Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీ, తెలంగాణ విషయంలో కేంద్రం వ్యూహాత్మకం!
posted on: Jul 8, 2014 12:25PM

కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతాపార్టీకి సంపూర్ణ మెజారిటీ వుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం చేయదలచుకున్నా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేసే అవకాశం పూర్తిగా వుంది. తాను చేయదలచుకున్న ఏ పనికైనా ఏ పార్టీ నుంచి అయినా మద్దతు కోరాల్సిన పరిస్థితి లేదు. నిజానికి సంపూర్ణ మెజారిటీ లభించిన భారతీయ జనతాపార్టీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే శక్తి వున్నా తన మిత్రపక్ష పార్టీలన్నిటినీ కలుపుకుని ఎన్డీయే ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసింది. ఇలా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో తాను ఎవరికీ దొరికిపోకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా వివేకంతో వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రెండు కీలక అంశాలు కేంద్ర ప్రభుత్వం ముందు వున్నాయి. అవి ఒకటి పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌కి బిల్లు రూపంలో పార్లమెంట్ ఆమోదం పొందేలా చేయడం. రెండోది హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థకి సంబంధించిన అధికారాలు గవర్నర్‌కి అప్పగించడం. ఈ రెండు అంశాలనీ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు ఈ రెండు అంశాలూ సీమాంధ్రులకు చాలా కీలకమైన అంశాలు. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈ రెండు అంశాలనూ కచ్చితంగా అమలులోకి తేవాలన్న కృతనిశ్చయంతో మోడీ ప్రభుత్వం వుంది. మోడీ ప్రభుత్వం చేయదలచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైతే నిర్దాక్షిణ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందో, అంతే నిర్దాక్షిణ్యంగా తన నిర్ణయాలను మోడీ ప్రభుత్వం అమలు చేయవచ్చు. అయితే ఆ మార్గంలో వెళ్ళడానికి ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. ఈ రెండు అంశాలలో ఆచి తూచి వ్యవహరించి తాను ఇబ్బంది పడకుండా, ఇరుక్కుపోకుండా, విమర్శలు ఎదుర్కోకుండా వుండేలా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే పోలవరం ఆర్డినెన్స్‌కి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందన్నట్టుగా రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే లోక్‌సభలో బిల్లును ఆమోదించాలని భావిస్తోంది. అదేవిధంగా గవర్నర్‌కి అధికారాల విషయంలో కూడా తాను తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా వుండేలా కూడా కేంద్రం కసరత్తు చేస్తోంది. మొత్తమ్మీద కేంద్రం సేఫ్ గేమ్ ఆడుతోంది.


.jpg)
.jpg)


