Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈ చిన్న చిట్కా ఫాలో అయితే చాలు.. కూలర్‌లో నీరు ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది!
posted on: Apr 24, 2026 4:08PM

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు తప్పనిసరి అవుతాయి. రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. అయితే కూలర్లు వాడేవారు దాని శుభ్రత గురించి మాత్రం అంత శ్రద్ద తీసుకోరు. దీని వల్ల నీరు మురికిగా మారి దోమలు పెరగడానికి ఆవాసంగా మారడమే కాకుండా.. . కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచకపోతే కూలింగ్ కూడా పెద్దగా రాదు. అయితే కూలర్ లో నీటిని ప్రతిరోజూ శుభ్రం చేయడం అంత ఈజీ ఏమీ కాదు.. కొన్ని కంపెనీల కూలర్లలో నీటిని నింపడం సులువే.. కానీ వాటిలో నీటిని తొలగించడం, శుభ్రం చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే.. అయితే.. కూలర్లలో నీరు ప్రతిరోజూ శుభ్రం చేయకపోయినా కొన్నిరోజుల పాటు నీరు శుభ్రంగా ఉండాలన్నా, తాజాగా అనిపించాలన్నా కేవలం ఒకే ఒక్క చిట్కా అద్బుతంగా పనిచేస్తుంది. అదేంటో తెలుసుకుంటే..
పటిక..
కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచడానికి పటిక చాలా సులభమైన, ఇంటి చిట్కా. దీనిని నీటిలో వేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కూలర్ ట్యాంక్‌లో నీరు తరచుగా ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది, ఇది తొందరగా మురికిగా మారే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ నీటిలో దోమలు ఆవాసం ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడతాయి. అయితే కూలర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే దానిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. నీటిలో ఒక చిన్న పటిక ముక్కను వేయడం వల్ల నీటిని శుభ్రపరచవచ్చు. పైగా దోమల సమస్య కూడా తగ్గుతుంది.
కూలర్ ట్యాంక్ లో పటిక వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..
నీటి స్వచ్చత..
పటిక నీటిలోని దుమ్ము, ధూళి , చిన్న కణాలను బంధిస్తుంది. ఈ కణాలు బరువెక్కి అడుగుకు చేరుకుంటాయి, దీనివల్ల పైన ఉన్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది.
దోమలకు చెక్..
పటిక నీటిని శుద్ధి చేయడం వల్ల దోమల గుడ్లు, లార్వాలు సులభంగా వృద్ధి చెందలేవు. దీనివల్ల దోమల సమస్య గణనీయంగా తగ్గుతుంది.
దుర్వాసన..
కూలర్ నీటి నుండి ఏదైనా వింత లేదా దుర్వాసన వస్తుంటే, దానిని చాలా వరకు తగ్గించడంలో పటిక సహాయపడుతుంది.
బ్యాక్టీరియా..
పటికకు తేలికపాటి యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి, ఇవి నీటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి.
నీటి నాణ్యత..
పటిక నీటిని ఎక్కువ సేపు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది, దీనివల్ల కూలర్ ప్యాడ్‌లు త్వరగా పాడవకుండా ఉంటాయి , గాలి చల్లగా ఉంటుంది.
పటికను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు..
పటికను ఎక్కువ పరిమాణంలో వాడకూడదు. ఒక చిన్న ముక్క సరిపోతుంది. ఎక్కువ పటిక కలపడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా కూలర్‌లోని నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.
*రూపశ్రీ.





