LATEST NEWS
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం (ఏప్రిల్ 23) ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే బూత్ ల వద్ద భారీగా బారులు తీరారు. ఇక పశ్చిమ బెంగాల్ లోని 16 జిల్లాల్లోని 152 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ రెండు రాష్ట్రాలలోనూ కూడా త్రిముఖ పోరు జరుగుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్ లో 4,023 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ 5.73 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యతం తేల్చనున్నారు. ఓటర్లలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులున్నారు.తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
ఒక పశ్చిమ బెంగాల్‌లో తొలివిడత అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది.ఈ విడతలో 1478 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 3.6 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.75 కోట్ల మంది మహిళలున్నారు. బెంగాల్‌లో తృణమూల్, బీజేపీ మధ్య ప్రధాన పోరు సాగుతున్నది. పోలింగ్ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.తమిళనాడులో ఉదయం 9గంటల వరకు 17.69 శాతం, పశ్చిమబెంగాల్‌లో 18.76 శాతం ఓటింగ్ నమోదైంది.
తమిళ చిత్రసీమలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్న విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. విజయ్ రాకతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు మారుతాయా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా విజయ్‌ని తన మిత్రపక్షం నేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారితీశాయి.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు. పవన్ పదేళ్ల పాటు ఓపికగా పోరాడి నేడు ఈ స్థాయికి చేరుకున్నారన్నారు.
పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టినప్పటికీ, తక్షణ అధికారం కోసం పాకులాడకుండా క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాడారు. ఓటములు ఎదురైనా వెరవకుండా, వెన్ను చూపకుండా నిలబడ్డారు. ఆ నిబద్ధతే నేడు ఆయనను ఏపీ రాజకీయాల్లో కీలక శక్తిగా మార్చిందని చంద్రబాబు చెప్పారు. విజయ్ కూడా అదే బాటలో పయనిస్తేనే ఫలితం ఉంటుందని చంద్రబాబు పరోక్షంగా సూచించారు. సినిమా క్రేజ్ ఓట్లను తెచ్చిపెట్టొచ్చు కానీ.. రాజకీయాల్లో స్థిరపడాలంటే ప్రజలతో మమేకం కావడమొక్కటే మార్గమని చంద్రబాబు చెప్పారు.
తమిళనాడులో ఇప్పటికే డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన శక్తులు ఉన్నాయి. ఈ తరుణంలో విజయ్ తన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాగైతే తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకుని సృష్టించుకున్నారో, విజయ్ కూడా అదే తరహాలో యువతను, మహిళలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు మాటల్లో కూడా ఇదే వ్యూహం కనిపిస్తోంది.
మరోవైపు, పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించడం వారిరువురి మధ్యా ఉన్న బాండింగ్ కు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ త్యాగాలకు సిద్ధపడ్డారని చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పడం కూటమి ధర్మాన్ని ఆయన తు.చ. తప్పకుండా పాటిస్తున్నారనడానికి తార్కానంగా చెబుతున్నారు. మొత్తానికి విజయ్ రాజకీయ ప్రయా ణం సాఫీగా సాగాలన్న ఆశాభావం వ్యక్తం చేసిన చంద్రబాబు.. నిలదొక్కుకుని రాణించాలంటే మాత్రం పవన్ కల్యాణ్ ను మోడల్ గా తీసుకోవాలని చెప్పకనే చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముఖద్వారంగా భావించే ఉత్తరాంధ్రలో వైపీపీ ప్రభ పూర్తిగా మసకబారింది. గతంలో ఈ ప్రాంతంపై పట్టు సాధించిన వైసీపీ ప్రస్తుతం చతికిలపడింది. పొలిటికల్ గా ఉత్తరాంధ్రలో ఆ పార్టీ ఇసుమంతైనా ప్రభావం చూపలేని పరిస్థితులకు దిగజారింది. గత ఎన్నికలలో ఓటమి తరువాత ఆ పార్టీ ఉత్తరాంధ్ర నేతలలో అంతర్గతవిభేదాలు ఈ ప్రాంతంలో పార్టీ కుదేలయ్యేలా చేశాయి.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు. దీంతో ఆయన చేసేదేం లేక చేతులెత్తేసి విశాఖ నగరానికే పరిమితమయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పూర్తిగా ధర్మాన సోదరులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వంటి నేతలను స్థానిక నాయకత్వమే పక్కన పెట్టింది. ఇందుకు విరుద్ధంగా, కింజరాపు కుటుంబం నేతృత్వంలో టీడీపీ జిల్లా వ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. జనసేన మద్దతు కూడా తోడవడంతో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఇక పుంజుకోవడం కష్టసాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే విధంగా విజయనగరంలోనూ వైసీపీ కుదేలైంది. ఒకప్పుడు జిల్లాపై గట్టి పట్టున్న బొత్స సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో పార్టీ ముక్కలు ముక్కలుగా చీలిపోయి వర్గపోరు పరాకాష్టకు చేరుకుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాగా జిల్లాలో జనసేన, తెలుగుదేశం పార్టీలు ఐక్యంగా పని చేస్తుండటంతో జిల్లాలో కూటమి బలం పెరిగింది.
ఇక విశాఖ జిల్లాలో వైసీపీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. అక్కడ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు గుడివాడ అమర్నాథ్ కు పార్టీ అధిష్టానం ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. ఇక మిగిలిన స్థానిక నేతలు కూడా పార్టీ వ్యవహారాలలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో జిల్లాలో వైసీపీ పరిస్థితి ఉండీ లేనట్లుగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏ రకంగా చూసినా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో వైసీపీ వర్గపోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కీలక నేతల మధ్య ఉన్న విభేదాలు, సమన్వయ లేమి కారణంగా ఆ పార్టీ క్యాడర్ నిస్తేజంగా మారిపోయింది. తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే ఈ ప్రాంతంలో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ALSO ON TELUGUONE N E W S
కామెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్య, హీరోగా మారి చేసిన లేటెస్ట్ మూవీ ‘జెట్లీ’ (Jetlee). రితేష్ రానా దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మరోసారి క్విర్కీ, డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతుందని ప్రామిస్ చేస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. మే 1న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ కథలో సత్య పోషిస్తున్న పాత్ర ప్రత్యేకంగా నిలుస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయిన ఒక వ్యక్తిగా, తనను తాను వెతుక్కుంటూ వింత పరిస్థితుల్లో ఉంటాడు. కానీ తన ప్రశ్నలకు సమాధానాలు దొరకడం బదులుగా, చుట్టూ ఉన్నవారి నుంచి సెటైర్లు ఎదురవుతాయి. ఈ కాన్సెప్ట్‌ను ఎమోషనల్‌గా కాకుండా పూర్తిగా కామెడీ ట్రాక్‌లో నడిపించడం ఈ సినిమాకి ప్రధాన బలం.
ట్రైలర్‌లో కనిపించే మరో ఆసక్తికర అంశం.. రియాలిటీ, పర్సెప్షన్ మధ్య ఉన్న కాంట్రాస్ట్. అందరికీ సత్య ఒక జోక్‌లా కనిపించినా, తాను మాత్రం పెద్ద యాక్షన్ హీరోలా బిహేవ్ చేస్తాడు. ఈ మిస్మ్యాచ్ వల్లే సినిమా మొత్తం నవ్వుల వర్షంగా మారుతోంది. యాక్షన్ సీన్స్ కూడా సీరియస్‌గా కాకుండా, ప్యారడీ టచ్‌తో ఉండటం ప్రత్యేక ఆకర్షణ.
సత్య తన సహజమైన స్టైల్‌లో అండర్‌ప్లే పెర్ఫార్మెన్స్‌తో నవ్వులు పండించారు. రియా సింగ్ గ్లామర్‌తో పాటు యాక్షన్‌లో కూడా ఆకట్టుకుంటుండగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష తమ ట్రేడ్‌మార్క్ కామెడీతో కథను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చారు. దర్శకుడు రితేష్ రానా తన ప్రత్యేకమైన స్టైల్‌ను ఈసారి మరింత ఎలివేట్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సత్య మాట్లాడుతూ.. "రితేష్ కథ చెప్పగానే చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్ చాలా నచ్చి సినిమా చేశాను. ఇందులో క్యారెక్టర్ హీరోలా కాకుండా కామెడీ స్పేస్ లోనే వుంటుంది. యాక్షన్ కామికల్ గానే వుంటుంది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ తో జరిగే ఇంటరాక్షన్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ప్రతి సెగ్మెంట్ ని చాలా ఎంజాయ్ చేశాను. రితేష్ స్టయిల్ లో వర్క్ చేయడంతో ఇంట్రస్టింగ్ గా వుంటుంది. ఈ సినిమాలో చిరంజీవి గారి రిఫరెన్స్ లు వుంటాయి. మే1న అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను." అన్నారు
డైరెక్టర్ రితేష్ రానా మాట్లాడుతూ.. "ఇది యాక్టర్ ని బట్టి డిజైన్ అయ్యే స్టొరీ. సత్య అనుకున్నప్పుడు తన స్టయిల్ క్యారెక్టరైజేషన్ బట్టి స్క్రిప్ట్ ని డిజైన్ చేశాం. సత్య యాడ్ అవ్వడం వలన కామెడీ మరింత ఎలివేట్ అయ్యింది. సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. మిషన్ ఇంపాజిబుల్ సినిమా సత్యతో తీస్తే ఎలా వుంటుందో 'జెట్లీ' అలా వుంటుంది. ఇందులో యాక్షన్, కామెడీ, ట్విస్ట్ లు అన్నీ వుంటాయి. తెలుగులో ఈ సినిమా చాలా కొత్తగా వుంటుంది." అన్నారు.
ప్రొడ్యూసర్ చెర్రీ మాట్లాడుతూ.. "ఈ సినిమాను ఐదు నెలల ఐదు రోజుల్లో షూటింగ్, ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేశాం. నిర్మాతగా ఇంతకంటే కావాల్సింది ఏమీలేదు. డైరెక్టర్ రితేష్ కి థాంక్ యూ. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. సత్య, వెన్నెల కిషోర్ గారు చాలా బిజీగా ఉండే ఆర్టిస్టులు అయినప్పటికీ ఎంతో కోఆపరేట్ చేశారు. ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన యూఎస్పీ ఉంది. దాదాపు 80 శాతం షూటింగ్ ఫ్లైట్‌లోనే చేశాం. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో అలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. ఫ్లైట్‌లో జరిగే సంఘటనలు, కామెడీతో ఈ సినిమా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. రితేష్ తనదైన స్టైల్‌లో మంచి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇది ఒక మంచి థ్రిల్లర్. నిజానికి ముందుగా పెద్ద హీరోగా ఇంటెన్స్ థ్రిల్లర్‌గా చేయాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. తర్వాత కామెడీ థ్రిల్లర్‌గా మార్చాం. కామెడీ అంటే రితేష్ కి ముందుగా గుర్తొచ్చే పేరు సత్య. సత్య, వెన్నెల కిషోర్ ఇద్దరినీ తీసుకుని ఈ సినిమా చేశాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. మే 1న అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను." అన్నారు.
వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. "ఇందులో నా పేరు మీరు నేరుగా థియేటర్‌లో తెలుసుకోవాలి. నేను దుబాయ్ నుంచి ఫ్లైట్‌లో వస్తున్నప్పుడు, ఆ ఫ్లైట్‌లో ఊహించని చిత్రవిచిత్రాలు జరుగుతాయి. నేను టిఎఫ్ఐ బానిసను. కథ చెప్పగానే క్లూస్ పట్టేస్తుంటాను. టైమ్ పాస్ కోసం ఒక సినిమా సుడోకు గేమ్ ఆడుతుంటాను. ఆ గేమ్ నేను పూర్తి చేశానా లేదా అనేది మే 1న ‘జెట్‌లీ’ సినిమా చూసి తెలుసుకోవాలి." అన్నారు.
హీరోయిన్ రియా సింఘా మాట్లాడుతూ.. "ఇందులో నా పేరు శివాని. నా పాత్ర ఎలా ఉంటుందో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. మొత్తం ఫ్లయిట్ లో చేసిన సినిమా ఇది. ఆడియన్స్ కి చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. " అన్నారు.
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. "ఇందులో నేను ఫాదర్ ఫీనిక్స్ అనే పాత్ర చేస్తున్నాను. కొందరు శైతాను రక్షకులు. వాళ్ళతో చాలా డేంజర్. నాకు ఫ్లైట్‌లో ఎదురైన సంఘటన ఏమిటో, అది ఎలా మారిందో మే 1న మీరు థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి." అన్నారు.
గుండు సుదర్శన్ మాట్లాడుతూ.. "ఇందులో నేను నూర్జహాన్ అనే పాత్రలో కనిపిస్తాను. నాకు ఫ్లైట్‌లో ఒక ఆపరేషన్ జరుగుతుంది. దాని వల్ల పెద్ద గొడవ ఏర్పడుతుంది. అది ఏమిటో మే 1న సినిమా చూసి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను." అన్నారు.
వైవిధ్యమైన సినిమాలని అభిమానులు, ప్రేక్షకులకి అందించడానికి సెల్యులాయిడ్ నే స్వయంగా కొంత మంది హీరోలని ఎంచుకొని వాళ్ల దారిని సినీ రహదారిగా మారుస్తుంది. అలాంటి ఒక హీరో నాచురల్ స్టార్ నాని(Nani). ప్రస్తుతం పాన్ ఇండియాని షేక్ చేయడానికి 'ది ప్యారడైజ్'(The Paradise)ని రెడీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ని అభిమానులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా చూసుకుంటూనే వాళ్ళు వెళ్లే దారిలో ఉన్న థియేటర్స్ వైపు ఒక లుక్ వేస్తు ప్యారడైజ్ రిలీజ్ రోజు థియేటర్స్ లోకి పరుగెత్తుకుంటూ వెళ్లడాన్ని తలుచుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు అంతకంటే ముందు థియేటర్స్ కి వెళ్లాల్సిన పరిస్థితి.
నాని తన అభిమానులు, ప్రేమికులు, మూవీ లవర్స్, ప్రేక్షుకుల కోసం 'నిన్ను కోరి' రీ రిలీజ్ చేస్తున్నాడు. వేసవి వేడి తాలూకు సెగని కనిపించకుండా చేయడానికి మే 8 న ల్యాండ్ అవుతున్నాడు. దీంతో థియేటర్స్ లో మరో సారి నాని చరిష్మా కొనసాగబోతుంది. ప్రేమికులకి, ప్రేమలో విడిపోయి వేరే పెళ్లిళ్లు చేసుకున్న వారికి నిన్ను కోరి ఆల్ టైం ఫేవరేట్ మూవీ. ప్రేమ అనేది మరణాన్ని దూరం చేసే అమృతం కంటే గొప్పదని కూడా చెప్పిన ఈ మూవీలో నానితో పాటు ప్రతి ఒక్కరి నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది. 'ఉమామహేశ్వరరావుగా నాని, పల్లవిగా నివేదా థామస్, అరుణ్ క్యారక్టర్ లో ఆది పినిశెట్టి ప్రాణం పోశారు.
also read: Allu family: అల్లు ఫ్యామిలీ పుట్టిందే తెలుగు సినిమా కోసమా!. వైరల్ అవుతున్న తాజా న్యూస్
మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ నుంచి వచ్చిన మ్యూజిక్ కూడా నిన్ను కోరి కి అదనపు ఆకర్షణగా నిలిచాయి. అడిగా అడిగా', 'ఉన్నట్టుండి గుండె', 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ వైజాగ్' వంటి పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ఇప్పుడు వెండితెరపై 4K క్వాలిటీతో సాంగ్స్ వినడం గొప్ప అనుభూతిని ఇవ్వనుంది. శివ నిర్వాణ(Siva Nirvana)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకావ్యం విడుదలై ఏడు సంవత్సరాలు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఆర్ఆర్ఆర్ దానయ్య నిర్మించాడు. ఇక మహా నటుడు రావు గోపాలరావు గారు చెప్పినట్టు 'చూడమ్మా శాంభవి ఒక్కొక్కలకి ఒక్కో సీజన్. కాబట్టి ఇది మా సీజన్ అన్నట్టుగా నిన్నే కోరి రాకతో మే మంత్ లవర్స్ సీజన్ అని చెప్పవచ్చు.
ఏది ఏమైనా ప్రస్తుతం అల్లు వారి పని మూడు పువ్వులు ఆరుకాయలు అనే చందాన ఉంది. అవసరమైతే ఆ సామెతని మూడు పువ్వులు పన్నెండు కాయలుగా కూడా మార్చగలిగే అంత జోష్ తో అల్లు ఫ్యామిలీ ముందుకు దూసుకుపోతుంది. పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా అల్లుఅర్జున్(Allu Arjun)తన స్టామినాని పెంచుకోవడంతో పాటు 'రాకా'తో సరికొత్త సంచలనాలకి సిద్ధంగా ఉండటం, సినిమా కోసమే ఆసియాలోనే ఎక్కడ లేని ఫ్యూచర్స్ తో హైదరాబాద్ కోకాపేటలో అల్లు సినిమాస్ నిర్మించడంతో అల్లు ప్రతిష్ట అంతకు అంత పెరుగుతూనే ఉంది. రీసెంట్ గా అల్లు ఫ్యామిలీకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి సినీ సర్కిల్స్ లో గుడ్ మార్నింగ్ హోదాలో చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం
అల్లు కాంపౌండ్ లో ఇప్పటికే గీతా ఆర్ట్స్(Geetha Arts), గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మూడో బ్యానర్ నిర్మిస్తునట్టుగా టాక్. ఈ మూడో బ్యానర్ ని తీసుకొస్తుంది ఎవరో కాదు అల్లు శిరీష్. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ క్రేజీ న్యూస్ గా మారింది. అల్లు శిరీష్ హీరోగా అనేక చిత్రాలని చేసినా పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయాడు. రీసెంట్ గానే తన వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ నిర్మాణ రంగంలో అడుగుపెడుతుండటం ఆసక్తికరంగా మారింది. మరి మనం ఏదో కాన్ఫిడెన్స్ గా చెప్పుకుంటున్నాం కానీ రూమర్ అనే వాళ్ళు కూడా లేకపోలేదు.
also read: Divyanka Sirohi: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి
ఇక గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 ఈ రెండు సంస్థలు సక్సెస్ ఫుల్ గానే తమ సినీ జర్నీని కొనసాగిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా ఎదగడం,గీతా ఆర్ట్స్ ఎదుగుతుండటం పారలాల్ గా జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉంటాయి. మరి మూడో బ్యానర్ కూడా నిజమైతే తెలుగు సినిమా కోసమే అల్లు ఫ్యామిలీ పుట్టినట్టు అవుతుంది.
-ఎంతో భవిష్యత్తు ఉంది
-కానీ చిన్న వయసులోనే ఎందుకిలా
-రెస్ట్ అనేది లేకపోవడం గుండెపోటుకి కారణమా!
ఎందుకో తెలియదు కానీ మరణానికి కాస్తయినా జాలి,దయ లేకుండా పోతుంది. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని రోజులు అనే వర్డ్ పై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉంది. రీసెంట్ గా ఎంతో భవిష్యత్తుని ఉహించుకొని ముందుకు వెళ్తున్న ప్రముఖ నటి దివ్యంక సిరోహి చనిపోవడం ప్రతి ఒక్కర్ని కలిచి వేస్తుంది. పూర్తి వివరాలు చూద్దాం.
దివ్యంక సిరోహి(Divyanka sirohi)..జీ టీవీ లో ప్రసారమైన 'బానో మెయిన్ తేరి దుల్హన్' అనే షోతో పరిచయమయ్యి అనతికాలంలోనే ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్, రాజ్‌నగర్ తన స్వస్థలం. మంగళవారం రాత్రి దివ్యంక అకస్మాత్తుగా ఇంట్లో కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే ఆమె గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పలు చిత్రాల్లో కూడా నటించిన దివ్యంక నుంచి వచ్చిన 50కి పైగా మ్యూజిక్ వీడియోలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా మాసూమ్ శర్మ, అమిత్ సైనీ వంటి ప్రముఖ గాయకులతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్ ఓవర్ నైట్ స్టార్ డమ్ ని కట్టబెట్టాయి. టిక్‌టాక్ వీడియోలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. టిక్ టాక్ బాన్ అయ్యాక ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తన సత్తా చాటుతు 1.3 మిలియన్లకి పైగా సంపాదించుకుంది. మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి BCA పూర్తి చేసి నటనపై ఉన్న మక్కువతో సాఫ్ట్‌వేర్ రంగం వైపు వెళ్లకుండా గ్లామర్ ప్రపంచాన్ని ఎంచుకున్నారు.
also read: Vijay deverakonda: యాక్షన్ స్టైల్ ని విజయ్ దేవరకొండ మొదలు పెట్టాడా!
దివ్యంక మరణవార్త తెలియగానే అభిమానులు సోషల్ మీడియా వేదికగా దివ్యంక గతంలో చేసిన పోస్టులని షేర్ చేస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. గతేడాది ఆమె పెట్టిన ఒక పోస్ట్‌లో "శివా.. నన్ను నీ దగ్గరకు తీసుకెళ్లు" అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఆకస్మిక మృతి పట్ల హర్యానవీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా పైన మనం చెప్పుకున్నట్టు మరణానికి ఏ మాత్రం జాలి, దయ, కనికరం లేదు. మరణాన్ని శాశ్వత సమాధి రోజు చేసే రావాలని కోరుకుందాం. దివ్యంక వయసు ముప్పై సంవత్సరాలు.
Following the success of the Mathu Vadalara franchise, actor Satya and director Ritesh Rana are back together for a new hijack comedy titled Jet Lee. The makers recently dropped the theatrical trailer, offering a glimpse into the film's eccentric premise. Instead of standard action tropes, the trailer suggests a lighthearted approach to the hijack genre, banking heavily on Satya's established comedic strengths.
The trailer revolves around a hostage situation on a flight, where Satya’s character finds himself at the center of the chaos. Suffering from what appears to be memory loss or a severe case of delusion, he genuinely believes he is a larger-than-life action hero. The cuts highlight his unique body language and signature comic timing as he attempts to take charge of the crisis.
Rhea Singha appears as an officer trying to logically salvage the situation, while Vennela Kishore is seen in a prominent supporting role. The footage hints at Satya portraying two different shades, driving the situational comedy.
On the technical front, Kaala Bhairava's background score complements the quirky tone typically associated with Ritesh Rana's direction. Produced by Mythri Movie Makers and Clap Entertainers, the film is gearing up for a theatrical release on May 1st.
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం, ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం.. వీటితో పాటు కాస్త ఆర్థికంగా బాగున్నవారైతే.. హనీమూన్ కు కూడా వెళ్తారు. పెళ్లయిన మొదట్లో.. కొన్ని నెలలు ఎంతో అద్బులంలా.. అంతా పరిపూర్ణంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ హనీమూన్ అయిపోయాక లేదా పెళ్లైన రెండు మూడు నెలల తర్వాత.. అసలైన లైఫ్ మొదలవుతుంది. ఇక్కడే అందరూ ఊహించుకునే పెళ్లి జీవితానికి, వాస్తవానికి మధ్య చాలా తేడా ఉందని తెలుసుకుంటారు. అసలు అంగీకరించలేని ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి, ఊహించుకున్న జీవితం చాలా రివర్స్ గా, డిజప్పాయింట్ గా అనిపిస్తుంది. పెళ్లి తర్వాత అర్థమయ్యే చేదు నిజాలు కొన్ని ఉన్నాయి. పెళ్ళి తర్వాత జీవితం గురించి కలలు కనే ప్రతి ఒక్కరూ, పెళ్లి తర్వాత జీవితాన్ని సినిమాటిక్ గా ఊహించుకునే ప్రతి ఒక్కరూ ఆ చేదు నిజాలను తెలుసుకోవాలి. దీని వల్ల పెళ్లి తర్వాత వారు డిజప్పాయింట్ అయ్యే పరిస్థితి ఎదురవ్వదు. ఆ చేదు నిజాలు ఏంటో తెలుసుకుంటే..
ప్రేమ అంటే..
పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు ప్రేమ అంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, పొగడ్తలు చెప్పుకోవడమే అనుకుంటారు. నిజానికి చాలామందికి మొదట్లో అవే జరుగుతుంటాయి. కానీ పెళ్లైన రెండు మూడు నెలల తర్వాత సాధారణ జీవితానికి తిరిగి వచ్చినప్పుడు, ప్రేమలో సరుకులు కొనడం, కరెంటు బిల్లు కట్టడం, బాధ్యతలు పంచుకోవడం కూడా ఉంటాయని మీరు గ్రహిస్తారు. బయటకు వెళ్లి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని అనుకునేవారు.. పెళ్లైన కొన్ని నెలల తర్వాత.. ఈరోజు రాత్రి భోజనానికి ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కేవలం బెడ్ రూమ్ ముచ్చట కాదు.. అది ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకోవడంలో కూడా ఉంటుంది.
పర్పెక్ట్ లైఫ్ పార్టనర్..
పెళ్లికి ముందు కేవలం మాట్లాడుకుంటూ ఉండటం వల్ల తమకు బెస్ట్ పార్ట్నర్ లభించారని అనుకుంటారు. కానీ పెళ్ళి తర్వాత ఒకే ఇంట్లో కలిసి జీవించడం మనిషిలో నిజ స్వభావాన్ని బయటపెడుతుంది. మనిషి అలవాట్లు, మాటలు, రోజువారీ ప్రవర్తన, కొన్నిసార్లు అతిగా రియాక్ట్ అవ్వడం, కోపం చేసుకోవడం, వాగ్వాదం ఇవన్నీ పెళ్లి తర్వాత ఉంటాయి. ఇవన్నీ పర్పెక్ట్ అనే ట్యాగ్ ను చెరిపేస్తాయి. అయితే.. అందరూ ఒప్పుకోవాల్సన నిజం ఏమిటంటే.. ఎవరూ కంప్లీట్ గా పర్పెక్ట్ గా ఉండరు. ప్రతి ఒక్కరికీ బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. రెండింటినీ అంగీకరించాలి.
గొడవలు..
పెళ్లి తర్వాత గొడవ పడని భార్యాభర్తలు ఎక్కడా ఉండరు. గొడవ పడని భార్యాభర్తలు ఉన్నారని అనుకోవడం కూడా చాలా పొరపాటు. విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణం. టీవీ రిమోట్ దగ్గర నుండి మొదలుకుని ఎన్నో విషయాలలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలపై వాదనలు ప్రతి వైవాహిక జీవితంలో ఒక భాగమే.
డబ్బు..
ప్రేమకు దాని స్థానం ఉంది, అలాగే డబ్బుకు దాని స్థానం ఉంది. పెళ్లి తర్వాత, ఇంటి బడ్జెట్‌ను రూపొందించుకోవడం, ఖర్చులను నిర్వహించుకోవడం, పొదుపు గురించి ఆలోచించడం వంటివి చాలా కీలకమవుతాయి. పెళ్లి తర్వాత దంపతులు తమ ఆర్థిక ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని గ్రహిస్తారు. కొందరు పొదుపు చేయాలనుకుంటే, మరికొందరు ఖర్చు చేయాలనుకుంటారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనా పరులైతే.. ఇద్దరి సంపాదన మీద ఒక్కరే అధికారం చూపించడం వంటి పరిస్థితులు ఎదురైతే.. అది వారి బంధంలో పెద్ద చీలికకు దారితీయవచ్చు. కాబట్టి వివాహం తర్వాత డబ్బు గురించి మాట్లాడటం మంచిదే కానీ.. డబ్బు కోసం బంధాన్ని విచ్చిన్నం చేయకూడదు.
పర్సనల్ స్పేస్..
పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడటం నుండి, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం వరకు పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారు. కానీ పెళ్లి తర్వాత మారిపోతుంది. ప్రతి విషయంలోనూ భాగస్వామిని కలుపుకోవాలి, వారి సౌకర్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు తమకోసం , స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది.
పైన చెప్పుకున్న విషయాలు చాలా సాధారణమైనవి. కానీ..పెళ్లికి ముందు చాలా జంటలు ఈ విషయాలలోనే ఊహించని అంచనాలు పెట్టుకుని, పెళ్లి తర్వాత చాలా డిజప్పాయింట్ అవుతారు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు. పాపం చిన్న పిల్లలు సైతం టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది. చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు, కానీ చాలా మందులకు ఉంటుంది. ఈ టాబ్లెట్ల మీద గీత చూసిన చాలామంది ఇది ఒక డిజైన్ అని అనుకుంటారు, కానీ ఈ గీత వెనుక పెద్ద కథే ఉంది.. వైద్య పరిభాషలో, ఈ గీతను స్కోర్ లైన్ అంటారు. మందును సమాన భాగాలుగా విభజించడానికి ఈ గీతను రూపొందిస్తారని నిపుణులు చెబుతున్నారు. టాబ్లెట్స్ పైన ఈ గీతలు ఎందుకు ఉంటాయి. ఫార్మా కంపెనీలు ఇలా టాబ్లెట్ల మీద గీతలు ఉంచడం వెనుక కారణం ఏంటి? వివరంగా తెలుసుకుంటే..
టాబ్లెట్ల మీద గీత..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని మాత్రలపై ఉండే గీత మందును సమాన భాగాలుగా విడగొట్టడానికి సహాయపడుతుంది, తద్వారా రోగులు సులభంగా సగం మాత్రను తీసుకోవచ్చు. వైద్యులు తరచుగా సగం మాత్ర మోతాదును కూడా సూచిస్తారు. ఈ గీత మాత్రను సగానికి విరవడాన్ని సులభతరం చేస్తుంది. రోగికి సరైన మోతాదు అందేలా చూసుకోవడానికి, మాత్రను తయారుచేసేటప్పుడు ఈ గీత వచ్చేలా చేస్తారట.
గీతలు లేని టాబ్లెట్లు..
మందుపై గీత లేని మాత్రలు. అంటే, టాబ్లెట్ల పై గీత లేకపోతే ఆ మాత్రను విరవకూడదట. లేకపోతే, దాని ప్రభావం తగ్గిపోవచ్చట. కొన్ని మందులకు ఎంటెరిక్ కోటింగ్ లేదా సస్టెయిన్డ్ రిలీజ్ వంటివి ఉంటాయని, వాటిని విరిస్తే టాబ్లెట్ల ప్రభావం మారవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే గీత లేని టాబ్లెట్లను విరవడం వల్ల దుష్ప్రభావాల ప్రమాదం పెరగవచ్చని అంటున్నారు.
డిజైన్ మాత్రం కాదు..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, టాబ్లెట్ మధ్యలో ఉండే గీత కేవలం డిజైన్ కోసం పెట్టేది కాదు. అది టాబ్లెట్ డోస్ తీసుకోవడానికి సహాయపడుతుంది. ఆ గీత టాబ్లెట్‌ను సులభంగా విరవడానికి వీలు కల్పిస్తుంది. టాబ్లెట్ లో సగం డోసు తీసుకోవాల్సిన వారు టాబ్లెట్‌ను సమాన భాగాలుగా విరవకపోతే సరైన డోస్ తీసుకోలేరు. దీని వల్ల మందు కూడా ప్రభావవంతంగా పనిచేయదు.
*రూపశ్రీ.
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. కానీ వేడి పెరిగేకొద్దీ పెరుగు త్వరగా పులిసిపోతుంది. కొన్నిసార్లు రాత్రి తోడు పెట్టిన పెరుగు ఉదయానికి తినడానికి వీలులేనంతగా పులిసిపోతుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో పెరుగును ఎక్కువ కాలం తాజాగా, రుచికరంగా ఉంచుకోవచ్చు. వేసవి కాలంలో పెరుగు పులుపు ఎక్కకుండా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలి? ఆ చిట్కాలేంటి? తెలుసుకుంటే..
ఇది గుర్తుపెట్టుకోవాలి..
మొదటగా పెరుగు పులవడం అనేది ఒక సహజ ప్రక్రియ అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పాలలో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా లాక్టోజ్‌ను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది, దీనివల్ల పెరుగుకు కొద్దిగా పుల్లని రుచి వస్తుంది. అయితే అధిక వేడిలో ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది, దీనివల్ల పెరుగు మరింత త్వరగా పులిసిపోతుంది. పెరుగు తోడు పెట్టడానికి పాల ఎంపిక చాలా కీలకం. ఎల్లప్పుడూ తాజా, నాణ్యమైన పాలను ఉపయోగించాలి. తాజాగా లేని పాలలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల పెరుగు త్వరగా పాడవుతుంది. పాలను బాగా మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడే పెరుగు చుక్క కలపాలి.
పరిశుభ్రత..
పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెరుగును నిల్వ చేసే పాత్రలు పూర్తిగా శుభ్రంగా , పొడిగా ఉండాలి. కొద్దిపాటి మురికి లేదా బ్యాక్టీరియా కూడా పెరుగు రుచిని, ఆకృతిని పాడుచేస్తుంది. వేసవిలో పెరుగు నిల్వ చేయడానికి సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. పెరుగును అధిక వేడికి లేదా ప్రత్యక్ష సూర్యరశ్మికి దూరంగా నిల్వ చేయాలి. చాలా వేడిగా ఉండే వాతావరణంలో పెరుగు త్వరగా పుల్లగా మారిపోతుంది. వంటగది చాలా వేడిగా ఉంటే, దానిని ఇంటిలోని చల్లని మూలలో నిల్వ చేయడం ఉత్తమం.
ఈ చిట్కా బాగా పనిచేస్తుంది..
పాలు పెరుగుగా మారే సమయంలో అందులో కాస్త పంచదార కలిపితే అందులో బ్యాక్టీరియా బాలెన్స్ గా ఉండటంలో సహాయపడుతుందట.పెరుగు త్వరగా పుల్లగా మారకుండా నివారిస్తుంది. అలాగే, ఎల్లప్పుడూ తాజా పెరుగునే తోడు చుక్కు కోసం ఉపయోగించాలి. పెరుగు తయారైన తర్వాత దాన్ని ఎక్కువ సేపు బయట ఉంచకూడదు. వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లని ఉష్ణోగ్రత బ్యాక్టీరియా పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల పెరుగు ఎక్కువ కాలం పాటు మంచి రుచిగా ఉంటుంది. ఎలాంటి వాసనలు రాకుండా ఉండటానికి పెరుగును ఎల్లప్పుడూ గాలి చొరబడని టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి.
తీపి పెరుగు..
కొందరు స్వీట్ కర్డ్ ఇష్టపడతారు. తీపి పెరుగు ఇష్టపడే వారు దాన్ని గడ్డకట్టించడానికి పాలలో ముందుగానే చక్కెర కలుపుకోవచ్చు. ఇది రుచిని మెరుగుపరిచి, పులుపును తగ్గిస్తుంది. పెరుగు పులిసిపోకుండా నివారించడం కష్టమేమీ కాదు. సరైన పాలు, శుభ్రమైన పాత్రలు, ఉష్ణోగ్రత ఎక్కువ లేకుండా చూసుకోవడం, సరైన పద్దతిలో నిల్వ చేయడం.. ఇవన్నీ చూసుకుంటే చాలు. ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా, రుచికరంగా, చిక్కగా ఉండే పెరుగును ఈ సమ్మర్ లో కూడా ఆస్వాదించవచ్చు.
*రూపశ్రీ.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం (ఏప్రిల్ 23) ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే బూత్ ల వద్ద భారీగా బారులు తీరారు. ఇక పశ్చిమ బెంగాల్ లోని 16 జిల్లాల్లోని 152 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ రెండు రాష్ట్రాలలోనూ కూడా త్రిముఖ పోరు జరుగుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్ లో 4,023 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ 5.73 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యతం తేల్చనున్నారు. ఓటర్లలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులున్నారు.తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
ఒక పశ్చిమ బెంగాల్‌లో తొలివిడత అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది.ఈ విడతలో 1478 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 3.6 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.75 కోట్ల మంది మహిళలున్నారు. బెంగాల్‌లో తృణమూల్, బీజేపీ మధ్య ప్రధాన పోరు సాగుతున్నది. పోలింగ్ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.తమిళనాడులో ఉదయం 9గంటల వరకు 17.69 శాతం, పశ్చిమబెంగాల్‌లో 18.76 శాతం ఓటింగ్ నమోదైంది.
తమిళ చిత్రసీమలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్న విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. విజయ్ రాకతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు మారుతాయా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా విజయ్‌ని తన మిత్రపక్షం నేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారితీశాయి.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు. పవన్ పదేళ్ల పాటు ఓపికగా పోరాడి నేడు ఈ స్థాయికి చేరుకున్నారన్నారు.
పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టినప్పటికీ, తక్షణ అధికారం కోసం పాకులాడకుండా క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాడారు. ఓటములు ఎదురైనా వెరవకుండా, వెన్ను చూపకుండా నిలబడ్డారు. ఆ నిబద్ధతే నేడు ఆయనను ఏపీ రాజకీయాల్లో కీలక శక్తిగా మార్చిందని చంద్రబాబు చెప్పారు. విజయ్ కూడా అదే బాటలో పయనిస్తేనే ఫలితం ఉంటుందని చంద్రబాబు పరోక్షంగా సూచించారు. సినిమా క్రేజ్ ఓట్లను తెచ్చిపెట్టొచ్చు కానీ.. రాజకీయాల్లో స్థిరపడాలంటే ప్రజలతో మమేకం కావడమొక్కటే మార్గమని చంద్రబాబు చెప్పారు.
తమిళనాడులో ఇప్పటికే డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన శక్తులు ఉన్నాయి. ఈ తరుణంలో విజయ్ తన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాగైతే తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకుని సృష్టించుకున్నారో, విజయ్ కూడా అదే తరహాలో యువతను, మహిళలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు మాటల్లో కూడా ఇదే వ్యూహం కనిపిస్తోంది.
మరోవైపు, పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించడం వారిరువురి మధ్యా ఉన్న బాండింగ్ కు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ త్యాగాలకు సిద్ధపడ్డారని చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పడం కూటమి ధర్మాన్ని ఆయన తు.చ. తప్పకుండా పాటిస్తున్నారనడానికి తార్కానంగా చెబుతున్నారు. మొత్తానికి విజయ్ రాజకీయ ప్రయా ణం సాఫీగా సాగాలన్న ఆశాభావం వ్యక్తం చేసిన చంద్రబాబు.. నిలదొక్కుకుని రాణించాలంటే మాత్రం పవన్ కల్యాణ్ ను మోడల్ గా తీసుకోవాలని చెప్పకనే చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముఖద్వారంగా భావించే ఉత్తరాంధ్రలో వైపీపీ ప్రభ పూర్తిగా మసకబారింది. గతంలో ఈ ప్రాంతంపై పట్టు సాధించిన వైసీపీ ప్రస్తుతం చతికిలపడింది. పొలిటికల్ గా ఉత్తరాంధ్రలో ఆ పార్టీ ఇసుమంతైనా ప్రభావం చూపలేని పరిస్థితులకు దిగజారింది. గత ఎన్నికలలో ఓటమి తరువాత ఆ పార్టీ ఉత్తరాంధ్ర నేతలలో అంతర్గతవిభేదాలు ఈ ప్రాంతంలో పార్టీ కుదేలయ్యేలా చేశాయి.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు. దీంతో ఆయన చేసేదేం లేక చేతులెత్తేసి విశాఖ నగరానికే పరిమితమయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పూర్తిగా ధర్మాన సోదరులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వంటి నేతలను స్థానిక నాయకత్వమే పక్కన పెట్టింది. ఇందుకు విరుద్ధంగా, కింజరాపు కుటుంబం నేతృత్వంలో టీడీపీ జిల్లా వ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. జనసేన మద్దతు కూడా తోడవడంతో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఇక పుంజుకోవడం కష్టసాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే విధంగా విజయనగరంలోనూ వైసీపీ కుదేలైంది. ఒకప్పుడు జిల్లాపై గట్టి పట్టున్న బొత్స సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో పార్టీ ముక్కలు ముక్కలుగా చీలిపోయి వర్గపోరు పరాకాష్టకు చేరుకుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాగా జిల్లాలో జనసేన, తెలుగుదేశం పార్టీలు ఐక్యంగా పని చేస్తుండటంతో జిల్లాలో కూటమి బలం పెరిగింది.
ఇక విశాఖ జిల్లాలో వైసీపీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. అక్కడ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు గుడివాడ అమర్నాథ్ కు పార్టీ అధిష్టానం ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. ఇక మిగిలిన స్థానిక నేతలు కూడా పార్టీ వ్యవహారాలలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో జిల్లాలో వైసీపీ పరిస్థితి ఉండీ లేనట్లుగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏ రకంగా చూసినా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో వైసీపీ వర్గపోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కీలక నేతల మధ్య ఉన్న విభేదాలు, సమన్వయ లేమి కారణంగా ఆ పార్టీ క్యాడర్ నిస్తేజంగా మారిపోయింది. తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే ఈ ప్రాంతంలో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్య నుండి కళ్లకు ఉపశమం కలిగించడానికి చాలా మంది బ్లూ లైట్ కళ్లద్దాలు వాడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్లూ లైట్ కళ్లద్దాల వినియోగం చాలా ఎక్కువైంది కూడా. అయితే, ఈ కళ్లద్దాలు నిజంగా కళ్లకు రక్షణ కవచంలా పనిచేస్తాయా? , లేక ఇవి కేవలం ఒక ట్రెండ్‌లో భాగమా? కంటి సంరక్షణ నిపుణులు దీని గురించి ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే..
బ్లూ లైట్ ఎఫెక్ట్..
నీలి కాంతి అనేది ఒక రకమైన అధిక శక్తి గల కాంతి. ఇది కేవలం డిజిటల్ స్క్రీన్‌ల నుండే కాకుండా, సూర్యరశ్మి నుండి కూడా వెలువడుతుంది. మనం గంటల తరబడి స్క్రీన్‌లను చూస్తూ ఉన్నప్పుడు, కళ్ళు పొడిబారడం, చికాకు, అలసట , తలనొప్పి వంటి కంటి సమస్యలను ఎదురవుతాయి. ఇలా కంటి సమస్యలు రావడాన్ని డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని అంటారు. ఈ సమస్యలకు స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతియే ప్రధాన కారణమని చాలా మంది భావిస్తారు.
బ్లూ లైట్ గ్లాసెస్..
మార్కెట్లో లభించే బ్లూ లైట్ గ్లాసెస్, వాటి ప్రత్యేక లెన్సులు నీలి కాంతిని కళ్ళలోకి చేరకుండా అడ్డుకుంటాయని బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెబుతారు. నీలి కాంతి మనిషిలో నిద్ర హార్మోన్లను ప్రభావితం చేస్తుంది కాబట్టి, ఇది కంటి ఒత్తిడిని తగ్గించి, నిద్రను మెరుగుపరుస్తుందని కంపెనీలు వాదిస్తున్నాయి. అయితే శాస్త్రీయంగా ఇది నిరూపణ కాలేదు. బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెప్పే విషయాలను పరిశోధనలు సమర్థించడం లేదు.
పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
బ్లూ లైట్ గ్లాసెస్ కంటి అలసటను తగ్గించడంలో అంత ప్రభావవంతంగా ఉండవు. కంటి నొప్పి , పొడిబారడానికి అసలు కారణం బ్లూ లైట్ కాదు, విరామం లేకుండా తదేకంగా స్క్రీన్‌ను చూడటం ద్వారానే అసలు సమస్య వస్తోంది , కూర్చున్నప్పుడు తప్పు పొజిషన్ లో కూర్చోవడం, స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు తక్కువగా కనురెప్పలు వాల్చడం వంటివి కళ్లకు అలసట, పొడిబారడం వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. అందువల్ల, కేవలం కళ్లజోడు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా తొలగించలేము.
బ్లూ లైట్ గ్లాసెస్ పనికిరావా?
బ్లూ లైట్ కళ్లద్దాలు ధరించడం వల్ల కొంతమందికి కొంత సౌకర్యం కలగవచ్చనేది నిజమే. ముఖ్యంగా రాత్రి పొద్దుపోయే వరకు తమ మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లపై పనిచేసే వారికి కొంత ఉపశమనం లభించవచ్చు లేదా వారి నిద్ర పోవడానికి ఎక్కువ రిస్క్ లేకుండా ఈ బ్లూ లైట్ కళ్లద్దాలు కాస్త హెల్ప్ చేయవచ్చు. కానీ పూర్తి కంటి రక్షణకు ఈ కళ్లద్దాలు పెట్టుకోవడం ఏకైక పరిష్కారంగా భావించడం సరికాదని వైద్యులు చెబుతున్నారు.
*రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, రాత్రి పూట సరైన సమయానికి నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా రాత్రి 10 గంటలకు నిద్రపోవాలని వైద్య నిపుణులు ఎందుకు చెబుతున్నారు? దీని వెనుక ఉన్న రహస్యాలేమిటో ఈ వీడియోలో చూద్దాం.
ముఖ్య అంశాలు:
శరీర పునరుద్ధరణ: రాత్రి 10 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య మన శరీరంలో కణాల మరమ్మత్తు ప్రక్రియ వేగంగా జరుగుతుంది.
మెదడు ఆరోగ్యం: సరైన సమయానికి నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది, ఒత్తిడి (Stress) తగ్గుతుంది మరియు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
యునానీ వైద్య విధానం: నిద్ర మరియు ఆరోగ్యంపై యునానీ వైద్య శాస్త్రం చెప్పిన అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు.
బరువు నియంత్రణ: సరైన నిద్ర జీవక్రియను (Metabolism) మెరుగుపరిచి, బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుందో వివరించబడింది.
మీరు నిత్యం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలనుకుంటే మీ నిద్ర సమయాన్ని మార్చుకోవాల్సిందే. ఈ వీడియో చూసి, రాత్రి 10 గంటల నిద్ర వల్ల కలిగే మరిన్ని లాభాలను తెలుసుకోండి!
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్ "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) 🙏✨
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది. ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం చేస్తున్నారు. ఇక చాలా మంది మరొక అడుగు ముందుకు వేసి జీవితానికి కీలకం అయిన ఉద్యోగాలు, ఆరోగ్యం, రిలేషన్షిప్స్ వంటి విషయాలలో సలహాలు కూడా ఈ కృత్రిమ మేధస్సును ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఇది మనిషి లాగా తప్పించుకుని పక్కకు వెళ్ళిపోయేది కాదు.. ఏ ప్రశ్న అడిగినా దానికి తగిన సమాధానం ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఏఐ ను ఆరోగ్య సమస్యలకు సలహాలు తీసుకుని, స్వంత వైద్యం దిశగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక బ్రిటీష్ వైద్య పత్రిక ఏఐ ను ఆరోగ్య సలహాలు అడగడం, ఆ సలహాలు పాటించడం వంటి విషయాల గురించి చాలా షాకింగ్ నిజాలు ప్రచురించింది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఆరోగ్య సమస్యల కోసం ఏఐ ను సలహా అడగడం ఎంత పెద్ద తప్పూ అర్థమవుతుంది.
ఆరోగ్య సమస్యలపై తప్పుడు సమాచారం..
ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు ఏఐ ఇచ్చే సమాధానాలలో సుమారు 50 శాతం తప్పుగా ఉంటాయి. ఏఐ చాట్‌బాట్‌లు అందించే సమాచారం చాలా తప్పుగా ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
ఏఐ బలహీనత..
జెమిని, డీప్‌సీక్, మెటా ఏఐ, చాట్‌జీపీటీ , గ్రోక్ వంటి ఏఐ సాధనాలపై విస్తృతమైన పరిశోధనను ఒక శాస్త్రవేత్తల టీమ్ నిర్వహించిందట. ఈ ఏఐ ప్లాట్పామ్ లలో ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రశ్నలు పరిశోధకులు అడిగారట. క్యాన్సర్ , వ్యాక్సిన్‌ల వంటి అంశాలపై ఏఐ ఇచ్చిన సమాధానాలు చాలా వరకు కచ్చితమైనవిగా ఉన్నాయి. అయితే మూల కణాలు , పోషణ వంటి అంశాలలో ఏఐ బలహీనంగా ఉన్నట్లు తేలిందట.
తప్పుడు సమాధానాలు..
ఏఐతో ఉన్న అతిపెద్ద సమస్య.. అది నిస్సంకోచంగా తప్పుడు సమాచారాన్ని అందిస్తుందట. ఇది తరచుగా ఎటువంటి హెచ్చరిక లేదా నిరాకరణను అందించదు. ఫలితంగా, వినియోగదారులు సరైన సమాచారం, తప్పు సమాచారాల మధ్య తేడాను గుర్తించలేరు. ఏఐ చెప్పే తప్పు సమాధానాలనే నిజం అనుకుని చాలామంది పొరపాట్లు చేస్తారు. అసలు ఏఐ చెప్పే సమాధానాలు నమ్మేలా అనిపించవని, సమస్యకు సంబంధం లేని సమాచారాన్ని ఇస్తుందని అంటున్నారు.
గమనిక..
పైన పేర్కొన్న విషయాలు సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా రూపొందించినవి.
*రూపశ్రీ.
