LATEST NEWS
  ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం.. కమలం గుటికి ముగ్గురు ఆప్ ఎంపీలు బీజేపీలోకి రాఘవ చడ్డా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో కీలక నేతగా ఉన్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆ పార్టీకి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్ తగిలినట్లు అయ్యింది. రాఘవ్ చద్దాతో పాటు ఆప్ పార్టీకి చెందిన మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు సందీప్ పాఠక్ మరియు అశోక్ మిట్టల్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీలో కీలకమైన పదవుల్లో ఉన్న వీరి చేరిక బీజేపీకి అదనపు బలాన్ని చేకూర్చింది. ఇటీవల కాలంలో రాఘవ చడ్డాను ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించినప్పటి నుంచే ఆయన అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వినిపించాయి. పార్టీ నిర్ణయాల పట్ల ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీలో చేరిన అనంతరం రాఘవ చడ్డా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చేస్తున్న ఈ ప్రయత్నానికి ఎంపీలు హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజిందర్ గుప్తా మరియు విక్రమ్ సాహ్ని వంటి పలువురు నేతల మద్దతు ఉందని ఆయన వెల్లడించారు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ రాజకీయ మార్పులు ఆప్ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ఒకేసారి ముగ్గురు ఎంపీలు పార్టీని వీడటం ఆ పార్టీ భవిష్యత్తుపై మరియు రాజ్యసభలో ఆప్ బలంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. రాఘవ్ చద్దా లాంటి యువ నేత బీజేపీలో చేరడం ఆ పార్టీకి వ్యూహాత్మక విజయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. పార్టీలోని అంతర్గత విభేదాలే ఈ వికెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. రాజ్యసభ వేదికగా ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రాజకీయ పరిణామం జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీకి, వచ్చే ఎన్నికలలో ఆ సంఖ్యైనా మిగులుతుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణులలోనే వ్యక్తమౌతున్న పరిస్థితి. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం..  వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 11 నియోజకవర్గాల్లో కనీసం నాలుగు స్థానాల్లో వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ గెలవడం సాధ్యం కాదని అంటున్నారు.   సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఎన్నికలలో వైసీపీ విజయం సాధించిన నియోజకవర్గాలలో.. కనీసం నాలుగింటిలో ఇప్పుడు వైసీపీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి పులివెందుల తరువాత అంతటి సురక్షిత స్థానంగా చెప్పుకునే పుంగనూరులో ఆ పార్టీ ప్రస్తుతం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని తెలుస్తోంది. పుంగనూరు పుడింగిగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఎన్నికలలోనే చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా విజయం సాధించారు. 2024 ఎన్నికలలో పెద్దిరెడ్డికి పుంగునూరులో వచ్చిన మెజారిటీ కవేలం 6వేల ఓట్లు మాత్రమే. అయితే ప్రస్తుతం చూస్తే.. ఆ నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని అంటున్నారు. పెద్దిరెడ్డి కేవలం వ్యాపారాలు, కోర్టు కేసులకే పరిమితమై ప్రజలకు దూరంగా ఉండటమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక  కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలోనూ వైసీపీకి గడ్డు పరిస్థితులే ఉన్నాయి. గత ఎన్నికలలో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి సుధ విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఆమె పనితీరు పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. వచ్చే ఎన్నికలలో బద్వేలు వైసీపీ చేజారడం ఖాయమని చెబుతున్నారు.   అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో కూడా వైసీపీకి గడ్డుపరిస్థితులే నెలకొని ఉన్నాయంటున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు.  అయితే.. ఆయన నియోజకవర్గ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన అక్కడి ప్రజలలో వ్యక్తం అవుతోంది. మరో వైపు తెలుగుదేశం నేత గొట్టిపాటి రవి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. దీంతో వైసీపీ నియోజకవర్గంలో పట్టు కోల్పోయిన పరిస్థితి ఉందని అంటున్నారు. .  ఇక అరకు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి రేగం మత్స్యలింగం ఇ విజయం సాధించారు. అయితే ఆయన కూడా నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం లేదనీ, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం కూటమి నేతలు క్షేత్రస్థాయిలో చురుకుగా, చొరవగా పని చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. దీంతో అరకులో కూడా ఆ పార్టీకి మరో చాన్స్ దక్కే అవకాశాలు అంతంతమాత్రమే అంటున్నారు.   అయితే వైసీపీ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నా.. ఒక సారి పార్టీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టగానే, గాలి వైసీపీవైపు మళ్లడం ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ క్యాడర్ లో, ప్రజలలో వైసీపీ పట్ల ఒకింత అసంతృప్తి ఉన్నమాట నిజమే అయినా.. జగన్ మోహన్ రెడ్డి త్వరలో చేపట్టబోయే పాదయాత్ర  దానిని పటాపంచలు చేస్తుందనీ, మళ్లీ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నది.   అయితే పరిశీలకులు మాత్రం ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకుని ప్రజలతో మమేకం కాకుండా వైసీపీ పుంజుకోవడం కష్టమేనని విశ్లేషిస్తున్నారు.  
  ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి  ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే. నాదెండ్ల ఎన్టీఆర్ పార్టీ  పెట్టిన‌పుడు చేదోడు వాదోడుగా ఉండేవారు. అంతే కాదు పార్టీ  జెండా,  ఎజెండా ఆ రంగు- రుచి- వాస‌న-  చిక్క‌ద‌నాల మేళ‌వింపులో స‌హ వ్య‌వ‌స్థాప‌క పాత్ర పోషించిన మాట నిజం. ఇక ల‌క్ష్మీపార్వ‌తి  అయితే చాలా మంది ఒప్పుకోరుగానీ, రెండో భార్య‌గా ఆయ‌న  జీవితంలోకి అడుగు పెట్టి ఉత్థానం నుంచి ప‌త‌నానికి తీసుకొచ్చి వ‌దిలి పెట్టారు. అయితే ఈ ఇద్ద‌రి ఉమ్మ‌డి శ‌తృవు మాత్రం చంద్ర‌బాబే.  ఆనాడు నాదెండ్ల విష‌యంలో చంద్ర‌బాబు ఆయ‌న్నుంచి ప‌ద‌వి లాక్కుని.. తిరిగి  ఎన్టీఆర్ కి క‌ట్ట‌బెడితే.. తిరిగి ల‌క్ష్మీపార్వ‌తి చేతుల్లోకి పార్టీ, ప్ర‌భుత్వం రెండూ వెళ్లిపోతుంద‌న‌గా.. తిరిగి చంద్ర‌బాబే ఆ ప‌ద‌విని లాక్కుని.. త‌న  ప‌రం చేసుకున్నారు. కాబ‌ట్టి వీరిద్ద‌రి వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను చేదించిన అభిన‌వ అర్జ‌నుడు చంద్ర‌బాబే. రామారావు అస‌లు పార్టీ పెట్టారంటే  త‌న వ‌ల్లే అంటారు నాదెండ్ల‌. ఇక ఆ స్వామి చ‌ర‌ణ‌దాసిని  నేను అంటారు ల‌క్ష్మీపార్వ‌తి.  ఇందాకే  అనుకున్న‌ట్టు ఇద్ద‌రి ఉమ్మ‌డి  టార్గెట్ చంద్ర‌బాబే.  ఇక్క‌డ విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే నాదెండ్ల ఎంద‌రెంద‌రో పుట్టుపూర్వోత్త‌రాల‌ను తిర‌గ‌రాసేవారు. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు గురించి అడ్డం- పొడ‌వు మాట్లాడేవారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌క్ష్మీపార్వ‌తి  విష‌యంలో కించిత్ మాట ఎక్క‌డా అన‌లేదాయ‌న‌. దీనంత‌టికీ  కార‌ణం.. మ‌ళ్లీ చంద్ర‌బాబే. ఆయ‌నే వీరిద్ద‌రి  కామ‌న్ ఎనిమీ కాబ‌ట్టి.. ఇద్ద‌రూ మంచి మిత్రుల్లాగానే వ్య‌వ‌హ‌రించారు. మొన్న విజ‌య‌మ్మ విష‌యంలో లోకేష్ పై అవాకులు చెవాకులు పేలిన‌పుడు కూడా ల‌క్ష్మీపార్వ‌తి టార్గెట్ మొత్తం  చంద్ర‌బాబే. ఏనాడూ  కూడా ఆమె నాదెండ్ల న‌మ్మ‌క ద్రోహాన్ని  ఎత్తి చూపించిన పాపాన పోలేదు. వీరిద్ద‌రి నిర్వాకానికి పార్టీని కాపాడ్డ‌మే  చంద్ర‌బాబు చేసిన త‌ప్పు. ఇక్క‌డ మ‌న‌మంతా గుర్తించాల్సింది ఏంటంటే.. ఒక వేళ నిజంగా వీళ్ల‌న్న‌ట్టు చంద్ర‌బాబే ఎన్టీఆర్ ప‌ట్ల‌ అంత‌టి  న‌మ్మ‌క ద్రోహి అయి ఉంటే ఆయ‌న కూడా ఎప్పుడో ప‌త‌నావ‌స్త‌కు చేరుకునేవారు. కానీ, ఆయ‌న అంత‌కంత‌కూ ఎదుగుతూ వ‌చ్చారంటేనే తెలియ‌ట్లా ఆయ‌న చేసిందంతా మంచేన‌నీ..  అదే నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి జ‌నం దృష్టిలో ఎలాంటి వారో అంద‌రికీ తెలిసిందే. వీరు వీరి తెర‌చాటు బాగోతాల‌కు జ‌నామోదం లేదు. అదే చంద్ర‌బాబు అలాక్కాదు.. ప్ర‌జ‌ల కోసం, కార్య‌క‌ర్త‌ల కోసం ఇదంతా చేయ‌డం  వ‌ల్లే నేడు ఆయ‌నీ స్థాయిలో ఉన్నారు. మిగిలిన  ఈ ఇద్ద‌రూ క‌లుగుల్లో దాక్కుని.. జనానికి స‌రిగా  మొహం చూపించ‌లేక ముడుచుకుని మూల కూర్చోవ‌ల్సిన దుస్థితికి చేరార‌ని అంటారు ప‌లువురు విశ్లేష‌కులు.
ALSO ON TELUGUONE N E W S
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'లెనిన్' విడుదలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా విడుదల తేదీ మరోసారి మారే అవకాశం ఉందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మొదట 'లెనిన్' చిత్రాన్ని మే 1, 2026న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే, అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా ఏప్రిల్ 30న వస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద అనవసర పోటీని నివారించడానికి 'లెనిన్' మేకర్స్ తమ సినిమాను జూన్ 26, 2026కి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జూన్ 26 రిలీజ్ డేట్‌ను ఖరారు చేసినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ తేదీ కూడా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు: సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనులు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదని నిర్మాత నాగార్జున భావిస్తున్నారట. రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం కూడా మే నెల నుండి జూన్ నెలాఖరుకు లేదా జూలైకి వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ 'పెద్ది' జూన్ 26న రావాలని నిర్ణయించుకుంటే, అప్పుడు 'లెనిన్' మూవీని జూలై 24 లేదా ఆగస్టు నెలలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్టే. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'శివాజీ', 'రోబో', '2.0' సినిమాలు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే, త్వరలో రాబోతున్న #Thalaivar173 ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఒక షాకింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈసారి శంకర్ దర్శకత్వం వహించడం లేదు.. రజనీకి విలన్‌గా నటించబోతున్నారట. రజనీకాంత్ తన 173వ సినిమాను సిబి చక్రవర్తి దర్శకత్వంలో చేయనున్నారు. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి వినిపిస్తున్న తాజా వార్త ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఇందులో విలన్ పాత్ర కోసం ఏకంగా దర్శకుడు శంకర్‌ను సంప్రదించినట్లు సమాచారం. దర్శకుడిగా మారకముందు శంకర్ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. అయితే, పూర్తిస్థాయి విలన్ పాత్రలో ఆయన కనిపించడం ఇదే మొదటిసారి అవుతుంది. రజనీకాంత్ వంటి మాస్ హీరోకు దీటుగా ఉండే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో శంకర్ కనిపిస్తే కొత్తగా ఉంటుంది. ఒకవేళ ఇది నిజమైతే, వెండితెరపై శంకర్-రజనీ మధ్య పోరు చూడటం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుంది. ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్ ఏంటంటే.. లోకనాయకుడు కమల్ హాసన్ ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నారని టాక్. రజనీకాంత్, కమల్ హాసన్, శంకర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.  శంకర్ విలనిజం, రజనీ స్వాగ్ కలగలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  
నటీనటులు: రఘు కుంచె, వికాస్ ముప్పాళ , రామచంద్రం పుణ్యమంతుల, రవి చిన్నిబిల్లి, టీనా శ్రావ్య, మౌనిక, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు సంగీతం: రఘు కుంచె ఎడిటర్: సుధీర్ ఎడ్ల సినిమాటోగ్రఫీ: మురళీకృష్ణ దర్శకత్వం: చైతన్య మోటూరి నిర్మాత: వాణి రవికుమార్  విడుదల తేదీ: ఏప్రిల్ 24, 2026 ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన 'గేదెల రాజు' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాకినాడ నేపథ్యంతో సాగే ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా ఎలా ఉందంటే..? (Gedela Raju Movie Review) కథ: ఈ సినిమా కథ కాకినాడ పరిసరాల్లో తిరుగుతుంది. గేదెల రాజు (రఘు కుంచె) ఒక రౌడీ షీటర్. రాజకీయాల్లోకి ప్రవేశించి మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎదగాలని అతను కలలు కంటుంటాడు. అయితే, అనూహ్యంగా ఒక గుర్తుతెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురవుతాడు. గేదెల రాజుకు శత్రువులు చాలా మంది ఉండటంతో, అసలు అతన్ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. ఈ క్రమంలో బయటపడిన ఆశ్చర్యకరమైన నిజాలే ఈ చిత్ర కథాంశం. విశ్లేషణ: ఈ సినిమా కేవలం ఒక రౌడీ షీటర్ కథ మాత్రమే కాదు, అధికారం కోసం జరిగే ఆధిపత్య పోరాటం. కాకినాడ ప్రాంతంలోని లోకల్ పాలిటిక్స్, అక్కడ కార్పొరేటర్ స్థాయికి ఎదగాలనుకునే ఒక రౌడీ షీటర్ ప్రయాణాన్ని దర్శకుడు చైతన్య మోటూరి చూపించారు. కథలో వచ్చే మలుపులు, ముఖ్యంగా గేదెల రాజు హత్య చుట్టూ అల్లిన సస్పెన్స్ సినిమాకు ప్రాణం పోసింది. కథ పాతదే అయినప్పటికీ, పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి రాజకీయాలను సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా కథనం చాలా వరకు ఇన్వెస్టిగేషన్ మోడ్‌లో సాగుతుంది. ఒక వైపు గేదెల రాజు గతం, మరోవైపు అతని హత్య గురించి పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్.. ఈ రెండింటినీ సమాంతరంగా నడిపారు. ఈ క్రమంలో శత్రువుల పాత్రలు, ప్రేమ కథలు రావడం కొంత గందరగోళంగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే నెమ్మదించినట్లు అనిపించినా, కీలక సన్నివేశాల్లో మాత్రం పట్టు కోల్పోలేదు. సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. గేదెల రాజు క్యారెక్టరైజేషన్, అతని పవర్ వంటి అంశాలతో మొదటి 30 నిమిషాలు వేగంగా సాగిపోతాయి. అయితే, ఇంటర్వెల్ వైపు వెళ్లే కొద్దీ కథనం కొంచెం నెమ్మదించి, పాత్రల మధ్య వైరాన్ని ఎస్టాబ్లిష్ చేయడంపై దృష్టి పెట్టింది. సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. గేదెల రాజును చంపింది ఎవరు? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ ఇన్వెస్టిగేషన్ సీన్స్ నడుస్తాయి. అయితే మధ్యలో కొన్ని డ్రామా సీన్స్ కథా వేగాన్ని తగ్గించాయి. కానీ, ప్రీ-క్లైమాక్స్ నుండి సినిమా మళ్ళీ పుంజుకుంటుంది. క్లైమాక్స్ మెప్పించింది. హంతకుడు ఎవరనేది రివీల్ అయ్యే సీన్ ప్రేక్షకులకు ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: రఘు కుంచె ఈ సినిమాకు ప్రధాన బలం. నెగటివ్ షేడ్స్ ఉన్న రౌడీ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. ఆయన పలికిన గోదావరి యాస, మేనరిజమ్స్ సహజంగా ఉన్నాయి. కాస్ ముప్పాళ , రామచంద్రం పుణ్యమంతుల, రవి చిన్నిబిల్లి, టీనా శ్రావ్య, మౌనిక, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు. చైతన్య మోటూరి ఎంచుకున్న కథాంశం బాగున్నా, కథనంలో కొంత తడబాటు కనిపించింది. ఒక థ్రిల్లర్‌గా ప్రారంభమైన సినిమా, మధ్యలో సాగదీతకు గురైంది. మురళీకృష్ణ సినిమాటోగ్రఫీ అక్కట్టుకుంది. డార్క్ థీమ్, సహజమైన లోకేషన్స్ సినిమాకు ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చాయి. నేపథ్య సంగీతం చాలా నేచురల్‌గా ఉందని చెప్పవచ్చు. ఎడిటర్ కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: రఘు కుంచె నటన ప్రారంభ సన్నివేశాలు చివరిలో ట్విస్ట్  మైనస్ పాయింట్స్: కథనంలో గందరగోళం  కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఫైనల్ గా.. 'గేదెల రాజు' ఒక సాధారణ రూరల్ యాక్షన్ డ్రామా. కథాంశం బాగున్నా, కథనంలో తడబాటు కారణంగా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది.  రేటింగ్: 2.25/5 Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఉండే అంచనాలే వేరు. 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో, లెజెండరీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాలోని లోపాలను, స్క్రీన్‌ప్లేలో జరిగిన పొరపాట్లను విశ్లేషించారు. ఆ వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పవన్ కల్యాణ్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాకు వెళ్లే అభిమానులు తమ ఫేవరెట్ స్టార్‌ను వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ఆరాటపడతారు. కానీ, ఈ సినిమాలో పవన్ ఎంట్రీ దాదాపు 20 నిమిషాల తర్వాత జరుగుతుంది. పరుచూరి అభిప్రాయం ప్రకారం, ఒక పెద్ద స్టార్ హీరో స్క్రీన్ పై కనిపించడానికి ఇంత సమయం తీసుకోవడం సినిమాకు మైనస్ పాయింట్. హీరో ఎంట్రీ ఆలస్యమైతే ప్రేక్షకుల్లో ఉన్న ఉత్సాహం తగ్గే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా ప్రథమార్థంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తర్వాత ప్రేక్షకులు కథలో మరింత వేగాన్ని కోరుకుంటారు. కానీ, 'ఉస్తాద్ భగత్ సింగ్' సెకండాఫ్‌లో లవ్ స్టోరీని ప్రవేశపెట్టడం కథాగమనాన్ని దెబ్బతీసిందని పరుచూరి పేర్కొన్నారు. ఆ లవ్ ట్రాక్‌ను ఫస్ట్ హాఫ్‌లోనే ముగించి ఉంటే బాగుండేదని, ద్వితీయార్థంలో అది కథకు అడ్డంకిగా మారిందని ఆయన విశ్లేషించారు. పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా డైరెక్టర్ హరీశ్ శంకర్ కమర్షియల్ అంశాలను బాగానే దట్టించారు. అయితే, ఒక పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వంటి అంశాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందని పరుచూరి సూచించారు. విలన్లను చంపే క్రమంలో సాధారణ నేరస్థుల కంటే ఉగ్రవాదులను చూపిస్తే బాగుండేదని, అప్పుడు చట్టాన్ని అతిక్రమించినా ప్రేక్షకుల్లో వ్యతిరేకత రాదని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలో అనన్య పాత్రను చంపేయడం అనేది ఒక షాకింగ్ పాయింట్ అయినప్పటికీ, ఆ సీన్ ఇంకా బలంగా పండి ఉండాల్సిందని పరుచూరి అన్నారు. అలాగే, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో 'పిల్లలు పనిలోకి కాదు.. బడిలోకి వెళ్లాలి' అనే మంచి మెసేజ్ ఇచ్చినా, అది మెయిన్ పాయింట్ నుంచి పక్కకు వెళ్లినట్లు అనిపించిందని ఆయన తెలిపారు. పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ ప్రకారం, 'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఈ చిన్న చిన్న స్క్రీన్‌ప్లే మార్పులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ముఖ్యంగా హీరో ఎంట్రీ, లవ్ ట్రాక్ ప్లేస్‌మెంట్ విషయంలో జాగ్రత్త వహించి ఉంటే 'గబ్బర్ సింగ్' స్థాయి విజయాన్ని అందుకునే అవకాశం ఉండేదని ఆయన విశ్లేషణ సారాంశం. ఏదేమైనా, పవన్ కల్యాణ్ మేనరిజమ్స్ మరియు పవర్ ఫుల్ డైలాగ్స్ అభిమానులను అలరించినప్పటికీ, కథనంలో లోపాలు సాధారణ ప్రేక్షకుడికి కొంత నిరాశను మిగిల్చాయనేది వాస్తవం.
The buzz in Tollywood circles is that Ram Charan's highly anticipated Peddi is eyeing a brand new release date, and it is causing quite a stir behind the scenes. Word on the street is that the makers are strongly considering June 25th to bring the film to theaters. This sudden shift is turning out to be a massive headache for Akhil Akkineni’s Lenin. Interestingly, the Lenin team had already moved away from their initial May 1st release plan specifically to avoid clashing with Peddi. Thinking they were safe, they locked in June 26th as their new date. However, if the current industry whispers are true, Peddi arriving on June 25th means the dreaded box office clash is back on again, putting the Akkineni hero right back in the danger zone. The real twist here is the actual production status of Peddi. Currently, shoot of the film is going on and trade circles are murmuring that the team has already communicated the June 25th date to their North American distributors to start blocking screens. Yet, insider sources reveal that the film's shoot will not entirely be wrapped up, some patch work and a song are still pending even after this schedule.  Whether the team can rush through the remaining shoot to hijack the June weekend or if Lenin gets to breathe easy is currently the hottest debate in the industry. AR Rahman is scoring music for the film and he doesn't like to rush his quality. Interestingly, Janhvi Kapoor, the leading lady has been silent about the film. Let's wait for official confirmation from director Buchi Babu and team.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. అయితే కూలర్లు వాడేవారు దాని శుభ్రత గురించి మాత్రం అంత శ్రద్ద తీసుకోరు. దీని వల్ల నీరు మురికిగా మారి దోమలు పెరగడానికి ఆవాసంగా మారడమే కాకుండా.. . కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచకపోతే కూలింగ్ కూడా పెద్దగా రాదు.   అయితే కూలర్ లో నీటిని ప్రతిరోజూ శుభ్రం చేయడం అంత ఈజీ ఏమీ కాదు.. కొన్ని కంపెనీల కూలర్లలో నీటిని నింపడం సులువే.. కానీ వాటిలో నీటిని తొలగించడం, శుభ్రం చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే.. అయితే.. కూలర్లలో నీరు ప్రతిరోజూ శుభ్రం చేయకపోయినా కొన్నిరోజుల పాటు నీరు శుభ్రంగా ఉండాలన్నా, తాజాగా అనిపించాలన్నా కేవలం ఒకే ఒక్క చిట్కా అద్బుతంగా పనిచేస్తుంది. అదేంటో తెలుసుకుంటే.. పటిక.. కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచడానికి పటిక చాలా సులభమైన,  ఇంటి చిట్కా. దీనిని నీటిలో వేయడం  వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కూలర్ ట్యాంక్‌లో నీరు తరచుగా ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది, ఇది తొందరగా మురికిగా మారే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ నీటిలో దోమలు  ఆవాసం ఏర్పాటు చేసుకుని  గుడ్లు పెడతాయి. అయితే కూలర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే   దానిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. నీటిలో ఒక చిన్న పటిక ముక్కను వేయడం వల్ల నీటిని శుభ్రపరచవచ్చు.  పైగా దోమల సమస్య కూడా తగ్గుతుంది. కూలర్ ట్యాంక్ లో పటిక వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నీటి స్వచ్చత.. పటిక నీటిలోని దుమ్ము, ధూళి , చిన్న కణాలను బంధిస్తుంది. ఈ కణాలు బరువెక్కి అడుగుకు చేరుకుంటాయి, దీనివల్ల పైన ఉన్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది. దోమలకు చెక్.. పటిక నీటిని శుద్ధి చేయడం వల్ల దోమల గుడ్లు, లార్వాలు సులభంగా వృద్ధి చెందలేవు. దీనివల్ల దోమల సమస్య గణనీయంగా తగ్గుతుంది. దుర్వాసన.. కూలర్ నీటి నుండి ఏదైనా వింత లేదా దుర్వాసన వస్తుంటే, దానిని చాలా వరకు తగ్గించడంలో పటిక సహాయపడుతుంది. బ్యాక్టీరియా..  పటికకు తేలికపాటి యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి, ఇవి నీటిలో ఉండే  హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. నీటి నాణ్యత.. పటిక నీటిని ఎక్కువ సేపు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది, దీనివల్ల కూలర్ ప్యాడ్‌లు త్వరగా పాడవకుండా ఉంటాయి , గాలి చల్లగా ఉంటుంది. పటికను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. పటికను ఎక్కువ పరిమాణంలో వాడకూడదు. ఒక చిన్న ముక్క సరిపోతుంది. ఎక్కువ పటిక కలపడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా కూలర్‌లోని నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.                                 *రూపశ్రీ.
  వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి. ఈ కారణంగానే ఇప్పట్లో ప్రతి ఇంట్లో కూలర్లు వాడుతున్నారు.  కాస్త అర్థిక స్థితి ఉన్నవారేతై ఏసీ లు కూడా పెట్టించుకుంటారు. కానీ రానురాను పెరుగుతున్న ఎండలు,  వాటి తాలుకూ వేడి కారణంగా కూలర్లు కూడా సరిపోవడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ.. సాధారణ కూలర్ ను కూడా చక్కగా ఏసీ లాంటి చల్లదనం ఇచ్చేలా చేయవచ్చు.  ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సాధారణ కూలర్ తో ఏసీ లాంటి చల్లదనం కావాలంటే.. ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుంటే.. సాల్ట్ , ఐస్.. కూలర్  చల్లటి గాలిని అందించాలని  అనుకుంటే, ఐస్ లేదా ఉప్పు నీటిని కలపడం చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇది చాలా ఫేమస్ చిట్కా కూడా.  కూలర్ ట్యాంకులో రాళ్ల ఉప్పు,   ఐస్ క్యూబ్స్ వేస్తారు.  రాళ్ల ఉప్పు ఐస్ క్యూబ్స్ కరగకుండా ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి. దీని వల్ల కూలింగ్ బాగా వస్తుంది. అయితే.. ఇది రెగ్యులర్ గా చేయడం మంచిది కాదు.. ఉప్పు తొందరగా చిలుము పట్టేలా చేస్తుంది. దీని వల్ల కూలర్ లోని మెటల్ భాగాలు తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా వేడి భరించలేని సమయాల్లో ట్రై చేయడం మంచిది. వెంటిలేషన్.. చాలా మంది ఏసీ లాంటి చల్లదనం వస్తుందని ఆశించి,  కూలర్లను మూసి ఉన్న గదులలో వాడుతుంటారు, కానీ ఇది  పెద్ద పొరపాటు. సరైన వెంటిలేషన్ ఉన్నప్పుడే ఎయిర్ కూలర్ సరిగ్గా పనిచేస్తుంది. గదిలో  వేడి గాలి బయటకు పోవడానికి , చల్లని గాలి లోపల ప్రసరించడానికి వీలుగా ఒక కిటికీని లేదా తలుపును తెరిచి ఉంచడం ముఖ్యం. సరైన వెంటిలేషన్ కూలర్ పనితీరును  మెరుగుపరుస్తుంది. శుభ్రత.. కాలక్రమేణా కూలర్ ప్యాడ్‌లపై దుమ్ము, ధూళి పేరుకుపోయి, వాటి కూలింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందువల్ల వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం లేదా మార్చడం ముఖ్యం. కూలర్ చాలా చల్లని గాలిని ఇవ్వాలి అంటే.. కూలర్ లోపల వట్టివేర్లతో తయారు చేసిన మ్యాట్లను  ఉపయోగించాలి. ఇది కూలింగ్ ను మెరుగుపరుస్తుంది. వట్టివేర్ల  గుండా నీరు ప్రవహించినప్పుడు, గాలి చల్లగా, తాజాగా మారుతుంది, మంచి  తేలికపాటి సువాసనను కూడా అందిస్తుంది. పైన పేర్కొన్న చిట్కాలను పాటించడం వల్ల వేసవి కాలంలో కూలర్ ఏసీ లాంటి చల్లదనాన్నిఇస్తుంది.                                     *రూపశ్రీ.
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం, ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం.. వీటితో పాటు కాస్త ఆర్థికంగా బాగున్నవారైతే.. హనీమూన్ కు కూడా వెళ్తారు. పెళ్లయిన మొదట్లో..  కొన్ని నెలలు ఎంతో అద్బులంలా.. అంతా పరిపూర్ణంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ హనీమూన్  అయిపోయాక లేదా పెళ్లైన  రెండు మూడు నెలల తర్వాత.. అసలైన లైఫ్ మొదలవుతుంది.  ఇక్కడే అందరూ ఊహించుకునే పెళ్లి జీవితానికి,  వాస్తవానికి మధ్య చాలా తేడా ఉందని తెలుసుకుంటారు.  అసలు అంగీకరించలేని ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి,  ఊహించుకున్న జీవితం చాలా రివర్స్ గా,  డిజప్పాయింట్ గా అనిపిస్తుంది.   పెళ్లి తర్వాత అర్థమయ్యే చేదు నిజాలు కొన్ని ఉన్నాయి. పెళ్ళి తర్వాత  జీవితం గురించి కలలు కనే ప్రతి ఒక్కరూ,  పెళ్లి తర్వాత జీవితాన్ని సినిమాటిక్ గా ఊహించుకునే ప్రతి ఒక్కరూ ఆ చేదు నిజాలను తెలుసుకోవాలి. దీని వల్ల పెళ్లి తర్వాత వారు డిజప్పాయింట్ అయ్యే పరిస్థితి ఎదురవ్వదు.  ఆ చేదు నిజాలు ఏంటో తెలుసుకుంటే..  ప్రేమ అంటే.. పెళ్లికి ముందు,  పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు  ప్రేమ అంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, పొగడ్తలు చెప్పుకోవడమే అనుకుంటారు. నిజానికి చాలామందికి మొదట్లో అవే జరుగుతుంటాయి. కానీ పెళ్లైన రెండు మూడు నెలల తర్వాత సాధారణ  జీవితానికి తిరిగి వచ్చినప్పుడు, ప్రేమలో సరుకులు కొనడం, కరెంటు బిల్లు కట్టడం, బాధ్యతలు పంచుకోవడం కూడా ఉంటాయని మీరు గ్రహిస్తారు.  బయటకు వెళ్లి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని అనుకునేవారు.. పెళ్లైన కొన్ని నెలల తర్వాత.. ఈరోజు రాత్రి భోజనానికి ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కేవలం బెడ్ రూమ్ ముచ్చట కాదు.. అది ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకోవడంలో కూడా ఉంటుంది. పర్పెక్ట్ లైఫ్ పార్టనర్.. పెళ్లికి ముందు కేవలం మాట్లాడుకుంటూ ఉండటం వల్ల తమకు బెస్ట్ పార్ట్నర్ లభించారని అనుకుంటారు.  కానీ పెళ్ళి  తర్వాత  ఒకే ఇంట్లో కలిసి జీవించడం  మనిషిలో నిజ స్వభావాన్ని బయటపెడుతుంది. మనిషి అలవాట్లు, మాటలు,   రోజువారీ ప్రవర్తన, కొన్నిసార్లు అతిగా రియాక్ట్ అవ్వడం,  కోపం చేసుకోవడం, వాగ్వాదం ఇవన్నీ పెళ్లి తర్వాత ఉంటాయి. ఇవన్నీ పర్పెక్ట్ అనే ట్యాగ్ ను చెరిపేస్తాయి.  అయితే..  అందరూ ఒప్పుకోవాల్సన నిజం ఏమిటంటే.. ఎవరూ కంప్లీట్ గా పర్పెక్ట్ గా ఉండరు. ప్రతి ఒక్కరికీ బలాలు ఉంటాయి,  బలహీనతలు ఉంటాయి. రెండింటినీ అంగీకరించాలి. గొడవలు.. పెళ్లి తర్వాత గొడవ పడని భార్యాభర్తలు ఎక్కడా ఉండరు.  గొడవ పడని  భార్యాభర్తలు ఉన్నారని అనుకోవడం కూడా చాలా పొరపాటు.  విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణం. టీవీ రిమోట్ దగ్గర నుండి మొదలుకుని ఎన్నో విషయాలలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలపై వాదనలు ప్రతి వైవాహిక జీవితంలో ఒక భాగమే. డబ్బు.. ప్రేమకు దాని స్థానం ఉంది, అలాగే డబ్బుకు దాని స్థానం ఉంది. పెళ్లి తర్వాత, ఇంటి బడ్జెట్‌ను రూపొందించుకోవడం, ఖర్చులను నిర్వహించుకోవడం, పొదుపు గురించి ఆలోచించడం వంటివి చాలా కీలకమవుతాయి. పెళ్లి తర్వాత దంపతులు తమ ఆర్థిక ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని గ్రహిస్తారు. కొందరు పొదుపు చేయాలనుకుంటే, మరికొందరు ఖర్చు చేయాలనుకుంటారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనా పరులైతే.. ఇద్దరి సంపాదన మీద ఒక్కరే అధికారం చూపించడం  వంటి పరిస్థితులు ఎదురైతే.. అది  వారి బంధంలో పెద్ద చీలికకు దారితీయవచ్చు. కాబట్టి వివాహం తర్వాత డబ్బు గురించి మాట్లాడటం మంచిదే కానీ.. డబ్బు కోసం బంధాన్ని విచ్చిన్నం చేయకూడదు. పర్సనల్ స్పేస్.. పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడటం నుండి, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం వరకు  పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారు. కానీ పెళ్లి తర్వాత మారిపోతుంది. ప్రతి విషయంలోనూ  భాగస్వామిని కలుపుకోవాలి, వారి సౌకర్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు తమకోసం , స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. పైన చెప్పుకున్న విషయాలు చాలా సాధారణమైనవి. కానీ..పెళ్లికి ముందు చాలా జంటలు ఈ విషయాలలోనే ఊహించని అంచనాలు పెట్టుకుని, పెళ్లి తర్వాత చాలా డిజప్పాయింట్ అవుతారు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.                          *రూపశ్రీ.
  ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం.. కమలం గుటికి ముగ్గురు ఆప్ ఎంపీలు బీజేపీలోకి రాఘవ చడ్డా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో కీలక నేతగా ఉన్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆ పార్టీకి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్ తగిలినట్లు అయ్యింది. రాఘవ్ చద్దాతో పాటు ఆప్ పార్టీకి చెందిన మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు సందీప్ పాఠక్ మరియు అశోక్ మిట్టల్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీలో కీలకమైన పదవుల్లో ఉన్న వీరి చేరిక బీజేపీకి అదనపు బలాన్ని చేకూర్చింది. ఇటీవల కాలంలో రాఘవ చడ్డాను ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించినప్పటి నుంచే ఆయన అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వినిపించాయి. పార్టీ నిర్ణయాల పట్ల ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీలో చేరిన అనంతరం రాఘవ చడ్డా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చేస్తున్న ఈ ప్రయత్నానికి ఎంపీలు హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజిందర్ గుప్తా మరియు విక్రమ్ సాహ్ని వంటి పలువురు నేతల మద్దతు ఉందని ఆయన వెల్లడించారు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ రాజకీయ మార్పులు ఆప్ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ఒకేసారి ముగ్గురు ఎంపీలు పార్టీని వీడటం ఆ పార్టీ భవిష్యత్తుపై మరియు రాజ్యసభలో ఆప్ బలంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. రాఘవ్ చద్దా లాంటి యువ నేత బీజేపీలో చేరడం ఆ పార్టీకి వ్యూహాత్మక విజయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. పార్టీలోని అంతర్గత విభేదాలే ఈ వికెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. రాజ్యసభ వేదికగా ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రాజకీయ పరిణామం జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీకి, వచ్చే ఎన్నికలలో ఆ సంఖ్యైనా మిగులుతుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణులలోనే వ్యక్తమౌతున్న పరిస్థితి. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం..  వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 11 నియోజకవర్గాల్లో కనీసం నాలుగు స్థానాల్లో వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ గెలవడం సాధ్యం కాదని అంటున్నారు.   సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఎన్నికలలో వైసీపీ విజయం సాధించిన నియోజకవర్గాలలో.. కనీసం నాలుగింటిలో ఇప్పుడు వైసీపీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి పులివెందుల తరువాత అంతటి సురక్షిత స్థానంగా చెప్పుకునే పుంగనూరులో ఆ పార్టీ ప్రస్తుతం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని తెలుస్తోంది. పుంగనూరు పుడింగిగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఎన్నికలలోనే చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా విజయం సాధించారు. 2024 ఎన్నికలలో పెద్దిరెడ్డికి పుంగునూరులో వచ్చిన మెజారిటీ కవేలం 6వేల ఓట్లు మాత్రమే. అయితే ప్రస్తుతం చూస్తే.. ఆ నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని అంటున్నారు. పెద్దిరెడ్డి కేవలం వ్యాపారాలు, కోర్టు కేసులకే పరిమితమై ప్రజలకు దూరంగా ఉండటమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక  కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలోనూ వైసీపీకి గడ్డు పరిస్థితులే ఉన్నాయి. గత ఎన్నికలలో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి సుధ విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఆమె పనితీరు పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. వచ్చే ఎన్నికలలో బద్వేలు వైసీపీ చేజారడం ఖాయమని చెబుతున్నారు.   అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో కూడా వైసీపీకి గడ్డుపరిస్థితులే నెలకొని ఉన్నాయంటున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు.  అయితే.. ఆయన నియోజకవర్గ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన అక్కడి ప్రజలలో వ్యక్తం అవుతోంది. మరో వైపు తెలుగుదేశం నేత గొట్టిపాటి రవి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. దీంతో వైసీపీ నియోజకవర్గంలో పట్టు కోల్పోయిన పరిస్థితి ఉందని అంటున్నారు. .  ఇక అరకు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి రేగం మత్స్యలింగం ఇ విజయం సాధించారు. అయితే ఆయన కూడా నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం లేదనీ, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం కూటమి నేతలు క్షేత్రస్థాయిలో చురుకుగా, చొరవగా పని చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. దీంతో అరకులో కూడా ఆ పార్టీకి మరో చాన్స్ దక్కే అవకాశాలు అంతంతమాత్రమే అంటున్నారు.   అయితే వైసీపీ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నా.. ఒక సారి పార్టీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టగానే, గాలి వైసీపీవైపు మళ్లడం ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ క్యాడర్ లో, ప్రజలలో వైసీపీ పట్ల ఒకింత అసంతృప్తి ఉన్నమాట నిజమే అయినా.. జగన్ మోహన్ రెడ్డి త్వరలో చేపట్టబోయే పాదయాత్ర  దానిని పటాపంచలు చేస్తుందనీ, మళ్లీ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నది.   అయితే పరిశీలకులు మాత్రం ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకుని ప్రజలతో మమేకం కాకుండా వైసీపీ పుంజుకోవడం కష్టమేనని విశ్లేషిస్తున్నారు.  
  ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి  ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే. నాదెండ్ల ఎన్టీఆర్ పార్టీ  పెట్టిన‌పుడు చేదోడు వాదోడుగా ఉండేవారు. అంతే కాదు పార్టీ  జెండా,  ఎజెండా ఆ రంగు- రుచి- వాస‌న-  చిక్క‌ద‌నాల మేళ‌వింపులో స‌హ వ్య‌వ‌స్థాప‌క పాత్ర పోషించిన మాట నిజం. ఇక ల‌క్ష్మీపార్వ‌తి  అయితే చాలా మంది ఒప్పుకోరుగానీ, రెండో భార్య‌గా ఆయ‌న  జీవితంలోకి అడుగు పెట్టి ఉత్థానం నుంచి ప‌త‌నానికి తీసుకొచ్చి వ‌దిలి పెట్టారు. అయితే ఈ ఇద్ద‌రి ఉమ్మ‌డి శ‌తృవు మాత్రం చంద్ర‌బాబే.  ఆనాడు నాదెండ్ల విష‌యంలో చంద్ర‌బాబు ఆయ‌న్నుంచి ప‌ద‌వి లాక్కుని.. తిరిగి  ఎన్టీఆర్ కి క‌ట్ట‌బెడితే.. తిరిగి ల‌క్ష్మీపార్వ‌తి చేతుల్లోకి పార్టీ, ప్ర‌భుత్వం రెండూ వెళ్లిపోతుంద‌న‌గా.. తిరిగి చంద్ర‌బాబే ఆ ప‌ద‌విని లాక్కుని.. త‌న  ప‌రం చేసుకున్నారు. కాబ‌ట్టి వీరిద్ద‌రి వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను చేదించిన అభిన‌వ అర్జ‌నుడు చంద్ర‌బాబే. రామారావు అస‌లు పార్టీ పెట్టారంటే  త‌న వ‌ల్లే అంటారు నాదెండ్ల‌. ఇక ఆ స్వామి చ‌ర‌ణ‌దాసిని  నేను అంటారు ల‌క్ష్మీపార్వ‌తి.  ఇందాకే  అనుకున్న‌ట్టు ఇద్ద‌రి ఉమ్మ‌డి  టార్గెట్ చంద్ర‌బాబే.  ఇక్క‌డ విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే నాదెండ్ల ఎంద‌రెంద‌రో పుట్టుపూర్వోత్త‌రాల‌ను తిర‌గ‌రాసేవారు. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు గురించి అడ్డం- పొడ‌వు మాట్లాడేవారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌క్ష్మీపార్వ‌తి  విష‌యంలో కించిత్ మాట ఎక్క‌డా అన‌లేదాయ‌న‌. దీనంత‌టికీ  కార‌ణం.. మ‌ళ్లీ చంద్ర‌బాబే. ఆయ‌నే వీరిద్ద‌రి  కామ‌న్ ఎనిమీ కాబ‌ట్టి.. ఇద్ద‌రూ మంచి మిత్రుల్లాగానే వ్య‌వ‌హ‌రించారు. మొన్న విజ‌య‌మ్మ విష‌యంలో లోకేష్ పై అవాకులు చెవాకులు పేలిన‌పుడు కూడా ల‌క్ష్మీపార్వ‌తి టార్గెట్ మొత్తం  చంద్ర‌బాబే. ఏనాడూ  కూడా ఆమె నాదెండ్ల న‌మ్మ‌క ద్రోహాన్ని  ఎత్తి చూపించిన పాపాన పోలేదు. వీరిద్ద‌రి నిర్వాకానికి పార్టీని కాపాడ్డ‌మే  చంద్ర‌బాబు చేసిన త‌ప్పు. ఇక్క‌డ మ‌న‌మంతా గుర్తించాల్సింది ఏంటంటే.. ఒక వేళ నిజంగా వీళ్ల‌న్న‌ట్టు చంద్ర‌బాబే ఎన్టీఆర్ ప‌ట్ల‌ అంత‌టి  న‌మ్మ‌క ద్రోహి అయి ఉంటే ఆయ‌న కూడా ఎప్పుడో ప‌త‌నావ‌స్త‌కు చేరుకునేవారు. కానీ, ఆయ‌న అంత‌కంత‌కూ ఎదుగుతూ వ‌చ్చారంటేనే తెలియ‌ట్లా ఆయ‌న చేసిందంతా మంచేన‌నీ..  అదే నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి జ‌నం దృష్టిలో ఎలాంటి వారో అంద‌రికీ తెలిసిందే. వీరు వీరి తెర‌చాటు బాగోతాల‌కు జ‌నామోదం లేదు. అదే చంద్ర‌బాబు అలాక్కాదు.. ప్ర‌జ‌ల కోసం, కార్య‌క‌ర్త‌ల కోసం ఇదంతా చేయ‌డం  వ‌ల్లే నేడు ఆయ‌నీ స్థాయిలో ఉన్నారు. మిగిలిన  ఈ ఇద్ద‌రూ క‌లుగుల్లో దాక్కుని.. జనానికి స‌రిగా  మొహం చూపించ‌లేక ముడుచుకుని మూల కూర్చోవ‌ల్సిన దుస్థితికి చేరార‌ని అంటారు ప‌లువురు విశ్లేష‌కులు.
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం,  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా కీలకం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో జింక్ కూడా ఒకటి. అయితే చాలామందికి జింక్ లోపం గురించి పెద్దగా అవగాహన ఉండదు.  జింక్ లోపం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది నిజమేనా? జింక్ లోపం గురించి.  జింక్ లోపం వల్ల వచ్చే సమస్యల గురించి వైద్యులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. శరీరానికి జింక్ ఎందుకు అవసరం..  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి , చర్మానికి జింక్ చాలా అవసరం. జింక్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి , కణజాలాలను బాగు చేయడానికి సహాయపడుతుంది. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చని, చర్మ, కడుపు సమస్యలను కూడా కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. జింక్ లోపం వల్ల వచ్చే సమస్యలు.. జింక్ లోపం శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. జింక్ లోపం పిల్లలలో పెరుగుదలను నిరోధించగలదు , మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇన్ఫెక్షన్లు.. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. జింక్ లోపం ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల ఫంగస్ , చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. విరేచనాలు.. వైద్యుల ప్రకారం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. జింక్ లోపం జీర్ణవ్యవస్థపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో జింక్ లోపించినప్పుడు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. గాయాలు.. జింక్ లోపం చర్మం, కడుపునే కాకుండా గాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. జింక్ లోపం ఉన్నవారిలో గాయాలు నెమ్మదిగా నయమవుతాయి. జింక్ లోపిస్తే కనిపించే లక్షణాలు.. జింక్ లోపం వేగంగా బరువు తగ్గడం, నీరసం , జుట్టు రాలడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. జింక్ పుష్కలంగా లభించే ఆహారాలు.. ఆహారంలో జింక్‌ను చేర్చుకోవడానికి,  గుమ్మడి గింజలు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు గింజలు , రాగులను చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలలో జింక్ ఉంటుంది. అదనంగా,  ఆవాల ఆకుకూర, మాంసం, పప్పుధాన్యాలు, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, పెరుగు, వేరుశెనగలు , గుడ్లను కూడా తినవచ్చు. ఈ ఆహారాలలో కూడా జింక్ సమృద్దిగా ఉంటుంది.                                 *రూపశ్రీ.
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ అవసరం లేకుండా కొద్దిమోతాదులో అందుతుంది.  అయితే  అన్ని రకాల కూరగాయలను ఇనుప పాత్రలో వండకూడదు.  . కొన్ని కూరగాయలు ఐరన్ పాత్రలో వండినప్పుడు రియాక్షన్ జరిగి వాటి రుచి, రంగు లేదా పోషక విలువల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.  ఆహారం  నాణ్యత , రుచిని కోల్పోకుండా ఉండేందుకు, ఐరన్ పాత్రలు వాడే ప్తి ఒక్కరూ వాటిలో వండకూడని కూరగాయలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. టమోటా.. టమోటాలు వంటల్లో ఎక్కువగా ఉపయోగించే  కూరగాయ. టమోటాలలో ఆమ్లం అధిక మొత్తంలో ఉంటుంది, ఇది ఐరన్ తో చర్య జరుపుతుంది. దీనివల్ల కూరగాయ రంగు ముదురుగా మారవచ్చు , కొద్దిగా వగరు రుచిని కలిగి ఉండవచ్చు. ఎక్కువసేపు వండటం ఈ ప్రభావాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. అందువల్ల, టమోటా వంటి  కూరగాయలను స్టీల్ లేదా నాన్-స్టిక్ పాన్ లేదా బౌల్స్ లో వండాలి. పాలకూర.. పాలకూర వంటి ఆకుకూరలు ఐరన్ ప్రభావానికి గురైనప్పుడు వాటి  ఆకుపచ్చ రంగును కోల్పోయి, ముదురు రంగులోకి లేదా నల్లగా మారవచ్చు, దీనివల్ల అవి తినడానికి పనికిరావు. రుచిలో కూడా కొద్దిగా మార్పు ఉంటుంది. ఆకుకూరలను అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలలో వండటం ఉత్తమం. చింతపండు.. చింతపండు ఉపయోగించి వండే  కూరను ఇనుప పెనంలో వండకూడదు. వీటిలో ఉండే ఆమ్లాలు ఇనుముతో చర్య జరిపి ఆహారం రుచిని మార్చి, దానికి లోహపు రుచిని ఇస్తాయి. ఇది అనారోగ్యకరమైనదిగా కూడా పరిగణించబడుతుంది. అందువల్ల, స్టీల్ లేదా నాన్-స్టిక్ పెనాన్ని ఉపయోగించాలి.  కేవలం చింతపండు మాత్రమే కాకుండా నిమ్మకాయ,  మామిడికాయ వంటివి కూడా ఐరన్ పాత్రలలో వండకూడదు. పెరుగు వంటలు.. పెరుగుతో చేసిన కూర లేదా పెరుగు గ్రేవీ వంటి కూరగాయల వంటకాలను ఇనుప పెనంలో వండినప్పుడు వాటి రుచి భిన్నంగా ఉంటుంది. పెరుగులోని పులుపు ఇనుముతో కలిసి కొద్దిగా చేదును కలిగిస్తుంది. అంతేకాకుండా రంగు ముదురుగా మారవచ్చు , కూరలో కొద్దిగా నలుపు కనిపించవచ్చు. నిమ్మకాయ.. కూరగాయలకు నిమ్మరసం కలపడం వల్ల వాటికి కొద్దిగా పులుపు, రుచి వస్తుంది, కానీ అది ఐరన్ తో  చర్య జరిపి రుచిని పాడుచేసే అవకాశం ఉంది.  దీనివల్ల ఆహారానికి లోహపు, వగరు రుచి వస్తుంది, కాబట్టి నిమ్మరసాన్ని ఎల్లప్పుడూ వంట చేసిన తర్వాత, తినడానికి ముందు మాత్రమే కలపాలి. ఎక్కువ నీటి శాతం కలిగిన కూరలు.. అధిక నీటి శాతం ఉన్న కూరగాయలను ఐరన్ పెనంలో వండినప్పుడు వాటి రంగు, ఆకృతి మారవచ్చు. ఈ కూరగాయలను ఎక్కువ సేపు వండితే నల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని రసాయనాలతో చర్య జరపని పాత్రలలో వండటం మంచిది.                               *రూపశ్రీ.
  ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్య నుండి కళ్లకు ఉపశమం కలిగించడానికి చాలా మంది బ్లూ లైట్ కళ్లద్దాలు వాడుతున్నారు.  ప్రస్తుతం ఈ బ్లూ లైట్ కళ్లద్దాల వినియోగం చాలా ఎక్కువైంది కూడా.  అయితే, ఈ కళ్లద్దాలు నిజంగా  కళ్లకు రక్షణ కవచంలా పనిచేస్తాయా? , లేక ఇవి కేవలం ఒక ట్రెండ్‌లో భాగమా? కంటి సంరక్షణ నిపుణులు దీని గురించి ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే.. బ్లూ లైట్ ఎఫెక్ట్.. నీలి కాంతి అనేది ఒక రకమైన అధిక శక్తి గల కాంతి. ఇది కేవలం డిజిటల్ స్క్రీన్‌ల నుండే కాకుండా, సూర్యరశ్మి నుండి కూడా వెలువడుతుంది. మనం గంటల తరబడి స్క్రీన్‌లను చూస్తూ ఉన్నప్పుడు, కళ్ళు పొడిబారడం, చికాకు, అలసట , తలనొప్పి వంటి కంటి సమస్యలను ఎదురవుతాయి. ఇలా కంటి సమస్యలు రావడాన్ని  డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని అంటారు. ఈ సమస్యలకు స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతియే ప్రధాన కారణమని చాలా మంది భావిస్తారు. బ్లూ లైట్ గ్లాసెస్.. మార్కెట్లో లభించే బ్లూ లైట్ గ్లాసెస్, వాటి ప్రత్యేక లెన్సులు నీలి కాంతిని కళ్ళలోకి చేరకుండా అడ్డుకుంటాయని బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెబుతారు. నీలి కాంతి మనిషిలో నిద్ర హార్మోన్లను ప్రభావితం చేస్తుంది కాబట్టి, ఇది కంటి ఒత్తిడిని తగ్గించి, నిద్రను మెరుగుపరుస్తుందని కంపెనీలు వాదిస్తున్నాయి. అయితే శాస్త్రీయంగా ఇది నిరూపణ కాలేదు.  బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెప్పే విషయాలను పరిశోధనలు సమర్థించడం లేదు. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే.. బ్లూ లైట్ గ్లాసెస్  కంటి అలసటను తగ్గించడంలో అంత ప్రభావవంతంగా ఉండవు.  కంటి నొప్పి , పొడిబారడానికి అసలు కారణం బ్లూ లైట్ కాదు,  విరామం లేకుండా తదేకంగా  స్క్రీన్‌ను చూడటం ద్వారానే అసలు సమస్య వస్తోంది , కూర్చున్నప్పుడు  తప్పు పొజిషన్ లో కూర్చోవడం,  స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు తక్కువగా కనురెప్పలు వాల్చడం వంటివి కళ్లకు అలసట, పొడిబారడం వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. అందువల్ల, కేవలం కళ్లజోడు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా తొలగించలేము. బ్లూ లైట్ గ్లాసెస్ పనికిరావా? బ్లూ లైట్  కళ్లద్దాలు ధరించడం వల్ల కొంతమందికి కొంత సౌకర్యం కలగవచ్చనేది నిజమే. ముఖ్యంగా రాత్రి పొద్దుపోయే వరకు తమ మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లపై పనిచేసే వారికి కొంత ఉపశమనం లభించవచ్చు లేదా వారి నిద్ర పోవడానికి ఎక్కువ రిస్క్ లేకుండా ఈ బ్లూ లైట్ కళ్లద్దాలు కాస్త హెల్ప్ చేయవచ్చు.   కానీ పూర్తి కంటి రక్షణకు ఈ కళ్లద్దాలు పెట్టుకోవడం  ఏకైక పరిష్కారంగా భావించడం సరికాదని వైద్యులు చెబుతున్నారు.                                    *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.