LATEST NEWS
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇప్పుడు తెలంగాణలో ముక్కోణపు రాజకీయ పోరుకు తెరలేపింది.  నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ మెట్రో ప్రాజెక్ట్   ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ట్రయాంగ్యులర్ పోరుకు వేదిక అయ్యింది.  కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది.  ఈ పార్టీల మథ్య  వాడివేడి చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యామ్నాయాలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది.   బిఆర్ఎస్ ప్రభుత్వంపై, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత బిఆర్ఎస్ పాలకులు ప్రజల అవసరాలను, ప్రజా డిమాండ్‌ను పూర్తిగా పక్కనబెట్టేశార  ఆరోపించారు. కేవలం తమ   ప్రయోజనాలు, ఆర్థిక లాభాల కోసమే ఈ ప్రాజెక్టును వాడుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు అత్యంత కీలకమైన, ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో మెట్రో లైన్లను కేటాయించకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పాడు చేసిందన్నారు. అక్కడితో ఆగకుండా  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా  మెట్రో ప్రాజెక్టు అభివృద్ధికి సహకారం అందించడం లేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఈ ప్రాజెక్టుకు రుణం అందకుండా అడ్డుకుంటున్నారనీ దుయ్యబట్టారు.   ఈ విమర్శలపై  బిఆర్ఎస్ నాయకత్వం  ఘాటుగా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   కొత్తగా అదనపు మెట్రో లైన్లను సాధించడంలో   పూర్తిగా విఫలమయ్యారని ఎదురుదాడికి దిగింది. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి  తమపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడింది.   ప్రాజెక్టును ప్రారంభించిన బిఆర్ఎస్ పాలనను విమర్శించడం మానేసి, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ హైదరాబాద్ నగరానికి కొత్త మెట్రో రూట్లను తీసుకురావడంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని హితవు పలికింది.  ఇక బీజేపీ కూడా రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసింది.  రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారనీ..  ఇప్పుడు వాటిని నెరవేర్చలేక చేతులెత్తేస్తున్నారని మండిపడింది.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అబద్ధపు ఆరోపణలు చేస్తూ, తన వైఫల్యాలను బిజెపిపైకి నెట్టేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్న బిజెపి..  ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే మేధోశక్తి, కార్యాచరణ రేవంత్ రెడ్డికి లేవని విమర్శించింది. మొత్తానికి ప్రజారవాణాకు అత్యంత కీలకమైన  హైదరాబాద్ మెట్రో  ఇప్పుడు పొలిటికల్ ట్రయాంగిల్ ఫైట్ కే కేంద్ర బిందువుగా మారింది. 
తమిళనాట అన్నాడీఎంకే పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారౌతోంది. తాజాగా   ఆ పార్టీ సీనియర్ నాయకుడు, తమిళనాడు మాజీ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి. విజయభాస్కర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.  తన రాజీనామాను ఆయన  శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను స్వయంగా కలిసి అందజేశారు. ఆ రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు.  విరాలిమలై నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విజయభాస్కర్ రాజీనామాతో దీంతో అన్నాడీఎంకే లో తీవ్ర కలకలం మొదలైంది. ఈ రాజీనామా వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా పార్టీ అగ్ర నాయకత్వం, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి  వైఖరి పట్ల విజయభాస్కర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలోని నిజమైన, క్షేత్రస్థాయి కార్యకర్తల గళాన్ని, అభిప్రాయాలను అధిష్టానం కనీసం వినడం లేదంటూ ఆయన బహిరంగంగానే ఆరోపించారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం   ప్రభుత్వంపై జరిగిన అసెంబ్లీ విశ్వాస పరీక్షలో విజయభాస్కర్ పార్టీ లైన్‌ను ధిక్కరించి, ప్రభుత్వానికి అనుకూలంగా  ఓటు వేయడం గమనార్హం. నాటి నుంచే ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్ ప్రయోజనాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని, త్వరలోనే తన తదుపరి  కార్యాచరణను ప్రకటిస్తానని విజయభాస్కర్  తెలిపారు.   2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం..  కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే అన్నాడీఎంకే పార్టీని వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఐదో శాసనసభ్యుడిగా విజయభాస్కర్ నిలిచారు. ఈ వరుస వలసల కారణంగా 234 మంది మొత్తం సభ్యులున్న తమిళనాడు శాసనసభలో అన్నాడీఎంకే పా బలం ఇప్పుడు   42కు పడిపోయింది.  మరోవైపు, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన సీటుతో కలుపుకుని, ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఖాళీల సంఖ్య 6 కి చేరుకుంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే, గతంలో అన్నాడీఎంకేను వీడి బయటకు వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల బాటలోనే డాక్టర్ సి. విజయభాస్కర్ కూడా అధికార టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకుంటారని పరిశీలకులు అంటున్నారు.   
మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.  గతంలో శివసేనను నిలువునా చీల్చిన ఏక్‌నాథ్‌ షిండే, ఇప్పుడు ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన  విభాగానికి మరో భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన పలువురు  లోక్‌సభ సభ్యులు షిండే నేతృత్వంలోని  శివసేనతో   సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పరిణామాలు మరవకముందే..  ఇప్పుడు మహారాష్ట్రలో  అదే  తరహా రాజకీయ ప్రకంపనలు  దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.  ఉద్ధవ్ శివసేన హైకమాండ్  తమ పార్టీ లోక్‌సభ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పుడు వారి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్‌  రావడంతో ఉద్ధవ్‌ ఠాక్రే శిబిరంలో  ఆందోళన, అలజడి మొదలైంది. పరిస్థితి చేతులు దాటిపోకముందే అప్రమత్తమైన ఉద్ధవ్‌ ఠాక్రే, స్వయంగా రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.   రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ మేరకు. శివసేన (ఉద్దవ్ ) పార్టీకి చెందిన ఆరుగురుర ఎంపీలు,  ఇప్పుడు అధికార శివసేన వైపు చూస్తున్నారు. సంజయ్‌ దినా పాటిల్‌, సంజయ్‌ దేశ్‌ముఖ్‌, నగేశ్‌ పాటిల్‌ అష్టికర్‌, ఓంరాజే నింబాల్కర్‌, భౌసాహెబ్‌ వక్చౌరే,   సంజయ్‌ జాధవ్‌ లు షిండే వర్గంతో నిరంతరం టచ్‌లోకి వెళ్లినట్లు చెబుతున్నారు.  వీరితో పాటు రాజాభౌ వాజే పేరు కూడా ఈ తిరుగుబాటు జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉద్ధవ్ ఠాక్రేకు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నఎంపీలలో  సగానికి పైగా బలం చేజారిపోయే ప్రమాదం పొంచి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  శివసేన (ఉద్దవ్) ఎంపీలు ఢిల్లీలో ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు, లోక్‌సభ సభ్యుడు  శ్రీకాంత్‌ షిండే అధికారిక నివాసంలో రహస్యంగా సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సమావేశంలో  విలీన వ్యూహాన్ని ఖరారు చేసుకున్న అనంతరం.. వీరంతా కలిసి,  లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్లమెంటులో పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక పార్లమెంటరీ వర్గాన్ని ఏర్పాటు చేయాలని వీరు స్పీకర్ ను కోరే అవకాశం ఉందంటున్నారు.  ఆ తర్వాత చట్టబద్ధంగా షిండే నేతృత్వంలోని  శివసేనలో ఈ గ్రూపును విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేయాలని వ్యూహం పన్నినట్లు చెబుతున్నారు.  మరోవైపు అ షిండే వర్గం ఈ పరిణామాలను బాహాటంగానే సమర్థిస్తోంది. మహారాష్ట్ర మంత్రి ప్రతాప్‌ సార్నాయక్‌ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. దివంగత బాల్‌ ఠాక్రే ఆశయాలను, సిద్ధాంతాలను నిజాయితీగా నమ్మి, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే సమర్థవంతమైన నాయకత్వంపై విశ్వాసం ఉంచే ఏ నాయకుడికైనా శివసేన తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన అన్నారు.  తిరుగుబాటు ఆలోచనతో వస్తున్న ఎంపీలను తాము సాదరంగా ఆహ్వానిస్తామని ఆయన ప్రకటించడంతో విలీన ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.  అయితే..  ఎంపీ సంజయ్‌ రౌత్‌.. ఈ తిరుగుబాటు వార్తలన్నీ   మైండ్ గేమ్‌లో భాగమేనని, తమ పార్టీ ఎంపీలంతా  ఉద్ధవ్‌ ఠాక్రే వెంటే   నిలబడతారని స్పష్టం చేశారు. అదే సమయంలో అధికార పక్షంపై ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీకి చెందిన ఎంపీలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికీ ఏకంగా  15 కోట్ల చొప్పున   ఆఫర్ చేస్తున్నారని సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు.  
ALSO ON TELUGUONE N E W S
Andhra Pradesh Deputy Chief Minister and Jana Sena Party President Pawan Kalyan fulfilled the wish of a young fan battling a rare genetic disorder by personally visiting his residence in Hanumakonda, Telangana. Seventeen-year-old Niranjan has been suffering from a rare DND-related condition that has left him bedridden and affected his growth. Expressing a wish to meet Pawan Kalyan, his request reached the Jana Sena chief through party leaders. Pawan visited Niranjan’s home on Wednesday, spent time with him and spoke with his parents to understand his health condition and treatment. Moved by the interaction, he comforted the teenager, embraced him and blessed him with Tirumala Sri Venkateswara Swamy’s sacred prasadam. Pawan Kalyan also extended financial assistance of Rs.1 lakh towards medical expenses and assured the family that special prayers would be offered at Warangal’s Bhadrakali Temple for Niranjan’s recovery. During the visit, Pawan watched videos of Niranjan dancing and imitating him during healthier days.  When the teenager shared his wish to raise a pet dog, Pawan promised to arrange one. Learning about the family’s financial situation, he also directed Jana Sena leaders to explore setting up a canteen to support their livelihood. Following the visit, Pawan Kalyan left directly for Bhadrakali Temple in Warangal. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులకు, ముఖ్యంగా భారతీయ హాలీవుడ్ అభిమానులకు ఇది ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్! 'ఇన్‌సెప్షన్', 'ఇంటర్‌స్టెల్లార్', 'ది డార్క్ నైట్', 'ఒపెన్‌హైమర్' వంటి విజువల్ వండర్స్ అండ్ మైండ్ బెండింగ్ చిత్రాలతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారిగా అధికారిక పర్యటనపై భారతదేశంలో అడుగుపెట్టబోతున్నారు. తన రాబోయే భారీ క్రేజీ ప్రాజెక్ట్ 'ది ఒడిస్సీ' (The Odyssey) చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ముంబై నగరానికి రానున్నారు. యూనివర్సల్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. జులై నెలలో ముంబైలో జరగబోయే ఈ చిత్ర గ్రాండ్ గ్లోబల్ ప్రీమియర్ వేడుకకు దర్శకుడు నోలన్‌తో పాటు హాలీవుడ్ టాప్ స్టార్స్, ఆస్కార్ విజేత మ్యాట్ డామన్, స్పైడర్‌మ్యాన్ ఫేమ్ టామ్ హాలండ్ మరియు ఆస్కార్ అవార్డు గ్రహీత, నిర్మాత ఎమ్మా థామస్ కూడా హాజరుకానున్నారు. నోలన్ కెరీర్‌లోనే ఒక సినిమా కోసం ఇలా భారతదేశంలో భారీ ప్రీమియర్ ఈవెంట్ నిర్వహించడం ఇదే ప్రథమం కావడంతో సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా లండన్, పారిస్, న్యూయార్క్ వంటి ప్రఖ్యాత నగరాల జాబితాలో ముంబైని కూడా గ్లోబల్ ప్రీమియర్ టూర్ కోసం సెలెక్ట్ చేయడం చూస్తుంటే.. హాలీవుడ్ మేకర్స్ భారతీయ సినిమా మార్కెట్‌కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టమవుతోంది. హోమర్ రచించిన చారిత్రాత్మక ఇతిహాసం 'ఒడిస్సీ' కథ ఆధారంగా ఈ సినిమాను నోలన్ తనదైన శైలిలో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు. ట్రాయ్ పతనం అనంతరం కథానాయకుడు ఒడిస్సియస్ తన స్వగృహానికి చేరుకోవడానికి చేసిన పదేళ్ల సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. ఈ సినిమా సాంకేతికంగా మరో సరికొత్త మైలురాయిని సృష్టించబోతోంది. సరికొత్త సరివిప్లవాత్మక ఐమ్యాక్స్ (IMAX) ఫిల్మ్ టెక్నాలజీని ఉపయోగించి, హాలీవుడ్ చరిత్రలోనే పూర్తి సినిమాను కేవలం ఐమ్యాక్స్ కెమెరాలతోనే షూట్ చేసిన మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్‌గా 'ది ఒడిస్సీ' రికార్డు సృష్టించింది. ముంబై ఫీనిక్స్ పల్లాడియంలోని ప్రతిష్టాత్మక పీవీఆర్ ఐకాన్ ఐమ్యాక్స్ థియేటర్ ఈ అద్భుత ఘట్టానికి వేదిక కానుంది. ఈ భారీ విజువల్ ఎపిక్‌లో మ్యాట్ డామన్, టామ్ హాలండ్‌లతో పాటు ఆన్ హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపిటా యోంగో, జెండాయా, మరియు చార్లీజ్ థెరాన్ వంటి హాలీవుడ్ అగ్ర తారాగణం భాగమైంది. నోలన్ సొంత బ్యానర్ సింకోపీపై ఎమ్మా థామస్‌తో కలిసి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ప్రీమియర్ ఈవెంట్‌పై ఇండియన్ ఫ్యాన్స్ విపరీతమైన హంగామా చేస్తున్నారు. భారత గడ్డపై జరగబోయే అతిపెద్ద అంతర్జాతీయ సినీ ఈవెంట్‌గా ఇది నిలిచిపోనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ విజువల్ వండర్ జులై 17న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మన దేశంలోని ప్రముఖ నగరాల్లోని ఐమ్యాక్స్ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలై సంచలనం సృష్టిస్తున్నాయి. నోలన్ మార్క్ విజువల్స్ మరియు టామ్ హాలండ్-మ్యాట్ డామన్‌ల స్క్రీన్ ప్రెజెన్స్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)హిట్ మూవీ 'బద్రి' ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ అమీషా పటేల్(Ameesha Patel).. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నానిలో కూడా  చేసి తెలుగు ప్రేక్షకులకి ఇంకా దగ్గరయింది. బాలీవుడ్ లో కూడా అందరి అగ్ర హీరోలతో జత కట్టిన అమీషా  తాజాగా తన ప్రేమాయణం గురించిన వార్తలతో వార్తల్లో నిలిచారు. పాకిస్తాన్‌కి  చెందిన ప్రముఖ నటుడు ఇమ్రాన్ అబ్బాస్‌తో ఆమె ఉన్న ఒక పాత రొమాంటిక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో  వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరూ ఎంతో క్లోజ్‌గా, రొమాంటిక్‌గా కనిపించడంతో, 51 ఏళ్ల వయసులో అమీషా పటేల్ తన ప్రియుడిని పరిచయం చేసిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే ఊహాగానాలు బాలీవుడ్, టాలీవుడ్ సర్కిల్స్‌లో ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అయితే, ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న మరో స్టోరీ కూడా ఉంది. గతంలో బహ్రెయిన్‌లో జరిగిన ఈవెంట్ సందర్భంగా అమీషా పటేల్, ఇమ్రాన్ అబ్బాస్ కలుసుకున్నారు. ఆ సమయంలో అమీషా పటేల్ నుంచి వచ్చిన 'క్రాంతి' మూవీలోని 'దిల్ మే దర్ద్ సా' అనే పాపులర్ రొమాంటిక్ సాంగ్‌ని వీరిద్దరూ కలిసి రీక్రియేట్ చేస్తూ ఒక ఫన్ వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోని  అమీషా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేయడంతో అప్పట్లోనే అది సెన్సేషన్ సృష్టించింది. ఆ పాత వీడియోనే ఇప్పుడు నెటిజన్లు మళ్లీ తెరపైకి తెచ్చి వైరల్ చేస్తున్నారు. ఈ ప్రేమాయణం వార్తలపై గతంలోనే నటి అమీషా పటేల్ గట్టిగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తామిద్దరం ఒంటరిగాఉండటం వల్లే ఇరు దేశాల మీడియా మరియు నెటిజన్లు ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారు. భారత్, పాక్  సరిహద్దులని  దాటిన తమ స్నేహం చాలా పవిత్రమైనది. అందులో ఎలాంటి దాపరికాలు లేవని చెప్పుకొచ్చింది. Also Read: shah rukh khan: షారుఖ్ ఖాన్ సీక్రెట్ బయటపెట్టిన తమన్నా ప్రస్తుతం సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అమీషా, 'గదర్ 2' వంటి భారీ బ్లాక్‌బస్టర్‌తో దాదాపు 500 కోట్లకి పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. కెరీర్‌పై ఫోకస్ పెడుతున్న తరుణంలో ఇలాంటి రూమర్స్ రావడం సర్వసాధారణమే అయినప్పటికీ, ఈ క్యూట్ అండ్ రొమాంటిక్ వీడియో మాత్రం ఇరు దేశాల సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇప్పటికీ ట్రెండింగ్‌గా కొనసాగుతోంది. అమీషా వయసు ప్రస్తుతం 51 సంవత్సరాలు.    
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'(Fauzi)పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ మినహా ఇప్పటివరకు ఎలాంటి మేజర్ అప్‌డేట్ ఇవ్వకుండా సైలెంట్‌గా షూటింగ్ కానిచ్చేస్తోంది. దీంతో అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' షూటింగ్‌తో ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్, ఇప్పుడు తన పూర్తి ఫోకస్‌ను 'ఫౌజీ' వైపు మళ్లించినట్టు తెలుస్తోంది. ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు రెబల్ స్టార్ ఏకంగా బల్క్ డేట్స్ కేటాయించారని సమాచారం. ప్రభాస్ ఒకేసారి భారీగా డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ శరవేగంగా దూసుకుపోనుంది. అంతేకాదు, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం వచ్చే నెలలోనే 'ఫౌజీ' టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్టుగా గట్టి టాక్ వినిపిస్తోంది. ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్‌తోనే సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేయబోతున్నారట. నిజానికి 'ఫౌజీ' సినిమా వచ్చే దసరా కానుకగా థియేటర్లలోకి రానుందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను డిసెంబర్ నెలలో అత్యంత భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, ఈ సినిమాను డిసెంబర్ 3న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో భారీ రేటుకు డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ చేసే పనిలో బిజీగా ఉంది. ఈ ఓటీటీ బిజినెస్ క్లోజ్ అయిన వెంటనే డిసెంబర్ 3 రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే ఒక పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇమాన్వి, ఈ సినిమాతో వెండితెరపై ప్రభాస్ పక్కన ఎలా అలరించబోతుందో అని ఫ్యాన్స్ ఎంతో క్యూరియస్‌గా ఉన్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. హను రాఘవపూడి మార్క్ ఎమోషన్స్ తో పాటు ప్రభాస్ రేంజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ 'ఫౌజీ' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఏదేమైనా వచ్చే నెల టీజర్ అప్‌డేట్ తో రెబల్ ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.  
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram). దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వెండితెరపై సమంత అలరించబోతున్న చిత్రం కావడంతో టాలీవుడ్ ప్రేక్షకులలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ చిత్రం జూన్ 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్‌తో పాటు సమంత అభిమానుల్లో సరికొత్త జోష్ నెలకొంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'యు/ఎ' (UA 13+) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే.. 2 గంటల 34 నిమిషాల 30 సెకన్ల (సుమారు 154 నిమిషాలు) పక్కా నిడివితో లాక్ చేయబడింది. ఎక్కడా బోర్ కొట్టకుండా, కథా గమనానికి సరిపోయేలా ఈ డీసెంట్ రన్ టైమ్‌ను లాక్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో ఎక్కడా అనవసరమైన వివాదాస్పద అంశాలు లేకపోవడంతో బోర్డు సభ్యులు పెద్దగా కట్స్ ఏవీ విధించకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వినోదంతో పాటు సాలిడ్ యాక్షన్ ఎమోషన్స్‌ను పండించిన విధానాన్ని చూసి సెన్సార్ సభ్యులు డైరెక్టర్ నందినీ రెడ్డి మరియు టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రజనీకాంత్ ఆల్‌టైమ్ క్లాసిక్ హిట్ 'బాషా' ఫార్మాట్ తరహాలో నడుస్తుందని డైరెక్టర్ బి.వి. నందినీ రెడ్డి హింట్ ఇచ్చారు. సాధారణంగా మగ హీరోలతో చూసే ఈ 'ఫ్లాష్‌బ్యాక్ అండ్ సీక్రెట్ పాస్ట్' టెంప్లేట్‌ను కాస్త మార్చి, ఒక సాధారణ గృహిణి స్థానంలో ఉంచి కథను అద్భుతంగా డిజైన్ చేశారు. కొత్తగా పెళ్లై అత్తగారింట్లో అడుగుపెట్టిన ఒక అమాయకపు కోడలు, తన గతాన్ని దాచిపెడుతూ అందరి మనసులు ఎలా గెలుచుకుంది? అదే సమయంలో పాత శత్రువులు తన ఫ్యామిలీపై దాడికి దిగినప్పుడు, వంటింట్లో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకీ పట్టి వారిని ఎలా వేటాడింది? అనే కథాంశంతో సినిమా రొమాంచితంగా సాగుతుంది. ఇక 'మా ఇంటి బంగారం' ఇన్‌సైడ్ సెన్సార్ టాక్ ప్రకారం.. సినిమాలో సమంత పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉందట. ముఖ్యంగా చీరకట్టులో ఆమె చేసిన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు. సమంతతో పాటు సహ నటీనటులైన శ్రీముఖి, గౌతమి, గుల్షన్ దేవయ్య, మంజూష తమ పాత్రలకు 100 శాతం న్యాయం చేశారు. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని, ప్రతి ఫైట్ సీన్‌లో థియేటర్లు దద్దరిల్లడం గ్యారెంటీ అని టాక్. సమంత తన సొంత బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్ పై తన భర్త రాజ్ నిడిమోరు మరియు హిమాంక్ దువ్వూరుతో కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
ఎండలు భగభగ మండుతూ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత రుతుపవనాలు వస్తాయి.  ఈ రుతుపవనాలు ప్రజలకు ఎంతో ఊరట ఇస్తాయి. చాలా ఎండల తర్వాత వర్షం కురవడం,  వాతావరణం చల్లబడటం అనేది కేవలం మనుషులకే కాదు.. జంతువులకు, వృక్షాలకు కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మొక్కలను పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టమున్నవారికి మాత్రం వర్షాలు కురవడం అనేది ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది.  అయితే వర్షాకాలం కొన్ని సవాళ్లను కూడా వెంట తెస్తుంది. వర్షాలు రాగానే కొన్ని తోటలు పచ్చగా, అందంగా కనిపిస్తాయి.   మరికొన్ని కలుపు మొక్కలు, కీటకాలు, కుండీలలో నీరు నిలవడం వంటి సమస్యలను తెచ్చిపెడతాయి.   ఈ వర్షాకాలంలో  తోటలోని మొక్కలకు ఎలాంటి వ్యాధులు రాకూడదన్నా.. మొక్కలు పచ్చగా,  ఏపుగా పెరగాలన్నా వర్షాలు ప్రారంభమయ్యే ముందు  కొన్ని పనులు చేయాలి. ఎంతో సులభమైన, ముఖ్యమైన ఆ పనులు ఏంటో తెలుసుకుంటే..   డ్రైనేజీ రంధ్రాలు.. వర్షాకాలంలో మొక్కలు చనిపోవడానికి చాలా ఎక్కువగా  ఎదురయ్యే  సాధారణ కారణం నీరు. మొక్కలకు నీరు బాగా పోసినా లేదా వర్షాల కారణంగా కుండీలలో నీరు ఎక్కువగా నిలిచినా మొక్కలు చనిపోతాయి.  కుండీ అడుగున ఉన్న రంధ్రం మట్టితో లేదా గులకరాళ్లతో మూసుకుపోతే, వర్షపు నీరు బయటకు పోదు. దీనివల్ల వేర్లు నీటిలో మునిగి ఉండి కుళ్లిపోతాయి. అందువల్ల, వర్షాలు రాకముందే, అదనపు నీరు వెంటనే బయటకు పోయేలా అన్ని కుండీలలోని డ్రైనేజీ  రంధ్రాలను పుల్ల లేదా స్క్రూడ్రైవర్‌తో శుభ్రం చేయాలి. కలుపు మొక్కలు.. గాలిలో , నేలలో తేమ పెరిగేకొద్దీ కుండీలలో , పూల మడులలో అనవసరమైన కలుపు మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఈ కలుపు మొక్కలు చూడటానికి అందవిహీనంగా ఉండటమే కాకుండా, నేల నుండి అవసరమైన పోషకాలను గ్రహించి,  ప్రధాన మొక్కలను బలహీనపరుస్తాయి. వర్షాలు ప్రారంభమయ్యే ముందు, తోట అంతటా లేదా కుండీలలో  కలుపును పూర్తిగా తీసివేసి, అన్ని కలుపు మొక్కలను వేళ్లతో సహా పెకిలించాలి. ప్రూనింగ్.. ప్రూనింగ్ అంటే కత్తిరింపు.  కొత్త మొక్కల పెరుగుదలకు వర్షాకాలం ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది . అందువల్ల, వర్షాలు ప్రారంభమయ్యే ముందు  మొక్కలను తేలికగా కత్తిరించాలి. చనిపోయిన, కుళ్ళిన లేదా వ్యాధి సోకిన కొమ్మలను తొలగించాలి. కత్తిరించడం వల్ల మొక్కలో గాలి, సూర్యరశ్మి ప్రసరణ మెరుగుపడుతుంది. వర్షం పడిన వెంటనే మొక్కకు ఎన్నో కొత్త, నిగనిగలాడే ఆకులు చిగురిస్తాయి. సపోర్ట్.. వర్షాకాలంలో బలమైన గాలులు, తుఫానులు సర్వసాధారణం. మనీ ప్లాంట్, తిప్పతీగ  లేదా తమలపాకు  వంటి తీగలు, బరువైన మొక్కలు బలమైన గాలుల వల్ల లేదా నీటి బరువు వల్ల విరిగి పడిపోవచ్చు. దీనిని నివారించడానికి, వర్షాకాలం రాకముందే  తీగలు , పొడవైన మొక్కలన్నింటికీ వెదురు కర్రలు, పుల్లలు లేదా తాళ్లతో తగినంత ఆధారాన్ని అందించాలి, తద్వారా అవి బలమైన తుఫానుల సమయంలో కూడా సురక్షితంగా నిలబడతాయి. కంపోస్ట్, కొత్త మట్టి.. తరచుగా కురిసే వర్షాల వల్ల  కుండీలలోని పై మట్టి, దానిలోని పోషకాలు కొట్టుకుపోతాయి. వర్షాలు పడటానికి ముందే మట్టిని సిద్ధం చేసుకోవడం ముఖ్యం. కుండీలలో కొంత తాజా మట్టిని, మంచి సేంద్రియ ఎరువును కలపాలి. వర్షపు నీరు పడినప్పుడు, ఈ ఎరువు నేరుగా వేర్లకు చేరి,  మొక్కలు రెట్టింపు వేగంతో పెరిగే శక్తిని ఇస్తుంది. కొన్ని గార్డెనింగ్ టిప్స్.. తేమతో కూడిన వాతావరణం కీటకాలు, శిలీంధ్రాలు , చీమల పెరుగుదలకు అనువైనది. వర్షాకాలంలో, మొక్కలపై మీలీబగ్స్ , శిలీంధ్రాల దాడి  బాగా  పెరుగుతుంది. దీనిని నివారించడానికి, ప్రతి 15 రోజులకు ఒకసారి  మొక్కలపై వేప నూనెను పిచికారీ చేయాలి, లేదా కొద్దిగా శిలీంధ్రనాశక పొడిని శుభ్రమైన నీటిలో కలపి పిచికారీ చేయాలి. ఈ ముందుజాగ్రత్త చర్యలు  మొక్కలను వ్యాధుల నుండి కాపాడుతాయి.                                            *రూపశ్రీ.
తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా పెంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఉండే  కొన్ని అలవాట్లు తెలియకుండానే పిల్లల మీద ప్రబావం చూపిస్తాయి.ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే.. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద ప్రబావం చూపిస్తున్నట్టు కనీసం తల్లిదండ్రులు తెలుసుకోరు, గ్రహించలేరు కూడా.  కానీ అది పిల్లల మానసిక , భావోద్వేగ ఎదుగుదలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రవర్తన సరిగా లేని తల్లిదండ్రుల వల్ల, పిల్లలు క్రమంగా మౌనంగా ఉండిపోతారు, తమ మనసులో ఉన్న విషయాలను  వ్యక్తపరచడానికి సిగ్గుపడతారు, వారి ఆత్మవిశ్వాసం కూడా బలహీనపడుతుంది.  తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంటే పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందో.. వారు జీవితంలో ఏ విషయాన్ని చెప్పలేక, జీవితంలో ఎదగలేక వెనుకబడిపోతారో.. పేరెంటింగ్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. కొన్ని లక్షణాలను, ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో పెంపకం సరిగా లేదని అర్థం చేసుకోవచ్చు.  తల్లిదండ్రులలో మూడు సాధారణ లక్షణాలు ఉంటాయి. మొదటిది, తమ పిల్లల ప్రతి  దాన్ని నియంత్రించాలని, వారి తరపున ప్రతి నిర్ణయం తామే తీసుకోవాలని కోరుకునే తల్లిదండ్రులు. రెండవది, పిల్లలు విచారంగా, కోపంగా లేదా కలత చెందినప్పుడు, "నువ్వు అతిగా స్పందిస్తున్నావు" లేదా "ఇంత చిన్న విషయానికి ఎందుకు కోపపడుతున్నావు?" వంటి మాటలు అనడం. ఇది పిల్లల భావాలకు విలువ లేదని వారికి నేర్పుతుంది. పిల్లలు సరిగా పెంచడం లేదనడానికి మూడవ సంకేతం ఏమిటంటే, పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే, ఎప్పుడూ చదువుకుంటే, తల్లిదండ్రుల మాట వింటే, వారి అంచనాలకు అనుగుణంగా జీవిస్తేనే తమకు ప్రేమ, పెద్దల అనుమతి  లభిస్తాయని భావించడం.  ఒకవేళ వారు అలా చేయకపోతే, వారి తల్లిదండ్రులు కోపగించుకోవడం లేదా కలత చెందడం,  ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఇలా చాలా చేస్తారు. తల్లిదండ్రులు చేసే ఈ ప్రవర్తన వల్ల పిల్లలు మానసికంగా ఎదగలేరు,  వారి ఆత్మవిశ్వాసం కోల్పోతారు. తల్లిదండ్రులు ప్రవర్తన మార్చుకోవాలి.. తల్లిదండ్రులు తమలో తాము పైన చెప్పుకున్న లక్షణాలు గమనిస్తే, వెంటనే తమ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలని పేరెంటింగ్ నిపుణులు అంటున్నారు.  అంతేకాదు.. తమ పిల్లలను నియంత్రించడానికి బదులుగా, తల్లిదండ్రులు వారితో మంచి అనుబంధాన్ని పెంచుకోవడం, పిల్లలతో స్నేహితులుగా ఉండటంపై  దృష్టి పెట్టాలి. వారి సమస్యలకు పరిష్కారాలు సూచించే ముందు, పిల్లలు ఏం చెప్తున్నారో  అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా, వారి  సమస్య ఏంటో వివరంగా తెలుసుకోవాలి. కేవలం చదువు, ఫలితాలపై దృష్టి పెట్టకుండా, వారు తమ పిల్లల అభిరుచికి విలువ ఇవ్వాలి. ఇది ముఖ్యం.. తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా లేకపోవడం అంటే.. అప్పుడప్పుడు ఒక చెడ్డ నిర్ణయం తీసుకునేవారు లేదా పొరపాటు చేసేవారు కాదు. విషపూరితమైన తల్లిదండ్రులు అంటే, వారి వల్ల పిల్లలు క్రమంగా తమ ఆత్మవిశ్వాసాన్ని, తమ అభిప్రాయాన్ని చెప్పే శక్తిని, ఏదీ చెప్పుకోలేని పరిస్థితి తీసుకురావడం.  ఇలాంటివన్నీ ఉంటే ఆ పిల్లలు జీవితంలో ఎంతో కోల్పోతారు.                                          *రూపశ్రీ.
  పిల్లలను పెంచడం అంటే కేవలం వారికి మంచి విద్య,  ఆహారం,  కనీస అవసరాలు  అందించడం కాదు. వారికి అవసరమైన జీవిత నైపుణ్యాలు, విలువలను కూడా నేర్పించాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తరచుగా చాలామంది తల్లిదండ్రులు, ఆడపిల్లలకు కొన్ని పనులను నేర్పిస్తారు.  మగపిల్లలకు ఆ పనులతో అవసరం లేదని,  అది మగవారి బాధ్యత కాదని చెబుతారు. కానీ మారుతున్న కాలంతో పాటు ఈ ఆలోచనా విధానం వేగంగా మారుతోంది. నేటి కాలంలో అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరినీ స్వయం సమృద్ధిగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం చాలా ముఖ్యం. చిన్నతనంలో నేర్చుకున్న అలవాట్లు, నైపుణ్యాలు పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు మాత్రమే నేర్పించే కొన్ని పనులు మగపిల్లలకు కూడా నేర్పిస్తే వారు మనుషులుగా ఎదగడమే కాకుండా వారి భవిష్యత్తు ఎంతో బాగుంటుంది.  ఆ పనులు ఏంటో తెలుసుకుంటే.. ఇంటి పనులలో సహాయం.. చిన్న వయస్సు నుండే పిల్లలకు ఇంటి పనులలో పాల్గొనడం నేర్పించాలి. వారి గదిని సర్దుకోవడం, గిన్నెలను వాటి స్థానంలో పెట్టడం, బట్టలు మడతపెట్టడం లేదా బల్ల సర్దడం వంటి పనులు వారిలో బాధ్యతా భావాన్ని పెంపొందిస్తాయి. దీనివల్ల ఇంటిని చూసుకోవడం అనేది అందరి ఉమ్మడి బాధ్యత అని పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. వంట.. వంట చేయడం అనేది ఒక జీవన నైపుణ్యం మాత్రమే కాదు, అది ఆత్మ గౌరవాన్ని కూడా పెంపొందిస్తుంది. .  టీ తయారు చేయడం, టిఫిన్  సిద్ధం చేయడం, సాధారణ భోజనం వండటం వంటి ప్రాథమిక వంట నైపుణ్యాలను మగపిల్లలకు కూడా నేర్పించాలి. దీనివల్ల భవిష్యత్తులో వారు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా ఉంటారు. మహిళలను గౌరవించడం.. చిన్నతనం నుండే పిల్లలకు ఇతరుల పట్ల గౌరవం, ఇతరులతో సున్నితంగా ఉండటం వంటివి   నేర్పించాలి. స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవానికి, సమానత్వానికి అర్హులని కొడుకులకు నేర్పించడం చాలా ముఖ్యం. ఇది వారి వ్యక్తిత్వాన్ని సానుకూలంగా తీర్చిదిద్దుతుంది. ఎమోషన్స్.. అబ్బాయిలకు తరచుగా ఏడవకూడదని,  బాధపడకూడదని సలహా ఇస్తుంటారు, కానీ మానసిక ఆరోగ్యానికి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వ్యక్తపరచడం చాలా ముఖ్యం. అబ్బాయిలకు తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పడం, సహాయం అడగడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం నేర్పించాలి. ఆర్థిక బాధ్యత.. చిన్న వయస్సు నుండే పిల్లలకు పొదుపు చేయడం, బడ్జెట్ వేసుకోవడం, బాధ్యతాయుతంగా ఖర్చు చేయడం వంటి అలవాట్లను నేర్పించడం వల్ల, వారు ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకుని, భవిష్యత్తులో మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చాలా వరకు ఆర్థికంగా పొదుపు చేసుకోవాలని,  ఎక్కువగా ఖర్చులు పెట్టకూడదని కేవలం ఆడపిల్లలకు చెబుతూ  ఉంటారు. కానీ భవిష్యత్తులో వివాహం తర్వాత ఆడపిల్లలు పొదుపు చేస్తూ.. మగవారు ఖర్చు చేస్తూ ఉంటే ఆ ఇల్లు ఆర్థికంగా ఎదగదు.  అందుకే ఆర్థిక బాధ్యత ఆడపిల్లలకు, మగపిల్లలకు ఇద్దరికీ నేర్పాలి.                                    *రూపశ్రీ.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇప్పుడు తెలంగాణలో ముక్కోణపు రాజకీయ పోరుకు తెరలేపింది.  నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ మెట్రో ప్రాజెక్ట్   ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ట్రయాంగ్యులర్ పోరుకు వేదిక అయ్యింది.  కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది.  ఈ పార్టీల మథ్య  వాడివేడి చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యామ్నాయాలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది.   బిఆర్ఎస్ ప్రభుత్వంపై, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత బిఆర్ఎస్ పాలకులు ప్రజల అవసరాలను, ప్రజా డిమాండ్‌ను పూర్తిగా పక్కనబెట్టేశార  ఆరోపించారు. కేవలం తమ   ప్రయోజనాలు, ఆర్థిక లాభాల కోసమే ఈ ప్రాజెక్టును వాడుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు అత్యంత కీలకమైన, ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో మెట్రో లైన్లను కేటాయించకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పాడు చేసిందన్నారు. అక్కడితో ఆగకుండా  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా  మెట్రో ప్రాజెక్టు అభివృద్ధికి సహకారం అందించడం లేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఈ ప్రాజెక్టుకు రుణం అందకుండా అడ్డుకుంటున్నారనీ దుయ్యబట్టారు.   ఈ విమర్శలపై  బిఆర్ఎస్ నాయకత్వం  ఘాటుగా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   కొత్తగా అదనపు మెట్రో లైన్లను సాధించడంలో   పూర్తిగా విఫలమయ్యారని ఎదురుదాడికి దిగింది. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి  తమపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడింది.   ప్రాజెక్టును ప్రారంభించిన బిఆర్ఎస్ పాలనను విమర్శించడం మానేసి, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ హైదరాబాద్ నగరానికి కొత్త మెట్రో రూట్లను తీసుకురావడంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని హితవు పలికింది.  ఇక బీజేపీ కూడా రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసింది.  రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారనీ..  ఇప్పుడు వాటిని నెరవేర్చలేక చేతులెత్తేస్తున్నారని మండిపడింది.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అబద్ధపు ఆరోపణలు చేస్తూ, తన వైఫల్యాలను బిజెపిపైకి నెట్టేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్న బిజెపి..  ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే మేధోశక్తి, కార్యాచరణ రేవంత్ రెడ్డికి లేవని విమర్శించింది. మొత్తానికి ప్రజారవాణాకు అత్యంత కీలకమైన  హైదరాబాద్ మెట్రో  ఇప్పుడు పొలిటికల్ ట్రయాంగిల్ ఫైట్ కే కేంద్ర బిందువుగా మారింది. 
తమిళనాట అన్నాడీఎంకే పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారౌతోంది. తాజాగా   ఆ పార్టీ సీనియర్ నాయకుడు, తమిళనాడు మాజీ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి. విజయభాస్కర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.  తన రాజీనామాను ఆయన  శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను స్వయంగా కలిసి అందజేశారు. ఆ రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు.  విరాలిమలై నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విజయభాస్కర్ రాజీనామాతో దీంతో అన్నాడీఎంకే లో తీవ్ర కలకలం మొదలైంది. ఈ రాజీనామా వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా పార్టీ అగ్ర నాయకత్వం, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి  వైఖరి పట్ల విజయభాస్కర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలోని నిజమైన, క్షేత్రస్థాయి కార్యకర్తల గళాన్ని, అభిప్రాయాలను అధిష్టానం కనీసం వినడం లేదంటూ ఆయన బహిరంగంగానే ఆరోపించారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం   ప్రభుత్వంపై జరిగిన అసెంబ్లీ విశ్వాస పరీక్షలో విజయభాస్కర్ పార్టీ లైన్‌ను ధిక్కరించి, ప్రభుత్వానికి అనుకూలంగా  ఓటు వేయడం గమనార్హం. నాటి నుంచే ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్ ప్రయోజనాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని, త్వరలోనే తన తదుపరి  కార్యాచరణను ప్రకటిస్తానని విజయభాస్కర్  తెలిపారు.   2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం..  కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే అన్నాడీఎంకే పార్టీని వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఐదో శాసనసభ్యుడిగా విజయభాస్కర్ నిలిచారు. ఈ వరుస వలసల కారణంగా 234 మంది మొత్తం సభ్యులున్న తమిళనాడు శాసనసభలో అన్నాడీఎంకే పా బలం ఇప్పుడు   42కు పడిపోయింది.  మరోవైపు, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన సీటుతో కలుపుకుని, ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఖాళీల సంఖ్య 6 కి చేరుకుంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే, గతంలో అన్నాడీఎంకేను వీడి బయటకు వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల బాటలోనే డాక్టర్ సి. విజయభాస్కర్ కూడా అధికార టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకుంటారని పరిశీలకులు అంటున్నారు.   
మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.  గతంలో శివసేనను నిలువునా చీల్చిన ఏక్‌నాథ్‌ షిండే, ఇప్పుడు ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన  విభాగానికి మరో భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన పలువురు  లోక్‌సభ సభ్యులు షిండే నేతృత్వంలోని  శివసేనతో   సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పరిణామాలు మరవకముందే..  ఇప్పుడు మహారాష్ట్రలో  అదే  తరహా రాజకీయ ప్రకంపనలు  దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.  ఉద్ధవ్ శివసేన హైకమాండ్  తమ పార్టీ లోక్‌సభ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పుడు వారి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్‌  రావడంతో ఉద్ధవ్‌ ఠాక్రే శిబిరంలో  ఆందోళన, అలజడి మొదలైంది. పరిస్థితి చేతులు దాటిపోకముందే అప్రమత్తమైన ఉద్ధవ్‌ ఠాక్రే, స్వయంగా రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.   రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ మేరకు. శివసేన (ఉద్దవ్ ) పార్టీకి చెందిన ఆరుగురుర ఎంపీలు,  ఇప్పుడు అధికార శివసేన వైపు చూస్తున్నారు. సంజయ్‌ దినా పాటిల్‌, సంజయ్‌ దేశ్‌ముఖ్‌, నగేశ్‌ పాటిల్‌ అష్టికర్‌, ఓంరాజే నింబాల్కర్‌, భౌసాహెబ్‌ వక్చౌరే,   సంజయ్‌ జాధవ్‌ లు షిండే వర్గంతో నిరంతరం టచ్‌లోకి వెళ్లినట్లు చెబుతున్నారు.  వీరితో పాటు రాజాభౌ వాజే పేరు కూడా ఈ తిరుగుబాటు జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉద్ధవ్ ఠాక్రేకు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నఎంపీలలో  సగానికి పైగా బలం చేజారిపోయే ప్రమాదం పొంచి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  శివసేన (ఉద్దవ్) ఎంపీలు ఢిల్లీలో ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు, లోక్‌సభ సభ్యుడు  శ్రీకాంత్‌ షిండే అధికారిక నివాసంలో రహస్యంగా సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సమావేశంలో  విలీన వ్యూహాన్ని ఖరారు చేసుకున్న అనంతరం.. వీరంతా కలిసి,  లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్లమెంటులో పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక పార్లమెంటరీ వర్గాన్ని ఏర్పాటు చేయాలని వీరు స్పీకర్ ను కోరే అవకాశం ఉందంటున్నారు.  ఆ తర్వాత చట్టబద్ధంగా షిండే నేతృత్వంలోని  శివసేనలో ఈ గ్రూపును విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేయాలని వ్యూహం పన్నినట్లు చెబుతున్నారు.  మరోవైపు అ షిండే వర్గం ఈ పరిణామాలను బాహాటంగానే సమర్థిస్తోంది. మహారాష్ట్ర మంత్రి ప్రతాప్‌ సార్నాయక్‌ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. దివంగత బాల్‌ ఠాక్రే ఆశయాలను, సిద్ధాంతాలను నిజాయితీగా నమ్మి, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే సమర్థవంతమైన నాయకత్వంపై విశ్వాసం ఉంచే ఏ నాయకుడికైనా శివసేన తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన అన్నారు.  తిరుగుబాటు ఆలోచనతో వస్తున్న ఎంపీలను తాము సాదరంగా ఆహ్వానిస్తామని ఆయన ప్రకటించడంతో విలీన ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.  అయితే..  ఎంపీ సంజయ్‌ రౌత్‌.. ఈ తిరుగుబాటు వార్తలన్నీ   మైండ్ గేమ్‌లో భాగమేనని, తమ పార్టీ ఎంపీలంతా  ఉద్ధవ్‌ ఠాక్రే వెంటే   నిలబడతారని స్పష్టం చేశారు. అదే సమయంలో అధికార పక్షంపై ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీకి చెందిన ఎంపీలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికీ ఏకంగా  15 కోట్ల చొప్పున   ఆఫర్ చేస్తున్నారని సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు.  
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నరాల బలహీనత రావచ్చు. అయితే, కొంతమందికి అన్ని రకాల వైద్య పరీక్షలు నార్మల్‌గా ఉన్నప్పటికీ ఒంట్లో శక్తి లేనట్టు, నిస్త్రాణగా అనిపిస్తుంది. వైద్య పరిభాషలో దీనిని 'క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్' (Chronic Fatigue Syndrome) అంటారు. తాత్కాలిక ఉపశమనం కోసం కాఫీ, టీలు లేదా స్వీట్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటి అంతుపట్టని నరాల బలహీనత మరియు నీరసం నుండి శాశ్వతంగా బయటపడటానికి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఇంట్లోనే సులభంగా చేసుకోదగ్గ రెండు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలను ఈ వీడియోలో వివరించారు.   చిట్కా 1 (ఎండు ద్రాక్ష మరియు నిమ్మరసం):** రాత్రి వేళల్లో ఒక గ్లాసు నీటిలో గుప్పెడు (సుమారు 25 గ్రాములు) ఎండు ద్రాక్ష (కిస్మిస్) వేసి, అందులో ఒక నిమ్మకాయ రసం పిండి మూత పెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి, నానిన కిస్మిస్ పండ్లను తినాలి. ఇలా 40 రోజుల పాటు చేయడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. చిట్కా 2 (షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారి కోసం - తులసి మరియు మట్టి ముంత):** ఒక చిన్న కొత్త మట్టి ముంతను శుభ్రం చేసుకుని, అందులో రాత్రి పూట ఒక గ్లాసు నీరు పోసి 10 తులసి ఆకులను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగాలి. మట్టిలో ఉండే సహజసిద్ధమైన ఖనిజాలు, తులసిలోని ఔషధ గుణాలు కలిసి నరాలకు అమితమైన శక్తిని ఇస్తాయి. ఖరీదైన మందులు లేకుండా, ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలతో నరాల బలహీనతను ఎలా దూరం చేసుకోవాలో డాక్టర్ గారి మాటల్లోనే ఈ వీడియో చూసి పూర్తిగా తెలుసుకోండి! మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా భోజనం చేయడం,  తిన్న వెంటనే నిద్రపోవడం, జీవనశైలిలో మార్పులు.. మొదలైనవన్నీ గ్యాస్,  ఎసిడిటీ సమస్యకు దారితీస్తాయి.  గుండెల్లో మంట, ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు తరచుగా దగ్గరలోని మెడికల్ స్టోర్ నుండి గ్యాస్ మాత్రలను కొనుగోలు చేసి వాడుతుంటారు. ఈ మందులు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి, కానీ దీర్ఘకాలంలో, అవి ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ల వల్ల మూత్రపిండాలకు కలిగే ప్రమాదాలు వైద్య నివేదికలలో, నిపుణుల బృందం ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (PPIs) అనే ఔషధాల సమూహాన్ని ఆరోగ్యానికి అత్యంత హానికరం అని వర్ణించింది. ఈ మందులను దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల మూత్రపిండాల వైఫల్యం ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు.. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు అనేక పేర్లతో అమ్ముడవుతాయి . ప్రపంచవ్యాప్తంగా చాలా  సాధారణంగా సూచించబడే మందులలో ఇవి కూడా ఉన్నాయి. కొన్ని పరిశోధనలలో ఇతర అసిడిటీ మందులు (హిస్టమైన్-2 రిసెప్టర్ యాంటాగోనిస్టుల వంటివి) తీసుకునే వారితో పోలిస్తే, PPIS మందులు తీసుకునే వారికి మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తేలింది. PPIS తీసుకుంటున్న రోగులకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వచ్చే అవకాశం 28.4 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.  అదేవిధంగా, తీవ్రమైన మూత్రపిండాల గాయం ప్రమాదం 4.2 రెట్లు ఎక్కువగా , ఫైనల్ స్టేజ్ మూత్రపిండాల వ్యాధి ప్రమాదం 35.5 రెట్లు ఎక్కువగా ఉంటుందట.  PPIS తీసుకునే వ్యక్తులలో ఎలక్ట్రోలైట్ల (సోడియం, పొటాషియం మరియు మెగ్నీషియం వంటివి) అసమతుల్యత ఉండే అవకాశం ఎక్కువగా ఉందని  అధ్యయనాల్లో తేలింది. లివర్ ప్రమాదం కూడా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, చాలా మంది రోగులకు PPIలు కీలకమైన మందులు కావచ్చని, PPIలు ఎలుకలు , మానవులలో దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచవచ్చని సూచించింది. సాధారణంగా మందుల ప్రయోగాలు ఎలుకల మీదనే జరుగుతాయి. రానిటిడిన్.. రానిటిడిన్‌తో ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే.., దానిని నిల్వ చేసినప్పుడు, దానిలో N-నైట్రోసోడైమిథైలమైన్ (NDMA) అనే రసాయనం ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది అత్యంత విషపూరితమైనదని , క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. చాలా దేశాలు దీని వాడకాన్ని నిషేధించినప్పటికీ, భారతదేశంలో ఇది ఇప్పటికీ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుకలో ఉంది. కాబట్టి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు ఊరికే మెడికల్ స్టోర్ నుండి మందులు తెచ్చుకుని వాడకుండా ఆరోగ్యాన్నిజాగ్రత్తగా కాపాడుకోవాలి.                                   *రూపశ్రీ.
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి రకరకాల ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ ఉత్పత్తులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు.  ఈ సమస్యను చాలామంది ఎదుర్కుంటూ ఉంటారు. కానీ ముఖం మీద మొటిమలు తగ్గాలన్నా,  గొండ్ కటీరా లేదా బాదం బంక చాలా బాగా పనిచేస్తుందని అంటున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఖరీదైన ఉత్పత్తులు ఎందుకు పనిచేయవంటే.. ఖరీదైన ఉత్పత్తులు  చర్మంపై ఎందుకు పనిచేయడం లేదని చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. దానికి సమాధానం ఏమిటంటే ఆ ఉత్పత్తులలో అనేక రకాల రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలను తరచుగా చర్మానికి మేలు చేయడానికి కలుపుతారు, కానీ అవి ప్రయోజనాలను అందించడానికి బదులుగా హాని కలిగించే అవకాశం ఎక్కువ. బాదం బంక ఎలా పనిచేస్తుందంటే.. శరీరంలో వేడి చర్మంపై ఎర్రటి బొబ్బల రూపంలో కనిపిస్తుంది. దీన్ని తగ్గించడానికి బాదం బంకను ఉపయోగించవచ్చు. బాదం బంకను  రాత్రంతా నానబెట్టాలి. ఉదయం పూట, ఆ స్ఫటికాలు జెల్లీలా కనిపిస్తాయి. దీనికి కొంచెం చల్లటి నీరు కలపాలి. ఇప్పుడు సగం నిమ్మకాయ రసాన్ని  కలపాలి. ఈ పానీయాన్ని తాగాలి.  దీనిని 3 నుండి 4 రోజుల పాటు తాగడం వల్ల ఫలితాలు కనిపిస్తాయి. బాదం బంక ప్రయోజనాలు.. బాదం బంక తినడం వల్ల శరీరం సహజంగా చల్లబడుతుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది,  దాని వృద్ధాప్యాన్ని నెమ్మదించే లక్షణాలు కలిగి  ఉంటుంది.  ఇది శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తుంది.            మొటిమలు, ముడతలు, ఎండదెబ్బ వంటి సమస్యలను తగ్గించగలదు. దీని ఫలితంగా కాంతివంతమైన , యవ్వనమైన చర్మం లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.                                       *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.