LATEST NEWS
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం ఎప్పటిలాగే మార్నింగ్ వాక్కు వెళ్లిన ఆయన.. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై కుప్పకూలిపోయారు. కొద్దిసేపు స్పృహ కోల్పోయి పడిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ధన్‌ఖడ్‌ను తక్షణమే పోలీసు కంట్రోల్ రూమ్ (PCR) వాహనంలో ఆయన నివాసానికి తరలించారు. సమాచారం అందుకున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS) వైద్య బృందంతో పాటు ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ సందీప్ సేథ్ అక్కడికి చేరుకుని ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం 75 ఏళ్ల జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో సెంటర్లో చేర్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కార్డియాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నారు.
కాగా, ధన్‌ఖడ్‌కు గతంలోనూ పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. 2025 మార్చిలో ఛాతిలో నొప్పి రావడంతో ఎయిమ్స్ క్రిటికల్ కేర్ యూనిట్లో చేరారు. ఆ సమయంలో ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స నిర్వహించారు. అదే ఏడాది జూన్‌లో నైనిటాల్ పర్యటన సందర్భంగా, ఈ ఏడాది జనవరిలో ఇంట్లో ఉన్న సమయంలోనూ ఆయన స్పృహ కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: 9వ తరగతిలో మంచి మార్కులు.. కొడుక్కి రూ.2 కోట్ల బీఎండబ్ల్యూ గిఫ్ట్..!
2022 ఆగస్టులో భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన జగదీప్ ధన్‌ఖడ్.. వ్యక్తిగత కారణాలతో 2025 జూలై 21న తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు
మీకు నచ్చవచ్చు: ఓ రైడ్ కొడదాం గురూ.. నగరాల్లో బైక్ ట్యాక్సీల జోరు.. యువతకు చేతినిండా పని.!
[ Jagdeep Dhankhar, former vice president, AIIMS Delhi, health update, morning walk collapse, cardiology department ]
ప్రస్తుత ఆధునిక కాలంలో ఉపాధి అవకాశాల రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న యువతకు, చదువుకుంటూనే సంపాదించాలనుకునే విద్యార్థులకు కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. ఇందులో బైక్ ట్యాక్సీ సేవలు ఒక ప్రధాన ఉపాధి మార్గంగా ఎదుగుతున్నాయి.
నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న రద్దీని అధిగమించడానికి, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ప్రజలు బైక్ ట్యాక్సీలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఈ డిమాండ్‌కు తగినట్టుగా ఎంతోమంది యువకులు ఈ రంగంలో ఉపాధిని వెతుక్కుంటున్నారు. సొంతంగా ద్విచక్ర వాహనం ఉంటే చాలు, ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా సంపాదించుకునే వెసులుబాటు లభిస్తోంది.
మరోవైపు, ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా తమ ఖాళీ సమయాల్లో లేదా ఆఫీసుకు వెళ్లే దారిలో బైక్ ట్యాక్సీ సేవలను అందిస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇది కేవలం పాకెట్ మనీ కోసమే కాకుండా, కుటుంబ ఆర్థిక భద్రతకు కూడా ఎంతో కొంత సహకరిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పెద్దగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకపోవడం, ఎటువంటి సంక్లిష్టమైన ప్రవేశ అర్హతలు అక్కర్లేకపోవడం ఈ రంగం యొక్క ప్రధాన ప్లస్ పాయింట్లు. డిజిటల్ యాప్‌ల ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రయాణికులతో అనుసంధానం కావడం రైడర్లకు ఎంతో సౌకర్యంగా మారుతోంది.
అయితే, ఈ రంగంలో వృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. పెరుగుతున్న ఇంధన ధరలు, నగరాల్లో ట్రాఫిక్ నిబంధనలు, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలపై రైడర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం మరియు సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తే, డ్రైవర్ల సంక్షేమానికి మరింత భరోసా దొరుకుతుంది.
మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో సాంకేతికతను జోడించి ఉపాధి పొందడంలో ఈ బైక్ ట్యాక్సీ మోడల్ ఒక విజయవంతమైన ఉదాహరణగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో అర్బన్ రవాణా రంగానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, యువతకు ఇదొక స్థిరమైన ఉపాధి వేదికగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ విద్యావిధానంలో సమూల మార్పులు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం.!
[ Bike taxi employment, youth financial security, techies and the unemployed, urban mobility, part-time jobs, Telugu News, Telugu One ]
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రభావం వైసీపీపై ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయాలలోకి ప్రవేశించడానికి ముందు నుంచి కూడా విజయసాయి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో కూడా విజయసాయి సహ నిందితుడు. జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నాయి.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన విజయసాయి, ఇప్పుడు పరివర్తన రాజనీతి పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.
దేశభక్తి, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా తన పార్టీ పనిచేస్తుందని విజయసాయి పార్టీ ప్రకటన సందర్భంగా చెప్పారు. పార్టీ అధికారిక ప్రకటనతో పాటు జెండాను కూడా ఆవిష్కరించిన విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సంస్కృతిని తీసుకువస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
ఈ పరిణామం వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకంగా, పార్టీ నేతకు అధినేతకు అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకోవడం ఆ పార్టీకి ఏదో మేరకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తమౌతోంది.
ఇది కూడా చదవండి: జయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!
పార్టీలో అసంతృప్తితో ఉన్న, అలాగే ఆయనతో సత్సంబంధాలు కలిగిన కొందరు నేతలు భవిష్యత్తులో వైసీపీని వీడి విజయసాయి పంచన చేరే అవకాశలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. అదలా ఉంచితే.. కొత్త పార్టీ ద్వారా ఆయన ఏ మేరకు ప్రభావం చూపగలరు, ప్రజాదరణను ఏ విధంగా సంపాదించుకుంటారు అనే విషయంలో కూడా రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
రానున్న కాలంలో విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) ప్రయాణం అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను ఏ మేరకు ఎలా ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చెప్పిన ముహూర్తానికి చెప్పినట్లుగా తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విజయసాయి, ముందు ముందు రాష్ట్ర రాజకీయాలలో ఏ మేరకు ప్రభావం చూపుతారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్త మౌతోంది.
మీకు నచ్చవచ్చు: వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి
విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.?
[Effect of Vijayasai Reddy New Party onYCP, Parivarthana Rajaneethi Party, PRP, Political Impact, AP Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
కొన్ని సినిమాలు చూస్తే నవ్వొస్తుంది. మరికొన్ని సినిమాలు చూస్తే ఉత్కంఠ కలుగుతుంది. ఇంకొన్ని మాత్రం మన జీవితంలో మర్చిపోయిన మనుషులను, బంధాలను గుర్తుచేస్తూ మనసును కదిలిస్తాయి. అలాంటి ఓ అరుదైన చిత్రమే ‘పైర్’ (Pyre).
65 ఏళ్లుగా కలిసి జీవిస్తున్న ఓ వృద్ధ దంపతులు.. 28 ఏళ్లుగా తిరిగిరాని కొడుకు.. చుట్టూ మనుషులే లేని ఓ కొండ గ్రామం.. చివరికి తమ మరణం తర్వాత అంత్యక్రియలు చేసేవాళ్లు కూడా ఉండరేమోనన్న భయం. వినడానికి చిన్న కథలా అనిపించినా, ఇందులో దాగున్న భావోద్వేగం మాత్రం గుండెను బరువెక్కిస్తుంది.
ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామం ఈ సినిమా నేపథ్యం. పదం సింగ్, తుల్సీ అనే వృద్ధ దంపతులు అక్కడ నివసిస్తుంటారు. దాదాపు 65 ఏళ్లుగా కలిసి జీవిస్తున్న ఈ జంటకు ఒక కొడుకు. ఉపాధి కోసం ముంబై వెళ్లిన అతడు 28 ఏళ్లుగా తిరిగి రాలేదు. అయినా ఎప్పటికైనా కొడుకు వస్తాడనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తూనే ఉంటారు.
ఓ రోజు కొడుకు నుంచి ఉత్తరం వస్తుంది. తాను ఊరికి వస్తున్నానని అందులో సమాచారం ఉంటుంది. దీంతో ఆ వృద్ధ దంపతుల ఆనందానికి అవధులుండవు. కానీ మరోవైపు ఆ గ్రామం మాత్రం రోజురోజుకూ ఖాళీ అవుతోంది. ఉపాధి కోసం ఒక్కొక్కరుగా ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు సందడిగా ఉన్న గ్రామం ఇప్పుడు నిశ్శబ్దంగా మారుతోంది.
ఇది కూడా చదవండి: ‘మాతృభూమి’ ట్రైలర్.. తెలంగాణ రియల్ హీరో బయోపిక్‌లో సల్మాన్ ఖాన్.!
ఈ క్రమంలో ఆ గ్రామం నుంచి వెళ్లిపోతున్న ఓ కుటుంబం ఆ వృద్ధుడితో చెప్పే మాటలు ఎంతో కలచివేస్తాయి. మీరు కూడా త్వరగా ఈ ఊరు విడిచి వెళ్లిపోండి.. లేదంటే మేము వెళ్లిపోయేలోపే చనిపోండి.. మీరు చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కూడా ఇక్కడ నలుగురు మనుషులు ఉండరనే అర్థంలో వారు మాట్లాడతారు. ఆ మాటల్లోని కఠినత్వం వెనుక గ్రామాలు ఎదుర్కొంటున్న వలసల సమస్య ఎంత తీవ్రంగా ఉందో చూపించారు దర్శకుడు.
ఈ సినిమాలోని అత్యంత భావోద్వేగమైన అంశాల్లో ఒకటి పదం సింగ్ తన ఇంటి బయటే రెండు చితిమంటల కోసం ఏర్పాట్లు చేసుకోవడం. గ్రామంలో సాయం చేసేవాళ్లు ఎవరూ మిగలరని భావించి, ఒకటి తన భార్య కోసం.. మరొకటి తన కోసం సిద్ధం చేసుకుంటాడు. అది చూసిన తుల్సీ ప్రశ్నించగా, తాను ముందుగా చనిపోతే ఆమెను కొండ కిందకు ఎవరు తీసుకెళ్తారని ఆలోచిస్తున్నానని చెబుతాడు.
65 ఏళ్ల దాంపత్యం తర్వాత కూడా తనకంటే భార్య గురించే ఎక్కువగా ఆలోచించే భర్త. ప్రేమ అంటే ఖరీదైన బహుమతులు, విహారయాత్రలు మాత్రమే కాదని.. ఒకరికొకరు తోడుగా ఉండటం, కష్టాల్లో చేయి అందించడం, చివరి క్షణం వరకు ఒకరి గురించి మరొకరు ఆలోచించడమేనని ఈ కథ గుర్తుచేస్తుంది.
దర్శకుడు వినోద్ కప్రికి ఈ సినిమా ఆలోచన 2018లో వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని మున్సియారి ప్రాంతంలో ఓ వృద్ధ దంపతుల గురించి తెలుసుకున్న ఆయన, వారి జీవితంలోని ఒంటరితనం, ఒకరిపై మరొకరికి ఉన్న ఆధారాన్ని కథగా మలచాలనుకున్నారు. మొదట నిజ జీవితంలోని ఆ దంపతులతోనే సినిమా చేయాలని భావించినా అది సాధ్యం కాలేదు.
చివరికి పదం సింగ్ కప్రి, హీరా దేవిలను ప్రధాన పాత్రల కోసం ఎంపిక చేశారు. వీరిద్దరూ అంతకుముందు కెమెరా ముందు నటించిన అనుభవం లేని సాధారణ గ్రామీణులు. అయినప్పటికీ తెరపై వారి సహజమైన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. పదం సింగ్ కప్రి దర్శకుడు వినోద్ కప్రికి చిన్నాన్న కావడం మరో విశేషం.
‘పైర్’ 2024లో టాలిన్ బ్లాక్ నైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో వరల్డ్ ప్రీమియర్ జరుపుకుంది. అక్కడ బెస్ట్ ఫిల్మ్ ఆడియన్స్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. భారతదేశంలో అక్టోబర్ 30, 2026న థియేటర్లలో విడుదలైంది. తక్కువ థియేటర్లలో విడుదలైనప్పటికీ ఈ సినిమా రెండు కోట్లు రాబట్టడం విశేషం. 'రామాయణ' రాకపోయి ఉంటే.. లాంగ్ రన్ లో వండర్స్ క్రియేట్ చేసి ఉండేదేమో.
ఇక తాజాగా ఈ సినిమాను 99వ అకాడమీ అవార్డుల కోసం జనరల్ ఎంట్రీ కేటగిరీల్లో సమర్పించేందుకు దర్శకుడు వినోద్ కప్రి నిర్ణయించుకున్నారు. స్వతంత్రంగా రూపొందించిన ఈ చిన్న సినిమా అంతర్జాతీయంగా ఇంతటి గుర్తింపు పొందడం విశేషం.
‘పైర్’ కథ ఉత్తరాఖండ్‌లోని ఓ మారుమూల గ్రామంలో సాగినా, అందులో చూపించిన సమస్య మనకు కూడా కొత్తేమీ కాదు. ఉద్యోగాలు, మెరుగైన జీవితం కోసం పిల్లలు నగరాలకు, విదేశాలకు వెళ్లడం సహజమే. కానీ వారి కోసం ఎదురుచూస్తూ పల్లెల్లో ఒంటరిగా మిగిలిపోయే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? డబ్బులు పంపించవచ్చు, ఫోన్లో మాట్లాడవచ్చు. కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు పక్కన కూర్చునే మనిషిని, నాలుగు మాటలు మాట్లాడే ఆత్మీయతను డబ్బుతో కొనలేం కదా.
అందుకే ‘పైర్’ కేవలం ఓ వృద్ధ దంపతుల ప్రేమకథ మాత్రమే కాదు. మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేసే సినిమా కూడా.
మీకు నచ్చవచ్చు:
30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్ హాసన్ మేకప్ వెనుక అసలు కథ తెలుసా.?
‘గాడ్ ఆఫ్ వార్’కి బ్రేక్.. చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా.!
[Pyre Movie, Emotional Story, Vinod Kapri, Padam Singh Kapri, Heera Devi]
Mani Ratnam's much-awaited romantic drama Inji Vellam, starring Vijay Sethupathi and Sai Pallavi, is gearing up for a theatrical release on January 29, 2027. The film has generated considerable curiosity ever since its title and first-look poster were unveiled, featuring the lead pair in a rain-soaked romantic moment.
The film marks another collaboration between Mani Ratnam and Vijay Sethupathi after Chekka Chivantha Vaanam. Sai Pallavi joins the filmmaker for the first time, and the pairing has become one of the major attractions. Although the makers have kept the storyline under wraps, the promotional material hints at a romantic drama set against the backdrop of Kolkata.
Inji Vellam is jointly produced by Mani Ratnam and Siva Ananth under Madras Talkies, along with Subaskaran's Lyca Productions. The film also has India Talkies associated with its production.
Also Read: Did Anirudh walk out of Simbu's Arasan?
A.R. Rahman is composing the music, continuing his celebrated association with Mani Ratnam. The technical crew includes cinematographer Avik Mukhopadhyay, editor Sreekar Prasad, production designer Sharmishta Roy, costume designer Eka Lakhani, choreographer Brinda Gopal and action choreographer Dhilip Subbarayan.
With Mani Ratnam, A.R. Rahman, Vijay Sethupathi and Sai Pallavi coming together, Inji Vellam carries considerable expectations. The January 29 release date gives audiences a confirmed target to look forward to, while further details about the film's story and supporting cast are awaited.
Check Out: Naslen wraps his next with Kumbalangi Nights director
Sukumar launches romantic entertainer with Siddhu
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
బాబుమోహన్.. ఈ పేరుకి ఉన్న చరిష్మా తెలుగు సినిమా ఉన్నంత కాలం వెలుగొందుతూనే ఉంటుంది. బాబు మోహన్ తమ సినిమాలో ఉండేలా చూడు అని ఇష్టదైవాల్ని ప్రార్ధించని హీరో లేడనే టాక్ కూడా తెలుగు ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో తరచూ వినపడుతూ ఉండేది.
అలాంటి బాబు మోహన్ తాజాగా టాలీవుడ్ మోస్ట్ అంటెన్సివ్ చిత్రమైన 'ది ప్యారడైజ్' సినిమా యూనిట్ పై అత్యంత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో తనకు జరిగిన చేదు అనుభవాలను, మేకర్స్ వ్యవహరించిన తీరును బహిరంగంగానే వెల్లడించి సంచలనం సృష్టించారు. ఇటీవలి కాలంలో సినిమాలని బాగా తగ్గించి, అత్యంత సెలెక్టివ్‌గా నటిస్తున్న బాబు మోహన్ 'ది ప్యారడైజ్' చిత్రంలో ఒక కీలకమైన మరియు మంచి క్యారక్టర్ కోసం దర్శకుడు, చిత్ర యూనిట్ తనని స్వయంగా సంప్రదించారని గుర్తు చేసుకున్నారు.
తన వద్దకు వచ్చిన ఆ రోల్ కోసం స్వయంగా లుక్ టెస్ట్ కూడా నిర్వహించారని, గెటప్ చాలా అద్భుతంగా వచ్చిందని ఆ సమయంలో ఎంతో అభినందించారని ఆయన తెలిపారు. షూటింగ్ ప్రారంభం కాగానే వెంటనే పిలుస్తామని, పనులన్నీ పూర్తి కాగానే కబురు పెడతామని చెప్పి యూనిట్ పెద్దలు నమ్మించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ఆ తర్వాత చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోగా, కనీసం ఫోన్ చేసి చెప్పే మర్యాద కూడా పాటించలేదని బాబు మోహన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిలుపు వస్తుందని, షూటింగ్‌కి రమ్మంటారని ఎంతో ఆశగా ఎదురుచూసిన తనను చివరికి ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా పక్కన పెట్టేశారని ఆయన మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: టిల్లు మావ కొత్త సినిమా: సబ్జెక్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!
తనలాంటి అనుభవజ్ఞుడైన సీనియర్ నటుడిని ఇలా గెటప్ వేసి, లుక్ టెస్ట్ చేసి అర్ధంతరంగా పక్కన పెట్టడం తీవ్ర అవమానకరమని ఆయన మధనపడ్డారు. నటీనటులకు కనీస గౌరవం ఇవ్వని వారికి దరిద్రం, శని వెంటపడతాయని, అందుకే ఆ సినిమాకి ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదని కొంచం ఘాటుగానే విమర్శించారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మీకు నచ్చవచ్చు:రామాయణ సౌత్ కలెక్షన్స్ ఇంతే!
మీకు నచ్చవచ్చు: రంగంలోకి చిరంజీవి: ఫ్యాన్స్ లో కోలాహాలం!
[Babu Mohan , Nani, the Paradise, Kayadu Lohar, Mohan Babu]
‘రంగస్థలం’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
‘RC17’ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సుకుమార్ ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌ను సిద్ధం చేస్తున్నారట. ఈ ఏడాది చివర్లోనే కెమెరా ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్, హీరోయిన్, సంగీత దర్శకుడు వంటి విషయాలపై కూడా ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. అయితే పూర్తి వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు.
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ ‘RC17’లో రిషికాంత్?.. పూజకు వెళ్లిన అసలు కారణం చెప్పేశాడు.!
అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నెమలి ఈక ఉండటంతో ఇది శ్రీకృష్ణుడి నేపథ్యంలో మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డిసెంబర్ చివరి వారంలో షూటింగ్ మొదలైతే, కొత్త ఏడాదిలో ఈ సినిమా మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ‘రంగస్థలం’ మ్యాజిక్‌ను సుకుమార్ మరోసారి రిపీట్ చేస్తారా? అనేది చూడాలి.
మీకు నచ్చవచ్చు:
‘గాడ్ ఆఫ్ వార్’కి బ్రేక్.. చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా.!
చేతులు మారిన జటాయు ప్రాజెక్ట్.. రోషన్ హీరోగా పాన్ ఇండియా మూవీ లాంచ్.!
[RC17 Shooting Update, RC17 Movie, Ram Charan, Sukumar, Mythri Movie Makers]
డిజె టిల్లు సిద్దు జొన్నలగడ్డ ప్రీవియస్ చిత్రాలని పరిశీలిస్తే వరుస పరాజయాలు. దీంతో అభిమానులు, సినీ ప్రేమికుల్లో ఒకింత బెంగ మొదలైంది. అంతలా డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ తో మెస్మరైజ్ చేసాడు. ఈ సారి హిట్ అంటూ కొత్త మూవీ స్టార్ట్ చేసాడు
ఆయన కొత్త చిత్రం ‘సిద్ధు 10’ అనే వర్కింగ్ టైటిల్‌తో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు. పూజ కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. దర్శకుడు బుచ్చిబాబు, దర్శకురాలు సందిని రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఇందులో సిద్ధుకు జోడీగా నయన్ సారిక నటించనున్నారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రానికి మోహన్ బి దర్శకత్వం వహించనున్నారు. జి వి ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. సుకుమార్ రైటింగ్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
ఈసారి మరింత డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ తాజా ప్రాజెక్ట్ చాలా యూనిక్ ప్లాట్‌తో తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్,లోకేష్ కనగరాజ్ మూవీ టైటిల్ ఇదేనా: ఆ స్టార్ అంట!
సినిమా రంగంలో ప్రయోగాత్మక కథలకు ఎప్పుడూ ముందుండే సిద్ధూ జొన్నలగడ్డ, కేవలం ఒకే జానర్‌కు పరిమితం కాకుండా, విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన లైనప్‌లో సోషియో ఫాంటసీ జానర్ మూవీతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతోంది.
ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే బలమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న సిద్ధూ నుంచి వస్తున్న ఈ అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
మీకు నచ్చవచ్చు:సెన్సేషన్ సృష్టిస్తున్న సూర్య !
మీకు నచ్చవచ్చు: శ్రీకాంత్ కొడుకు వచ్చేస్తున్నాడు!
[Siddhu Jonnalagadda, Nayan Saarika, Allu Aravind, Telugu Cinema, TeluguCinema News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం మన సంప్రదాయంలో ఎప్పట్నుంచో ఉంది. అయితే దీని వెనుక దాగున్న శాస్త్రీయ కారణాలు మరియు ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా పాలల్లో కాల్షియం, ఐరన్, ప్రొటీన్ వంటి శరీరానికి అత్యవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు అర చెంచా పసుపు చేర్చినప్పుడు ఈ పానీయం కాస్తా గోల్డెన్ మిల్క్ లేదా అద్భుతమైన ఆరోగ్య అమృతంగా మారుతుంది. రాత్రి పూట ఈ పసుపు పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒత్తిడి, అలసట పూర్తిగా తొలగిపోయి ప్రశాంతమైన గాఢమైన నిద్ర సొంతమవుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పసుపులో అత్యంత శక్తివంతమైన కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను తొలగించడంలో మరియు ఫ్రీ రాడికల్స్ తో పోరాడడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల శరీరానికి సహజసిద్ధమైన యాంటీ క్యాన్సర్ ప్రభావం అందుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా, పసుపు పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ మిశ్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
శరీరంలో రోగనిరోధక శక్తిని అమాంతం పెంచడంలో పసుపు పాలు గ్రేట్ రిజల్ట్ ఇస్తాయి. పసుపులోని యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు కాలానుగుణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళ దీన్ని సేవించడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇందులో కొద్దిగా తేనె లేదా అల్లం కలుపుకుంటే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. రోజూ ఒక గ్లాసు గోల్డెన్ మిల్క్ తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడటంతో పాటు వైరల్ దాడి నుంచి రక్షణ లభిస్తుంది.
జీర్ణవ్యవస్థను పటిష్టం చేయడంలో పసుపు పాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. పసుపు జీర్ణక్రియను ఉత్తేజపరిచి, అజీర్ణం, గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతూ శరీరం తీసుకునే ఆహారంలోని పోషకాలను మెరుగ్గా గ్రహించేలా తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా పసుపు పాలు తాగే వారిలో జీర్ణ సంబంధిత రుగ్మతలు చాలా వరకు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు ధృవీకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి:టైప్1 మరియు టైప్2 డయాబెటిస్‌కు, అద్భుతమైన ఇంటి చిట్కా!
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను, మెదడు పనితీరును మెరుగుపరచడంలో పసుపు పాలు ఎంతగానో సహాయపడతాయి. కుర్కుమిన్ జ్ఞాపకశక్తిని పెంపొందించడమే కాకుండా వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమ్మినో ఆమ్లం, పసుపు గుణాలు కలిసి మెదడు నరాలను రిలాక్స్ చేసి నిద్రలేమి సమస్యను తరిమికొడతాయి.
చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలోనూ పసుపు పాలు అద్భుతంగా పనిచేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి మొటిమలు, మచ్చలు, చర్మంపై ముడతలు రాకుండా నివారించడంలో ఇవి సహాయపడతాయి. వయసు పెరుగుతున్న ఛాయలను తగ్గించి చర్మానికి సహజమైన కాంతిని ఇస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన, నిండు నూరేళ్ల జీవితం కోసం ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగే అలవాటును మీ దినచర్యలో భాగం చేసుకోండి.
మీకు నచ్చవచ్చు:కంటి నీరు, కారడం వెనుక ఉన్న అసలు రహస్యం: వైద్యుల సలహాలు
ఉదయం, లేవగానే నీరు తాగడం వల్ల కిడ్నీలు మరియు జీర్ణవ్యవస్థకు కలిగే లాభాలు!
Turmeric Milk Benefits, Haldi Doodh At Night, Golden Milk Science, Improve Sleep Naturally, Anti Inflammatory Drinks, Doctor Health Advice, Health Tips In Telugu.
వర్షాకాలం లేదా చలికాలం వచ్చిందంటే చాలు, తేళ్లు, పాములు వంటి విషసృపాలు తడి నేలల నుంచి బయటికి వచ్చి ఇళ్లలోకి, చీకటి మూలల్లోకి చేరుతుంటాయి. అయితే, చిన్నపాటి అజాగ్రత్త వల్ల ఒక్కోసారి మనం తేలు కాటుకు గురికావాల్సి వస్తుంది. తేలు కుట్టిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్రమైన మంట, భరించలేని నొప్పి, తిమ్మిర్లు కలుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,500 రకాల తేలు జాతులు ఉండగా, కేవలం కొన్ని మాత్రమే ప్రాణాంతకమైన విషాన్ని విడుదల చేయగలవు. అయినప్పటికీ, తేలు కుట్టిన వెంటనే భయపడిపోకుండా కొన్ని అత్యవసర ప్రథమ చికిత్స చర్యలు పాటించడం ద్వారా విషం ప్రభావాన్ని, తీవ్రమైన నొప్పిని గణనీయంగా తగ్గించవచ్చు.
తేలు కుట్టిన వెంటనే చేయాల్సిన మొదటి పని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడం. కుట్టిన భాగాన్ని గోరువెచ్చని నీరు మరియు యాంటీసెప్టిక్ సబ్బుతో శుభ్రంగా కడగాలి. ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఆ తర్వాత, ఐస్ క్యూబ్స్‌ను ఒక శుభ్రమైన గుడ్డలో చుట్టి తేలు కుట్టిన ప్రదేశంపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి, విషం శరీరంలోకి వేగంగా పాకకుండా అడ్డుకోవచ్చు. ఒకవేళ చేయికి లేదా కాలికి కుట్టినట్లయితే, ఆ భాగాన్ని కదలకుండా కొద్దిగా ఎత్తులో ఉంచడం చాలా మంచిది.
ఇక వంటింట్లో దొరికే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలతో కూడా తక్షణ ఉపశమనం పొందవచ్చు. పసుపులో ఉండే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని మాయం చేస్తాయి. కొద్దిగా పసుపును ఆవ నూనెతో కలిపి పేస్ట్‌లా చేసి కుట్టిన చోట రాస్తే మంట త్వరగా తగ్గుతుంది. అలాగే బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి రాసినా చర్మానికి మంచి ఉపశమనం లభిస్తుంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉండే ఉల్లిపాయ రుద్దడం లేదా నాటు వైద్యాలు వంటి శాస్త్రీయ ఆధారాలు లేని పద్ధతులను గుడ్డిగా నమ్మి కాలయాపన చేయడం ప్రాణాలకే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 3,000 మంది తేలు కాటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో దాదాపు 80 శాతం మంది చిన్నపిల్లలే ఉండటం గమనార్హం. తేలు విషం పిల్లలపై, వృద్ధులపై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బాధితుల్లో విపరీతమైన చెమటలు పట్టడం, తల తిరగడం, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది లేదా వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలి. తీవ్రమైన సందర్భాల్లో వైద్యులు యాంటీ వినమ్ (Antivenom) మందులను అందించి ప్రాణాలు కాపాడుతారు.
ఇది కూడా చదవండి:వైద్య రంగంలో సంచలనం: క్యాన్సర్ కణాల రహస్యాలను, బట్టబయలు చేసిన శాస్త్రవేత్తలు
ఇంటి చుట్టూ తేళ్లు రాకుండా తగిన రక్షణ మరియు నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను ముందే అడ్డుకోవచ్చు. ఇళ్ల పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పనికిరాని వస్తువులు, చెత్తాచెదారం, ఎండిన చెట్ల పొదలను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇంట్లోని గోడల్లో ఉండే పగుళ్లను సిమెంట్ లేదా మట్టితో మూసివేయాలి. రాత్రి సమయాల్లో లేదా చీకటి ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కాళ్లకు బూట్లు, చేతులకు రక్షణ గ్లౌజులు ధరించడం చాలా ముఖ్యం.
అలాగే, ఎక్కడైనా బూట్లు లేదా దుస్తులు బయట ఉంచితే, వాటిని వేసుకునే ముందు ఒకసారి గట్టిగా జాడించి చూసుకోవడం మంచి అలవాటు. తేళ్లు సాధారణంగా చీకటి ప్రదేశాలు, బూట్ల లోపల, మంచాల కింద దాక్కుంటాయి. కొద్దిపాటి అప్రమత్తత, సరైన సమయంలో అందించే ప్రథమ చికిత్స తేలు కాటు విష ప్రభావాన్ని పూర్తిగా తగ్గించి ప్రాణాలను కాపాడుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా నిపుణులైన వైద్యుల సలహా తీసుకోవడమే అత్యంత సురక్షితమైన మార్గం.
మీకు నచ్చవచ్చు:గుండె వేగం, సాధారణంగా ఉన్నా పక్షవాతం రావచ్చా? వైద్యులు హెచ్చరిస్తున్న విషయాలివే!
పరగడుపున, టీ లేదా కాఫీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
Scorpion Sting First Aid, Scorpion Bite Remedies, Emergency Medical Tips, Insect Sting Treatment, First Aid Guide, Doctor Health Advice, Health Tips In Telugu.
పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి అనేక పోషకాలను అందించడంలో ఇవి ముందుంటాయి. శీతాకాలంలో ఎదురయ్యే పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో నారింజ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో చాలామందిని ఇబ్బందిపెట్టే ప్రధాన సమస్యలు దగ్గు, జలుబు మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు. నారింజ పండ్లలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. ప్రతిరోజూ నారింజ తీసుకోవడం ద్వారా కాలానుగుణ వ్యాధుల బారిన పడకుండా సులభంగా రక్షణ పొందవచ్చు.
అలాగే, చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. నారింజలో లభించే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి ఎంతగానో సహాయపడుతుంది, ఇది చర్మాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా ఉంచడంలో కీలకమైనది. అంతేకాకుండా, ఇవి చర్మానికి ముడతలు రాకుండా కాపాడి, ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా సహజమైన మెరుపును అందిస్తాయి.
మరోవైపు, నారింజలో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడంలో, మలబద్ధకం సమస్యను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఆహార ఎంపికగా నిలుస్తుంది. ఇది కడుపు నిండిన భావనాన్ని కలిగించి అనవసరమైన ఆహారపు అలవాట్లను నియంత్రిస్తుంది.
ఇది కూడా చదవండి:పండుగ, తిండి తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా? ఎసిడిటీ ముప్పు తప్పదు!
ఇవే కాకుండా, నారింజలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. చలికాలంలో నీరు తక్కువగా తాగుతుంటారు కాబట్టి శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. నారింజలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో హైడ్రేషన్ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ మరియు ఇతర పోషకాలు కంటి చూపును మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడతాయి.
మొత్తంగా చూస్తే, శీతాకాలంలో ప్రకృతి మనకు అందించే ఒక ఆరోగ్యకరమైన వరం నారింజ పండ్లు. కేవలం రుచిలోనే కాకుండా, పోషకాల పరంగానూ ఇవి ఎంతో శ్రేష్టమైనవి. కాబట్టి ఈ చలికాలంలో మీ రోజువారీ ఆహారంలో నారింజను కచ్చితంగా భాగం చేసుకొని, సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.
మీకు నచ్చవచ్చు:బిల్వ ఆకులతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎవరికి మేలు? ఎవరికి డేంజర్?
లిపిడ్ ప్రొఫైల్, అంటే ఏమిటి? గుండెను కాపాడుకునే సులభమైన మార్గం!
Oranges In Winter, Cold And Cough Remedies, Immunity Boosting Foods, Vitamin C Health Benefits, Winter Health Tips, Doctor Health Advice, Health Tips In Telugu.
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రభావం వైసీపీపై ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయాలలోకి ప్రవేశించడానికి ముందు నుంచి కూడా విజయసాయి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో కూడా విజయసాయి సహ నిందితుడు. జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నాయి.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన విజయసాయి, ఇప్పుడు పరివర్తన రాజనీతి పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.
దేశభక్తి, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా తన పార్టీ పనిచేస్తుందని విజయసాయి పార్టీ ప్రకటన సందర్భంగా చెప్పారు. పార్టీ అధికారిక ప్రకటనతో పాటు జెండాను కూడా ఆవిష్కరించిన విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సంస్కృతిని తీసుకువస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
ఈ పరిణామం వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకంగా, పార్టీ నేతకు అధినేతకు అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకోవడం ఆ పార్టీకి ఏదో మేరకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తమౌతోంది.
ఇది కూడా చదవండి: జయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!
పార్టీలో అసంతృప్తితో ఉన్న, అలాగే ఆయనతో సత్సంబంధాలు కలిగిన కొందరు నేతలు భవిష్యత్తులో వైసీపీని వీడి విజయసాయి పంచన చేరే అవకాశలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. అదలా ఉంచితే.. కొత్త పార్టీ ద్వారా ఆయన ఏ మేరకు ప్రభావం చూపగలరు, ప్రజాదరణను ఏ విధంగా సంపాదించుకుంటారు అనే విషయంలో కూడా రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
రానున్న కాలంలో విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) ప్రయాణం అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను ఏ మేరకు ఎలా ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చెప్పిన ముహూర్తానికి చెప్పినట్లుగా తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విజయసాయి, ముందు ముందు రాష్ట్ర రాజకీయాలలో ఏ మేరకు ప్రభావం చూపుతారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్త మౌతోంది.
మీకు నచ్చవచ్చు: వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి
విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.?
[Effect of Vijayasai Reddy New Party onYCP, Parivarthana Rajaneethi Party, PRP, Political Impact, AP Politics, Telugu One]
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి కొత్తపార్టీని అధికారికంగా ప్రకటించారు. తాను ఏర్పాటు చేసిన పార్టీ పెరును ఆయన ప్రకటించారు. విజయవాడ ఏ కన్నెన్షన్ వేదికగా బుధవారం (నవంబర్ 11) సరిగ్గా 11 గంటల 11నిముషాలకు ఆయన తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. తన కొత్త పార్టీ పేరు పీఆర్పీ (పరివర్తన రాజనీతి పార్టీ)గా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దీంతో ఏపీ రాజకీయాలలో మరో కొత్తపార్టీ ఆవిర్భవించింది.
గతంలో వైపీపీలో కీలక నేతగా చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి, ఆ తరువాత ఆ పార్టీకీ, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా సందర్భంగా ఇక రాజకీయాలకు దూరం, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన విజయసాయి రెడ్డి, ఆ నిర్ణయం మార్చుకుని, యూటర్న తీసుకుని మళ్లీ రాజకీయ ప్రవేశం చేశారు.
తన కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన ఆయన ఈ సందర్భంగా పార్టీ జెండా, ఎజెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో కుల, మత రాజకీయాలకు స్వస్తి పలకడంతో పాటు, రెండు కుటుంబాల ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలకడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
దేశభక్తి, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పీఆర్పీ పనిచేస్తుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ముఖ్యంగా యువతను భావి నాయకులుగా తీర్చిదిద్దే ఫ్యాక్టరీగా తమ పార్టీ పని చేస్తుందన్న విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో కరువు కాటకాలు, కరెంటు కోతలు లేని పరిస్థితులను సృష్టించడం, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం తమ ధ్యేయమన్నారు.
ఇది కూడా చదవండి: వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి
ఇక ఎన్నికల హామీల విషయంలోనూ ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించడం, చదువుల భారాన్ని తగ్గించి వంద శాతం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు,
విజయసాయిరెడ్డి నూతన పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాలలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు అసంతృప్త నేతలు ఆయన బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయాలపై చూపే ప్రభావంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరలేచింది.
మీకు నచ్చవచ్చు: విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!
తెలుగుదేశం, వైసీపీ దొందూదొందే.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. విజయసాయిరెడ్డి.!
[Vijayasai Reddy New Party PRP, Parivarthana Rajaneethi Party, Andhra Pradesh Politics, Vijayawada Convention Center, Gen Z Leaders, Telugu One]
తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ తనదైన ముద్ర వేస్తూ తొలి ప్రయత్నంలోనే తన టీవీకే పార్టీని గెలిపించుకుని, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి సుమారు 35 శాతానికి పైగా ఓటు బ్యాంకును సాధించారు.
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల కాలంలో టీవీకే ప్రభుత్వానికి చెందిన కొందరు నేతల వివాదాస్పద ప్రవర్తన పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తోంది. గతంలో ఒక మంత్రి డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో వివాదంలో చిక్కుకోగా, తాజాగా తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే రవిశంకర్ దురుసు ప్రవర్తన వివాదంగా మారింది.
తిరుచిరాపల్లి జిల్లాలో తమ ప్రాంతంలోని తాగునీటి ఎద్దడి, చెత్తాచెదారం పేరుకుపోవడం వంటి సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్లిన కార్తీక్ కుమార్ అనే వ్యక్తిపై డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ భౌతిక దాడికి దిగారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి తన వద్దకు వచ్చిన వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకోవడం దుమారానికి దారితీసింది.
ఇది కూడా చదవండి: చంద్రబాబుతో భేటీ: విజయ్ విక్టరీ సింబల్.. దక్షిణాది పొలిటికల్ సినేరియో మార్పునకు సంకేతమా.?
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో టీవీకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రజా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో హింసాత్మక మరియు ఆధిపత్య రాజకీయాలకు స్వస్తి పలకాలని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేల తీరు ఆయన ఆశయాలకు గండికొడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం కొద్ది నెలలు మాత్రమే అయినప్పటికీ, ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం కావడం పార్టీకి నష్టం చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి విజయ్, తప్పు చేసే ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుని గాడిన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
ముఖ్యమంత్రిగా విజయ్ పని తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో చూపుతున్న వేగం, నిరాడంబరత ప్రజలను ఆకట్టుకుంటున్నప్పటికీ, టీవీకే ఎమ్మెల్యేల తీరు, వారిపై వెల్లువెత్తుతున్న విమర్శలు పార్టీకే కాదు, వ్యక్తిగతంగా విజయ్ కూడా నష్టం చేకూరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. గీత దాటిన ఎమ్మెల్యేలపై విజయ్ కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
మీకు నచ్చవచ్చు: తమిళనాడు సీఎం విజయ్ పై ఎన్నికల కేసు: ఈ నెల 14న తీర్పు.!
విడాకుల కేసు: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్ వైఫ్.!
[TVK MLAS Crossing Line, Tamilnadu Government, CM Vijay, Deputy Speaker Ravi Shankar, Controversy, Telugu One]
ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే చాలామంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వయసు పెరిగిన తర్వాత మాత్రమే వచ్చే సమస్యగా భావించే ఆర్థరైటిస్ ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తోంది. అసలు చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు రావడానికి కారణాలేంటి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అంటే ఏమిటి? ఈ సమస్యకు వ్యాయామానికి ఉన్న సంబంధం ఏమిటి? కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కీళ్లు మన శరీర కదలికలకు ఎంతో కీలకం. నడవడం, మెట్లు ఎక్కడం, కూర్చోవడం, నిలబడటం వంటి రోజువారీ పనులన్నీ కీళ్ల సహకారంతోనే సాధ్యమవుతాయి. అయితే శారీరక శ్రమ తగ్గడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు కీళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా మోకాళ్లపై ఒత్తిడి పెరిగినప్పుడు నొప్పి, బిగుతుగా అనిపించడం, కదలికల్లో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి.
కీళ్ల నొప్పులు రాకుండా ఉండటానికి, మోకాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రోజువారీ వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ వీడియోలో Dr. Bhaskarకీళ్ల ఆరోగ్యం, ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి ముఖ్యమైన విషయాలను వివరించారు. అలాగే మోకాళ్ల కదలికలు మెరుగుపడటానికి, కండరాలు బలపడటానికి, కీళ్లపై ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఐదు వ్యాయామాల గురించి తెలియజేశారు.
ఈ ఐదు వ్యాయామాలను ఎలా చేయాలి? వాటిని రోజువారీ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి? కీళ్ల నొప్పులతో బాధపడేవారు వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు ఎలాంటి వ్యాయామాలను ఎంచుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి పిండికూరతో కిడ్నీ రాళ్లు కరుగుతాయా.. డాక్టర్ ఏం చెబుతున్నారు
కీళ్ల నొప్పులు ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన వ్యాయామాలు సరిపోవు. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే తమకు తగిన వ్యాయామాలను ఎంచుకోవాలి. నొప్పి పెరిగేలా బలవంతంగా వ్యాయామాలు చేయకూడదు.
కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మోకాళ్ల నొప్పుల పట్ల అవగాహన పెంచుకోవడానికి డాక్టర్ భాస్కర్ అందిస్తున్న ఈ విలువైన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోండి.
మరిన్ని ఆరోగ్య విషయాలు, నిపుణుల సలహాలు, ఉపయోగకరమైన సమాచార వీడియోల కోసం TeluguOne Healthను ఫాలో అవ్వండి.
మనం రోజూ తినే ఆహారంలో కొన్ని కాంబినేషన్స్ ట్రై చేస్తుంటాం. కానీ ఏ ఆహార పదార్థాన్ని వేటితో కలిపి తింటే మన శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయనే విషయం మీద చాలామందికి స్పష్టత ఉండదు. మనం తినే వాటిలో కొన్ని కాంబినేషన్ లు ఆరోగ్యానికి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అలాంటి కొన్ని అరుదైన , అత్యంత ప్రయోజనకరమైన ఫుడ్ కాంబినేషన్ లు ఏవో.. వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో గురించి వివరంగా తెలుసుకుంటే..
పుచ్చకాయ.. ఉప్పు..
మనలో చాలా మందికి పుచ్చకాయ అనగానే గుర్తుకు వచ్చేది కేవలం తియ్యటి రుచి మాత్రమే. అయితే పుచ్చకాయ ముక్కల మీద కొద్దిగా ఉప్పు చల్లుకొని తింటే దాని రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా రెట్టింపు అవుతాయి. పుచ్చకాయలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఉప్పులో సోడియం లభిస్తుంది. ఈ రెండు కలిసి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండేలా చూస్తాయి. ముఖ్యంగా ఎండకాలంలో లేదా వర్కవుట్లు చేసిన తర్వాత ఈ కాంబినేషన్ శరీరాన్ని తక్షణ శక్తితో పాటు హైడ్రేట్ గా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది.
బాదం..డార్క్ చాక్లెట్..
బాదం పప్పులను డార్క్ చాక్లెట్ తో కలిపి తీసుకోవడం మరొక మంచి అలవాటు. బాదం పప్పులో శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు , విటమిన్ ఈ లభిస్తాయి. అలాగే డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువగా ఉండే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఈ రెండింటి కలయిక శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ శక్తిని గణనీయంగా పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది , గుండె సంబంధిత సమస్యలు రాకుండా రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఓట్స్.. పెరుగు..
ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తినడం చాలా మందికి అలవాటు. అయితే ఈ ఓట్స్ ను పెరుగుతో కలిపి తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఓట్స్ లో ప్రీబయోటిక్స్ ఉంటాయి. అలాగే పెరుగులో మంచి బ్యాక్టీరియాను అందించే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ రెండు కలిసి కడుపులోని జీర్ణక్రియను మెరుగుపరచడంలో , గట్ హెల్త్ ని ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. పొట్టకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి ఈ ఆహార కాంబినేషన్ మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ఇది కూడా చదవండి మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..!
గ్రీన్ టీ.. నిమ్మరసం..
బరువు తగ్గాలనుకునేవారు లేదా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టేవారు గ్రీన్ టీ తాగడం సాధారణం. అయితే గ్రీన్ టీ లో కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగితే దాని ప్రయోజనాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లను శరీరం వేగంగా గ్రహించేలా సహాయపడుతుంది. సాధారణంగా గ్రీన్ టీ తాగడం వల్ల అందే పోషకాలు నిమ్మకాయ కలవడం వల్ల మరింత మెరుగ్గా పనిచేస్తాయి.
పసుపు పాలు.. మిరియాల పొడి..
మన ఇంట్లో తరచూ చేసుకునే పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగడం మన సాంప్రదాయం. అయితే ఈ పసుపు పాలలో చిటికెడు మిరియాల పొడి కూడా కలిపితే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. మిరియాలలో పైపరిన్ అనే గుణం ఉంటుంది. ఇది పసుపులోని కర్క్యుమిన్ అనే మూలకాన్ని శరీరం త్వరగా , పూర్తిగా గ్రహించడానికి సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఎముకల నొప్పులు , ఇతర ఆరోగ్య సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మనం తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఏ ఆహారాన్ని ఏ పదార్థంతో కలిపి తినాలో తెలుసుకొని పాటిస్తే శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ అద్భుతమైన ఆహార కాంబినేషన్ లను దైనందిన జీవితంలో భాగం చేసుకొని పూర్తి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు ఇలా చేస్తే చాలు... పిల్లలు ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలంటే ఇష్టపడతారు..!
ప్రతిరోజూ ఉదయం గొంతుకు హాయిగా ఉండేలా వేడి వేడిగా టీ తాగి రోజును ప్రారంభించడం చాలా మందికి అలవాటు. అయితే ఆ రొటీన్ టీకి బదులుగా అప్పుడప్పుడు కొన్ని సుగంధ ద్రవ్యాలు , మూలికలను జోడించి తయారు చేసుకునే పానీయాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని హెర్బల్ టీలు అని అంటారు.
మన వంటింట్లో సులభంగా లభించే మసాలా దినుసులతోనే ఈ టీల ను తయారు చేసుకుని తాగవచ్చు. అలా వంటిట్లో ఉండే మసాలా దినుసుల్లో అనాస పువ్వు కూడా ఒకటి. ఈ అనాస పువ్వుతో తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చిన్న పువ్వు కేవలం వంటకాలకు రుచిని ఇవ్వడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే..
అనాస పువ్వు టీ..
ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ ఫీవర్స్ , ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. జ్వరం లేదా ఏదైనా వైరస్ లేదా శ్వాసకోశ సమస్యలు తలెత్తినప్పుడు ప్రకృతి మనకు ప్రసాదించిన అనాస పువ్వును ఉపయోగించి సులభంగా హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు. అనాస పువ్వును చిన్న ముక్కలుగా చేసి, నీటిలో మరిగించి టీలా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రయోజనాలు..
వైరల్ ఫీవర్.. శ్వాసకోశ సమస్యలు..
వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, వైరస్ జ్వరాలు సర్వసాధారణం. అనాస పువ్వులో యాంటీ వైరల్ , యాంటీ మైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించే హానికారక వైరస్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. శ్వాసనాళాల్లో చేరిన శ్లేష్మాన్ని కరిగించి, గొంతు నొప్పి , ఊపిరితిత్తుల ఇబ్బంది నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.
జీర్ణక్రియ ..
తిన్న ఆహారం సరిగా అరగకపోవడం, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ టీ చాలా బాగా పనిచేస్తుంది. అనాస పువ్వులోని పోషకాలు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి, జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. భోజనం తర్వాత లేదా ఉదయం పూట ఈ టీ తాగడం వల్ల పొట్ట తేలికగా ఉంటుంది.
ఇది కూడా చదవండి షుగర్ పేషెంట్లు తప్పక తెలుసుకోవాలి ! ముఖ్యమైన డాక్టర్ సూచనలు
రోగనిరోధక శక్తి పెంపు..
శరీరంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే చిన్నచిన్న అనారోగ్యాలు కూడా త్వరగా చుట్టుముడతాయి. అనాస పువ్వు టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది , ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ లభిస్తుంది.
కీళ్ల నొప్పులు, వాపులు తగ్గించడం..
శరీరంలో ఎక్కడైనా వాపులు లేదా కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు ఈ టీ సహజ నివారణగా పనిచేస్తుంది. దీనిలో ఉండే కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు శరీరంలో మంటను, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. వయసు మళ్లిన వాళ్ళలో లేదా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
మానసిక ప్రశాంతత , నిద్రలేమి నివారణ..
రోజంతా పడిన అలసట, ఒత్తిడి కారణంగా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. అనాస పువ్వు టీలో ఉండే సువాసన , మృదువైన గుణాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది మనసును రిలాక్స్ చేసి చక్కగా నిద్ర పట్టేలా సహాయపడుతుంది.
చర్మ సౌందర్యం..
శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు వస్తుంటాయి. ఈ హెర్బల్ టీ శరీరాన్ని శుభ్రపరిచి, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారడానికి దోహదపడుతుంది.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు థైరాయిడ్ PCOS గట్ హెల్త్.. వీటి మధ్య సంబంధం ఏమిటి.!
మహిళలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడని అండాశయ క్యాన్సర్ లక్షణాలివే!
What Happens to Your Body When You Drink Star Anise Tea,Amazing Benefits Revealed,Star Anise Tea,Amazing Benefits for Your Body
