Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయా? వైద్యులు చెప్పిన నిజాలివీ!
posted on: Jul 28, 2026 2:58PM

నేటికాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చాలా సాధారణం అయిపోయింది. ఏ వయసు వారికైనా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల పిల్లలు, యువకులలో కిడ్నీలో రాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం దాదాపు 10 మందిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కుంటూ ఉన్నారట. ఈ సమస్యలు సాధారణంగా తేలికపాటి చికిత్స లేదా శస్త్రచికిత్స ద్వారా సులభంగా పరిష్కారం అవుతాయి. కానీ కొంతమందిలో రాళ్ల సమస్యలు తీవ్రమైన మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. అసలు కిడ్నీలో రాళ్ల సమస్య ఎలా ఏర్పడుతుంది? బీర్ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుందనే మాట నిజమా? దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే..
మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు..
మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి అతిపెద్ద కారణం తగినంత నీరు తీసుకోకపోవడం. తగినంత నీరు త్రాగనప్పుడు మూత్రం ఘాడతగా మారుతుంది. దానిలోని ఖనిజాలు స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఇవే కిడ్నీలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.
ఉప్పు అధికంగా తీసుకోవడం, ప్రోటీన్ అధికంగా తీసుకోవడం, ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలైన పాలకూర, చాక్లెట్ వంటివి తినడం, అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ల ప్రమాదం పెరుగుతుంది.
ఊబకాయం, మధుమేహం, జీవక్రియ సమస్యలు కూడా రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.
మూత్రపిండాలలో రాళ్లు ఎలా నయమవుతాయి?
వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. కిడ్నీలో రాళ్ళు సాధారణంగా ఎక్కువ నీరు త్రాగడం ద్వారా వాటంతట అవే బయటకు వస్తాయి. నొప్పిని తగ్గించడానికి, రాళ్ల పరిమాణాన్ని తగ్గించడానికి వైద్యులు మందులను సూచించవచ్చు. అయితే రాళ్ల పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరం ఏర్పడవచ్చు. కిడ్నీలో రాళ్లను ముందుగానే తొలగించడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి కాలక్రమేణా కిడ్నీ లోపలి పొరను దెబ్బతీస్తాయి.
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు తగ్గుతాయా?
బీరు తాగడం వల్ల మూత్ర ఉత్పత్తి పెరుగుతుందని, తరచుగా మూత్ర విసర్జన జరుగుతుందని, రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడుతుందని చాలామంది నమ్ముతారు. కానీ వైద్యులు ఈ నమ్మకాన్ని తోసిపుచ్చుతున్నారు.
బీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడతాయనే నమ్మకం ప్రజలలో ఉన్నా.. బీరు తాగితే చాలు కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి అనుకోవడం చాలా తప్పని, అది వైద్యులు రికమెండ్ చేయరని చెబుతున్నారు. బీరు తాత్కాలికంగా మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది, కానీ అది శరీరం డీహైడ్రేట్ అవ్వడానికి కారణం అవుతుంది. ఇది రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం అవుతుంది.
బీరులో ప్యూరిన్లు కూడా ఉంటాయి, ఇవి యూరిక్ ఆమ్లాన్ని పెంచుతాయి, మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి, అప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీర్ తాగితే.. ఈ రాళ్ల ప్రమాదం మరింత పెరుగుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యకు ఔషదంగా బీర్ ను తీసుకోవడం అస్సలు మంచిది కాదు.
*రూపశ్రీ.



.webp)


