Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పొరపాటున కూడా ఈ కూరగాయలను ఐరన్ పాత్రలలో వండకండి!
posted on: Apr 23, 2026 3:18PM

ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది. దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ అవసరం లేకుండా కొద్దిమోతాదులో అందుతుంది. అయితే అన్ని రకాల కూరగాయలను ఇనుప పాత్రలో వండకూడదు. . కొన్ని కూరగాయలు ఐరన్ పాత్రలో వండినప్పుడు రియాక్షన్ జరిగి వాటి రుచి, రంగు లేదా పోషక విలువల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఆహారం నాణ్యత , రుచిని కోల్పోకుండా ఉండేందుకు, ఐరన్ పాత్రలు వాడే ప్తి ఒక్కరూ వాటిలో వండకూడని కూరగాయలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
టమోటా..
టమోటాలు వంటల్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయ. టమోటాలలో ఆమ్లం అధిక మొత్తంలో ఉంటుంది, ఇది ఐరన్ తో చర్య జరుపుతుంది. దీనివల్ల కూరగాయ రంగు ముదురుగా మారవచ్చు , కొద్దిగా వగరు రుచిని కలిగి ఉండవచ్చు. ఎక్కువసేపు వండటం ఈ ప్రభావాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. అందువల్ల, టమోటా వంటి కూరగాయలను స్టీల్ లేదా నాన్-స్టిక్ పాన్ లేదా బౌల్స్ లో వండాలి.
పాలకూర..
పాలకూర వంటి ఆకుకూరలు ఐరన్ ప్రభావానికి గురైనప్పుడు వాటి ఆకుపచ్చ రంగును కోల్పోయి, ముదురు రంగులోకి లేదా నల్లగా మారవచ్చు, దీనివల్ల అవి తినడానికి పనికిరావు. రుచిలో కూడా కొద్దిగా మార్పు ఉంటుంది. ఆకుకూరలను అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలలో వండటం ఉత్తమం.
చింతపండు..
చింతపండు ఉపయోగించి వండే కూరను ఇనుప పెనంలో వండకూడదు. వీటిలో ఉండే ఆమ్లాలు ఇనుముతో చర్య జరిపి ఆహారం రుచిని మార్చి, దానికి లోహపు రుచిని ఇస్తాయి. ఇది అనారోగ్యకరమైనదిగా కూడా పరిగణించబడుతుంది. అందువల్ల, స్టీల్ లేదా నాన్-స్టిక్ పెనాన్ని ఉపయోగించాలి. కేవలం చింతపండు మాత్రమే కాకుండా నిమ్మకాయ, మామిడికాయ వంటివి కూడా ఐరన్ పాత్రలలో వండకూడదు.
పెరుగు వంటలు..
పెరుగుతో చేసిన కూర లేదా పెరుగు గ్రేవీ వంటి కూరగాయల వంటకాలను ఇనుప పెనంలో వండినప్పుడు వాటి రుచి భిన్నంగా ఉంటుంది. పెరుగులోని పులుపు ఇనుముతో కలిసి కొద్దిగా చేదును కలిగిస్తుంది. అంతేకాకుండా రంగు ముదురుగా మారవచ్చు , కూరలో కొద్దిగా నలుపు కనిపించవచ్చు.
నిమ్మకాయ..
కూరగాయలకు నిమ్మరసం కలపడం వల్ల వాటికి కొద్దిగా పులుపు, రుచి వస్తుంది, కానీ అది ఐరన్ తో చర్య జరిపి రుచిని పాడుచేసే అవకాశం ఉంది. దీనివల్ల ఆహారానికి లోహపు, వగరు రుచి వస్తుంది, కాబట్టి నిమ్మరసాన్ని ఎల్లప్పుడూ వంట చేసిన తర్వాత, తినడానికి ముందు మాత్రమే కలపాలి.
ఎక్కువ నీటి శాతం కలిగిన కూరలు..
అధిక నీటి శాతం ఉన్న కూరగాయలను ఐరన్ పెనంలో వండినప్పుడు వాటి రంగు, ఆకృతి మారవచ్చు. ఈ కూరగాయలను ఎక్కువ సేపు వండితే నల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని రసాయనాలతో చర్య జరపని పాత్రలలో వండటం మంచిది.
*రూపశ్రీ.





