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు   45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే..  అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో శ్రీకాకుళం, ప్రకాశం తదితర జిల్లాల్లో జరిగిన నియామకాల డిజిటల్ డేటాను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. వికలాంగుల కేటగిరీలో 45 మార్కులు రావాల్సి ఉండగా, కేవలం 40.75 మార్కులు సాధించి అనర్హుడిగా మిగిలిన ఒక అభ్యర్థికి రోస్టర్ పాయింట్ల ఆధారంగా 42 వేల పైచిలుకు ర్యాంకు ఉన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అంతకంటే మెరుగైన ర్యాంకులు, అర్హత మార్కులు సాధించిన ఎంతో మంది ప్రతిభావంతులను పక్కనబెట్టి, తెర వెనుక దందాతో అనర్హులకు కాల్ లెటర్లు పంపారని బాధితులు నిలదీస్తున్నారు. మరింత విచిత్రంగా, కేవలం రెండు నెలల్లో ముగియాల్సిన ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఏకంగా రెండేళ్ల పాటు సాగదీశారు. 2020 నవంబర్‌లో ప్రారంభమైన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ 2022 జనవరి వరకు   కొనసాగుతూనే వచ్చింది. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల పరిధిలోకి వచ్చే మహిళా కానిస్టేబుల్   పోస్టుల్లో వినికిడి లోపం   ఉన్న వారికి పెద్దపీట వేయడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన పోస్టుకు ఫిట్ నెస్ ను పక్కనబెట్టి దొంగ సర్టిఫికేట్లతో పైరవీకారులకు ఉద్యోగాలు కట్టబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు  అప్పుడే ఒక మంత్రిని కలిసి మొరపెట్టుకోగా.. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం కానీ, మీకే ఇస్తామని చెప్పామా? అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నించిన అభ్యర్థులను మాజీ మంత్రి కుమారుడు తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ వివరాలు బయటపెడితే బాధితుల కుటుంబాలను లేకుండా చేస్తామంటూ గూండాలతో హెచ్చరికలు పంపడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. లక్షలాది మంది నిరుద్యోగుల కష్టాన్ని, తల్లిదండ్రుల ఆశలను కాలరాస్తూ జరిగిన ఈ సచివాలయ ఉద్యోగాల దందాపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్లు వస్తున్నాయి. బాధితులంతా సమాచార హక్కు చట్టం (  ద్వారా వివరాలు సేకరించి, హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిల్   దాఖలు చేయాలని మేధావులు సూచిస్తున్నారు. నిలిపివేసిన అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి, అభ్యర్థుల మార్కులతో కూడిన సమగ్ర మెరిట్ జాబితాను విడుదల చేయడమే కాకుండా, దీనిపై సిట్టింగ్ జడ్జితో పూర్తి స్థాయి విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని ఏపీ నిరుద్యోగ లోకం గళమెత్తుతోంది.
  బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపైనా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు. వచ్చే ఐదేళ్ల చిట్టినాయుడు, అండ్ టీం'కు సినిమా చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన కాలంలో తమను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరినీ, తమ పార్టీ నేతలపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. కష్టకాలంలో పార్టీతో కలిసి నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుడిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్తాయని పిలుపునిచ్చారు. ఈ రాజకీయ యుద్ధంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రతి అక్రమ కేసును చట్టపరంగా మరియు రాజకీయంగా ఎదుర్కొంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ప్రభుత్వం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి కుతంత్రాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రతిపక్షంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని, అధికార పక్షానికి చుక్కలు చూపిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. వర్దన్నపేట వేదికగా కేటీఆర్ చేసిన ఈ సుదీర్ఘ, ఘాటైన ప్రసంగం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  
ALSO ON TELUGUONE N E W S
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద జాతర చేయడం ఆయన నైజం. ప్రస్తుతం రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం 'ఇరుముడి' (Irumudi) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగానే మాస్ రాజా తన నెక్స్ట్ మూవీ లైనప్‌ను మరింత పవర్‌ఫుల్‌గా సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, 'ఇరుముడి' తర్వాత రవితేజ డైరెక్టర్ మారుతీ(Maruthi)తో జతకట్టబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. మారుతీ ఈ ఏడాది రెబల్ స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కించిన భారీ హర్రర్ కామెడీ చిత్రం 'రాజాసాబ్' 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. 'రాజాసాబ్' తర్వాత మారుతీ తన నెక్స్ట్ మూవీ ఏ హీరోతో చేస్తాడనే ఆసక్తి నెలకొని ఉంది. అయితే మారుతీ ఇటీవల రవితేజకు ఒక అదిరిపోయే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ లైన్‌ను వినిపించారట. మారుతీ మార్క్ కామెడీ టైమింగ్, రవితేజ బాడీ లాంగ్వేజ్ అండ్ మాస్ ఎనర్జీకి సరిగ్గా సరిపోయేలా ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ యాక్షన్ స్క్రిప్ట్ ఉండబోతోందని టాక్. నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని గత 3, 4 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇద్దరి బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం దొరకడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు రవితేజ లైనప్‌లో మరికొన్ని క్రేజీ కాంబినేషన్లు కూడా లైన్లో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో హాసిత్ గోలి దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయతో మరో సినిమా చర్చల దశలో ఉన్నాయి. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి కూడా రవితేజ కోసం ఒక పవర్‌ఫుల్ మాస్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం. ఏదేమైనా 'ఇరుముడి' తర్వాత మారుతీ దర్శకత్వంలో రాబోయే సినిమా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మారుతీ మార్క్ కామెడీ టైమింగ్, రవితేజ ఎనర్జీ తోడైతే థియేటర్లలో నవ్వుల జాతర గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఖుషీ అవుతున్నారు.  
  ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు స్టార్ హీరో వడ్డే నవీన్(Vadde Naveen). ఈ నెల 19 న ట్రాన్స్ ఫర్  త్రిమూర్తులు(Transfer trimurthulu)తో థియేటర్స్ లో అడుగుపెట్టడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అసలు మూవీ ప్రకటన వచ్చినప్పటి దగ్గర్నుంచే ఎప్పుడెప్పుడు నవీన్ సెల్యులాయిడ్ పై అడుగుపెడతాడా అని ఎదురుచూసిన అభిమానుల నెంబర్ కైతే లెక్కే  లేదు. పైగా 100 కథలని విన్న తర్వాత ఓకే చేసిన కథ అని నవీన్ చెప్పడంతో  తొలి రోజు భారీగానే థియేటర్స్ కి పోటెత్తారు. ఇక అభిమానులు, ప్రేక్షకుల స్పందన చూసుకుంటే 'మూవీలో వడ్డే నవీన్ ఎప్పటి లాగానే తనదైన లుక్స్,డాన్స్, ఫైట్స్ తో మెస్మరైజ్ చేసాడు. కానీ కథ విషయంలోనే పొరపాటు జరిగింది. ఇలాంటి కథనంతో కూడిన కథలు గతంలో చాలానే వచ్చాయి కాబట్టి నేటి ట్రెండ్ కి తగ్గ కథతో రావాల్సింది. పోనీ మేకర్స్ అనుకున్న కథకే కొత్త రకం స్క్రీన్ ప్లే ని అప్లై చేయాల్సింది. నవీన్ తప్ప మిగతా నటీనటుల నటనలో కూడా మెరుపులు ఏం లేవు.  కాకపోతే కొంతలో కొంత ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాపాడాయనే అభిప్రాయాన్ని వారంతా వ్యక్తం చేస్తున్నారు. Also read: అగ్ర హీరో సోదరుడిపై గొడ్డలితో దాడి.. పరిస్థితి విషమం రివ్యూస్ పరంగా చూసుకున్నా మెజారిటీ రివ్యూస్  మిక్స్డ్ టాక్ చెప్తున్నాయి. ఇక మూడు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే  తొలి రోజు 20 లక్షలుతో మూడు రోజులకి గాను టోటల్ గా ముప్పై లక్షల గ్రాస్ వసూలు చేసినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ టాక్. వడ్డే నవీన్ స్వయంగా నిర్మించగా 7 కోట్ల బడ్జెట్ అనే టాక్ సినీ సర్కిల్స్ లో చాలా బలంగానే వినిపిస్తుంది  
Kajal Aggarwal is clearly excited about her next big Telugu outing, NBK111. The actress recently opened up about being part of the much-awaited film starring Nandamuri Balakrishna and called the opportunity a “dream come true” moment in her career. Kajal revealed that getting to play a powerful character opposite Balakrishna is something she is genuinely looking forward to. More importantly, she hinted that this is not a routine heroine role and that the character comes with strong importance in the narrative. Interestingly, this marks Kajal’s reunion with Balakrishna after the success of Bhagavanth Kesari. Their pairing received a positive response earlier and expectations are naturally higher this time, especially with director Gopichand Malineni returning to collaborate with Balakrishna after delivering Veera Simha Reddy. The actress had earlier described NBK111 as a new-age action drama, suggesting that the film will combine Balakrishna’s trademark mass appeal with a fresher treatment and presentation. With shooting already underway and Kajal sounding highly confident about her role, NBK111 is slowly shaping into one of the most anticipated commercial entertainers currently in production. Fans will now be waiting to see what this Balakrishna–Kajal combination delivers on the big screen. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh), నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram), సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారనే అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి నందమూరి అభిమానుల్లో మరియు సాధారణ సినీ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అసలు ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో వెంకటేష్ లాంటి సీనియర్ హీరో పక్కన కళ్యాణ్ రామ్‌ను మాత్రమే ఎందుకు ఎంపిక చేశారనే విషయానికి సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌ను ఎంపిక చేయడం వెనుక ఒక బలమైన కారణం మరియు అద్భుతమైన క్యారెక్టరైజేషన్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్, సినిమా ప్రారంభం నుండి చివరి వరకు సాగే పూర్తి నిడివి కలిగిన ఒక మాస్ యాక్షన్ రోల్‌లో అలరించబోతున్నారు. కథ ప్రకారం ఈ క్యారెక్టర్ మొత్తం పక్కా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ మరియు ఆ ప్రాంతపు పౌరుషం చుట్టూ తిరుగుతుందని సమాచారం. వెండితెరపై రాయలసీమ ఫ్యాక్షనిజం, గంభీరమైన డైలాగ్ డెలివరీ, మరియు కంటిచూపుతోనే శత్రువులను భయపెట్టే ఇంటెన్స్ యాక్షన్ సీన్లను పండించడంలో నందమూరి వంశపు హీరోలకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ మరియు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి పాత్రలను అద్భుతంగా పండించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. సరిగ్గా ఇదే నమ్మకంతో దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఉన్న రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్‌ను నందమూరి కళ్యాణ్ రామ్ అయితేనే వందకు వంద శాతం పర్‌ఫెక్ట్‌గా న్యాయం చేయగలరని బలంగా నమ్మారు. అందుకే మరే ఇతర హీరో పేరును కూడా పరిశీలించకుండా నేరుగా కళ్యాణ్ రామ్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పోషించే పాత్ర చాలా ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా, సినిమా కథను కీలకమైన మలుపులు తిప్పే విధంగా డిజైన్ చేయబడింది.  వెంకటేష్ క్లాస్ మరియు ఫ్యామిలీ మేనరిజమ్స్‌కు, కళ్యాణ్ రామ్ ఊరమాస్ ఫ్యాక్షన్ యాక్షన్‌ తోడైతే థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోల స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.  
  'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi)కుటుంబానికి సంబంధించి బీహార్‌లోని ఆయన స్వగ్రామంలో జరిగిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పంకజ్ త్రిపాఠి అన్నయ్య విజయేంద్రనాథ్ తివారీపై కొంతమంది దుండగులు గొడ్డలితో ఘోరంగా దాడికి తెగబడ్డారు. నిన్న ఆదివారం రాత్రి జరిగిన ఈ  ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకి  దారితీసింది.  పంకజ్ త్రిపాఠి కుటుంబ సభ్యులు సినిమా రంగానికి పూర్తి దూరంగా ఉంటూ, తమ సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటిది, పంకజ్ త్రిపాఠి అన్నయ్యపై ఇలాంటి ప్రాణాంతక దాడి జరగడం బాలీవుడ్ వర్గాలతో పాటు సాధారణ ప్రజలని  సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోరమైన ఘటన బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా, మాధోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్సంద్ తివారీ టోలా అనే గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ దాడి వెనుక చాలా కాలంగా నలుగుతున్న ఒక భూ వివాదమే ప్రధాన కారణమని తెలుస్తోంది. జూన్ 21న విజయేంద్రనాథ్ తివారీకి, వారి పొరుగున ఉండే రాజేష్ సాహ్ అనే వ్యక్తికి మధ్య భూమికి సంబంధించిన ఒక విషయంలో తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి, వివాదం కాస్తా తీవ్ర హింసాత్మకంగా మారింది. దీంతో  పంకజ్ త్రిపాఠి సోదరుడిపై రాజేష్  గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఊహించని దాడిలో విజయేంద్రనాథ్ తివారీ శరీరానికి తీవ్రమైన గాయాలయ్యాయి. Also read: నేటివిటీ వదిలేస్తున్న తెలుగుసినిమా.. ఇది వీళ్ళ పనేనా!  దాడి జరిగిన వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన విజయేంద్రనాథ్‌ని  అత్యవసరంగా గోపాల్‌గంజ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, గాయాల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో మెరుగైన, అధునాతన వైద్య చికిత్స కోసం పాట్నాలోని పి.ఎమ్.సి.హెచ్ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.  ఏప్రిల్ 2024 లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో పంకజ్ త్రిపాఠి బావ రాకేశ్ తివారీ మరణించగా, సోదరి సబితా తివారీ తీవ్రంగా గాయపడ్డారు. ఆ చేదు జ్ఞాపకాల నుండి కోలుకోకముందే, ఇప్పుడు సొంత అన్నయ్యపై ఇలా గొడ్డలితో దాడి జరగడం పంకజ్ త్రిపాఠి కుటుంబాన్ని తీవ్ర ఆవేదనలోకి నెట్టింది.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
ఆలోచన ఒక అవసరానికి ముడివడకుండా ఉన్నంతవరకూ దానికి అర్ధవంతమైన గెలుపు ఉండదు. చాలా మందిలో ఆలోచన అనే ఒక బెరడు, జీవిత సాగరంలో దానికదే తేలిపోతూ ఉంటుంది. లక్ష్యం లేని ఆలోచన ఒక దుర్గుణం. ఆలోచనలను ఆలా తేలిపోనివ్వకూడదు. లక్ష్యం లేని ఆలోచనల వలన చివరకు జరిగేది విధ్వంసమే. ఒక లక్ష్యం లేకుండా జీవించే వారు తేలికగా ఆందోళన, భయం, కష్టాలు నిర్వేదాల ఉచ్చులో పడతారు. ఈ బలహీనతలన్నీ ఖచ్చితంగా జరిగే ఒక పాపపు ప్రణాళికలా  ఓటమికీ, దుఃఖానికీ మరియూ నష్టానికీ దారి తీస్తాయి. ఎందుకంటే శక్తి ఆధారంగా పరిణతి చెందే ఈ విశ్వంలో బలహీనతకి చోటు లేదు. ఒక మనిషి తన హృదయంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండి, దానిని చేరుకునేవరకూ పరితపించాలి. ఆ ఆశయాన్ని లేదా లక్ష్యాన్ని తన ఆలోచనల కేంద్రబిందువుగా చేసుకోవాలి. సమయ సందర్భాలను బట్టి, ఆ లక్ష్యం ఆధ్యాత్మిక ఆశయం కావచ్చు, లేదా ప్రాపంచిక విషయం కావచ్చు. అది ఏదైనప్పటికీ తన ఆలోచనాశక్తినంతా దాని మీదే పూర్తిగా లగ్నం చేయాలి. దానినే అతని పరమ విధిగా భావించి వేరే ఇతర వ్యాపకాల పట్ల కోరికల పట్ల, ఊహల పట్ల మనస్సుని పోనివ్వకుండా తదేక దీక్షతో సాధించే వరకూ శ్రమించాలి. ఇదే ఆత్మ నిగ్రహానికి మరియూ నిజమైన ఏకాగ్రతకు రాజమార్గం. ఒక వేళ లక్ష్య సాధనలో మరలా మరలా ఓడిపోయినా (బలహీనతలను అధిగమించేవరకూ ఓటమి ఎలాగూ తప్పదు), వ్యక్తి శీలంలో అభివృద్ధి కనిపిస్తే అది విజమైన విజయానికి ఒక నిదర్శనం, భవిష్యత్తులో సాధించబోయే విజయానికి ఈ ఓటమి ఒక మెట్టులా, ఒక శక్తిలా పనిచేస్తుంది. ఉన్నత లక్ష్యం గురించి ఆదుర్దా వద్దనుకునే వ్యక్తులు చేసేది ఎంత చిన్న పనైనా సరే, దానికి ఏమాత్రం విలువలేదనిపించినా సరే, ఎటువంటి అవకతవకలు లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే దాని మీదనే తమ ధ్యాసంతా ఉంచాలి. కేవలం ఈ విధంగానే ఆలోచనలను వృద్ధి చేసుకున్నప్పుడు అవి మరింత శక్తివంతంగా మారి లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయి. శక్తిని వృద్ధి చేసుకునే ఏకైక మార్గం ఎడతెగని కృషి మరియూ సాధన మాత్రమే అని తెలుసుకుని, దానిని నమ్మిన మరుక్షణం, అతి బలహీనమైన వ్యక్తి అయినా సరే కష్టించి పనిచేయడం ప్రారంభిస్తాడు. కృషికి కృషినీ, ఓర్పుకి ఓర్పునీ, శక్తికి శక్తినీ జోడిస్తూ ఉంటే, వ్యక్తి అభివృద్ధి ఇక ఆగదు. అలా ఎదుగుతూ చివరకు ఎంతో దివ్యమైన శక్తిగా మారుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి సహనంతో జాగ్రత్తగా సాధన చేస్తే ఎలా శక్తివంతంగా తయారవుతాడో అలాగే బలహీనమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి సరైన ఆలోచనల వలన మానసికంగా శక్తివంతంగా తయారుకాగలడు. నిర్లక్ష్యాన్ని, బలహీనతనూ దూరంగా ఉంచి, ఒక లక్ష్యం వైపు ఆలోచించడం మొదలుపెట్టడమంటే, ఓటమిని కూడా లక్ష్య సాధనలో ఒక భాగంగా పరిగణించే శక్తివంతులుగా మారడమే. అటువంటి వ్యక్తులు శక్తివంతంగా ఆలోచించి, భయంలేకుండా అడుగు ముందుకేసి, ఎటువంటి పరిస్థితినైనా తమకు అనువుగా మార్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేరుకునే మార్గాన్ని మానసికంగా ఎంచుకుని దిక్కులు చూడకుండా ఋజుమార్గంలో పయనించాలి. అనుమానాలను, భయాలనూ పూర్తిగా తుడిచిపెట్టెయ్యాలి.  ఎందుకంటే అవి నాశనానికి కారకాలు, కృషి అనే దారిని మళ్ళించి వ్యక్తిని ప్రభావరహితంగా పనికిమాలినవిధంగా తయారుచేయగలవు. అనుమానం, భయం ఎప్పుడూ ఏదీ సాధించింది లేదు, ఎప్పుడూ సాధించలేవు కూడా. అవి ఎప్పుడూ ఓటమికే దారి తీస్తాయి. అవి చేరిన వెంటనే లక్ష్యం, బలం, శక్తి, సంకల్ప శక్తి అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. ఏదైనా పని చేయగలమనే జ్ఞానం నుంచే చేయాలనే సంకల్పం పుట్టుకొస్తుంది. అనుమానం, భయం జ్ఞానానికి బద్ధ శత్రువులు. వాటిని చంపేయకుండా ఇంకా ఉత్సాహపరిచే వారు ప్రతి అడుగులోనూ ఇబ్బందికి గురవుతారు. అనుమానాన్నీ, భయాన్నీ జయించినవాడు ఓటమిని కూడా జయిస్తాడు. అతని ప్రతి ఆలోచన, శక్తితో కూడుకుని ఉంటుంది, అతడు ప్రతి కష్టాన్నీ వివేకంతో మరియూ ధైర్యంతో ఎదుర్కొని జయించగలడు. నిర్భయమైన ఆలోచనకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం తోడైతే అది సృజనాత్మక శక్తిగా మారుతుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఊగిసలాడే ఆలోచనలతో మరియూ కొట్టుమిట్టాడే వాతావరణంతో ఉండే ఒక బుడగలా కాకుండా, పరిస్థితికి ఉన్నతంగా శక్తివంతంగా మారేదానికి సంసిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి తన మానసిక శక్తులను స్పృహతో మరియూ తెలివితేటలతో సమర్ధవంతంగా వాడుకోగలుగుతాడు.                                  ◆నిశ్శబ్ద.
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు. ఈ కారణంగా మధ్యతరగతి, దిగువ తరగతి వారిగానే ఉండిపోతారు తప్ప, ధనవంతుల లిస్ట్ లోకి వెళ్లలేరు.  అయితే దీనంతటికి కారణం ఆ వ్యక్తులే అంటున్నారు ఆర్థిక నిపుణులు,  లైఫ్ స్టైల్ విశ్లేషకులు.  ఇంతకీ మనిషి చేసే తప్పులు మనిషిని ధనవంతుడు కాకుండా ఎలా  ఆపుతాయి.  ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే.. మనిషి చేసే తప్పు.. శ్రమ మనిషికి నిజమైన సంపద, కానీ మనిషి చాలా సార్లు శ్రమిస్తాడు కానీ అతనికి సొంతంగా ఎదగడం తెలియదు.  గంధం తీయాలంటే గందపు చెక్కను అరగదీయాలి,  అలాగే ఒక మంచి పూల హారం కావాలంటే పూలను దారంలోకి జొప్పించి అల్లాలి.  ఇవన్నీ వ్యక్తిలో ఓపిక,  శ్రమకు చక్కని నిదర్శనాలు. అలాంటి శ్రమ, ఓపిక ఉన్నప్పుడే.. దేవుడి ముందు నిలబడి దేవుడిని తృప్తిగా ప్రార్థిస్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా పొందగలుగుతారు. అదే విధంగానే.. మనిషి కష్టపడి పనిచేస్తేనే తనకు తాను ఫలితాన్ని పొందగలుగుతాడు. అంతేకానీ కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడి చివరిలో ఫలితం రావాలని అనుకుంటే అది ఆశాజనకంగా ఉండదు. సద్గుణాలు.. మనిషిలో సద్గుణాలు ఉంటే అతను ధనవంతుడు కావడానికి మార్గాలు పదే పదే కలిసి వస్తూనే ఉంటాయి.  పేదరికంలో ఉన్న వ్యక్తికి ఓర్పు ఉంటే గొప్ప అవకాశాలు చూపిస్తుంది.  మాసిపోయిన బట్టలు మంచి నీటితో ఉతికితేనే అవి తెల్లగా మెరుస్తాయి. అలాగే వ్యక్తి మొదట సద్గుణాలు అలవర్చుకున్నప్పుడు అతను  అతను ఆకర్షిస్తాడు.  అతని వ్యక్తిత్వంలో మంచి, చెడు బయటకు ప్రకాశిస్తాయి.  ధనవంతులు కావడం అంటే చెడు గుణాలు కలిగి ఉండటమా లేదా అనేది కాదని కొందరు అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. చెడు దారిలో కలిగే ధనం ఎప్పటికీ మనిషిని ఉన్నతంగా ఉంచదు. నిజమైన ధనవంతుడు.. పేదరికంలో ఉన్న వ్యక్తి అసలు పేదవాడిగా  పరిగణించకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఎందుకంటే నిజమైన పేదవాడు డబ్బు లేని వాడు.. జ్ఞానం,  వ్యక్తిత్వం లేనివాడే నిజమైన పేదవాడు అంటాడు ఆచార్య చాణక్యుడు. జ్ఞానం లేని వ్యక్తికి ఎంత సంపద ఉన్నా అతను వ్యర్థ్యం అంటాడు. అవకాశాలు.. మనిషి జీవితంలో అవకాశాలు రావడం లేదని వాపోతుంటాడు. కానీ నిజానికి అవకాశాలను సృష్టించుకునే వాడే ఆర్థికంగా ఎదగగలడని అంటారు. ఎడారిలో అయినా ఇసుకను లోతుగా తవ్వితేనే నీటి చెలమ లభించే అవకాశం ఉంటుంది. అలాగే అవకాశాలే లేవు అనుకున్నప్పుడు వాటిని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది. అపాత్ర దానం.. దానం చేయడం చాలా గొప్ప గుణం. కానీ దానం చేస్తే పుణ్యం వస్తుందనే కారణంతో చేతిలో ఉన్నది అనవసరమైన వ్యక్తులకు దానం చేయడం పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టే. దానం చేయడం ఎంత మంచి కార్యమో.. అర్హత లేని వారికి దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభించకపోగా, ఆర్థికంగా దిగజారిపోతారు.   పొదుపు.. చాలామందికి పొదుపు చేయడం అంటే అవసరాలు మాని మరీ దాచిపెట్టడం అనుకుంటారు. కానీ అవసరాలు మానుకుని దాచిపెట్టే డబ్బే పేదరికానికి కారణం అవుతుంది.                                   *రూపశ్రీ.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ, జాతీయ స్థాయిలో మోదీ-అమిత్ షా ద్వయం అనుసరిస్తున్న వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో, బలమైన ప్రాంతీయ శక్తులు సైతం కేంద్ర పెద్దల చాణక్యానికి తలవంచక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణ వరకు ప్రాంతీయ అధినేతల అహంకారం, వ్యూహాత్మక తప్పిదాలు వారి పతనానికి ఏ విధంగా దారితీస్తున్నాయో  తెలుగువన్ వాస్తవ వేదికలో జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు.  రాజకీయాల్లో ఎప్పుడైనా పోరాటం ఉండాలని, ఎక్కడైతే రాజీ పడతారో అక్కడే పతనం ప్రారంభమవుతుందని  జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన  మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు. పశ్చిమ బెంగాల్ ఉదాహరణను తీసుకుంటే..  మమతా బెనర్జీ బలమైన నాయకురాలైనప్పటికీ, ఇండియా బ్లాక్‌లో ఉంటూనే కాంగ్రెస్, సీపీఎంతో సరైన రీతిలో కలవలేకపోవడం ఓట్ల చీలికకు దారితీసిందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలీకృతమైందన్నారు. మమతా బెనర్జీ, చంద్రబాబు, జగన్ ,  కేసీఆర్.. ఎవరైనా సరే ప్రాంతీయ పార్టీల అధిపతుల్లో ఉండే అహంకారమే ఒక్కోసారి వారి సొంత రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు. మరోవైపు తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ..  బీఆర్ఎస్ తీవ్రమైన నైతిక పతనాన్ని ఎదుర్కొంటోందని విమర్శించారు. గతంలో వచ్చిన టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, నాయకుల ప్రవర్తన ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. అదే సమయంలో బీజేపీ సైతం స్థానికంగా అంతర్గత వివాదాలు, నైతిక సమస్యల వల్ల ప్రజల్లో పట్టు కోల్పోయే ప్రమాదంలో పడిందని, దీనివల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఇక జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన వివిధ ఉద్యమాలు, కొత్త శక్తుల ఆవిర్భావంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రదర్శించిన లౌక్యం అద్భుతమని కొనియాడారు. విపక్షాలు లేదా నిరసనకారులు కేంద్ర ప్రభుత్వంపై ఉద్రిక్తతలు సృష్టించి మైలేజ్ పొందాలని చూసిన ప్రతిసారీ, అమిత్ షా   వ్యూహాత్మకంగా వ్యవహరించి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. అరెస్టులు చేసి అనవసరంగా హీరోలను చేయడం కంటే, చట్టపరమైన వెసులుబాటు కల్పించి వారి వ్యూహాలనే నీరుగార్చడంలో కేంద్రం సఫలమైందని స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్ల కాలం భారత రాజకీయాల్లో అత్యంత కీలకమని, ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవాలంటే అహంకారాన్ని వీడి ప్రజాక్షేత్రంలో గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో మోదీ, అమిత్ షా ద్వయం వేస్తున్న ఎత్తులను చిత్తు చేయకపోతే ప్రాంతీయ శక్తుల మనుగడ మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. 
తెలుగు వన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ  హయాంలో చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో పెను సంచలనం రేపే భారీ కుంభకోణం వెలుగుచూసింది.  2020లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా జరిగిన ఈ రిక్రూట్‌మెంట్‌లో అర్హులైన మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీస అర్హత మార్కులు రాని వారికి తెరవెనుక నుంచి ఉద్యోగాలు కట్టబెట్టారని బాధితులు ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలను ప్రశ్నించిన బాధితులకు  నాటి అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి కుమారుడు, అనుచరుల నుంచి ప్రాణాపాయ హెచ్చరికలు రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు   45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే..  అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో శ్రీకాకుళం, ప్రకాశం తదితర జిల్లాల్లో జరిగిన నియామకాల డిజిటల్ డేటాను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. వికలాంగుల కేటగిరీలో 45 మార్కులు రావాల్సి ఉండగా, కేవలం 40.75 మార్కులు సాధించి అనర్హుడిగా మిగిలిన ఒక అభ్యర్థికి రోస్టర్ పాయింట్ల ఆధారంగా 42 వేల పైచిలుకు ర్యాంకు ఉన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అంతకంటే మెరుగైన ర్యాంకులు, అర్హత మార్కులు సాధించిన ఎంతో మంది ప్రతిభావంతులను పక్కనబెట్టి, తెర వెనుక దందాతో అనర్హులకు కాల్ లెటర్లు పంపారని బాధితులు నిలదీస్తున్నారు. మరింత విచిత్రంగా, కేవలం రెండు నెలల్లో ముగియాల్సిన ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఏకంగా రెండేళ్ల పాటు సాగదీశారు. 2020 నవంబర్‌లో ప్రారంభమైన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ 2022 జనవరి వరకు   కొనసాగుతూనే వచ్చింది. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల పరిధిలోకి వచ్చే మహిళా కానిస్టేబుల్   పోస్టుల్లో వినికిడి లోపం   ఉన్న వారికి పెద్దపీట వేయడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన పోస్టుకు ఫిట్ నెస్ ను పక్కనబెట్టి దొంగ సర్టిఫికేట్లతో పైరవీకారులకు ఉద్యోగాలు కట్టబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు  అప్పుడే ఒక మంత్రిని కలిసి మొరపెట్టుకోగా.. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం కానీ, మీకే ఇస్తామని చెప్పామా? అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నించిన అభ్యర్థులను మాజీ మంత్రి కుమారుడు తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ వివరాలు బయటపెడితే బాధితుల కుటుంబాలను లేకుండా చేస్తామంటూ గూండాలతో హెచ్చరికలు పంపడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. లక్షలాది మంది నిరుద్యోగుల కష్టాన్ని, తల్లిదండ్రుల ఆశలను కాలరాస్తూ జరిగిన ఈ సచివాలయ ఉద్యోగాల దందాపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్లు వస్తున్నాయి. బాధితులంతా సమాచార హక్కు చట్టం (  ద్వారా వివరాలు సేకరించి, హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిల్   దాఖలు చేయాలని మేధావులు సూచిస్తున్నారు. నిలిపివేసిన అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి, అభ్యర్థుల మార్కులతో కూడిన సమగ్ర మెరిట్ జాబితాను విడుదల చేయడమే కాకుండా, దీనిపై సిట్టింగ్ జడ్జితో పూర్తి స్థాయి విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని ఏపీ నిరుద్యోగ లోకం గళమెత్తుతోంది.
  బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపైనా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు. వచ్చే ఐదేళ్ల చిట్టినాయుడు, అండ్ టీం'కు సినిమా చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన కాలంలో తమను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరినీ, తమ పార్టీ నేతలపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. కష్టకాలంలో పార్టీతో కలిసి నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుడిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్తాయని పిలుపునిచ్చారు. ఈ రాజకీయ యుద్ధంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రతి అక్రమ కేసును చట్టపరంగా మరియు రాజకీయంగా ఎదుర్కొంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ప్రభుత్వం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి కుతంత్రాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రతిపక్షంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని, అధికార పక్షానికి చుక్కలు చూపిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. వర్దన్నపేట వేదికగా కేటీఆర్ చేసిన ఈ సుదీర్ఘ, ఘాటైన ప్రసంగం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  
భారతీయుల ఆహారంలో  నెయ్యి ప్రధానంగా ఉంటుంది.  ఒకప్పుడు నెయ్యిని చాలా విరివిగా తినేవారు. పైగా నెయ్యిని పోసుకుని తినాలి అని చెప్పేవారు. అయితే ఆ తరువాత నెయ్యి వాడకం తగ్గినా, ఇప్పటికీ నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా చాలామంది నెయ్యి లేకుండా భోజనం చేయరు.  చాలా రకాల తీపి పదార్థాల తయారీలోనూ నెయ్యి వాడతారు.  నెయ్యి కలపడం వల్ల వాటి రుచి పెరగడమే కాకుండా, శరీరానికి కొవ్వు కూడా అందుతుంది, ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే చాలామంది భారతీయుల ఇళ్లలో నెయ్యి కనిపిస్తుంది. వెనుకటి కాలంలో నెయ్యిని ఇంట్లోనే తయారు చేసేవారు. కానీ ఇప్పుడు నెయ్యిని మార్కెట్లో కొనడం అలవాటు అయిపోయింది. శరీరానికి నెయ్యి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, ఈ రోజుల్లో  నెయ్యిని తినడానికి వెనుకాడుతున్నారు. దీనికి కారణం నెయ్యిలో కల్తీ పెరిగిపోవడమే. ఈ కల్తీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులుగా హాని కలిగిస్తోంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. కల్తీ నెయ్యి ఎలా తయారు చేస్తారు? కల్తీ నెయ్యిని చౌక నూనెలు, కొవ్వులు, రసాయనాలు, బంగాళాదుంపలు, యూరియా, ఫ్రెషనర్లు, స్వీటెనర్లతో పాటు దాని నాణ్యత , భద్రత రెండింటినీ తగ్గించే అనేక ఇతర హానికరమైన పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఇది నెయ్యి యొక్క పోషక విలువను తగ్గించి, ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది. కల్తీ నెయ్యి గుర్తించడం ఎలాగంటే.. ఒక పరీక్ష నాళికలో 1 మి.లీ కరిగించిన నెయ్యి తీసుకోవాలి. దీనికి 1 మి.లీ గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl) కలపాలి. తర్వాత అర టీస్పూన్ చక్కెర కలపాలి.  మిశ్రమాన్ని కనీసం రెండు నిమిషాల పాటు బాగా కదిలించాలి.  తర్వాత దాన్ని ఒకపక్కన ఉంచాలి. నెయ్యి స్వచ్ఛమైనదైతే దాని రంగులో ఎలాంటి మార్పు ఉండదు.  నెయ్యిలో కల్తీ జరిగితే, దాని రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది. పరీక్షించేటప్పుడు జాగ్రత్త.. ఇంట్లో HCl ఉపయోగించి నెయ్యిలో కల్తీని పరీక్షించాలని అనుకుంటే, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక బలమైన ఆమ్లం , కొన్ని చుక్కలు  శరీరంపై పడినా హానికరం కావచ్చు. ఇది నెయ్యిని పరీక్షించడానికి, నెయ్యి స్వచ్ఛతను నిర్థారించడానికి సహాయపడుతుంది.  అవసరమైతే నెయ్యిని ల్యాబ్ టెస్ట్ కూడా చేయించవచ్చు.                            *రూపశ్రీ.
పిల్లలు మొబైల్ ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ ఎక్కువగా వాడితే కళ్ళు దెబ్బతింటాయనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే నిజంగా కళ్ళకు హాని కలిగించేది స్క్రీన్ కాదు, దాన్ని ఉపయోగించే విధానమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డా. కాసు ప్రసాద్ రెడ్డి వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, కంటి అలసటను తగ్గించే సులభమైన ఐ ఎక్సర్‌సైజులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను వివరించారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు.  ముఖ్యంగా ఆహారంలో అన్నం, చపాతీకి సమానంగా లేక అంతకంటే ఎక్కువ మొత్తంలో కూరగాయలు ఉండాలని ఆహార నిపుణులు కూడా చెబుతారు. అయితే ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్ వినియోగం పెరగడం వల్ల నేటికాలంలో కూరగాయల వినియోగం కూడా తగ్గింది.   కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా కూరగాయలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది , బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. అయితే 5 రకాల కూరగాయలు ఉన్నాయి.  ఈ కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  ఈ విషయం చాలా మందికి తెలియదు కూడా.  ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుంటే.. పాలకూర.. పాలకూరను పోషకాల నిధిగా పరిగణిస్తారు. దీనిలో ఐరన్ , కాల్షియం, పీచుపదార్థం, విటమిన్లు ఎ, సి , కె సమృద్ధిగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల శరీరంలోని రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బ్రోకలి.. బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.  బ్రోకలీని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక అవసరమైన పోషకాలు లభిస్తాయి. క్యారెట్లు.. క్యారెట్లలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ A గా మార్చబడుతుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి , రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. క్యారెట్లను సలాడ్‌గా, జ్యూస్‌గా లేదా కూరగాయగా తినవచ్చు. క్యాప్సికమ్.. క్యాప్సికమ్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు , అనేక ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి , ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. సొరకాయ.. సొరకాయలో నీరు, పీచుపదార్థం పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరాన్ని తేమగా ఉంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వేసవి కాలంలో సొరకాయను తినడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా బరువు అదుపులో ఉంటుందని కూడా చెబుతారు.                              *రూపశ్రీ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.