LATEST NEWS
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రతినిథులకు ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం (ఫిబ్రవరి 23) ఇచ్చిన ఆత్మీయ విందు నవ్వుల విందుగా, పరిచయాలు, పలకరింపుల మేళవింపులుగా మారింది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పరస్పరం కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుంటూ ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది. ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు. తమతమ ప్రాంతాల ప్రత్యేకతలను పంచుకున్నారు.
శ్రీకాకుళం వెటకారం, విజయనగరం చతురతతో సంభాషణలు రక్తి కట్టాయి. మంత్రి నారా లోకేష్ ఈ విందు సమావేశంలో మంగళగిరి చేనేత ప్రమోషన్ చేస్తూ శ్రీకాకుళం ప్రజాప్రతినిథులు పొందూరు ఖాదీతో బదులిచ్చారు. ఆత్మీయ వేదికకు హాజరైన ప్రజాప్రతినిథుల కుటుంబసభ్యులకు మంగళగిరి పట్టుచీరలు లోకేష్ బహుకరించారు.
ఈ ఆత్మీయ విందు సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామమోహన నాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, గొండు శంకర్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి సాయి శ్రీనివాస్, కొండ్రు మురళీ మోహన్, బొబ్బిలి ఆర్ఎస్వీకేకే రంగారావు బేబీనాయన, కిమిడి కళా వెంకటరావు, పి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం మాధవి, నడికుదిటి ఈశ్వరరావు కుటుంబసభ్యులతో హాజరయ్యారు.
తమిళనాడు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పూర్తి కావడంతో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను సోమవారం (ఫిబ్రవరి 23) విడుదల చేసింది. సవరించిన జాబితా కింద రాష్ట్రంలోని 74 లక్షల మంది ఓట్లను ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది. తుది జాబితాలో మొత్తం 5.67 కోట్ల మంది బాజితాలో ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 6.41 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. సోమవారం ఫిబ్రవరి 23) చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడు చీఫ్ ఎలక్షన్ అధికారి అర్చనా పట్నాయక్ ఈ జాబితాను విడుదల చేశారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. 2025 డిసెంబర్ 19 నుంచి 2026 జనవరి 30 వరకూ ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాల్సిందిగా 4.38 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, వీటిలో 4.23 లక్షల ఎంట్రీలను వెరిఫికేషన్ అనంతరం తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించామని పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదేజరగనున్న సంగతి తెలిసిందే. అలాగే కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికలు ఈ ఏడాదే జరుగుతాయి.
రాజమహేంద్రవరం జిల్లా జైలు నుంచి బెయిలుపై ఇటీవల విడుదలైన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సోమవారం (ఫిబ్రవరి 23) పరామర్శించారు. మాజీ మంత్రులు, వైసీపీనాయకులతో కలిసి గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లిన ముద్రగడ అంబటి రాంబాబును పరార్శించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభఉత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు.
గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రతిరోజూ అబద్ధాలాడుతున్నారంటూ చంద్రబాబు, తెలుగుదేశం నేతలపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభరెడ్డి.. అంబటి రాంబాబు కుమార్తె మౌనికను ప్రత్యేకంగా పలకరించి.. ఆమె ధైర్యాన్ని అభినందించారు.
ALSO ON TELUGUONE N E W S
The cult duo of Dasara, Natural Star Nani and director Srikanth Odela, are back with a massive entertainer, The Paradise. Produced by Sudhakar Cherukuri under SLV Cinemas, this project is being mounted on a world-class scale.
The first single, "Aaya Sher," has already set the internet ablaze. Rockstar Anirudh Ravichander proves his mettle once again, delivering a roaring blend of tribal percussion and gritty electronic layers that feel both primal and dangerous.
Nani’s transformation is the highlight here; he brings a sense of "mental madness" with his long braids, thick beard, and rugged red blazer. Director Srikanth Odela’s vision for the world of The Paradise is staggering—beautiful yet brutal.
The track is supercharged by Kasarla Shyam’s hungry lyrics and the fierce, earthy vocals of Telangana folk singers Addula Jangireddy and Akunoori Deviah. With Sudhan Master’s viral choreography and a cast featuring Mohan Babu, Raghav Juyal, and Sampoornesh Babu, the film is set for a grand pan-world release on August 21st.
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
విజయ్, రష్మిక రెండు సార్లు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు?
పెళ్లికి హాజరవుతున్న టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరు?
పెళ్లికి 100 మంది మాత్రమే అతిథులు.. ఎందుకని?
ఎంతోకాలంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్త బాగా ప్రచారంలో ఉంది. దానికి తెరదించుతూ ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహబంధంతో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహం ఎంతో ప్రైవేట్‌గా పరిమితమైన అతిథుదల మధ్య జరగబోతోంది. ఇప్పటికే ఇరు కుటుంబాల సభ్యులు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. వందకు మించి అతిథులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫిబ్రవరి 24 సాయంత్రం జరిగే సంగీత్‌తో వివాహ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి.
విజయ్, రష్మికల వివాహ క్రతువులో తెలుగు సంప్రదాయాన్ని, కొడవ (కూర్గ్) పద్ధతులను మేళవిస్తుండడం విశేషంగా చెప్ప్పుకోవచ్చు. ఫిబ్రవరి 26 ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో, సాయంత్రం రష్మిక సొంత ఊరి పద్ధతి అయిన కొడవ పద్ధతిలో వివాహ వేడుక జరగనుంది. అంటే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వీరి వివాహం జరగబోతోంది. వివాహం తర్వాత విజయ్, రష్మిక శుక్రవారం హైదరాబాద్ చేరుకుంటారు. చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల కోసం మార్చి 3న బంజారా హిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో ఎంతో వైభవంగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.
Vijay Devarakonda and Rashmika Mandanna have fell in love after working together in Geetha Govindam. Back then, Rashmika got engaged to Rakshit Shetty and broke it to continue in films. Ever since, there have been rumors about Vijay and Rashimka, VIROSH being a couple but they stated that they are friends.
They never revealed that they are in love but they kept releasing family photo updates and vacation trip updates, separately, yet with hints that they are together. Finally, they have ended the hide and seek games. The couple is getting married on 26th February at Udaipur and they intend to keep it private.
It is being reported that they are not allowing any media coverage as families will be present. They have also asked their close friends to not share photos. Tharun Bhascker is attending the ceremony with Eesha Rebba and he has been asked to not share any details until the couple does.
On March 3rd, they are planning for a reception while on 26th Feb, they will be getting married in two styles - Telangana traditional and Koduva style. Media personnel will be invited for a special party and throughout, they are intending to keep all the details as private as possible, state reports.
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them
-మార్చి 19 న సిల్వర్ స్క్రీన్ పైకి లాండింగ్
-ధురంధర్ 2 vs టాక్సిక్
-పోటీ తప్పదా
-సోషల్ మీడియా తాజా టాక్ ఏంటి
బాక్స్ ఆఫీస్ వద్ద అసలు సిసలైన సినీ మజాకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు వేదికగా నిలిచిన ధురంధర్ 2 , టాక్సిక్ శరవేగంగా ముస్తాబవుతున్నాయి. దీంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో ఆ రెండు చిత్రాలపై ఆసక్తి నెలకొని ఉంది. ఆసక్తి నెలకొని ఉందని మనం చెప్తుంటే భలే విషయాన్నీ కనిపెట్టావు బాబు సన్మానం ఏమైనా చేయమంటావా అని ఈ న్యూస్ చదువుతున్న వాళ్ళు అడుగుతారు. గొప్ప అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఆ రెండు చిత్రాల కోసం ఎప్పట్నుంచో ఎంతో ఆశతో ఎదురుచూస్తు వస్తున్నారు.ఆ రెండు చిత్రాలపై అంత క్యాపబిలిటీ ఉంది.మనమేదో కొత్త విషయం కనిపెట్టామని ఎగతాళిగా సన్మానం అని అంటున్నారు.మరి ధురంధర్ 2 , టాక్సిక్ కి సంబంధించిన కొత్త న్యూస్ ఏంటో చూద్దాం.
ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2),టాక్సిక్(Toxic)మార్చి 19 న ఒకే రోజు పాన్ ఇండియా వ్యాప్తంగా అడుగుపెడుతున్నాయి. ధురంధర్ హిందీ ఒరిజినల్ కాబట్టి హిందీలో ఎక్కువ క్రేజ్, టాక్సిక్ కన్నడ మూవీ కాబట్టి కన్నడలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఓన్ భాష సినీ ప్రేమికులు తమ సినిమానే ఎక్కువగా ఆదరిస్తారని అనుకునే జమానా రోజులు పోయి చాలా కాలం అవుతుంది. ఒక మాదిరిగా ఉన్న చిత్రాల కంటెంట్ బాగుంటేనే పాన్ ఇండియా ప్రేక్షకులు తమ నెత్తిన పెట్టుకోని ప్రమోషన్స్ చేస్తున్న రోజులు. అలాంటిది ధురంధర్ పార్ట్ 2 , టాక్సిక్ లాంటి బడా హీరోల సినిమాలకి ఎంతటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రాబడతాయో అనే ఆసక్తి అందరిలో ఉంది.
also read: ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య
సినీ సమాజంలో అభిమానులు సహజం కాబట్టి ఆ రెండు చిత్రాల్లో తమ అభిమాన చిత్రం ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాల వారిలా ఏరియా లెక్కలు వేసి మరి చెప్తున్నారు. మరి తెలుగు అభిమానులు అందరి కంటే ముందుంటారు కాబట్టి వాళ్ళు కూడా తమకి ఇష్టమైన సినిమా తెలుగు నాట ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందనే కామెంట్స్ తో సోషల్ మీడియాని బాగానే యూజ్ చేస్తున్నారు. కాని ఎవరు కూడా రెండు సినిమాల్లో ఒక సినిమా వల్ల ఇంకో సినిమా ప్లాప్ అవుతుందని చెప్పటం లేదు. దీంతో సినీ రంగం బాగుండాలనే వాళ్ళ సినీ మానవత్వం అర్ధమవుతుంది. ధురంధర్ 2 , టాక్సిక్ లని చూడాలంటే పెట్టి పుట్టాలనే సామెత కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదే ధురంధర్ 2 , టాక్సిక్ ల తాజా న్యూస్.
- మహేష్, రాజమౌళి ఎందుకు కొట్టుకున్నారు?
- రామ్‌గోపాల్‌వర్మ వల్లే మహేష్, రాజమౌళి మధ్య ఫైట్
- ప్రస్తుతం ‘వారణాసి’ పరిస్థితి ఏంటి?
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, రాజమౌళి మధ్య భీకర యుద్ధం జరిగింది. సినిమా యాక్షన్ సీన్‌ని మరిపించే స్థాయిలో ఇద్దరూ కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్ప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు మహేష్, రాజమౌళి ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది? వారిద్దరి మధ్య ఏం జరిగింది అని ఆ వీడియో మాత్రమే చూసినవారు ఆసక్తిగా ఆరా తీశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. అది ఎఐ లో క్రియేట్ చేసిన వీడియో. దాన్ని పోస్ట్ చేసింది రామ్‌గోపాల్‌వర్మ.
ఇటీవలికాలంలో ఎఐ సష్టిస్తున్న విచిత్రాలు, విధ్వంసాలు మనం చూస్తున్నాం. నేచురల్‌గా కనిపించే కొన్ని వీడియోలు ఎఐ ద్వారా క్రియేట్ చేసినవి అని చెప్పేవరకు మనకు తెలీదు. అంత సహజంగా ఆ వీడియోలు ఉంటున్నాయి. అలాంటి ఓ వీడియోను ఆర్జీవీ పోస్ట్ చేశారు. మొదటి నుంచీ ఎఐపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన వర్మ.. చాలా ఇంటర్వ్యూల్లో దాని గురించి చర్చించారు. ఎఐను ఏ స్థాయిలో వినియోగించుకోవచ్చో తెలిపేందుకు మహేష్, రాజమౌళి మధ్య జరిగిన ఫైట్‌ను ఉదాహరణగా చూపించారు. ఈ పోస్ట్‌కి ‘సినిమా ఈజ్ డెడ్’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.
సాధారణంగా మన సినిమాల్లో హీరో, విలన్ ఎంత బీభత్సంగా కొట్టుకుంటారో మనం చూస్తూనే ఉన్నాం. టేబుల్స్ విరిగిపోతాయి. కొన్నిసార్లు గోడలు కూడా బద్దలైపోతాయి. ఆ స్థాయిలో మహేష్, రాజమౌళి మధ్య ఫైట్ జరిగింది. ఒకరిపై ఒకరు పవర్ఫుల్ పంచ్‌లు ఇచ్చుకుంటూ సినిమా యాక్షన్ సీన్‌ను మరిపించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వర్మ ఇచ్చిన క్యాప్షన్‌కి రిప్లయ్ ఇస్తూ.. ఎఐ వల్ల సినిమా రంగమే కాదు అన్ని రంగాలూ డెడ్ అయ్యాయని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో భారత దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ జార్జియాకు బయల్దేరింది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ‘వారణాసి’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ మూవీ రిలీజ్ అవ్వని రేంజ్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా, పృథ్వీరాజ్ సుకుమార్ విలన్‌గా నటిస్తున్నారు. శ్రీదుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై డా.కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ ‘వారణాసి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు, ఖర్చు, కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు. దీనికోసం మంచి మార్గాలు, ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే..
ఫ్రీలాన్సింగ్..
రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్ ఉంటే ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్, ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు.
బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్..
రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్, వ్యూస్ బాగా వచ్చిన తరువాత యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం.
ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్..
ఏదైనా ఒక సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు ఆన్లైన్ క్లాసెస్ చెప్పవచ్చు. లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు. లేదా Google Meetలో స్వయంగా క్లాసెస్ చెప్పవచ్చు. ఇది విద్యార్థులకు, టీచింగ్ చేసేవారికి కూడా చాలా బాగుంటుంది.
ఈ-బుక్స్..
రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్ రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం.
ఈ కామర్స్-రీసెల్లింగ్..
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు.
ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్..
సైడ్ ఇన్కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు.
ఈ తప్పులు చేయకండి..
సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే..
తొందరపాటు చాలామందికి ఉంటుంది. సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు.
సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు.
సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు.
ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు.
కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు.
సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
గొప్పలు చెప్పుకోవడానికి సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.
*రూపశ్రీ.
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు. ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు. కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి. స్టిక్కర్లను అలాగే ఉంచడం ఇష్టం ఉండదు, పోనీ వాటిని తీసేద్దాం అనుకుంటే స్టిక్కర్ల తాలూకు గమ్ వాటి మీద కనిపిస్తూ వస్తువుల లుక్ పాడు చేస్తుంది. పైగా ఈ గమ్ మీద దుమ్ము దూళి చాలా తొందరగా పేరుకుపోతుంది. అయితే కొత్త వస్తువుల మీద స్టిక్కర్లు సులువుగానే తొలగించవచ్చని చాలా మందికి తెలియదు. కేవలం కొన్ని టిప్స్ ఫాలో కావడం వల్ల స్టిక్కర్లను వాటి మూలాలు కనిపించకుండా తొలగించవచ్చు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
హెయిర్ డ్రైయర్ వేడి..
స్టిక్కర్‌ను వేడి చేయడం వల్ల దాని జిగట మృదువుగా మారుతుంది, దీని వలన స్టిక్కర్ తీయడం సులభం అవుతుంది. మీడియం వేడి మీద హెయిర్ డ్రైయర్‌ను ఆన్ చేయాలి. స్టిక్కర్ కు 2-3 అంగుళాల దూరంలో 30-40 సెకన్ల పాటు హెయిర్ డ్రైయర్ ను పట్టుకోండి. తర్వాత ఒక మూల నుండి స్టిక్కర్‌ను పట్టుకుని మెల్లిగా లాగితే స్టిక్కర్ సులువుగా వచ్చేస్తుంది. ఒకవేళ స్టిక్కర్ సరిగా రాకపోతే మరికొంతసేపు డ్రైయర్ తో స్టిక్కర్ ఉన్న ప్రాంతాన్ని వేడి చేయాలి.
బేకింగ్ సోడా, నూనె పేస్ట్..
ఈ ఇంట్లో తయారుచేసిన బేకింగ్ సోడా, నూనె పేస్ట్ స్టిక్కర్ల జిగటను తొలగిస్తుంది. బేకింగ్ సోడా, వంట నూనె లేదా కొబ్బరి నూనె సమాన భాగాలుగా కలిపి పేస్ట్ లా చేయాలి. దానిని స్టిక్కర్ లేదా జిగురు మరక ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఒక గుడ్డతో రుద్దాలి. ఎలాంటి ఆనవాళ్లు లేకుండా స్టిక్కర్ కానీ దాని తాలూకు జిగురు కానీ తొలగిపోతుంది.
వెనిగర్ వాటర్..
వెనిగర్ స్టిక్కర్ మీద ఉన్న జిగురును వదిలిస్తుంది. ఒక కాటన్ బాల్ లేదా క్లాత్ ను వెనిగర్ లో ముంచి స్టిక్కర్ మీద ఉంచాలి. 10-15 నిమిషాల తర్వాత స్టిక్కర్ సులభంగా ఊడిపోతుంది. తర్వాత మృదువైన గుడ్డతో ఆ ప్రాంతాన్ని తుడవాలి.
నెయిల్ పాలిష్ రిమూవర్..
గట్టి స్టిక్కర్లకు నెయిల్ పాలిష్ రిమూవర్ ఒక గొప్ప ఛాయిస్. దీన్ని ఉపయోగించడానికి నెయిల్ పాలిష్ రిమూవర్‌ను ఒక కాటన్ బాల్‌పై అద్ది, స్టిక్కర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 5-7 నిమిషాల తర్వాత సున్నితంగా గీకాలి. జిగురు గుర్తులు పూర్తిగా మాయమవుతాయి.
వేడినీరు..
వాటర్ ప్రూఫ్ ఉన్న ప్రాంతాలలో స్టిక్కర్లు ఉంటే వేడి నీరు చాలా బాగా సహాయపడుతుంది. దీని కోసం గోరువెచ్చని నీటితో కొద్దిగా డిష్ సోప్ కలపాలి. ద్రావణంలో స్పాంజ్ ముంచి స్టిక్కర్ మీద సున్నితంగా రుద్దాలి. స్టిక్కర్ లేదా జిగురు పదార్థం సులభంగా తొలగిపోతాయి.
*రూపశ్రీ.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు. ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు. భారతదేశంలో ఉపవాసం సాధారణంగా మరుసటి రోజు ప్రారంభమవుతుంది. రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెల. దీనిని అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. ఈ నెల చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలోనే పవిత్ర ఖురాన్ అవతరణ ప్రారంభమైందని చెబుతారు. రంజాన్ ఉపవాసం, దాహం గురించి మాత్రమే కాదు, రంజాన్ మాసంలో చెయవలసిన పనులు, చేయకూడని పనులు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే..
రంజాన్ ప్రాముఖ్యత..
రంజాన్ మాసం దయ, ఆశీర్వాదం, క్షమాపణల మాసంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ముస్లింలు ఉపవాసం ఉండి, తమ పాపాలకు క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. ఉపవాసం సహనం, క్రమశిక్షణ, స్వీయ నియంత్రణను నేర్పుతుంది. రోజంతా ఆకలితో, దాహంతో ఉండటం వల్ల పేదవారి కష్టాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనుషులలో స్పందించే గుణం పెరుగుతుంది.
రంజాన్ నెలలో జకాత్, సదఖా (దానధర్మాలు) ఇవ్వడం చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. పేదలకు ఆదాయంలో కొంత భాగాన్ని ఇవ్వడం సమాజంలో సమానత్వాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తుంది. రంజాన్ చివరి పది రాత్రులు ప్రత్యేకంగా పరిగణించబడతాయి. షబ్-ఎ-ఖదర్ రాత్రి వెయ్యి నెలల కంటే మెరుగైనదిగా పరిగణించబడుతుంది.
రంజాన్ మాసంలో ఏం చెయ్యాలి..
ఐదుసార్లు ప్రార్థన చేయడం చాలా ముఖ్యం అని చెబుతారు. అది కూడా సరైన సమయానికి చేయాలి.
ప్రతిరోజూ ఖురాన్లో కొంత భాగం చదవడం లేదా వినడం చేయాలి. ఈ నెల ఖురాన్‌తో అనుసంధానం కావడానికి ఉత్తమ సమయం.
ఖర్జూరం, నీటితో ఉపవాసం విరమించడం సున్నత్‌గా పరిగణించబడుతుంది.
జకాత్, సదఖా ఇవ్వడం ద్వారా పేదవారికి సహాయం చేయాలి.
ప్రవర్తనను నియంత్రించుకోవాలి. కోపం, వాదనలు, కఠినమైన మాటలు నివారించాలి.
ఇఫ్తార్ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సమతుల్య భోజనం తినాలి.
రంజాన్ లో చేయకూడనివి..
అబద్ధాలు చెప్పడం, గాసిప్ చెప్పడం, ఇతరులను బాధపెట్టడం మానుకోవాలి.
చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోకూడదు.
ఇఫ్తార్ సమయంలో ఆహారం వృధా చేయకూడదు. లేదా వృధా ఖర్చులు చేయకూడదు.
ప్రార్థనలో అజాగ్రత్తగా ఉండకూడదు.
పనికిరాని కార్యకలాపాలలో లేదా చెడు అలవాట్లలో సమయాన్ని వృధా చేయకూడదు.
*రూపశ్రీ
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రతినిథులకు ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం (ఫిబ్రవరి 23) ఇచ్చిన ఆత్మీయ విందు నవ్వుల విందుగా, పరిచయాలు, పలకరింపుల మేళవింపులుగా మారింది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పరస్పరం కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుంటూ ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది. ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు. తమతమ ప్రాంతాల ప్రత్యేకతలను పంచుకున్నారు.
శ్రీకాకుళం వెటకారం, విజయనగరం చతురతతో సంభాషణలు రక్తి కట్టాయి. మంత్రి నారా లోకేష్ ఈ విందు సమావేశంలో మంగళగిరి చేనేత ప్రమోషన్ చేస్తూ శ్రీకాకుళం ప్రజాప్రతినిథులు పొందూరు ఖాదీతో బదులిచ్చారు. ఆత్మీయ వేదికకు హాజరైన ప్రజాప్రతినిథుల కుటుంబసభ్యులకు మంగళగిరి పట్టుచీరలు లోకేష్ బహుకరించారు.
ఈ ఆత్మీయ విందు సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామమోహన నాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, గొండు శంకర్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి సాయి శ్రీనివాస్, కొండ్రు మురళీ మోహన్, బొబ్బిలి ఆర్ఎస్వీకేకే రంగారావు బేబీనాయన, కిమిడి కళా వెంకటరావు, పి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం మాధవి, నడికుదిటి ఈశ్వరరావు కుటుంబసభ్యులతో హాజరయ్యారు.
తమిళనాడు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పూర్తి కావడంతో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను సోమవారం (ఫిబ్రవరి 23) విడుదల చేసింది. సవరించిన జాబితా కింద రాష్ట్రంలోని 74 లక్షల మంది ఓట్లను ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది. తుది జాబితాలో మొత్తం 5.67 కోట్ల మంది బాజితాలో ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 6.41 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. సోమవారం ఫిబ్రవరి 23) చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడు చీఫ్ ఎలక్షన్ అధికారి అర్చనా పట్నాయక్ ఈ జాబితాను విడుదల చేశారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. 2025 డిసెంబర్ 19 నుంచి 2026 జనవరి 30 వరకూ ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాల్సిందిగా 4.38 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, వీటిలో 4.23 లక్షల ఎంట్రీలను వెరిఫికేషన్ అనంతరం తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించామని పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదేజరగనున్న సంగతి తెలిసిందే. అలాగే కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికలు ఈ ఏడాదే జరుగుతాయి.
రాజమహేంద్రవరం జిల్లా జైలు నుంచి బెయిలుపై ఇటీవల విడుదలైన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సోమవారం (ఫిబ్రవరి 23) పరామర్శించారు. మాజీ మంత్రులు, వైసీపీనాయకులతో కలిసి గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లిన ముద్రగడ అంబటి రాంబాబును పరార్శించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభఉత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు.
గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రతిరోజూ అబద్ధాలాడుతున్నారంటూ చంద్రబాబు, తెలుగుదేశం నేతలపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభరెడ్డి.. అంబటి రాంబాబు కుమార్తె మౌనికను ప్రత్యేకంగా పలకరించి.. ఆమె ధైర్యాన్ని అభినందించారు.
నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఒక విలాసం కాదు, అది ఒక అవసరం. మీ ఫిట్నెస్ ప్రయాణాన్ని సరైన దిశలో నడిపించడానికి ఈ క్రింది సమగ్ర సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం: మీ ఫిట్నెస్ ప్రయాణం ఇక్కడే మొదలు!
మన పూర్వీకులు జిమ్ అంటే ఏంటో తెలియకపోయినా ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఎందుకంటే వారి జీవనశైలిలో శారీరక శ్రమ ఒక భాగంగా ఉండేది. కానీ నేటి కాలంలో మనం చిన్న పనికి కూడా స్విగ్గీ లేదా జెప్టో వంటి యాప్స్ పై ఆధారపడుతూ, కనీసం నడవడానికి కూడా బద్ధకిస్తున్నాము. మన శరీరం కదలడానికి పుట్టింది, కూర్చోవడానికి కాదు. కదలిక లేని జీవితం వ్యాధులకు నిలయంగా మారుతోంది.
మనం ఎందుకు వర్కవుట్ చేయాలి?
• మనుగడ కోసం: నడక అనేది ఒక వ్యాయామం కాదు, అది మన మనుగడకు ప్రాథమిక అవసరం. మనం ఆరోగ్యంగా బతకాలంటే శారీరక కదలిక తప్పనిసరి.
• ఒత్తిడిని జయించడానికి: నిత్యం ఉండే మానసిక ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం పొందడానికి రెసిస్టెన్స్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి.
• శరీర పునరుజ్జీవనం కోసం: సరైన వర్కవుట్ మరియు తగినంత నిద్ర మీ బాడీని రిజూవినేట్ (Rejuvenate) చేసి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.
ఏం చేయకూడదు?
• లిఫ్ట్‌లు మరియు యాప్స్ పై అతిగా ఆధారపడటం: చిన్న దూరాలకు కూడా వాహనాలు వాడటం లేదా లిఫ్ట్‌లు వాడటం మానేయండి. మెట్లు ఎక్కడం వంటి చిన్న చిన్న పనులను వ్యాయామంగా కాకుండా దైనందిన కృత్యంగా మార్చుకోండి.
• రాత్రిపూట ఆలస్యంగా వర్కవుట్ చేయడం: వీలైనంత వరకు రాత్రి 7 గంటల తర్వాత భారీ వర్కవుట్స్ చేయకండి. దీనివల్ల బాడీలో కార్టిసోల్ లెవెల్స్ పెరిగి, మీ నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది.
• నిద్రకు ముందు స్క్రీన్ చూడటం: నిద్రలేమి (Insomnia) సమస్యలను నివారించడానికి పడుకునే ముందు ఫోన్ లేదా టీవీ చూడటం మానేయాలి.
• వర్కవుట్ సమయంలో నీళ్లు తాగకపోవడం: వర్కవుట్ చేసేటప్పుడు లిక్విడ్స్ తీసుకోకూడదనేది తప్పుడు ప్రచారం. నీరు తాగకపోతే ఎలక్ట్రోలైట్స్ కోల్పోయి నీరసం (Dizziness) వచ్చే ప్రమాదం ఉంది.
సరైన పద్ధతిలో వర్కవుట్ ఎలా చేయాలి?
• సరైన సమయం: జిమ్ చేయడానికి ఉదయం 5 నుండి 9 గంటల లోపు అత్యంత అనుకూలమైన సమయం.
• వ్యాయామ కాలపరిమితి: రోజుకు కనీసం ఒక గంట వెయిట్ ట్రైనింగ్ మరియు ఆ తర్వాత 20 నుండి 30 నిమిషాల కార్డియో చేయడం ఉత్తమం. మొత్తం మీద 1.5 గంటల రొటీన్ సరిపోతుంది.
• సహజ ఎలక్ట్రోలైట్స్: వర్కవుట్ మధ్యలో ఉప్పు నీరు, నిమ్మరసం లేదా పుదీనా కలిపిన నీటిని సిప్ చేస్తూ ఉండటం వల్ల కోల్పోయిన లవణాలు తిరిగి లభిస్తాయి.
• ఆహారం మరియు విశ్రాంతి: ఒకవేళ సాయంత్రం వర్కవుట్ చేసినా, ఆ తర్వాత ప్రోటీన్ మరియు ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారం తీసుకుని, వేడి నీటి స్నానం చేసి పడుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
ప్రశ్నలు - సమాధానాలు
1. నడకను ఫిట్‌నెస్‌లో భాగంగా చూడవచ్చా: లేదు, నడక అనేది మన శరీరం ప్రాథమికంగా చేసే పని. ఫిట్నెస్ కోసం అదనపు వ్యాయామాలు అవసరం.
2. జిమ్ చేయడానికి రోజులో ఏ సమయం ఉత్తమం: ఉదయం వేళల్లో చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత బాగుంటుంది. అయితే సమయం లేని వారు తగిన జాగ్రత్తలతో సాయంత్రం కూడా చేయవచ్చు.
3. బాడీ రికవరీ అవ్వాలంటే ఏం చేయాలి: తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్రలోనే శరీరం తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. నిద్ర తగ్గితే 'బ్రెయిన్ ఫాగ్' మరియు నీరసం వచ్చే అవకాశం ఉంది.
ముగింపు: మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కేవలం ఆహార నియమాలు పాటిస్తే సరిపోదు, తగినంత కదలిక మరియు వ్యాయామం కూడా ఉండాలి. సీడ్ ఆయిల్స్ మరియు కల్తీ పాల పదార్థాలకు దూరంగా ఉంటూ, ఒత్తిడిని నియంత్రించుకోవడం అలవాటు చేసుకోండి.
మీ ఫిట్నెస్ ప్రయాణంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం మా YouTube Channel (Video link: https://youtu.be/u4uDJUP7Fw0?si=j6YfUFILXu2eJwcc ) ని సందర్శించండి. అక్కడ మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోలు మరియు వర్కవుట్ చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి!
చాలామందికి బాదం పప్పు గురించి తెలిసి ఉంటుంది. కానీ బాదం బంక అనే పేరు బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. కానీ బాదం బంక ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతారు. బాదం బంకను నీటిలో నానబెట్టుకుని తింటుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో బాదం బంక వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్న బంక గడ్డల్లా ఉంటుంది. నీటిలో వేసి సుమారు 2 గంటల సేపు నానబెడితే బాదం బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది. దీన్ని నేరుగా తింటారు, నీటిలో కలిపి తాగుతారు, ఇందులో సబ్జా, పంచదార వంటివి కూడా కలుపుకుని తాగుతారు. వేసవిలో పానీయాలలో బాదం బంకను యాడ్ చేసుకుంటారు. ఇది శరీరానికి చలువ చేస్తుందని చెబుతారు. అయితే.. బాదం బంక తినడం వల్ల మొటిమలు తగ్గుతాయని కొందరు అంటుంటారు. దీని వెనుక గల నిజం ఏమిటో తెలుసుకుంటే..
మొటిమలకు కారణం..
చర్మం మీద మొటిమలు, కురుపులు వంటివి వేడి వల్ల వస్తాయి. దీని వల్ల చర్మం చాలా దెబ్బతింటుంది. ఈ వేడిని తగ్గించడం ద్వారా మొటిమలు, కురుపులు తగ్గించడంలో బాదం బంక చక్కగా.. ఔషధంలా పనిచేస్తుంది.
బాదం బంక.. చర్మ ప్రయజనాలు..
బాదం బంకను తీసుకోవడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
బాదం బంకను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయానికి ఈ బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది. దీనికి కొంచెం చల్లని నీరు కలపాలి. ఇందులో కొంచెం నిమ్మరసం కలపాలి. దీన్ని డీహైడ్రేట్ పానీయంలా తీసుకోవాలి. కనీసం 3 నుండి 4 రోజులు రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
బాదం బంక ఎందుకు మంచిది?
బాదం బంక తినడం వల్ల సహజంగానే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది చర్మాన్ని తేమ చేస్తుంది. బాదం బంకలో ఉండే యాంటీ-ఏజింగ్ లక్షణాల కారణంగా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఇది శరీరం లోపలి నుండి విషాన్ని తొలగిస్తుంది. మొటిమలు, ముడతలు, వడదెబ్బ వంటి సమస్యలను తగ్గిస్తుంది. బాదం బంక తినడం వల్ల చర్మానికి మెరుపు, యవ్వనం లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
*రూపశ్రీ.
నేటికాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చాలా సాధారణం అయిపోయింది. ఏ వయసు వారికైనా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల పిల్లలు, యువకులలో కిడ్నీలో రాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం దాదాపు 10 మందిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కుంటూ ఉన్నారట. ఈ సమస్యలు సాధారణంగా తేలికపాటి చికిత్స లేదా శస్త్రచికిత్స ద్వారా సులభంగా పరిష్కారం అవుతాయి. కానీ కొంతమందిలో రాళ్ల సమస్యలు తీవ్రమైన మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. అసలు కిడ్నీలో రాళ్ల సమస్య ఎలా ఏర్పడుతుంది? బీర్ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుందనే మాట నిజమా? దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే..
మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు..
మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి అతిపెద్ద కారణం తగినంత నీరు తీసుకోకపోవడం. తగినంత నీరు త్రాగనప్పుడు మూత్రం ఘాడతగా మారుతుంది. దానిలోని ఖనిజాలు స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఇవే కిడ్నీలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.
ఉప్పు అధికంగా తీసుకోవడం, ప్రోటీన్ అధికంగా తీసుకోవడం, ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలైన పాలకూర, చాక్లెట్ వంటివి తినడం, అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ల ప్రమాదం పెరుగుతుంది.
ఊబకాయం, మధుమేహం, జీవక్రియ సమస్యలు కూడా రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.
మూత్రపిండాలలో రాళ్లు ఎలా నయమవుతాయి?
వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. కిడ్నీలో రాళ్ళు సాధారణంగా ఎక్కువ నీరు త్రాగడం ద్వారా వాటంతట అవే బయటకు వస్తాయి. నొప్పిని తగ్గించడానికి, రాళ్ల పరిమాణాన్ని తగ్గించడానికి వైద్యులు మందులను సూచించవచ్చు. అయితే రాళ్ల పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరం ఏర్పడవచ్చు. కిడ్నీలో రాళ్లను ముందుగానే తొలగించడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి కాలక్రమేణా కిడ్నీ లోపలి పొరను దెబ్బతీస్తాయి.
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు తగ్గుతాయా?
బీరు తాగడం వల్ల మూత్ర ఉత్పత్తి పెరుగుతుందని, తరచుగా మూత్ర విసర్జన జరుగుతుందని, రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడుతుందని చాలామంది నమ్ముతారు. కానీ వైద్యులు ఈ నమ్మకాన్ని తోసిపుచ్చుతున్నారు.
బీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడతాయనే నమ్మకం ప్రజలలో ఉన్నా.. బీరు తాగితే చాలు కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి అనుకోవడం చాలా తప్పని, అది వైద్యులు రికమెండ్ చేయరని చెబుతున్నారు. బీరు తాత్కాలికంగా మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది, కానీ అది శరీరం డీహైడ్రేట్ అవ్వడానికి కారణం అవుతుంది. ఇది రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం అవుతుంది.
బీరులో ప్యూరిన్లు కూడా ఉంటాయి, ఇవి యూరిక్ ఆమ్లాన్ని పెంచుతాయి, మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి, అప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీర్ తాగితే.. ఈ రాళ్ల ప్రమాదం మరింత పెరుగుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యకు ఔషదంగా బీర్ ను తీసుకోవడం అస్సలు మంచిది కాదు.
*రూపశ్రీ.
