Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీ అసెంబ్లీలో తమాషా సంఘటన!
posted on: Jul 25, 2024 3:46PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమాషా సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి మీద శ్వేతపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం కేసులు పెట్టిన వాళ్ళు లేచి నిల్చోండి అన్నారు. దాంతో పవన్ కళ్యాణ్‌తో సహా మెజారిటీ సభ్యులు లేచి నిల్చున్నారు. దాంతో సభలో నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం వీళ్ళని లోపల వేయాలని కేసులు పెట్టింది. కానీ ప్రజలు వీళ్ళని అసెంబ్లీకి పంపించారు అని అన్నారు. ఆ తర్వాత కేసులేవీ లేని వాళ్ళు లేచి నిల్చోండి అని అడిగారు. అప్పుడు చాలా కొద్దిమంది మాత్రమే లేచి నిల్చున్నారు. ‘మీరు అదృష్టవంతులు’ అని చంద్రబాబు ఈ సందర్భంగా చమత్కరించారు.






