చలికాలంలో పెదాలు పగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు
మహిళలు ప్రత్యేకంగా చలికాలంలో ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవటానికి ఎక్కువ సమయం కేటాయించవలసి ఉంటుంది. ఈ చల్లని గాలులు చర్మంకి తగిలి చర్మసౌందర్యానికి హాని కలిగిసస్తాయి. ముఖ్యంగా పెదాలకు. ఈ చలికాలంలో మీ పెదాలు పగలకుండా మెరిసిపోతూ ఉండాలంటే ఈక్రింది టిప్స్ ను తరుచుగా వాడుతూ ఉండాలి.
* ప్రతిరోజూ పడుకునేముందు లిప్‌స్టిక్‌ను తప్పనిసరిగా తీసేయాలి. వెన్నతో పెదాలను మృదువుగా మసాజ్ చేయాలి.
* ఎప్పుడూ పెదాలను పొడిగా వదిలేయకుండా, నాణ్యత కలిగిన లిప్ లోషన్ తీసుకుని తరచూ పెదాలకు అప్లై చేయాలి.
* తేమగా ఉండటానికి కావాల్సినంత మాయిశ్చరైజర్‌ను పెదాలకు ఆరకుండా రాస్తూ ఉండాలి.
* బ్లాక్ టీ బ్యాగ్‌ను గోరు నీటిలో ముంచి రెండు మూడు నిమిషాల పాటు దానిని పెదాలపై నెమ్మదిగా అద్దండి. ఇది పెదాలలో తేమను పెంచుతుంది.
* పెదాలు ఆరోగ్యంగా ఉండటానికి బి విటమిన్ ఉపయోగపడుతుంది. వివిధ రూపాల్లో బి విటమిన్ తీసుకోవడం వల్ల పెదాలు చిట్లకుండా ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.
* సగటున శరీరానికి అవసరమయ్యే నీటితోపాటు శీతాకాలంలో ఇంకా ఎక్కువ నీళ్లను తీసుకోవాలి. దీనివల్ల శరీరంతోపాటు పెదాలు కూడా పొడిబారకుండా ఉంటాయి.